అన్వేషించండి

Bathukamma 2024 : బతుకమ్మ ఆట, పాటలు ఆరోగ్యానికి ఎంత మంచివో తెలుసా? ముఖ్యంగా గుండె ఆరోగ్యానికి చాలా మంచిది

Health Benefits with Bathukamma : బతుకమ్మ సమయంలో పాటలు, ఆటలు అబ్బో ఆ సందడే వేరు ఉంటుంది. అయితే ఇలా ఆడి పాడడం వల్ల ఆరోగ్యానికి ఎన్నో లాభాలు ఉంటాయంటున్నారు. అవేంటంటే.. 

Discover the Health Benefits of Bathukamma : మహిళలు ఇంట్లో పనులు, రెగ్యూలర్​ పనులు చేయడంలో బిజీగా ఉంటారు. ఇంటి పనిలో.. కుటుంబ బాధ్యతల్లో వారికి మెంటల్ ప్రెజర్ ఎక్కువగా ఉంటుంది. పైగా వీరికి పర్సనల్​ యాక్టివిటీలంటూ ఏవి ప్రత్యేకంగా ఉండవు. అయితే బతుకుమ్మ సమయంలో వారికి స్ట్రెస్ రిలీఫ్ చేస్తూ.. ఆరోగ్యానికి బెనిఫిట్స్​ అందించే యాక్టివిటీలు ఎన్నో ఉంటాయి. అవి ఎలాగో.. బతుకుమ్మ సమయంలో ఆట, పాటల వల్ల ఎలాంటి ప్రయోజనాలు జరుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. 

గుండె ఆరోగ్యానికి మంచిదట..

బతుకమ్మ సమయంలో దాని చుట్టూ చేరి పాటలు పాడుతూ ఉంటారు. పాటలకు అనుగుణంగా డ్యాన్స్ చేస్తూ ఉంటారు. ఇలా చేయడం వల్ల గుండె ఆరోగ్యానికి చాలా మంచిది.  పైగా వారికి ఒత్తిడి తగ్గుతూ ఉంటుంది. మెరుగైన రక్తప్రసరణను అందించి.. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. శరీరంలో ఆక్సీజన్ లెవెల్స్​ని పెంచుతుంది. గుండెకు సంబంధించిన ఇబ్బందులను దూరం చేస్తుంది. బీపీ కూడా కంట్రోల్ అవుతుంది. అంతేకాకుండా డ్యాన్స్ చేస్తూ పాటలు పాడడంవల్ల మంచి హార్మోన్స్ విడుదల అవుతాయి.
నిద్ర పెరుగుతుంది..

అధ్యయనాలు ఏమి చేప్తున్నాయంటే

ప్రొఫెషనల్ డ్యాన్సర్​ కన్నా.. రోజూ నార్మల్​గా డ్యాన్స్ చేసుకునేవారు హెల్తీగా ఉంటారట. డ్యాన్స్​ని కష్టపడి చేసేవారికంటే జుంబా లాంటివి చేసిన వ్యక్తులు హృదయ సంబంధ వ్యాధులతో మరణించే ప్రమాదం 46 శాతం తక్కువగా ఉంటుందని ఆస్ట్రేలియన్ అధ్యయనంలో తేలింది. కండరాలు టోన్ అవుతాయి. మానసికంగా కూడా యాక్టివ్​గా ఉంటారు. ఎండార్ఫిన్స్ విడుదలై.. ఒత్తిడి తగ్గుతుంది. మెటబాలీజం పెరుగుతుంది. నిద్ర నాణ్యత కూడా మెరుగవుతుంది. 

మానసిక ఆందోళన తగ్గుతుంది..

ఫటిగో, ఒత్తిడి సమస్యలున్నవారు బతుకమ్మనే కాకుండా.. డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే స్ట్రెస్ రిలీజ్ అవుతూ ఉంటుంది. మానసిక సమస్యలు దూరమై.. జ్ఞాపకశక్తికూడా మెరుగవుతుందంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఈ తరహా యాక్టివిటీలు బరువును కంట్రోల్ చేయడంలో, ఫ్లెక్సీబులిటీని పెంచుతుంది. కండరాలకు బలం చేకూరుతుంది. యాంగ్జైటీ, ఒత్తిడి తగ్గుతాయి. ఎముకలు దృఢంగా మారుతాయి. యోని కండరాలకు కూడా ఈ యాక్టివిటీలు మంచి ప్రయోజనాలు అందిస్తాయట. పాటలు రెగ్యూలర్​గా పాడుతూ ఉంటే.. లంగ్స్ ఆరోగ్యానికి మంచిది. ఒత్తిడి, ఆందోళన కూడా కంట్రోల్​లో ఉంటుంది. మూడ్​ని రీసెట్ చేస్తుంది. 

Also Read : బతుకమ్మ అంటే కేవలం పండుగ కాదు.. స్త్రీ శక్తిని గౌరవిస్తూ, ప్రకృతితో మమేకమై చేసుకునే  ఫెస్టివల్ ఇది

శారీరక, మానసిక ప్రయోజనాల కోసం..

బతుకమ్మ ఆడినా లేకున్నా రెగ్యూలర్​గా జుంబా క్లాస్​లు పాల్గొంటే ఒత్తిడి తగ్గుతుంది. పైగా మిమ్మల్ని డ్యాన్స్​లో ప్రావీణ్యులను చేస్తుంది. యాక్టివ్​గా ఉంచడంలో హెల్ప్ చేస్తుంది. బయటకు క్లాస్​లకు వెళ్లలేనివారు ఇంట్లోనే పాటలు పాడుతూ, డ్యాన్స్ వేసుకుంటూ ఉండొచ్చు. లేదంటే డ్యాన్సింగ్ పార్టనర్​ ఒకరు తోడుగా ఉంటే మీరు కూడా ఉత్సాహంగా రోజూ ఈ చర్యలో పాల్గొంటారు. రోజుకి ఓ అరగంట మీరు దీనికి కేటాయించుకుంటే శారీరక, మానసిక ఆరోగ్యాన్ని పొందవచ్చు అంటున్నారు నిపుణులు. 

Also Read : బతుకమ్మను ఏ విధంగా పేర్చాలో తెలుసా? ఉపయోగించాల్సిన పూలు ఇవే

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Independence Day Quiz Questions : ఆగస్టు 15పై పోటీ పరీక్షల్లో అడిగే ముఖ్యమైన GK ప్రశ్నలు.. సమాధానాలు ఇవే
ఆగస్టు 15పై పోటీ పరీక్షల్లో అడిగే ముఖ్యమైన GK ప్రశ్నలు.. సమాధానాలు ఇవే
Independence Day Speech : స్వాతంత్య్ర దినోత్సవ 2026 ప్రసంగం.. స్కూల్ స్పీచ్ పోటీలో గెలవాలంటే ఈ టిప్స్ పాటించండి
స్వాతంత్య్ర దినోత్సవ 2026 ప్రసంగం.. స్కూల్ స్పీచ్ పోటీలో గెలవాలంటే ఈ టిప్స్ పాటించండి
Habits To Quit Before 40 : 40 ఏళ్లు వచ్చేలోపు మానేయాల్సిన 7 అలవాట్లు.. లేదంటే ఆరోగ్యంపై ఈ ప్రభావాలు తప్పవు
40 ఏళ్లు వచ్చేలోపు మానేయాల్సిన 7 అలవాట్లు.. లేదంటే ఆరోగ్యంపై ఈ ప్రభావాలు తప్పవు
Independence Day 2026 : స్వాతంత్య్ర దినోత్సవం 2026 చరిత్ర, ప్రాముఖ్యత.. ఆగస్టు 15నే ఎందుకు జరుపుకుంటామంటే
స్వాతంత్య్ర దినోత్సవం 2026 చరిత్ర, ప్రాముఖ్యత.. ఆగస్టు 15నే ఎందుకు జరుపుకుంటామంటే

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Ration Card Security Features: తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
TDP YSRCP Polavaram Credit War: పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
Sharwanand George Krish : శర్వానంద్, శ్రీను వైట్ల మూవీ షురూ - సంక్రాంతి బరిలో ఫ్యామిలీ ఎంటర్టైనర్
శర్వానంద్, శ్రీను వైట్ల మూవీ షురూ - సంక్రాంతి బరిలో ఫ్యామిలీ ఎంటర్టైనర్
iPhone Sypware Alert: ఐఫోన్ వినియోగదారులకు బిగ్ అలర్ట్‌! 110 దేశాల్లో ఆపిల్ స్పైవేర్ హెచ్చరిక! 
ఐఫోన్ వినియోగదారులకు బిగ్ అలర్ట్‌! 110 దేశాల్లో ఆపిల్ స్పైవేర్ హెచ్చరిక! 
Telangana Free Sewing Machine Scheme: తెలంగాణలో ఇంటింటా ఇందిరమ్మ కుట్టు మిషన్లు పథకం! అర్హతలు, అప్లై చేసే విధానం ఏంటీ?
తెలంగాణలో ఇంటింటా ఇందిరమ్మ కుట్టు మిషన్లు పథకం! అర్హతలు, అప్లై చేసే విధానం ఏంటీ?
Revanth Reddy:
"చేతబడి తిరగబడింది, అష్టదిగ్బంధమయ్యారు" బీఆర్‌ఎస్ నేతలపై రేవంత్ సంచలన వ్యాఖ్యలు 
Vadala OTT : ఓటీటీలో జగపతి బాబు సైకలాజికల్ థ్రిల్లర్ సడన్ స్ట్రీమింగ్ - ఎందులో చూడొచ్చంటే?
ఓటీటీలో జగపతి బాబు సైకలాజికల్ థ్రిల్లర్ సడన్ స్ట్రీమింగ్ - ఎందులో చూడొచ్చంటే?
Embed widget