News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Baking Soda: వంటసోడా కేవలం పకోడీలు, కేకుల్లో వేయడానికే కాదు, వీటితో ఇంకా ఎన్నో ఉపయోగాలు

వంటసోడాతో పెద్దగా ఉపయోగాలు లేవు అనుకుంటాం కానీ, చాలా ఉన్నాయి.

FOLLOW US: 
Share:

బేకింగ్ సోడా అనేది వంటసోడా అనేది వంటల్లో అప్పుడప్పుడు వాడేది. కేక్ మిశ్రమంలో దీన్ని అరస్పూను కలిపితే చాలు మెత్తగా వస్తుంది కేక్. అలాగే పకోడీలు, బజ్జీల్లో వేయడం వల్ల కూడా అవి మెత్తగా వస్తాయి. డీపై ఫ్రై చేసే వంటకాల్లో కచ్చితంగా వీటిని వాడతారు. ఇడ్లీ - దోశె పిండిలో కూడా కలుపుతారు. నిజానికి ఈ పౌడర్ తో ఇంతే ఉపయోగాలు అనుకుంటారు కానీ, నిజానికి ఇంకా ఉన్నాయి. 

బేకింగ్ సోడా అంటే...
ఇది కూడా ఒక రసాయన సమ్మేళనమే. దీని శాస్త్రీయ నామం సోడియం బైకార్బోనేట్. అంటే ఇందులో కూడా ఉప్పు ఉంటుంది. 

గుండెల్లో మంటకు...
జీర్ణాశయం ఎగువ భాగంలో మండుతున్నట్టు అనిపిస్తుంది చాలా మందికి. గుండెల్లో మంట అనేది యాసిడ్ రిఫ్లక్స్ కు కారణం కారణం అవుతుంది. బేకింగ్ సోడాలో ఆల్కలీన్ లక్షణాలు ఉంటాయి. ఇది యాసిడ్ ప్రభావాన్ని తటస్తం చేస్తుంది. నీళ్లలో చిటికెడు బేకింగ్ సోడా కలుపుకుని తాగితే మంచిది. 

మౌత్ వాష్‌గా...
బేకింగ్ సోడాలోని యాంటీ బాక్టిరియల్ లక్షణాలు మౌత్ వాష్‌గా పనికొస్తాయి. గోరువెచ్చని నీటిలో అరటేబుల్ స్పూన్ బేకింగ్ సోడా వేసి నోరు పుక్కిలిస్తే మంచిది. 

డియోడరెంట్‌గా...
చెమట వాసన పోయేలా చేయడంలో కూడా బేకింగ్ సోడా ఉపయోగపడుతుంది. చెమట వాసన రాకుండా ఉండాలంటే చంకల్లో పౌడర్‌కు బదులు బేకింగ్ సోడాను చల్లుకోవాలి. సిల్లీగి అనిపిస్తున్నా... ఇది బాగా పనిచేస్తుంది. 

ఎయిర్‌ఫ్రెషనర్‌గా...
బేకింగ్ సోడా ఎయిర్‌ఫ్రెషనర్‌‌గా పనిచేస్తుంది. చెడు వాసన పోగొట్టడానికి ఉపయోగపడుతుంది. చెడు వాసన వస్తున్నప్పుడు బేకింగ్ పౌడర్‌ను  చల్లితే అది పోతుంది.  

దుస్తులపై మరకలు పోగొట్టేలా..
బేకింగ్ సోడా దుస్తులపై మరకలను తొలగిస్తుంది. బేకింగ్ సోడా మీ దుస్తులను తెల్లగా మారుస్తుంది. వాషింగ్ మెషీన్ బట్టలతో పాటూ కాస్త బేకింగ్ సోడా కూడా చల్లండి. మీకే మార్పు కనిపిస్తుంది. 

గుండెకి మేలు...
చిన్న గ్లాసు నీళ్లలో, అర టీస్పూను బేకింగ్ సోడా వేసి రోజూ తాగాలి. ఇలా తాగడం వల్ల గుండెకు చాలా మేలు కలుగుతుంంది. గుండెకు రక్తాన్ని సరఫరా చేసే రక్తనాళాల్లో అడ్డంకులు తొలగిపోతాయి అని వివరిస్తున్నారు వైద్యులు. గుండె సమస్యలు తక్కువ వచ్చే అవకాశం ఉంది. అలాగని అధికంగా తాగేయడం మరిన్ని సమస్యలు వస్తాయి. కాబట్టి మితంగా తాగాలి. 

Also read: మగవారు తండ్రిగా మారేందుకు ఉత్తమ వయసు ఇదే, సమర్థిస్తున్న వైద్య నిపుణులు

Also read: గర్భంతో ఉన్నప్పుడు చేసే తప్పులు ఇవే

Published at : 19 Jun 2022 10:38 AM (IST) Tags: Baking soda benefits Baking soda Baking soda for pakoras Baking soda Uses

ఇవి కూడా చూడండి

Christmas 2023 gift ideas : క్రిస్మస్ రోజు మీ పిల్లలకు ఏ గిఫ్ట్ ఇవ్వాలా అని ఆలోచిస్తున్నారా? ఇవి ట్రై చెయ్యండి

Christmas 2023 gift ideas : క్రిస్మస్ రోజు మీ పిల్లలకు ఏ గిఫ్ట్ ఇవ్వాలా అని ఆలోచిస్తున్నారా? ఇవి ట్రై చెయ్యండి

Herbs benefits: ఆయుర్వేదం - మీ ఆరోగ్యాన్ని కాపాడే అద్భుతమైన మూలికలు ఇవే, ఏయే రోెగాల నుంచి రక్షిస్తాయంటే?

Herbs benefits: ఆయుర్వేదం - మీ ఆరోగ్యాన్ని కాపాడే అద్భుతమైన మూలికలు ఇవే, ఏయే రోెగాల నుంచి రక్షిస్తాయంటే?

Walking Tips : ఇలా నడిస్తే డయాబెటిస్ రానేరాదట - మీరూ ట్రై చేయండి

Walking Tips : ఇలా నడిస్తే డయాబెటిస్ రానేరాదట - మీరూ ట్రై చేయండి

Silent Heart Attacks: చలికాలంలో హార్ట్ ఎటాక్ ముప్పు - ఈ లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త

Silent Heart Attacks: చలికాలంలో హార్ట్ ఎటాక్ ముప్పు - ఈ లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త

Weight Loss Fruits: బరువు తగ్గాలా? ఈ పండ్లు తినండి, కొవ్వు కొవ్వొత్తిలా కరిగిపోతుంది

Weight Loss Fruits: బరువు తగ్గాలా? ఈ పండ్లు తినండి, కొవ్వు కొవ్వొత్తిలా కరిగిపోతుంది

టాప్ స్టోరీస్

Bhatti Vikramarka: లక్షల కోట్ల అప్పుల్లో తెలంగాణ, ఛాలెంజ్ గా ఆర్థికశాఖ తీసుకున్నాను: భట్టి విక్రమార్క

Bhatti Vikramarka: లక్షల కోట్ల అప్పుల్లో తెలంగాణ, ఛాలెంజ్ గా ఆర్థికశాఖ తీసుకున్నాను: భట్టి విక్రమార్క

Look Back 2023: భారీ సక్సెస్‌ కొట్టిన చిన్న సినిమాలు - ఈ ఏడాది టాలీవుడ్‌లో క్రేజీ సిక్సర్!

Look Back 2023: భారీ సక్సెస్‌ కొట్టిన చిన్న సినిమాలు - ఈ ఏడాది టాలీవుడ్‌లో క్రేజీ సిక్సర్!

2024 TVS Apache RTR 160 4V: సూపర్ డిజైన్, అదిరిపోయే లుక్‌తో వచ్చిన కొత్త అపాచీ - ధర ఎంతో తెలుసా?

2024 TVS Apache RTR 160 4V: సూపర్ డిజైన్, అదిరిపోయే లుక్‌తో వచ్చిన కొత్త అపాచీ - ధర ఎంతో తెలుసా?

Mahalaxmi Scheme: రాష్ట్రంలో ఉచిత బస్సు ప్రయాణం - ప్రభుత్వ నిర్ణయంపై మహిళల హర్షం

Mahalaxmi Scheme: రాష్ట్రంలో ఉచిత బస్సు ప్రయాణం - ప్రభుత్వ నిర్ణయంపై మహిళల హర్షం