మలబద్ధకంతో బాధపడుతున్నారా? ఈ ఆహారాలతో బయటపడొచ్చు
మలబద్ధక సమస్య బయటకి చెప్పుకోలేనిది. అలా అని భరించలేనిది కూడా. దాని నుంచి ఉపశమనం పొందాలంటే ఈ ఆహార పదార్థాలు తప్పక తీసుకోవాలని ఆయుర్వేదం చెబుతోంది.
పొట్ట అసౌకర్యంగా ఉంటే మూడ్ ఏమాత్రం బాగోదు. రోజంతా ఇబ్బందిగానే ఉంటుంది. అందుకే పేగులు ఆరోగ్యంగా ఉండేలాగా చూసుకోవాలి. లేదంటే దాని ప్రభావం జీర్ణ వ్యవస్థ మీద పడుతుంది. చెడు జీర్ణ వ్యవస్థ వల్ల ఎక్కువగా ఎదురయ్యే సమస్య మలబద్ధకం. దీనితో పాటు రోగనిరోధక వ్యవస్థ, మానసిక ఆరోగ్యం, జీర్ణాశయాంతర వ్యాధులు, క్యాన్సర్ వంటి జబ్బుల బారిన పడే ప్రమాదం ఉందని పలు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. అందువల్ల కడుపు ఆరోగ్యంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. అనారోగ్య ఆహారపు అలవాట్లు వల్ల చాలామంది మలబద్ధకం సమస్యతో బాధపడుతున్నారని నిపుణులు వెల్లడించారు. ఇది ఆరోగ్యాన్ని కూడా దెబ్బతీస్తుంది. ఈ సమస్య నుంచి బయట పడాలంటే ఈ ఆహార పదార్థాలు డైట్లో చేర్చుకుంటే మంచి ఫలితాలు పొందుతారని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.
అల్లం
మెరుగైన జీర్ణక్రియకి గొప్ప ఔషధం అల్లం. మలబద్ధకం సమస్యతో ఉన్నప్పుడు పేగులని కదలించడంలో అల్లం బాగా పని చేస్తుంది. బెల్లం కలిపిన అల్లం తినడం వల్ల వాత, కఫ దోషాలు తగ్గించడంలో సహాయపడుతుంది. కడుపు ఉబ్బరం సమస్యని ఎదుర్కొంటుంది. అల్లం వేసుకుని టీ తాగితే ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు చేకూరుస్తుంది.
వేడినీళ్లు
పేగుల ఆరోగ్యానికి గోరువెచ్చని నీళ్ళు మ్యాజిక్ లాగా పని చేస్తుంది. జీర్ణక్రియని మెరుగుపరిచి శరీరం నుంచి విషాన్ని తొలగించడంలో గోరువెచ్చని నీళ్ళు సహాయపడతాయి. చల్లని నీటిని తాగినప్పుడు మొత్తం జీర్ణవ్యవస్థ, ఎంజైమ్ స్రావాన్ని నెమ్మదించేలా చేస్తుంది. చల్లటి నీళ్ళు వల్ల కడుపు ఉబ్బరం, రోజంతా అలసటగా ఉండటంతో పాటు బరువుగా అనిపిస్తుంది. ఆయుర్వేదం ప్రకారం గోరువెచ్చని నీళ్ళు ఆకలిని ప్రేరేపిస్తాయి. మూత్రాశయాన్ని శుభ్రపరిచి జీర్ణక్రియకి తోడ్పడుతుంది. వాత, కఫ దోషాల నుంచి ఉపశమనం కలిగేలా చేస్తుంది. అందుకే రోజంతా గోరు వెచ్చని నీటిని తాగడం చాలా ముఖ్యమని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.
అంజీర్
అంజీర్ నానబెట్టుకుని తింటే బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. ఆయుర్వేదం ప్రకారం ఇది వాత, పితాలని సమతుల్యం చేయడంలో సహాయపడుతుంది. ఈ పండు రబ్బరు పాలని ఆయుర్వేదంలో గొప్ప ఔషధంగా ఉపయోగిస్తారు. ఇందులో ఎంజైమ్ ఫిసిన్ ఉంటుంది. ఇది పొట్టలో ఏర్పడే పురుగులతో పోరాడే శక్తివంతమైన యాంటెల్మింటిక్ ని కలిగి ఉంటుంది. మలబద్ధకం, ఇతర జీర్ణ సమస్యల నుంచి బయటపడేసేందుకు అంజీరా బాగా ఉపయోగపడుతుంది. రాత్రంతా నానబెట్టి తీసుకోవడం ఉత్తమం.
నల్ల కిస్మిస్
నలుపు రంగు ఎండు ద్రాక్ష గొప్ప డైటరీ ఫుడ్. ఫైబర్ తో పాటు ఆరోగ్యకరమైన కార్బోహైడ్రేట్లు, యాంటీఆక్సిడెంట్లు, ఖనిజాలు, విటమిన్లు పుష్కలంగా ఉన్నాయి. గట్ ఆరోగ్యానికి ఇవి చాలా మేలు చేస్తాయి. మలబద్ధకం సమస్యని నివారించడానికి రాత్రిపూట 5-6 నల్ల ఎండుద్రాక్ష నానబెట్టుకుని పొద్దున్నే వాటిని తినాలి.
జొన్నలు
పేగుల ఆరోగ్యానికి జొన్నలు బాగా పని చేస్తాయి. ఇది గ్లూటెన్ రహితం. ప్రోటీన్స్, సూక్ష్మపోషకాలు, ఐరన్ తో పాటు మరెన్నో పోషకాలు అందిస్తుంది. గోధుమ కంటే ఇవే సులభంగా జీర్ణమవుతాయి. జీవక్రియని పెంచడంలో సహాయపడతాయి. అజీర్ణం, మలబద్ధకం సమస్యలు ఉన్నట్లయితే గోధుమలు, మైదాకి దూరంగా ఉండాలి. దానికి బదులుగా జొన్న పిండి ఉపయోగించుకోవచ్చు.
Also Read: నాలుక మీద పుండ్లను నిర్లక్ష్యంగా చేస్తున్నారా? జాగ్రత్త క్యాన్సర్ కావచ్చు