By: ABP Desam | Updated at : 19 Mar 2023 06:44 AM (IST)
Edited By: Soundarya
Image Credit: Pixabay
పెరుగు అంటే చాలా మందికి ఇష్టం. ఈ వేసవిలో పెరుగు, మజ్జిగ తీసుకుంటే చలువ చేస్తుంది. కానీ పెరుగు తీసుకునేటప్పుడు మాత్రం ఈ తప్పులు చేయవద్దని నిపుణులు హెచ్చరిస్తున్నారు. భోజనంతో పాటు పెరుగు తినే ముందు గుర్తుంచుకోవాల్సిన విషయాలు ఇవే..
రాత్రిపూట వద్దు
రాత్రిపూట పెరుగు తినకుండా భోజనం ముగించరు. కానీ నైట్ పెరుగు తింటే శరీరంలో బద్ధకం పెరుగుతుంది. దీని వల్ల శ్లేష్మం ఏర్పడుతుంది. ఆయుర్వేదం ప్రకారం పెరుగులోని తీపి శ్లేష్మం ఏర్పడటానికి దారితీస్తాయి. శ్వాసకోశ సమస్యలు తీసుకొస్తుంది. నాసికా భాగాల్లో ఇబ్బంది, కీళ్ల నొప్పులను పెంచుతుంది, వాపుకు కూడా దారితీస్తుంది.
పెరుగు పచ్చిది వద్దు
బయటకి వెళ్లేటప్పుడు కొంతమంది పెరుగు, పంచదార కలుపుకుని తిని వెళతారు. అలా చేస్తే మంచి జరుగుతుందని నమ్ముతారు. చక్కెర, తేనె, బెల్లం లేదా ఉప్పు, ఎండు మిర్చి, జీలకర్ర పొడి వంటి మసాలా దినుసులు చేర్చుకుని పెరుగు తినొచ్చు. ఇది పెరుగు సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది. శ్లేష్మం ఏర్పడతాన్ని తగ్గిస్తుంది.
ఈ సీజన్లలో తినొద్దు
చాలా మంది ప్రతిరోజు పెరుగు తినకుండా తమ భోజనం ముగించరు. అయితే కొన్ని నెలల్లో పెరుగు తినకపోవడమే మంచిదని నిపుణులు సలహా ఇస్తున్నారు. ఎందుకంటే ఇది మొత్తం ఆరోగ్యాన్ని, జీర్ణక్రియకి హాని కలిగిస్తుంది. ఆయుర్వేదం ప్రకారం వసంత, శరదృతువు, చలికాలంలో పెరుగు తినకుండా ఉండటమే మంచిది. ఆ సమయాల్లో పెరుగు తింటే శ్లేష్మం ఏర్పడటానికి దారితీస్తుంది.
మంద్జాత్ పెరుగు నివారించాలి
మంద్జాత్ పెరుగు అసలు తినకూడదు. చరక్ సంహితలో పేర్కొన్న ఆచార్య చరక్ గ్రంథాల ప్రకారం తప్పనిసరిగా నివారించాలి.
పెరుగు వల్ల ప్రయోజనాలు
బరువు తగ్గించుకునేందుకు పెరుగు చక్కగా ఉపయోగపడుతుంది. ఇందులో ప్రోబయోటిక్స్ ఉన్నాయి. పేగులను ఆరోగ్యంగా ఉంచే మంచి బ్యాక్టీరియాని ప్రేరేపిస్తుంది. ఇందులోని ఈస్ట్ లు జీర్ణక్రియని పెంచుతాయి. తరచూ దీన్ని తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి స్థాయిలు పెరిగి ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం తగ్గుతుంది. మలబద్ధకం, గుండెల్లో మంట, అనేక జీర్ణ సమస్యల్ని నయం చేయడంలో పెరుగు సహాయకారిగా ఉంటుంది. అయితే అతిగా తింటే మాత్రం అనార్థాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. పెరుగు తలలో నొప్పి, మైగ్రేన్ ని ప్రేరేపించే ఆహారం. బయోజెనిక్ అమైన్ వల్ల ఇలా జరుగుతుంది. ఈ అమైన్ లు నాడీ వ్యవస్థ మీద ఒత్తిడి తీసుకొచ్చి రక్తప్రసరణ తగ్గిస్తాయి లేదంటే పెంచుతాయి. దీని వల్ల తలనొప్పి వస్తుంది.
ఆర్థరైటిస్ సమస్యలు ఉన్న వారిలో మంట, కీళ్ల నొప్పులు పెరిగే అవకాశం ఉంది. పెరుగులోని కొన్ని ప్రోటీన్స్ ఆ నొప్పులను ఎక్కువ చేస్తాయి. రోగనిరోధక శక్తి తక్కువ ఉన్న వాళ్ళు పెరుగు తింటే త్వరగా అంటువ్యాధుల బారిన పడతారు.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.
Also Read: ఈ పండ్లు తిన్నారంటే మెరిసే చర్మం మీ సొంతం
భోజనం చేశాక వెంటనే చేయకూడని పనులు ఇవే, లేకుంటే ఈ సమస్యలు తప్పవు
Chia Seeds: బరువు తగ్గించే ఆహారాల్లో చియా విత్తనాలు ఒక భాగం- వీటితో డయాబెటిస్ అదుపులో
మతి పోగోట్టే బీపీ – కొత్త పరిశోధనలు ఏం చెబుతున్నాయంటే...
Toxic Food: రోజూ తినే ఈ ఆహార పదార్థాలు ఎంత విషపూరితమో తెలుసా? ఒక్కోసారి ప్రాణాలు పోతాయ్
Prostate Cancer: పురుషుల్లో ఆ ముప్పు - పండ్లు, కూరగాయలే రక్షిస్తాయట!
KCR Decisions: పోడు భూములకు పట్టాలు రెడీ, పంపిణీపై త్వరలో తేదీ ప్రకటిస్తాం: సీఎం కేసీఆర్
AP 10th Exams: 'పది'లో ఆరుపేపర్లు, బిట్ పేపర్ లేకుండానే ప్రశ్నపత్రం! విద్యార్థులకు 'సిలబస్' కష్టాలు!
పది రోజుల్లో 50 వేల బుకింగ్స్, TSRTC కొత్త ప్లాన్కు అపూర్వ స్పందన, ఇకపై ఎనీటైమ్!
నా ఇంటికి రా రాహుల్ భయ్యా- రేవంత్ ఎమోషనల్ ట్విట్