ఈ పండ్లు తిన్నారంటే మెరిసే చర్మం మీ సొంతం
వేసవి ఎండకి చర్మం మంటగా చికాకుగా అనిపిస్తుంది. మురికి పేరుకుపోయి మరింత ఇబ్బంది పెడుతుంది. ఆ సమస్యలన్నింటికి చెక్ పెట్టాలంటే పండ్లతో ఇలా చేయండి.
పండ్లు ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు చేకూరుస్తాయని అనడంతో ఎటువంటి సందేహం లేదు. మరీ ముఖ్యంగా సీజనల్ ఫ్రూట్స్ తినాలని వైద్యులు పదే పదే చెప్తుంటారు. అందుకు కారణం పండ్లలో విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు, ఇతర పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. చర్మానికి పునరుజ్జీవం ఇవ్వడంలో సహాయపడతాయి. నారింజ, బొప్పాయి, కివీస్ వంటి పండ్లలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది చర్మానికి అవసరమైన కొల్లాజెన్ ని అందిస్తుంది. చర్మ నిర్మాణానికి, స్థితిస్థాపతకు అవసరమైన ప్రోటీన్ ఇది. అందుకే ఏయే పండ్లు తింటే చర్మ సంరక్షణకు ఉపయోగపడతాయో తెలుసుకోవాలి.
శరీరంలోని వ్యర్థాలను బయటకి పంపించాలన్నా, ఫ్రీ రాడికల్స్ తో పోరాడాలన్నా బెర్రీలు, ద్రాక్ష, దానిమ్మ వంటివి తినాలి. వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఫ్రీ రాడికల్స్ ని అడ్డుకుంటుంది. వృద్ధాప్య ఛాయలు, చర్మ సమస్యలు రాకుండా నిరోధిస్తుంది.
హైడ్రేట్ గా ఉండేందుకు: పుచ్చకాయ, కీరదోస, స్ట్రాబెర్రీ వంటి పండ్లలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. ఇది చర్మాన్ని హైడ్రేట్ చేయడానికి సహాయపడుతుంది. ముడతలు, గీతలు పోగొట్టి యవ్వనంగా కనిపించేలా చేస్తుంది.
చర్మ ఆకృతి కోసం: బొప్పాయి, పైనాపిల్ వంటి పండ్లలో ఎంజైమ్ లు ఉంటాయి. ఇవి మృతకణాలను ఎక్స్ ఫోలియేట్ చేయడానికి, రంధ్రాలను అన్ లాగ్ చేయడానికి చర్మ ఆకృతిని మెరుగుపరచడంలో సహాయపడతాయి.
మంటని తగ్గిస్తుంది: చెర్రీస్, బ్లూ బెర్రీస్ వంటి పండ్లలో యాంటీ ఇన్ఫ్లమేటరీ సమ్మేళనాలు ఉంటాయి. ఇవి చర్మంలోని మంట, ఎరుపుని తగ్గించడంలో సహాయపటాయి. అందుకే ఈ వివిధ రకాల పండ్లను చేర్చుకుని తింటే మెరిసే ఛాయ, ఆరోగ్యకరమైన చర్మం పొందవచ్చు.
పండ్లు ఇలా ఉపయోగించండి..
రకరకాల పండ్లు తినాలి: ఒకే రకమైన పండు కాకుండా అన్ని రకాల పండ్లు ముక్కలు చేసుకుని తింటే మంచిది. రోజువారీ ఆహారంలో రకరకాల పండ్లు చేర్చుకోవచ్చు. బొప్పాయి, బెర్రీలు, నారింజ, కివీ, జామ, పుచ్చకాయ వంటి పండ్లలో విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.
పండ్ల మాస్క్: ఇంట్లో తయారుచేసిన ఫేస్ మాస్క్ కోసం పండ్లు వాడుకోవచ్చు. అరటిపండు, అవకాడో లేదా స్ట్రాబెర్రీ వంటి మెత్తని పండ్లను తేనె, పెరుగు లేదా ఓట్మీల్ కలిపుకుని తీసుకుంటే మంచిది. మాస్క్ ని అప్లై చేసుకునే ముందు గోరువెచ్చని నీటితో మొహం కడుక్కోవాలి. ఫ్రూట్ మాస్క్ అప్లై చేసిన 10-15 నిమిషాల పాటు అలాగే ఉంచుకోవాలి.
పండ్ల నీరు: పండ్లు నానబెట్టుకుని నీటిని తీసుకోవచ్చు. నిమ్మకాయ, దోసకాయ, పుదీనా వంటివి వేసుకుని నీళ్ళు బాగా పోసుకోవాయి. ఆ నీటిని తాగితే చర్మం హైడ్రేట్ గా ఆరోగ్యంగా ఉంటుంది. తగినంత నీరు తాగడం వల్ల శరీరం నుంచి టాక్సిన్స్ బయటకి వెళతాయి.
పండ్ల రసం; చర్మానికి తాజా పండ్ల రసాన్ని కూడా రాసుకోవచ్చు. నారింజ రసాన్ని అప్లై చేసి 10 నిమిషాల పాటు అలాగే ఉంచి చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇందులోని విటమిన్ సి చర్మాన్ని ప్రకాశవంతంగా మారుస్తుంది. డార్క్ స్పాట్స్ తగ్గిస్తుంది.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.
Also Read: రబ్ది, జిలేబి కలిపి తింటే నిజంగానే మైగ్రేన్ నొప్పి తగ్గుతుందా?