అన్వేషించండి

Cooking Tips: గుడ్లు వండేటప్పుడు ఈ తప్పులు చేయకండి- అవి మీ వంట రుచి మార్చేస్తాయ్

మీరు ఎప్పుడు గుడ్లు ఉడికించినా పగిలిపోయి.. అందులోని సొన బయటకి వచ్చేసి చూసేందుకు అసహ్యంగా కనిపిస్తుందా? అయితే ఇలా చేయండి.

బహుముఖ ప్రయోజనాలు అందించే వాటిలో గుడ్లు ఒకటి. ఆమ్లెట్, కూర, ఎగ్ బుజ్జీ, ఉడికించిన గుడ్లు ఇలా ఏది తిన్నా రుచికరంగానే ఉంటుంది. కానీ ఉడికించిన తర్వాత గుడ్లు రుచి, ఆకృతి మారిపోయిన సందర్భాలు ప్రతీ ఒక్కరి ఇంట్లో ఎదురవుతూనే ఉంటుంది. అలా ఎందుకు జరిగిందోనని ఆలోచించరు. గుడ్లు చెడిపోయి ఉంటాయి అందుకే అలా అయిపోయిందని అనుకుంటారు. కానీ గుడ్లు వండేటప్పుడు చేసే తప్పుల మూలంగా అది జరుగుతుంది. అందుకే ఎగ్స్ వండేటప్పుడు ఈ సాధారణ తప్పులు నివారించాలి.

అతిగా ఉడికించడం

అతిగా ఉడికించడం వల్ల ఏదైనా ఆహారం రుచి, ఆకృతి మారిపోతాయి. అది గుడ్లు వండేటప్పుడు సర్వ సాధారణంగా జరుగుతుంది. గుడ్లు ఉడకబెట్టిన తర్వాత వాటిని అలాగే వేడి నీటిలో వదిలేయడం వల్ల అందులోని తెల్లసొన పూర్తిగా పాడయ్యే అవకాశం ఉంది. అందుకే గుడ్డు ఉడికిందని అనిపించిన తర్వాత వాటిని వేడి నీటిలో వదిలేయకుండా తీసి చల్లని నీటిలో పెట్టాలి.

పాన్ ప్రీహీట్ చేయకపోయినా..

కొంతమంది ముందుగా పాన్ పెట్టేసి వేడి చేయకుండానే గుడ్డు పగలగొట్టి దాని మీద వేసేస్తారు. కానీ అలా చేయడం వల్ల మీ కూర మీరే నాశనం చేసుకున్నట్టు. పాన్ ని ముందుగా వేడి చేయకుండా గుడ్డు వేస్తే అది దాని రుచి, ఆకృతిని చెడగొడుతుంది. అందుకే ఎగ్ బుజ్జీ లేదా వేపుడు వంటివి చేసేటప్పుడు తప్పనిసరిగా ముందుగా పాన్ ని వేడి చేసుకోవాలి. అప్పుడే గుడ్డు వేసిన వెంటనే అతుక్కోకుండా చేస్తుంది. చేసిన వంట రుచి అద్భుతంగా ఉంటుంది.  

అధిక వేడి వద్దు

ఆమ్లెట్ లేదా ఎగ్ బుజ్జీ చేసేటప్పుడు స్టవ్ మంట తక్కువగా ఉండేలా చూసుకోవాలి. అధిక వేడి ఉపయోగించడం వల్ల గుడ్లు ఎక్కువగా ఉడికి గట్టిగా, పొడిగా మారిపోతాయి. అందుకే ఎక్కువ మీడియం ఫ్లేమ్ మీద వంట చేయాలి. అలా చేయడం వల్ల గుడ్డు గట్టిగా మారకుండా రుచిగా మంచి ఆకృతిలో కనిపిస్తుంది.

మరిగే నీటిలో గుడ్లు వేయొద్దు

గుడ్లు బాయిల్ చేసే ముందు నీటిని బాగా వేడి చేసి అవి మరుగుతున్నప్పుడు వాటిని వేయకూడదు. ముందుగానే నీటిలో వాటిని వేసుకుని ఉడికించుకోవాలి. ఉడికించిన తర్వాత గుడ్లు తీసి చల్లని నీటిలో వేసుకోవాలి. లేదంటే గుడ్లు గట్టిగా ఆయిపోతాయి.

సరైన పాత్ర

గుడ్లు వండటానికి సరైన రకమైన పాత్రను ఎంచుకోవడం చాలా ముఖ్యం. పాత్రల వల్ల వండే వంట రుచి ఆధారపడి ఉంటుంది. కలర్ పోయిన పాన్ లేదా లోహ పాత్రలను ఎంచుకోవడం మానుకోవాలి. బదులుగా సిలికాన్, నైలాన్ లేదా చెక్క పాత్రలు ఎంచుకోవాలి. వీటిలో వండితే రుచి చెక్కుచెదరకుండా ఉంటుంది.

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.

Also Read: ఐస్ క్రీమ్ తింటే నిజంగానే శరీరం చల్లబడుతుందా?

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Rythu Bharosa: అర్ధరాత్రి దాటగానే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ - పేదలకు త్వరలోనే సన్నబియ్యం ఇస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి
అర్ధరాత్రి దాటగానే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ - పేదలకు త్వరలోనే సన్నబియ్యం ఇస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి
Raghurama Custodial Torture case: రఘురామ కస్టోడియల్ టార్చర్ కేసులో కీలక పరిణామం, నిందితుల్ని గుర్తించానని వెల్లడి
రఘురామ కస్టోడియల్ టార్చర్ కేసులో కీలక పరిణామం, నిందితుల్ని గుర్తించానని వెల్లడి
Road Accident: వరంగల్ జిల్లాలో తీవ్ర విషాదం- ఆటోలు, కారుపై లారీ బోల్తా పడి ఏడుగురు దుర్మరణం
వరంగల్ జిల్లాలో తీవ్ర విషాదం- ఆటోలు, కారుపై లారీ బోల్తా పడి ఏడుగురు దుర్మరణం
Pawan Kalyan: కడపలో ఫ్లెక్సీ వార్, 21తో గేమ్ ఛేంజర్ కాలేము - పవన్ కళ్యాణ్‌ టార్గెట్‌గా ఫ్లెక్సీలు దుమారం
కడపలో ఫ్లెక్సీ వార్, 21తో గేమ్ ఛేంజర్ కాలేము - పవన్ కళ్యాణ్‌ టార్గెట్‌గా ఫ్లెక్సీలు దుమారం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Nandamuri Balakrishna Padma Bhushan | నందమూరి బాలకృష్ణకు పద్మభూషణ్ | ABP DesamRing Nets Issue in Srikakulam | శ్రీకాకుళం జిల్లాలో పెరుగుతున్న రింగువలల వివాదం | ABP DesamKCR Sister Sakalamma Final Journey | అక్క సకలమ్మకు కేసీఆర్ నివాళులు | ABP DesamSS Rajamouli Post on Mahesh Babu | ఒక్క పోస్ట్ తో సెన్సేషన్ క్రియేట్ చేసిన రాజమౌళి | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rythu Bharosa: అర్ధరాత్రి దాటగానే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ - పేదలకు త్వరలోనే సన్నబియ్యం ఇస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి
అర్ధరాత్రి దాటగానే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ - పేదలకు త్వరలోనే సన్నబియ్యం ఇస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి
Raghurama Custodial Torture case: రఘురామ కస్టోడియల్ టార్చర్ కేసులో కీలక పరిణామం, నిందితుల్ని గుర్తించానని వెల్లడి
రఘురామ కస్టోడియల్ టార్చర్ కేసులో కీలక పరిణామం, నిందితుల్ని గుర్తించానని వెల్లడి
Road Accident: వరంగల్ జిల్లాలో తీవ్ర విషాదం- ఆటోలు, కారుపై లారీ బోల్తా పడి ఏడుగురు దుర్మరణం
వరంగల్ జిల్లాలో తీవ్ర విషాదం- ఆటోలు, కారుపై లారీ బోల్తా పడి ఏడుగురు దుర్మరణం
Pawan Kalyan: కడపలో ఫ్లెక్సీ వార్, 21తో గేమ్ ఛేంజర్ కాలేము - పవన్ కళ్యాణ్‌ టార్గెట్‌గా ఫ్లెక్సీలు దుమారం
కడపలో ఫ్లెక్సీ వార్, 21తో గేమ్ ఛేంజర్ కాలేము - పవన్ కళ్యాణ్‌ టార్గెట్‌గా ఫ్లెక్సీలు దుమారం
U19 T20 World Cup: భారత్ నాలుగో విక్టరీ - తెలంగాణ ప్లేయర్ త్రిష దూకుడు, 8 వికెట్లతో బంగ్లా చిత్తు
భారత్ నాలుగో విక్టరీ - తెలంగాణ ప్లేయర్ త్రిష దూకుడు, 8 వికెట్లతో బంగ్లా చిత్తు
Karnataka News: బస్సు కిటికీలోంచి తల బయటకు పెట్టడం ఎంత ప్రమాదమో తెలుసా? - తెగిపడిన మహిళ తల, కర్ణాటకలో షాకింగ్ ఘటన
బస్సు కిటికీలోంచి తల బయటకు పెట్టడం ఎంత ప్రమాదమో తెలుసా? - తెగిపడిన మహిళ తల, కర్ణాటకలో షాకింగ్ ఘటన
Andhra Pradesh: శాఖలవారీగా మంత్రుల పనితీరుపై నివేదికకు ఏపీ ప్రభుత్వం ఆదేశాలు, వారిలో మొదలైన టెన్షన్
శాఖలవారీగా మంత్రుల పనితీరుపై నివేదికకు ఏపీ ప్రభుత్వం ఆదేశాలు, వారిలో మొదలైన టెన్షన్
CM Revanth Reddy: గణతంత్ర దినోత్సవ వేళ తెలంగాణలో పథకాల జాతర - 4 పథకాలు ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి
గణతంత్ర దినోత్సవ వేళ తెలంగాణలో పథకాల జాతర - 4 పథకాలు ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి
Embed widget