అన్వేషించండి

AI Chatbot : పొరపాటున కూడా AIను ఈ ప్రశ్నలు అడగకండి.. జైలుకి వెళ్లాల్సి రావచ్చు, జాగ్రత్త

AI Chatbot Illegal Questions : ఏఐ చాట్ బాట్​లను అన్ని అడగడం మీకు అలవాటా? అయితే జాగ్రత్త వాటిని కొన్ని క్వశ్ఛన్స్ అడగకూడదట. అడిగితే జైలుకు వెళ్లే ప్రమాదం ఉందట. ఎందుకంటే..

AI Safety Rules : ఈరోజుల్లో AI చాట్‌బాట్‌లు వినియోగం బాగా పెరిగింది. దాదాపు ప్రతి ఒక్కరు తమ లైఫ్​లో వివిధ అవసరాల కోసం AIని ప్రశ్నలు అడగడం చేస్తున్నారు. ఇవి వారికి కావాల్సిన సమాధానాలు ఇచ్చి పనిని సులభతరం చేస్తున్నాయి. కొత్త సమాచారాన్ని అందిస్తున్నాయి. అయితే మీరు ఈ చాట్‌బాట్‌లను కొన్ని రకాల ప్రశ్నలు అడిగికే నేరమని మీకు తెలుసా? అలాగే మీరు AI చాట్​బాట్​లను కొన్ని క్వశ్చన్స్ అడిగితే.. చట్టపరమైన చిక్కుల్లోకి వెళ్లే అవకాశం ఉందని చెప్తున్నారు. చాలా దేశాలలో సైబర్ చట్టాలు (cyber law awareness) చాలా కఠినంగా మారాయి. తప్పు ప్రశ్నలు లేదా తప్పుడు సమాచారం అడగడం కూడా నేరంగానే పరిగణిస్తున్నారు. అందుకే చిన్న తప్పు ప్రశ్న కూడా పెద్ద నష్టాన్ని ఇవ్వచ్చు.

చట్టవిరుద్ధమైన సమాచారమే నేరమా!?

చాలా మంది సరదాగా లేదా ఆసక్తితో చాట్‌బాట్‌లను చట్టానికి వ్యతిరేకంగా ఉండే సమాచారం ( AI misuse) కోసం అడుగుతారు. ఉదాహరణకు ఆయుధాలు తయారు చేయడం, బ్యాంకింగ్ వ్యవస్థను హ్యాక్ చేయడం, ఇతరుల వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలించడం లేదా సైబర్ దాడి చేయడం వంటి వాటి గురించి ప్రశ్నలు అడుగుతారు. దీనిలో భాగంగా భారతదేశ IT చట్టం(India cyber security laws).. సైబర్ భద్రతా చట్టాల ప్రకారం.. అటువంటి సమాచారం కోసం అడగడం లేదా తెలుసుకోవాలని ప్రయత్నించడం కూడా నేరంగా పరిగణిస్తారు. సిస్టమ్ లాగ్‌లలో ఇది రికార్డ్ అయితే.. దర్యాప్తు సంస్థలు దీనిని అనుమానాస్పద కార్యకలాపంగా భావిస్తాయి.

హింస, అల్లర్లు గురించిన ప్రశ్నలు

ఏదైనా చాట్‌బాట్ హింసను ప్రేరేపించే, అల్లర్లను రేకెత్తించే లేదా చట్టవిరుద్ధమైన సంస్థలకు సంబంధించిన ప్రశ్నలకు ప్రతిస్పందిస్తే.. అది తీవ్రమైన నేరం కావచ్చు. భద్రతా సంస్థలు అటువంటి ప్రశ్నలపై వెంటనే అప్రమత్తమవుతాయి. మీ ప్రశ్న రికార్డ్‌లలో భద్రపరుస్తారు. దీని ఆధారంగా మీపై చర్య కూడా తీసుకోవచ్చు.

ప్రభుత్వ డేటా, భద్రతకు సంబంధించిన సమాచారం

చాలాసార్లు ప్రజలు పోలీసు నెట్‌వర్క్ ఎలా పనిచేస్తుందో.. సైనిక వ్యవస్థలను ఎలా ఛేదించాలో లేదా ప్రభుత్వ వెబ్‌సైట్‌లలోకి ఎలా చొరబడాలో అడుగుతారు. ఇలాంటి ప్రశ్నలు అడగడం దేశ భద్రతతో ఆటలాడటంగా పరిగణిస్తారు. చాలా దేశాలలో ఇది గూఢచర్యం లేదా సైబర్ ఉగ్రవాదం పరిధిలోకి వస్తుంది. దీనికి జైలు శిక్ష కూడా విధించవచ్చు.

వ్యక్తిగత సమాచారం కోసం..

ఒక వ్యక్తి చిరునామా, బ్యాంక్ వివరాలు, స్థానం లేదా వ్యక్తిగత డేటాను చాట్‌బాట్ ద్వారా అడగడం కూడా నేరం. ఇది సైబర్ స్టాకింగ్, డేటా దొంగతనానికి వస్తుంది. డిజిటల్ సిస్టమ్‌లో అటువంటి ప్రశ్న సేవ్ అవుతుంది. ఫిర్యాదు వచ్చినప్పుడు మిమ్మల్ని సులభంగా ట్రాక్ చేస్తారు.

ఆ తప్పులు చేయకండి

  • చాట్‌బాట్‌ల నుంచి ఎప్పుడూ చట్టవిరుద్ధమైన లేదా నిషేధిత సమాచారాన్ని అడగవద్దు.
  • సరదాగా లేదా ప్రయోగాలలో కూడా ప్రమాదకరమైన ప్రశ్నలు అడగవద్దు.
  • సైబర్ భద్రతా చట్టాల గురించి తెలుసుకోండి.
  • ప్రతి ప్రశ్నను ఆలోచించి అడగండి. ఎందుకంటే రికార్డ్ ఎల్లప్పుడూ సేవ్ అవుతుంది. 

AIని అవసరాల కోసం లేదా సమాచారం కోసం ఉపయోగిస్తే ఎంత బెనిఫిట్ అవుతుందో.. అవసరమైన వాటి గురించి సెర్చ్ చేస్తే అంతే డేంజర్ కూడా అవుతుంది. 

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Fatty Liver Diet : ఫ్యాటీ లివర్ సమస్య ఉందా? కాలేయ ఆరోగ్యానికి మేలు చేసే డ్రింక్స్ ఇవే.. రోజూ తాగితే మంచిదేనా?
ఫ్యాటీ లివర్ సమస్య ఉందా? కాలేయ ఆరోగ్యానికి మేలు చేసే డ్రింక్స్ ఇవే.. రోజూ తాగితే మంచిదేనా?
Winter Health Tips for Kids : పిల్లలకు చలికాలంలో జలుబు, దగ్గు రాకుండా ఉండాలంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే.. పేరెంట్స్ ఫాలో అయిపోండి
పిల్లలకు చలికాలంలో జలుబు, దగ్గు రాకుండా ఉండాలంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే.. పేరెంట్స్ ఫాలో అయిపోండి
Eating on Time : టైమ్‌కి తింటున్నారా? ఆలస్యంగా భోజనం చేస్తే వచ్చే సమస్యలివే.. సమయానికి తింటే ఎన్ని లాభాలో తెలుసా?
టైమ్‌కి తింటున్నారా? ఆలస్యంగా భోజనం చేస్తే వచ్చే సమస్యలివే.. సమయానికి తింటే ఎన్ని లాభాలో తెలుసా?
Henna for Grey Hair : తెల్లజుట్టుకు సహజమైన రంగు కావాలా? హెన్నాలో ఈ 5 పదార్థాలు కలిపి అప్లై చేయండి
తెల్లజుట్టుకు సహజమైన రంగు కావాలా? హెన్నాలో ఈ 5 పదార్థాలు కలిపి అప్లై చేయండి

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YS Sharmila Demands Apology: తండ్రి వయసున్న వ్యక్తికి శుభలేఖ ఇస్తే చెట్టాపట్టాల్ అంటారా?.. వైఎస్ జగన్‌కు షర్మిల సూటి ప్రశ్నలు!
తండ్రి వయసున్న వ్యక్తికి శుభలేఖ ఇస్తే చెట్టాపట్టాల్ అంటారా?.. వైఎస్ జగన్‌కు షర్మిల సూటి ప్రశ్నలు!
CM Chandrababu: ఎల్‌నినో, వరుస తుపాను నష్టాలకు కేంద్రం సాయం కోరిన ఏపీ సీఎం చంద్రబాబు
ఎల్‌నినో, వరుస తుపాను నష్టాలకు కేంద్రం సాయం కోరిన ఏపీ సీఎం చంద్రబాబు
MLA Anirudh Reddy: రాజకీయ నాయకులు కాదు, ప్రభుత్వ అధికారులే ఎక్కువ అవినీతిపరులు: ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి
రాజకీయ నాయకులు కాదు, ప్రభుత్వ అధికారులే ఎక్కువ అవినీతిపరులు: ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి
Ranu Bombai Ki Ranu Lyrics : రాను ముంబయికి రాను న్యూ రికార్డ్ - 100 కోట్లకు చేరువలో రాము రాథోడ్ ఫోక్ సాంగ్... హుషారెత్తించే లిరిక్స్
రాను ముంబయికి రాను న్యూ రికార్డ్ - 100 కోట్లకు చేరువలో రాము రాథోడ్ ఫోక్ సాంగ్... హుషారెత్తించే లిరిక్స్
మార్కెట్‌లోకి వచ్చి ఆరు నెలలు కూడా కాలేదు.. Bajaj Pulsar 180కి మళ్లీ బ్రేక్‌!
యూత్‌ఫుల్‌ బైక్‌ బజాజ్ పల్సర్ 180 ఇక కనిపించదా? ఐదేళ్లలో రెండోసారీ అదే పరిస్థితి
MS Dhoni Retires: ఐపీఎల్‌కు ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్.. CSK మెంటార్‌గా కొత్త ఇన్నింగ్స్‌కు శ్రీకారం
ఐపీఎల్‌కు ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్.. CSK మెంటార్‌గా కొత్త ఇన్నింగ్స్‌కు శ్రీకారం
Cheap Liquor Scam: ఫారిన్ బ్రాండ్ అని బిల్డప్.. జానీ వాకర్ బాటిల్స్‌లో చీప్ లిక్కర్- మందుబాబుల జేబులకు చిల్లు
ఫారిన్ బ్రాండ్ అని బిల్డప్.. జానీ వాకర్ బాటిల్స్‌లో చీప్ లిక్కర్- మందుబాబుల జేబులకు చిల్లు
Bellampalli Police Video: బెల్లంపల్లి పోలీసుల ఫామ్ హౌస్ పార్టీ కలకలం.. రామగుండం సీపీ విచారణకు ఆదేశం
బెల్లంపల్లి పోలీసుల ఫామ్ హౌస్ పార్టీ కలకలం.. రామగుండం సీపీ విచారణకు ఆదేశం
Embed widget