Kids food: పిల్లలు బరువు తక్కువగా ఉన్నారా? అయితే ఈ ఆహారాలు తరచూ తినిపించండి
పిల్లలు సన్నగా ఉంటు వారికి కాస్త బలంగా మార్చేందుకు ఈ ఆహారాలు ప్రయత్నించండి.
కొంతమంది పిల్లలు వయసుకు తగ్గట్టు బరువు పెరగరు, మరికొందరు పొడవు పెరగరు. పిల్లలు వయసుకు తగ్గట్టు కనిపించడం లేదంటే వారు సరైన ఆహారం తీసుకోవడం లేదని అర్థం, లేదా వారు తీసుకున్న శరీరం శోషించుకోవడం లేదని అర్ధం. ఈ రెండింటిలో ఏది కారణమైనా వారికి ప్రత్యేకమైన ఆహారం పెట్టాల్సిందే. శరీరం సరైన బరువు, ఎత్తు లేనప్పుడు ఆ ప్రభావం మానసిక ఆరోగ్యంపై కూడా పడుతుంది. ఇలాంటి పిల్లలకు కచ్చితంగా పెట్టాల్సిన ఆహారాలు ఇవి.
ఏం తినాలి?
గుడ్లు, చికెన్, బెల్లం, తేనె, నట్స్, ఓట్స్, బీన్స్, అరటిపండు, పప్పులు... ఇవి రోజువారీ ఆహారంలో ఉండేట్టు చూసుకోవాలి. ఒకరోజు గుడ్డు పెడితే మరుసటి రోజు చికెన్ తినిపించాలి. ఉదయం లేచిన వెంటనే స్పూనుతో తేనె తినిపించాలి. ఓట్స్ తో చేసిన ఊతప్పాలు వంటివి తినిపించాలి. బీన్స్ కూరను వండి పెట్టాలి. రోజుకో అరటిపండు తినిపించాలి. కందిపప్పు, పెసరపప్పు వండి పెట్టాలి.
అవకాడో పండ్లు, బంగాళాదుంపలు, మొక్కజొన్న తినిపించాలి. ఇవి శరీరంలో బరువు పెరిగేలా చేస్తాయి.ఇవన్నీ శరీరానికి పోషకాలను శోషించుకునే శక్తిని ఇస్తాయి. దీని వల్ల పిల్లలు బరువు పెరుగుతారు. పండ్లను స్మూతీల్లా మార్చి పిల్లలకు తినిపించాలి.
విటమిన్ సి, ఈ, కే, పొటాషియం, బీటా కెరాటిన్, ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు పుష్కలంగా ఉన్న ఆహారాలు పిల్లలకు తినిపించాలి. ప్రొటీన్, కార్బోహైడ్రేట్లు, ఫైబర్,ఆరోగ్యకరమైన కొవ్వులు ఉన్న ఆహారపదార్థాలని పిల్లలకు ఏరికోరి తినిపించాలి.
పిల్లలను చాలా మంది బలవంతంగా తినిపిస్తారు. దీని వల్ల వారు బరువు పెరగరు. వారు ఇష్టంగా తినేలా చూడాలి. ఎంత ఇష్టంగా తింటారో వారంతా బరువు, ఎత్తు పెరుగుతారు.
">
Also read: డయాబెటిక్ రోగులు నేరేడు పండ్లు తింటే ఏం జరుగుతుందో తెలుసా? తెలిస్తే వదలకుండా తింటారు
Also read: కేజీయఫ్‌ను మించి పోయిన బంగారు గని, ఇదే ప్రపంచంలో అతి పెద్దది, ఎక్కడుందో తెలుసా?