News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Black Jamun: డయాబెటిక్ రోగులు నేరేడు పండ్లు తింటే ఏం జరుగుతుందో తెలుసా? తెలిస్తే వదలకుండా తింటారు

డయాబెటిక్ రోగులు నేరేడు పండ్లు తినవచ్చా? తినకూడదా? ఈ సందేహం మీకుందా? అయితే ఈ కథనం మీకోసమే.

FOLLOW US: 
Share:

వానాకాలం వచ్చిందంటే చాలు, నేరేడు పండ్లు గుత్తులు గుత్తులుగా వేలాడతాయి. ఆ చెట్లున్న చోట నేలపై నేరేడు పండ్లు ఎన్నో రాలిపోతాయి. వర్షాకాలంలో మాత్రం దొరికే పండ్లు నేరేడు. సీజనల్ పండ్లను కచ్చితంగా తినాలని వైద్యులు చెబుతుంటారు. అయితే డయాబెటిక్ రోగులు ఏది పడితే అది తినకూడదు. మరి నేరేడు పండ్లు తినొచ్చా? నిర్భయంగా తినొచ్చు. వాటిని తినడం వల్ల వారికి ఎంతో మేలు జరుగుతుంది. ఈ పండ్లు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తాయి. మధుమేహం కారణంగా వచ్చే అనారోగ్య సమస్యలను రాకుండా అడ్డుకుంటాయి. కాబట్టి ఈ పండ్లను వానాకాలంలో రోజుకు ఓ పది పండ్ల దాకా తిన్నా ఫర్వాలేదు. 

ఇలా చేస్తే అదుపులోనే...
నేరేడు గింజలు కూడా మధుమేహులకు చాలా మేలు చేస్తాయి. ఈ గింజలను ఎండబెట్టి పొడిగా చేసుకుని సీసాలో వేసి దాచుకోవాలి. రోజూ ఈ పొడిని నీటిలో కలుపుకుని తాగడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు  నియంత్రణలో ఉంటాయి. కాబట్టి మధుమేహులు నేరేడు పండ్లను తరచూ తింటే చాలా మంచిది. గుండె జబ్బులు ఉన్న వారు కూడా వీటిని తినవచ్చు. మెదడు పనితీరును ఇది చురుగ్గా చేస్తుంది. పొటాషియం, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి కాబట్టి శరీరానికి ఎంతో మేలు జరుగుతుంది. 

అందానికీ....
నేరేడులోని సుగుణాలు యాంటీ ఏజింగ్ లక్షణాలను కలిగి ఉంటాయి.  చర్మంపై వృద్ధాప్య ఛాయ‌లు త్వరగా కనిపించకుండా రక్షిస్తాయి. వీటిని తినడం వల్ల ముఖంపై గీతలు, మచ్చలు, ముడతలు త్వరగా రావు. వీటిని తినడం వల్ల నోట్లోని దంతాలకు కూడా ఎంతో మేలు. నోటి దుర్వాసన కూడా పోతుంది. శరీరం డీహైడ్రేషన్ బారిన పడకుండా కాపాడుతుంది. రోగనిరోధశక్తిని పెంచడంలోనూ ఈ పండ్లు ముందుంటాయి. వానాకాలంలో వచ్చే రోగాలు, వ్యాధులు రాకుండా ఈ పండ్లలోని పోషకాలు అడ్డుకుంటాయి. మహిళలు, పిల్లలు వీటిని తినడం చాలా అవసరం. రక్తహీనత సమస్య తగ్గుతుంది. మూత్రాశయ సమస్యలను తీర్చడంలోనూ నేరేడు పండ్లు మేలు చేస్తాయి. కాలేయాన్ని క్లీన్ చేస్తుంది. పనితీరును మెరుగుపరుస్తుంది. వానాకాలంలో కచ్చితంగా తినాల్సిన పండ్లు నేరేడు.  

Also read: బస్సులో పట్టేంత మందిని ఆటోలో ఎక్కించేశాడు, పోలీసులకే దిమ్మదిరిగింది, వైరలవుతున్న వీడియో

Also read: కేజీయఫ్‌ను మించి పోయిన బంగారు గని, ఇదే ప్రపంచంలో అతి పెద్దది, ఎక్కడుందో తెలుసా?

Also read: రోజూ ఎనిమిది గంటలకు పైగా కూర్చుని పనిచేసేవారికి షాకింగ్ న్యూస్, అలా కూర్చుంటే ఈ గుండె సమస్యలు తప్పవు

Published at : 11 Jul 2022 03:26 PM (IST) Tags: Diabetic Patients Diabetics and Black Jamun Black Jamun Benefits Neredu Fruits

ఇవి కూడా చూడండి

ButterMilk: చలువ చేస్తుందని మజ్జిగ అతిగా తాగుతున్నారా? ఈ సైడ్ ఎఫెక్టులు రావచ్చు

ButterMilk: చలువ చేస్తుందని మజ్జిగ అతిగా తాగుతున్నారా? ఈ సైడ్ ఎఫెక్టులు రావచ్చు

Stress: అధికంగా ఒత్తిడికి గురవుతున్నారా? జాగ్రత్త క్యాన్సర్ బారిన పడతారు

Stress: అధికంగా ఒత్తిడికి గురవుతున్నారా? జాగ్రత్త క్యాన్సర్ బారిన పడతారు

Pineapple Halwa: ఒక్కసారి పైనాపిల్ హల్వా తింటే మీకు ఇంకే హల్వా నచ్చదు, రెసిపి ఇదిగో

Pineapple Halwa: ఒక్కసారి పైనాపిల్ హల్వా తింటే మీకు ఇంకే హల్వా నచ్చదు, రెసిపి ఇదిగో

Shoulder: భుజం నొప్పి ఎక్కువగా ఉంటుందా? ఒత్తిడి తగ్గించుకుంటే నొప్పి తగ్గుతుంది

Shoulder: భుజం నొప్పి ఎక్కువగా ఉంటుందా? ఒత్తిడి తగ్గించుకుంటే నొప్పి తగ్గుతుంది

Potato: నెలరోజుల పాటు బంగాళాదుంప తినడం మానేస్తే ఏమౌతుందో తెలుసా?

Potato: నెలరోజుల పాటు బంగాళాదుంప తినడం మానేస్తే ఏమౌతుందో తెలుసా?

టాప్ స్టోరీస్

Chandrababu Arrest : విశాఖలో టీడీపీ కొవొత్తుల ర్యాలీని అడ్డుకున్న పోలీసులు, పలువురి అరెస్ట్ తో ఉద్రిక్తత

Chandrababu Arrest : విశాఖలో టీడీపీ కొవొత్తుల ర్యాలీని అడ్డుకున్న పోలీసులు, పలువురి అరెస్ట్ తో ఉద్రిక్తత

కాంగ్రెస్‌ లో ఉంటే, ఏ పదవీ లేకపోయినా గౌరవంగా బతకొచ్చు: పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి

కాంగ్రెస్‌ లో ఉంటే, ఏ పదవీ లేకపోయినా గౌరవంగా బతకొచ్చు: పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి

Bigg Boss Season 7 Telugu: ‘బిగ్ బాస్’ హౌస్ నుంచి వంటలక్క ఔట్? మౌనితాకే మూడో పవర్ అస్త్ర!

Bigg Boss Season 7 Telugu: ‘బిగ్ బాస్’ హౌస్ నుంచి వంటలక్క ఔట్? మౌనితాకే మూడో పవర్ అస్త్ర!

IND Vs AUS: రెండో వన్డేలో తుదిజట్లు ఎలా ఉంటాయి? - భారత్ మార్పులు చేస్తుందా?

IND Vs AUS: రెండో వన్డేలో తుదిజట్లు ఎలా ఉంటాయి? - భారత్ మార్పులు చేస్తుందా?