అన్వేషించండి

Dinner Timings : సాయంత్రం 5 గంటలకే డిన్నర్ ముగించేయాలా? నిద్ర, గట్ హెల్త్​పై దీని ప్రభావం ఎలా ఉంటుంది? నిపుణుల సలహాలివే

Early Dinner For Better Sleep : రాత్రి భోజనం తొందరగా చేయడం ఆరోగ్యానికి మంచిదా? నిద్ర, జీర్ణక్రియ, హార్మోన్లు, ఆమ్లతత్వంపై భోజన సమయం ప్రభావం గురించి నిపుణులు ఇస్తోన్న సూచనలివే.

Early Dinner Affects on Sleep and Digestion : టెక్ వ్యవస్థాపకుడు, దీర్ఘకాలిక ఆరోగ్యానికి మద్దతుదారు అయిన బ్రయాన్ జాన్సన్ ఇటీవల X లో ఒక పోస్ట్ ద్వారా ముందుగానే భోజనం చేయడం, మానసిక ఆరోగ్యం గురించి చర్చను లేవనెత్తారు. బయోహాకింగ్ రొటీన్, డేటా ఆధారిత జీవనశైలి ప్రయోగాలకు పేరుగాంచిన జాన్సన్.. ఎవరైతే తమ మానసిక శ్రేయస్సు ముఖ్యమనుకుంటున్నారో.. వారు నిద్రపోయే కొన్ని గంటల ముందే భోజనం చేసేయాలని సూచించారు. రాత్రిపూట తినడం మానుకోవాలని.. సాయంత్రం 5 గంటల తర్వాత ఆహారం తీసుకోకూడదనే నియమం పెట్టుకోవాలని సిఫార్సు చేస్తున్నారు.

అయితే ఈ నియమం ఫాలో అవ్వాలంటే.. చాలా డౌట్స్ వస్తాయి. ఇది ఆరోగ్యానికి మంచిదేనా? ఎలాంటి ప్రయోజనాలు పొందవచ్చో..  ఈ అంశాలపై నిపుణులు ఇచ్చే సలహాలు, సూచనలు ఏంటో చూసేద్దాం.  

నిర్దిష్ట సమయం అవసరమా?

మణిపాల్ హాస్పిటల్లో చీఫ్ క్లినికల్ డైటీషియన్ అయిన శ్రీమతి నబనీత సాహా ప్రకారం.. మీరు సాయంత్రం 5 గంటలకు భోజనం చేయాలనే నియమాన్ని పాటించడంపై దృష్టి పెట్టకూడదని సూచిస్తున్నారు. దానికి బదులుగా చివరి భోజనం, నిద్రపోయే సమయానికి మధ్య తగినంత సమయం ఉండేలా చూసుకోవాలని చెప్తున్నారు. చివరి భోజన సమయానికి, నిద్ర సమయానికి కనీసం 2-4 గంటల వ్యవధి ఉండేలా చూసుకోవాలంటున్నారు. అలాగే సాయంత్రం 5 గంటలకే భోజనం చేయాలనే నియమం అందరికీ సరిపోకపోవచ్చని చెప్తున్నారు. దీనివల్ల ఆకలి నిద్రలేమికి కారణం అవుతుందని చెప్తున్నారు. ఎవరైతే రాత్రుళ్లు 8-9 గంటలకు నిద్రపోతారో.. వారికి సాయంత్రం 5 గంటలకు భోజనం చేసే నియమం బాగా సరిపోతుందని అన్నారు.  

రాత్రుళ్లు ఆలస్యంగా తింటే..

నిద్రపోయే సమయానికి దగ్గరగా ఆలస్యంగా తినడం వల్ల.. ఆరోగ్యంపై అనేక విధాలుగా ప్రభావం చూపుతుందని సాహా అంటున్నారు. ఇది నిద్ర, జీవక్రియ, హార్మోన్లను విడుదల చేసే శరీర సహజ గడియారం అయిన కార్డియన్ రిథమ్​ను దెబ్బతీస్తుంది. అలాగే జీర్ణక్రియకు శక్తి అవసరమని, వేడిని ఉత్పత్తి చేస్తుందని.. ఈ ప్రక్రియను థర్మోజెనిసిస్ అంటారు. మంచి నిద్రలో శరీర ఉష్ణోగ్రత సహజంగా తగ్గుతుంది. కానీ నిద్రపోయే ముందు ఎక్కువ తింటే.. జీర్ణవ్యవస్థ చురుకుగా ఉంటుంది. శరీరం వేడిగా మారి నిద్రపోవడం కష్టమవుతుంది. హార్మోన్ల సమతుల్యత కూడా ప్రభావితం కావచ్చు. ఇన్సులిన్ విడుదలను ప్రేరేపించే భోజనం మెలటోనిన్, మానవ వృద్ధి హార్మోన్ ఉత్పత్తిని తగ్గిస్తుంది.

కణజాల మరమ్మత్తు, కండరాల పునరుద్ధరణ, జీవక్రియ నియంత్రణకు ఈ హార్మోన్ చాలా అవసరం. ఎక్కువగా నిద్ర ప్రారంభ దశలో జరుగుతుంది. దీని కారణంగా నిద్రపోయే కనీసం రెండు నుంచి నాలుగు గంటల ముందు భోజనం చేయడం ప్రయోజనకరంగా ఉంటుంది. ఎసిడిటీ సమస్యలు కూడా భోజనం సమయం జీర్ణ ఆరోగ్యాన్ని కూడా నేరుగా ప్రభావం చేస్తుంది. కానీ ముఖ్యంగా ఎసిడిటీని గురిచేసేవారిపై ఇది ఎక్కువ ఎఫెక్ట్ చూపిస్తుంది. మణిపాల్ హాస్పిటల్​లో మెడికల్ గ్యాస్ట్రోఎంటరాలజీ కన్సల్టెంట్ అయిన డాక్టర్ ప్రసన్న కె.ఎస్. రాత్రిపూట ఆలస్యంగా తినడం వల్ల ఎసిడిటీ పెరుగుతుందని వివరిస్తున్నారు.

తిన్న వెంటనే పడుకున్నప్పుడు..

భోజనం చేసిన వెంటనే పడుకుంటే.. జీర్ణంకాని ఆహారం, కడుపులోని ఆమ్లం ఆహార నాళంలోకి తిరిగి ప్రవహిస్తుంది. గొంతు, నోటిలో రక్షణ ప్రతిస్పందనలు లేనప్పుడు.. ఊపిరితిత్తులు, గొంతు, ముక్కు దెబ్బతింటాయి. కొన్నిసార్లు నిద్రకు కూడా ఆటంకం కలుగుతుంది. అందుకే రాత్రి భోజనం, నిద్రకు కనీసం రెండున్నర నుంచి మూడు గంటల వ్యవధి ఉండేలా చూసుకోవడం మంచిది. అలాగే కాఫీ, టీ, నూనె పదార్థాలు, మసాలా ఆహారాలను రాత్రి సమయంలో తీసుకోకూడదని సలహా ఇస్తున్నారు. ఎందుకంటే ఇవి మరింత ఎసిడిటీని పెంచుతాయి.

గట్ హెల్త్​పై ప్రభావం

శరీరం విశ్రాంతి కోసం సిద్ధమవుతున్నప్పుడు.. రాత్రి సమయంలో జీర్ణక్రియ సహజంగా నెమ్మదిస్తుంది. దీనిగురించి డాక్టర్ ప్రసన్న వివరిస్తూ.. రాత్రి సమయంలో కడుపు, పేగులు వాటి పనితీరును తగ్గిస్తాయి. ఆహారం జీర్ణం కాకుండా ఉండిపోతే.. అది పేగులలో బ్యాక్టీరియా క్షీణతను పెంచుతుంది. ఈ ప్రక్రియ ఉబ్బరం, గ్యాస్​కు దారి తీస్తుంది. అలాగే హానికరమైన బ్యాక్టీరియా పెరుగుదలను ప్రోత్సహిస్తుంది.

అజీర్ణంతో బాధపడేవారు ఏమి చేయాలంటే..

GERD లేదా దీర్ఘకాలిక అజీర్ణంతో బాధపడుతున్న వ్యక్తులు వారి భోజనం సమయం, నిద్ర భంగిమల గురించి ప్రత్యేకంగా జాగ్రత్త వహించాలి. రాత్రిపూట తేలికపాటి భోజనం, నిద్రపోయే ముందు రెండున్నర నుంచి మూడు గంటల ముందు తీసుకోవాలి. తల పైకి ఉండేలా ఎడమవైపు తిరిగి పడుకోవాలి. ఇది ముప్పై నుంచి నలభై ఐదు డిగ్రీల కోణంలో ఉండాలని అని డాక్టర్ ప్రసన్న సూచిస్తున్నారు.

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Common Krait Poisonous Snake: దోమ కుట్టినట్లు అనిపిస్తుంది.. నేరుగా నాడీ వ్యవస్థపై విషం ప్రభావం- కట్లపాము అంత ప్రమాదకరమా?
దోమ కుట్టినట్లు అనిపిస్తుంది.. నేరుగా నాడీ వ్యవస్థపై విషం ప్రభావం- కట్లపాము అంత ప్రమాదకరమా?
India Fertility Rate : భారతదేశంలో తగ్గిపోయిన సంతానోత్పత్తి రేటు.. పిల్లలు కావాలనుకుంటున్నారు కానీ..
భారతదేశంలో తగ్గిపోయిన సంతానోత్పత్తి రేటు.. పిల్లలు కావాలనుకుంటున్నారు కానీ..
Flu Vaccine : ఫ్లూను నిర్లక్ష్యం చేస్తే ప్రమాదం అంటోన్న నిపుణులు.. ప్రతి ఏడాది టీకా తీసుకోవాల్సిందేనట
ఫ్లూను నిర్లక్ష్యం చేస్తే ప్రమాదం అంటోన్న నిపుణులు.. ప్రతి ఏడాది టీకా తీసుకోవాల్సిందేనట
Poor Sleep and Stress : ఒత్తిడి, నిద్రలేమితో ఇబ్బంది పడుతున్నారా? నగర జీవనశైలిలో ఈ అలవాట్లు తప్పనిసరి
ఒత్తిడి, నిద్రలేమితో ఇబ్బంది పడుతున్నారా? నగర జీవనశైలిలో ఈ అలవాట్లు తప్పనిసరి

వీడియోలు

Ujjaini Mahankali Bonalu 2026 | అమ్మవారికి తొలి బోనం సమర్పించిన పొన్నం
HYDRAA Restores Uppal Nalla Cheruvu Lake | ఉప్పల్ నల్లచెరువుకు కొత్త జలకళ
Trinayani Serial Actress Ashika Padukone | 'త్రినయని' ఆషికా రియల్ లైఫ్ సీక్రెట్స్
Hardik Pandya Comments On Captaincy | కెప్టెన్సీపై హార్దిక్ పాండ్యా షాకింగ్ కామెంట్స్
Vaibhav Suryavanshi Vice Captaincy | 15 ఏళ్ల కుర్రాడికి వైస్ కెప్టెన్సీ ఏంటి?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
US Iran War: దాడులు చేయవద్దని అమెరికాను ఇరాన్ వేడుకుందా? ట్రంప్ వ్యాఖ్యలకు టెహ్రాన్ స్ట్రాంగ్ కౌంటర్
దాడులు చేయవద్దని అమెరికాను ఇరాన్ వేడుకుందా? ట్రంప్ వ్యాఖ్యలకు టెహ్రాన్ స్ట్రాంగ్ కౌంటర్
Hyderabad Crime News: ఎల్బీనగర్‌లో దారుణం.. 9 నెలల పాపను చెరువులో ముంచి చంపిన కన్నతల్లి
ఎల్బీనగర్‌లో దారుణం.. 9 నెలల పాపను చెరువులో ముంచి చంపిన కన్నతల్లి
రూ. 15 వేల EMI పై Maruti Brezza కొంటే డౌన్ పేమెంట్ ఎంత చెల్లించాలి? ఫీచర్ల వివరాలు
రూ. 15 వేల EMI పై Maruti Brezza కొంటే డౌన్ పేమెంట్ ఎంత చెల్లించాలి? ఫీచర్ల వివరాలు
Taslima Nasrin Back To Kolkata: రెండు దశాబ్దాల తరువాత కోల్‌కతాకు తస్లీమా నస్రీన్.. 3 ప్రభుత్వాలపై ఆసక్తికర వ్యాఖ్యలు
రెండు దశాబ్దాల తరువాత కోల్‌కతాకు తస్లీమా నస్రీన్.. 3 ప్రభుత్వాలపై ఆసక్తికర వ్యాఖ్యలు
Jasprit Bumrah Out.!: లంక టూర్ కి ముందే టీమ్ ఇండియాకి బిగ్ షాక్.. మోకాలి గాయంతో బుమ్రా అవుట్.! 
లంక టూర్ కి ముందే టీమ్ ఇండియాకి బిగ్ షాక్.. మోకాలి గాయంతో బుమ్రా అవుట్.! 
Tilak Varma News: సౌత్ జోన్ కెప్టెన్ గా తిలక్ వర్మ .. వైస్ కెప్టెన్ గా రికీ భుయ్  ఎంపిక
సౌత్ జోన్ కెప్టెన్ గా తిలక్ వర్మ .. వైస్ కెప్టెన్ గా రికీ భుయ్  ఎంపిక.. 23 నుంచి దులీప్ ట్రోఫీ
YSRCP MLA Virupakshi: కర్నూలులో పొలిటికల్ హీట్.. వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షి అరెస్ట్, అసలేం జరిగిందంటే!
కర్నూలులో పొలిటికల్ హీట్.. వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షి అరెస్ట్, అసలేం జరిగిందంటే!
CM Revanth Reddy: ఉజ్జయిని మహంకాళి బోనాలు.. అమ్మవారిని దర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి.. బోనం సమర్పించిన మంత్రులు
ఉజ్జయిని మహంకాళి బోనాలు.. అమ్మవారిని దర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి.. బోనం సమర్పించిన మంత్రులు
Embed widget