Heat Stroke లక్షణాలు ఇవే.. సమ్మర్లో జాగ్రత్త సుమీ

Published by: Geddam Vijaya Madhuri

అకస్మాత్తుగా తీవ్రమైన తలనొప్పి రావటం హీట్ స్ట్రోక్లో భాగమే.

ఎండలో ఎక్కువగా ఉన్నప్పుడు తల తిరుగుతుంది. ఇది కూడా దాని లక్షణమే కావచ్చు.

ఎండలో ఉన్నప్పుడు ఓపికంతా అయిపోతుంది. బలహీనతను కూడా హీట్ స్ట్రోక్ లక్షణమే అంటారు.

శరీర ఉష్ణోగ్రత రెగ్యులర్గా కంటే ఎక్కువ పెరగడం కూడా దీనిలో భాగమే.

ఎండకాలంలో శరీరం ఎక్కువ నీటిని కోరుతుంది. దానికన్నా ఎక్కువ దాహం వేస్తే హీట్ స్ట్రోక్గా భావించాలి.

శరీరంలో ఉష్ణోగ్రత పెరిగి.. చర్మం కూడా వేడిగా మారుతుంది.

శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు పడతారు.

ఈ లక్షణాలు గుర్తించినప్పుడు ఆందోళన చెందకుండా నీడకు వెళ్లండి.

పరిస్థితి అదుపులో లేదు అనుకుంటే వెంటనే వైద్య సహాయం తీసుకోండి.