Air Pollution: వాయుకాలుష్యం డిప్రెషన్ వచ్చే అవకాశాన్ని పెంచుతుంది జాగ్రత్త... హెచ్చరిస్తున్న కొత్త అధ్యయనం
దట్టమైన పొగలా అల్లుకుంటున్న వాయుకాలుష్యం... మనుషులను డిప్రెషన్ బారిన పడేస్తుందట.
దిల్లీలొ పొగలా కమ్ముకుంటున్న వాయుకాలుష్యం గురించి అందరకీ తెలిసిందే. దిల్లీ ప్రజలకు వీటి వల్ల అనేక ఆరోగ్యసమస్యలు తలెత్తాయి. కేవలం దిల్లీలోనే కాదు దాదాపు అన్నీ మెట్రోనగరాల్లోనూ వాయు కాలుష్యం చాలా పెరిగిపోతోంది. ఇలా వాయు కాలుష్యానికి దీర్ఘకాలంగా గురవుతున్న వ్యక్తులు డిప్రెషన్ బారిన పడే అవకాశాలు చాలా ఎక్కువని చెబుతోంది ఓ కొత్త అధ్యయనం. ఇప్పుడు కరోనా రాకూడదని మాస్కులు పెట్టుకుంటున్నట్టు, భవిష్యత్తులో వాయుకాలుష్యానికి గురి కాకుండా మాస్కులు పెట్టుకునే రోజులు రావచ్చని అంచనావేస్తోంది అధ్యయనం.
అమెరికాకు చెందిన లీబర్ ఇన్సిట్యూట్ ఆఫ్ బ్రెయిన్ డెవలప్మెంట్ సంస్థ, చైనాలోని ఓ యూనివర్సిటీ కలిసి ఈ పరిశోధనను చేశారు. దీనికోసం 40 దేశాల నుంచి డేటాను తెప్పించారు. వాయుకాలుష్యం, న్యూరో ఇమేజింగ్, మెదడు జన్యు వ్యక్తీకరణ వంటి అంశాలకు సంబందించి వివరాలను సేకరించారు. దాన్ని బట్టి వాయు కాలుష్యానికి, డిప్రెషన్ కు మధ్య ఉన్న బంధాన్ని కనుగొన్నారు. వాయుకాలుష్యం డిప్రెషన్ కు కారణమయ్యే జన్యువుల పనితీరును మార్చడం ద్వారా మానసిక జబ్బుల బారిన పడేలా చేస్తాయని చెబుతున్నారు పరిశోధకులు. దాదాపు 352 మంది ఆరోగ్యవంతులైన మానవులపై ఈ అధ్యయనం సాగింది.
‘అధిక కాలుష్య ప్రాంతాలలో నివసించే ప్రజలు ఎక్కువగా నిరాశకు గురవుతుంటారు. ఉత్సాహం కూడా తగ్గుతుంది. ఎందుకంటే వారి జన్యువులు, వాయు కాలుష్యం వల్ల మార్పు చెందుతాయి. దీని వల్ల చిన్న చిన్న సమస్యలే చాలా పెద్దవిగా కనిపించి మానసికంగా ప్రభావం చూపిస్తాయి. అలాంటి వాతావరణంలో నివసించే ఆరోగ్యవంతులైన ప్రజల్లో డిప్రెషన్ అభివృద్ధి చెందే చాలా ఎక్కువ అవకాశం ఉంది’ అని పరిశోధనకు నాయకత్వం వహించిన టాన్ వివరించారు. వాయు కాలుష్యంగా పెరగకుండా ప్రజలతో పాటూ ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలని, లేకుంటే భవిష్యత్ తరాలు ఇబ్బందిలో పడతాయని అంటున్నారు పరిశోధకులు.
ముఖ్య గమనిక: ఆరోగ్య నిపుణులు, పలు అధ్యయనాల్లో పేర్కొన్న అంశాలను ఇక్కడ యథావిధిగా అందించాం. మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా వైద్యుడు లేదా ఆహార నిపుణులను సంప్రదించాలి. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమేనని గమనించగలరు.
Also read: గుండు కొట్టించుకోవడానికి సిద్ధంగా ఉన్నానంటున్న ద్రాక్షాయణి
Also read: జుట్టురాలిపోకుండా ఒత్తుగా పెరగాలా... చక్కటి పరిష్కారం విటమిన్ ఇ
Also read: బిగ్‌బాస్‌లో జెస్సీ వ్యాధి ఇదే, వర్టిగో లక్షణాలు... వామ్మో చుక్కలు చూపిస్తాయి
Also read: ఈ శతాబ్ధపు సుదీర్ఘ పాక్షిక చంద్రగ్రహణం... మన దేశంలో ఈ రాష్ట్రాల వారికే కనిపించే అవకాశం
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి