అన్వేషించండి

AI Helps Pregnancy : 18 ఏళ్ల నిరీక్షణకు తెర, వంధ్యత్వంతో బాధపడే జంటకు గుడ్ న్యూస్.. IVF ఫెయిల్ అయినా వదలని AI

AI Miracle : భిన్నమైన విషయాల్లో విభిన్నమైన పద్ధతులను తెరపైకి తెస్తూ.. AI ముందుకు దూసుకెళ్లిపోతుంది. 18 ఏళ్లుగా పిల్లల కోసం ఎదురుచూస్తోన్న ఓ జంటకు ప్రెగ్నెన్సీ భాగ్యాన్ని కల్పించింది.

AI in Fertility Treatment : ఈ రోజుల్లో సంతాన సమస్యలు చాలామందిలో ఉంటున్నాయి. మగ, ఆడ తేడా లేకుండా చాలామంది దీనితో ఇబ్బందులు పడుతున్నారు. అలా ఓ జంట 18 ఏళ్లుగా తల్లిదండ్రులు అయ్యేందుకు ఎదురు చూశారు. తిరగని డాక్టర్లు లేరు. చివరికి IVF కూడా వారికి హ్యాండ్ ఇచ్చింది. కానీ AI మాత్రం వారి ఆశలను నిజం చేస్తూ.. ఇప్పుడు ఆ జంట ప్రెగ్నెంట్ అయ్యేందుకు కారణం అయింది. 

రానున్న రోజుల్లో అన్ని రంగాల్లో తనదైన శైలిలో ముందుకు వెళ్తుందనే నిపుణుల మాటలను నిజం చేస్తుంది AI. వైద్యరంగంలో కూడా దీని వినియోగం మొదలైపోయింది. AI సహాయంతో ఎన్నో వండర్స్ చేస్తున్నారు. కొలంబియా యూనివర్సిటీలో జరిగిన ఈ AI ప్రయత్నం వంధ్యత్వంతో ఇబ్బంది పడే ఎందరికో ఆశలు కల్పిస్తుంది. 

విఫలమైన IVF

అజోస్పెర్మియా వంధ్యత్వంతో ఇబ్బంది పడుతున్న ఓ జంట అనేకసార్లు ప్రెగ్నెన్సీకి ట్రై చేసింది. IVF కూడా చివరికి విఫలమైంది. దీంతో వారు పిల్లలపై ఆశలు వదిలేసుకున్నారు. కానీ కొలంబియాలోని యూనివర్సిటీ ఫెర్టిలిటీ సెంటర్​లో స్టార్ (STAR) అనే పద్ధతిలో వారి సమస్యను దూరం చేసింది AI. గతంలో IVF కోసం చేసిన స్పెర్మ్ ఎనలైజర్లో క్వాలిటీ స్పెర్మ్ గుర్తించలేకపోయారు. కానీ ఏఐ మాత్రం వాటిని గుర్తించి.. తక్కువ స్పెర్మ్​తో వారు ప్రెగ్నెంట్ అయ్యేలా చేసింది.

వంధ్యత్వంతో ఇబ్బంది పడుతున్న పురుషుడి స్పెర్మ్​లో కొద్దిపాటి స్పెర్మ్​ను (కేవలం మూడు వీర్యకణాలను) స్టార్ పద్ధతిలో గుడ్లతో కలిపి ఫలదీకరణం చేశారు. ఇది వారికి మంచి రిజల్ట్స్ ఇవ్వడంతో ఆ జంట ప్రెగ్నెంట్ అయ్యారు. డిసెంబర్​లో వారికి డెలివరీ డేట్ ఇచ్చారు. ఇది పురుషుల్లోని వంధ్యత్వ చికిత్సలో కీలకపాత్ర పోషించనుందని తెలిపారు. 

STAR పద్ధతి.. 

Sperm Tracking and Recovery. ఈ స్టార్ పద్ధతి ద్వారా AI వీర్య నమూనాను పూర్తిస్థాయిలో స్కాన్ చేసింది. దానిలోని మూడు బెటర్ స్పెర్మ్ కణాలు వెలికితీసి.. వాటిని IVFలో ఉపయోగించారు. దానిని అండంలోకి ప్రవేశపెట్టడంతో ఆ జంట ప్రెగ్నెన్సీ అవకాశాన్ని పొందారు. 

ఈ పద్ధతి వంధ్యత్వంతో ఇబ్బంది పడుతున్న జంటల్లో ఎన్నో వండర్స్ చేయనుంది. ఎందుకుంటే ప్రస్తుతకాలంలో చాలామంది పురుషులు వంధ్యత్వంతో బాధపడుతున్నారు. వారి లైఫ్ స్టైల్, స్ట్రెస్, జాబ్స్, తిండి వంటి అలవాట్లు ఈ సమస్యకు కారణమవుతున్నాయి. అయితే ఈ స్టార్ పద్ధతి వంధ్యత్వంతో సమస్యతో పిల్లలకోసం ఎదురుచూస్తోన్న వారికి మంచి వరం కానుంది. 

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఆమె, డా. బి.ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్శిటీ (Dr. BRAOU) నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. 2018లో హైదరాబాద్‌లో ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ ఆమె మూడేళ్లు పనిచేశారు.

తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో ఒక సంవత్సరం పాటు పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశం లో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ అందిస్తున్నారు.

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Ind vs SA 5th T20 Highlights : తిలక్, హార్దిక్ తుపాను, వరుణ్ చక్రవర్తి వ్యూహంలో సౌతాఫ్రికా విలవిల- అహ్మదాబాద్‌లో భారత్ విజయం!
తిలక్, హార్దిక్ తుపాను, వరుణ్ చక్రవర్తి వ్యూహంలో సౌతాఫ్రికా విలవిల- అహ్మదాబాద్‌లో భారత్ విజయం!
Minister Komatireddy Rajagopal Reddy: మంత్రిని కాబోతున్నా - డిక్లేర్ చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
మంత్రిని కాబోతున్నా - డిక్లేర్ చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
Phone tapping case is SIT: ఫోన్ ట్యాపింగ్ కేసులో సజ్జనార్ నేతృత్వంలో సిట్ - ఇప్పటి వరకూ ఏం తేల్చలేకపోయారా?
ఫోన్ ట్యాపింగ్ కేసులో సజ్జనార్ నేతృత్వంలో సిట్ - ఇప్పటి వరకూ ఏం తేల్చలేకపోయారా?
Andhra intermediate exams: ఏపీలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్‌లో మార్పుచేర్పులు - కొత్త షెడ్యూల్ ఫుల్ డీటైల్స్ ఇక్కడ
ఏపీలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్‌లో మార్పుచేర్పులు - కొత్త షెడ్యూల్ ఫుల్ డీటైల్స్ ఇక్కడ

వీడియోలు

Atha Kodalu In Sarpanch Elections Heerapur | హోరాహోరీ పోరులో కోడలిపై గెలిచిన అత్త | ABP Desam
టీమిండియా, సౌతాఫ్రికా మధ్య నేడు ఆఖరి పోరు
సంజూ.. చుక్కలు చూపించాల!
కోహ్లీ రికార్డ్‌ బద్దలు కొట్టడానికి అడుగు దూరంలో అభిషేక్ శర్మ
టీమిండియా కోచ్ గౌతం గంభీర్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన కపిల్ దేవ్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ind vs SA 5th T20 Highlights : తిలక్, హార్దిక్ తుపాను, వరుణ్ చక్రవర్తి వ్యూహంలో సౌతాఫ్రికా విలవిల- అహ్మదాబాద్‌లో భారత్ విజయం!
తిలక్, హార్దిక్ తుపాను, వరుణ్ చక్రవర్తి వ్యూహంలో సౌతాఫ్రికా విలవిల- అహ్మదాబాద్‌లో భారత్ విజయం!
Minister Komatireddy Rajagopal Reddy: మంత్రిని కాబోతున్నా - డిక్లేర్ చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
మంత్రిని కాబోతున్నా - డిక్లేర్ చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
Phone tapping case is SIT: ఫోన్ ట్యాపింగ్ కేసులో సజ్జనార్ నేతృత్వంలో సిట్ - ఇప్పటి వరకూ ఏం తేల్చలేకపోయారా?
ఫోన్ ట్యాపింగ్ కేసులో సజ్జనార్ నేతృత్వంలో సిట్ - ఇప్పటి వరకూ ఏం తేల్చలేకపోయారా?
Andhra intermediate exams: ఏపీలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్‌లో మార్పుచేర్పులు - కొత్త షెడ్యూల్ ఫుల్ డీటైల్స్ ఇక్కడ
ఏపీలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్‌లో మార్పుచేర్పులు - కొత్త షెడ్యూల్ ఫుల్ డీటైల్స్ ఇక్కడ
Pawan Kalyan: జనసేన ఎమ్మెల్యేలతో పవన్ కల్యాణ్ వన్ టు వన్ భేటీ - పనితీరుపై సమీక్ష - గట్టి వార్నింగ్ ఇస్తున్నారా?
జనసేన ఎమ్మెల్యేలతో పవన్ కల్యాణ్ వన్ టు వన్ భేటీ - పనితీరుపై సమీక్ష - గట్టి వార్నింగ్ ఇస్తున్నారా?
Delhi Crime: కుటుంబ గొడవల్లో కాల్పులు - ఒక్క బాడీలోకి 69 బుల్లెట్లు దింపేశారు - ఇంత కర్కశత్వమా?
కుటుంబ గొడవల్లో కాల్పులు - ఒక్క బాడీలోకి 69 బుల్లెట్లు దింపేశారు - ఇంత కర్కశత్వమా?
యువరాజ్ సింగ్,సోనూ సూద్ సహా పలువురి సెలబ్రిటీలకు షాక్, ఆస్తులు జప్తు చేసిన ఈడీ
యువరాజ్ సింగ్,సోనూ సూద్ సహా పలువురి సెలబ్రిటీలకు షాక్, ఆస్తులు జప్తు చేసిన ఈడీ
Bhartha Mahasayulaku Wignyapthi Teaser : 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' టీజర్ వచ్చేసింది - మాస్ మహారాజ రవితేజ ఏం చేశారంటే?
'భర్త మహాశయులకు విజ్ఞప్తి' టీజర్ వచ్చేసింది - మాస్ మహారాజ రవితేజ ఏం చేశారంటే?
Embed widget