Beauty Care: నోరూరించే ఈ ఫుడ్స్ తినారంటే బార్బీ బొమ్మలాగా అందంగా కనిపిస్తారు
అందంగా కనిపించాలని ఎవరు మాత్రం అనుకోరు చెప్పండి. అందుకోసం బ్యూటీ పార్లర్ కి వెళ్ళడం కాదు ఈ ఆహారాలు తీసుకున్నారంటే అందంగా ఉంటారు.
బార్బీ లాంటి అందం కావాలా? అయితే అందుకోసం మొహానికి రంగులు వేసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అందం అనేది పైకి మేకప్ లు వేసుకుంటే వచ్చేది కాదు. పేలవమైన ఆహారపు అలవాట్లు మిమ్మల్ని అందవిహీనంగా కనిపించేలా చేస్తే సమతుల్య ఆహారం మీ అందాన్ని రెట్టింపు చేస్తుంది. ఖరీదైన బ్యూటీ పార్లర్ ట్రీట్మెంట్ కి వెళ్ళకుండా మంచి ఆహారం తీసుకుంటే చాలు. ప్రకాశవంతమైన చర్మం, మెరిసే జుట్టు, బలమైన గోర్లు కావాలంటే ఈ ఆహార పదార్థాలు మీ డైట్లో తప్పనిసరిగా ఉండేలా చూసుకోండి.
బెర్రీలు
బ్లూ బెర్రీస్, బ్లాక్ బెర్రీస్, కాన్ బెర్రీస్ లో పోషకాలు అధికంగా ఉంటాయి. శరీరం తనని తాను రిపేర్ చేసుకునేందుకు అవసరమైన యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ గుణాలని ఇవి అందిస్తాయి. ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టాన్ని నివారిస్తాయి. చర్మానికి అద్భుతమైన మెరుపుని అందిస్తాయి. చర్మానికి మేలు చేసే కొల్లాజెన్ ఇచ్చే విటమిన్ ఏ, సి పుష్కలంగా ఇస్తుంది.
గుడ్లు
కొరియన్ బ్యూటీ ప్రొడక్ట్ గా గుడ్డు క్రీమ్ ప్రసిద్ధి చెందింది. గుడ్డులోని పచ్చ సొనలో విటమిన్ ఏ ఉంటుంది. ఇది చర్మాన్ని పునరుద్ధరిస్తుంది. గుడ్డు సొనలు ముఖంపై మెరుపుని ఇచ్చేందుకు పని చేస్తాయి. ఇవి కొవ్వు ఆమ్లాలతో నిండి ఉండటం వల్ల చర్మానికి అవసరమైన తేమని అందిస్తాయి.
క్యారెట్లు
స్కిన్ కి ఉపయోగపడే ఫుడ్ తినాలనుకునే వారికి అద్భుతమైన ఎంపిక క్యారెట్. దద్దుర్లు, మొటిమలతో పాటు అనేక చర్మ సమస్యలకు చికిత్స చేసే గుణాలు క్యారెట్ లో మెండుగా ఉన్నాయి. యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండటంతో పాటు బీటా కెరోటిన్ సమృద్ధిగా ఇస్తుంది. చర్మం మీద ఏర్పడే నల్ల మచ్చలు నయం చేయడంలో సహాయపడుతుంది.
టొమాటో
లుటీన్, బీటా కెరోటిన్, లైకోపీన్ సహా అనేక కెరొటినాయిడ్లు టొమాటోలో ఉన్నాయి. మొటిమలు సహజంగా నివారించేందుకు ఇవి ఉపయోగపడతాయి. టొమాటో రసంలో యాంటీ బ్యాక్టీరియా, యాంటీ ఫంగల్ గుణాలు కలిగి ఉన్నాయి. చర్మ pH స్థాయిలని సమతుల్యం చేస్తాయి. చర్మం మీద వచ్చే నూనె ఉత్పత్తిని తగ్గిస్తాయి.
కొబ్బరి నీళ్ళు
కొబ్బరి నీళ్ళు చర్మానికి ఎంతో మేలు చేస్తాయి. చర్మాన్ని తేమగా, ఆరోగ్యంగా, ప్రకాశవంతంగా ఉంచడంలో సహాయపడతాయి. వీటితో చర్మం నిగారింపు సంతరించుకుంటుంది. యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియా, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఇన్ఫెక్షన్ నుంచి కాపాడతాయి. వృద్ధాప్య సాంకేటాలని ఆలస్యం చేయడంలో సమర్థవంతంగా పని చేస్తుంది. మొటిమలు నివారిస్తుంది.
మామిడి పండ్లు
ఇవి తింటే మొటిమలు వస్తాయనే ఒక వాదన ఉంది. కానీ వీటిని తినడం వల్ల చర్మానికి జరిగే మేలు గురించి తెలిస్తే అసలు వదిలిపెట్టరు. మెరిసే చర్మం పొందాలని అనుకుంటే మామిడి పండ్లు మితంగా తీసుకోవాలి. ఇందులోని విటమిన్ సి మొటిమలని నయం చేస్తుంది. రంధ్రాలు అన్ లాగ్ చేస్తుంది. యూవీ కిరణాల వల్ల కలిగే హాని నుంచి చర్మాన్ని రక్షిస్తుంది. మామిడి పండ్లు సహజ సన్ స్క్రీన్ గా పని చేస్తాయి.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.
Also Read: టీత్ వైటనింగ్‌తో దంతాలు తెల్లగా మారుతాయా?