Teeth Whitening: టీత్ వైటనింగ్‌తో దంతాలు తెల్లగా మారుతాయా?
దంతాలు తెల్లగా కనిపించేలా చేసుకునేందుకు ఇప్పుడు అధునాతన టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది. అదే టీత్ వైటనింగ్.
మీ పేస్ట్ లో ఉప్పు ఉందా? మీ దంతాలు తెల్లగా మారాలని అనుకుంటున్నారా? అయితే ఈ పేస్ట్ బెస్ట్ ఎంపిక అంటూ టీవీలో బోలెడు యాడ్స్ రోజూ కనిపిస్తూనే ఉంటాయి. తెల్లటి చిరునవ్వు మంచి నోటి పరిశుభ్రతకు సూచిక. దంతాలు తెల్లగా ఉంచుకోవడం అనేది అంత ఈజీగా సాధ్యమయ్యే విషయం కాదు. పళ్ళు తెల్లగా ఉంచుకోవడం అనే దాని మీద అనేక అపోహలు ఉన్నాయి. వాటిని కొంతమంది నిజమని నమ్మేస్తారు. వాటిని సరిదిద్దుకోకపోతే చాలా నష్టపోవాల్సి వస్తుంది. వాటిలో కొన్ని అపోహలు, వాస్తవాలు ఇవి.
అపోహ: దంతాలు ఎంత రంగు మారినా తెల్లగా వచ్చేస్తాయి
వాస్తవం: నిజానికి పళ్ళు రంగు మారడానికి ఉన్న కారణాలు పరిగణలోకి తీసుకోవడం అవసరం. సహజమైన మరకలు దంతాల లోతైన ఉపరితలంపై ఉంటాయి. ఇది వయసుకి సంబంధించినది అనుకుంటారు కానీ కాదు. ఫ్లోరైడ్ తీసుకోవడం వల్ల ఎనామెల్ దెబ్బతిని రంగు మారవచ్చు. దీని వల్ల డెంటిన్ ముదురు రంగులోకి వస్తుంది. ధూమపానం, పొగాకు నమలడం, కాఫీ, టీ, వైన్ వంటి వాటిని వల్ల ఎనామెల్ పై క్రోమోజెనిక్ మరకలు పడతాయి. దంతాలు తెల్లబడటం అనేది కేవలం బయటి ఉపరితలం కాంతివంతం చేయడానికి మాత్రమే పని చేస్తాయి. అంతర్గత మరకలు కోసం బ్లీచింగ్ చేయవచ్చు.
అపోహ: దంతాలు తెల్లగా అయ్యేందుకు ప్రొఫెషనల్ క్లీన్ అప్ అవసరం లేదు
వాస్తవం: దంతాల మీద ఫలకం లేదా కాలిక్యులస్ ఏర్పడితే తెల్లబడటం అనేదాన్ని నిరోధిస్తుంది. వాటి సహజమైన రంగుని కోల్పోతుంది. అందుకే పళ్ళు మీద ఉన్న పాచి, మరకలు, పళ్ళలో ఇరుక్కుపోయిన చెత్తను తొలగించుకోవడం ముఖ్యం.
అపోహ: సహజ ఉత్పత్తులు దంతాలని గణనీయంగా తెల్లగా చేస్తాయి
వాస్తవం: జర్నల్ ఆఫ్ ఓరల్ బయోసైన్సెస్ పేర్కొన్నట్టుగా నిమ్మకాయ, స్ట్రాబెర్రీ, నారింజ, బొప్పాయి వంటి ఇతర పండ్లు తింటే సహజంగా తెల్లగా ఉంటాయి. ఇవి దంతాల రూపాన్ని తేలిక చేస్తాయి. పండ్లు, కూరగాయలు శరీరానికి చాలా మేలు చేస్తాయి. అవి పంటి రంగుని గణనీయంగా ప్రభావితం చేస్తాయి.
అపోహ: వైటనింగ్ ఏజెంట్లతో దంతాలు తెల్లబడతాయి.
వాస్తవం: దంతాలు తెల్లబరిచే ఏజెంట్ల చర్య ఎనామిల్, డెంటిన్ అకర్బన, సేంద్రీయ భాగాలపై మాత్రమే పని చేస్తుంది. వరల్డ్ జర్నల్ ఆఫ్ డెంటిస్ట్ ప్రకారం పళ్ల మీద పెట్టె క్లిప్, ఫిల్లింగ్స్ వల్ల దంతాల రంగు తెల్లగా ఏమి మారదు.
అపోహ: తెల్లబడటం ఎప్పటికీ ఉంటుంది
వాస్తవం: దంతాలు మొదట్లో తెల్లగా ఉన్నప్పటికీ కాలక్రమేణా వాటి రంగు మసకబారుతుంది. ఆహారం, ధూమపానం, నోటి పరిశుభ్రత వంటి వాటి మీద పళ్ళు తెలుపు ఆధారపడి ఉంటుంది.
అపోహ: ఇంట్లో కంటే బయట క్లీన్ చేసుకుంటే తెల్లగా అవుతాయి
వాస్తవం: వైటనింగ్ ఏజెంట్లు హైడ్రోజన్ పెరాక్సైడ్ లేదా కార్బమైడ్ పెరాక్సైడ్ తో తయారవుతాయి. దంతాల ఉపరితలం నుంచి మరకలు తొలగించి సహజ రంగుని పునరుద్ధరిస్తారు. డెంటల్ టెక్నాలజీతో ఈ ప్రక్రియ ఉంటుంది. దంతాలు వైటనింగ్ ప్రక్రియకి మీ దంతాలు సరిగా ఉన్నాయో లేదో వైద్యులు చెక్ చేస్తారు. వాటి మీద రబ్బరు లేదా జెల్ ప్రొటెక్టర్ వేస్తారు. నోటికి మౌత్ గార్డ్ లాగా సరిపోయే విధంగా మన దంతల సైజుని బట్టి ఒక ట్రేని తయారు చేసి ఫిట్ చేస్తారు. దంత వైద్యులు సూచించిన ఉత్పత్తుల్లో గరిష్టంగా 10 శాతం ఖచ్చితమైన తెలుపు ఇస్తే మిగతా 30 నుంచి 40 శాతం సంతృప్తికరమైన ఫలితం ఉంటుంది.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.
Also Read: ఈ మూడు చాలు మీ గుండెని ప్రమాదంలో పడేయడానికి!