IPL, 2022 | Qualifier 2 | Narendra Modi Stadium, Ahmedabad - 27 May, 07:30 pm IST
(Match Yet To Begin)
RR
RR
VS
RCB
RCB
IPL, 2022 | Final | Narendra Modi Stadium, Ahmedabad - 29 May, 08:00 pm IST
(Match Yet To Begin)
GT
GT
VS
TBC
TBC

Dhanushkodi: ప్రపంచం అంచులకు వెళ్లిన ఫీలింగ్ కావాలా, ధనుష్కోడిలోని ఆ ప్రాంతానికి వెళితే సరే

వేసవిలో ఎక్కడికి వెళ్లాలని ఆలోచిస్తున్నారా? ధనుష్కోడి వెళితే ఆ ట్రిప్ గుర్తుండిపోవడం ఖాయం.

FOLLOW US: 

ప్రపంచం అంచుకు వెళ్లి నిల్చుని చూస్తే ఎలా ఉంటుంది? చుట్టూ నీళ్లు, మధ్యలో మీరు... అలాంటి అనుభూతిని జ్ఞాపకాల రూపంలో పదిలంగా దాచుకోవాలనుందా? అయితే ధనుష్కోడి రామసేతును సందర్శించాల్సిందే. కుటుంబంతో సరదాగా గడిపేందుకు మంచి డెస్టినేషన్ ధనుష్కోడి. తమిళనాడులోని రామేశ్వరం దీవి ఒక అంచున ఉన్న గ్రామం ఇది. ఇదో చిన్న జాలర్ల గ్రామం. ఒకప్పుడు మనదేశానికి, శ్రీలంకుకు మధ్య వారధిలా ఉండేది ధనుష్కోడి. ఈ గ్రామం రామేశ్వరం నుంచి 20 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.

అదే రామసేతు
పూర్వం రాముడు లంకను చేరేందుకు సేతువును (వంతెన) నిర్మించిన సంగతి తెలిసిందే. ఆ రామసేతు ప్రారంభమైంది ధనుష్కోడి నుంచే అనే నమ్మకం ప్రజల్లో ఉంది. అదే ధనుష్కోడి నుంచి సముద్రం మధ్యలోకి కనిపించే నడవ దారే. ఒక్కోసారి అది సముద్రం నీళ్లలోని మునిగిపోతుంది. సముద్ర నీళ్లు తగ్గి వంతెన బయటకు కనిపించినప్పుడు చక్కగా దానిపై నడవచ్చు. వంతెన చివరన నిలుచుంటే చుట్టూ నీళ్లతో ప్రపంచం అంచున నిల్చున్న ఫీలింగ్ కలుగుతుంది. నిల్చుని చుట్టూ ఒక్కసారి చూస్తే మీకు ప్రపంచానికి అదే చివరి పాయింట్ అనిపిస్తుంది. 

రామ‌సేతు రాళ్లు
రామ వంతెనకు వాడిన రాళ్లు ఇప్పటికి ఆ ప్రాంతంలో ఉన్నాయని నమ్ముతారు. జాలర్ల వలల్లో చాలా సార్లు ఆ రాళ్లు పడతాయి. వాటిని పర్యాటకులను అమ్ముతుంటారు. నిజానికి ఇలా అమ్మడం నిషేధమే అయినా, అమ్మకాలు మాత్రం జరుగుతున్నాయి. ధనుష్కోడి నుంచి కేవలం 18 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది శ్రీలంక. 

దెయ్యాల గ్రామం...
ధనుష్కోడిని ఘోస్ట్ టౌన్‌గా పిలుస్తారు. దానికి కారణం అక్కడ ఎవరూ నివసించకపోవడమే. ప్రస్తుతం పర్యాటకుల కోసం ఏర్పాటు చేసిన షాపులు, కొంతమంది జాలర్లు మాత్రమే అక్కడ కనిపిస్తారు. 1964లో వచ్చిన తుఫానుకు ధనుష్కోడి గ్రామం నాశనమైపోయింది. ఎంతోమంది చనిపోయారు. దీంతో ఆ గ్రామాన్ని అందరూ విడిచివెళ్లిపోయారు. జనాల్లేక దెయ్యాల గ్రామంగా పేరు పడిపోయింది. కానీ అక్కడ ఎలాంటి దెయ్యాల కథలు ప్రచారంలో లేవు. రాముడి కాలిడిన ప్రదేశంగా ప్రసిద్ధికెక్కింది. కేవలం సముద్రం పక్కనే ఉండడం తుఫానులు విరుచుకుపడడంతోనే గ్రామం ఖాళీగా మిగిలిపోయింది. 

ఎలా వెళ్లాలి?
1. ధనుష్కోడికి దగ్గరలో ఉన్న రైల్వే స్టేషన్ రామేశ్వరం. రామేశ్వరానికి చాలా ప్రాంతాల నుంచి రైళ్లు నడుస్తున్నాయి. 

2. విమానంలో వెళ్లాలనుకుంటే మధురై ఎయిర్ పోర్టు వరకు, లేదా టుటికోరిన్ ఎయిర్ పోర్టు వరకు వెళ్లచ్చు. మధురై ఎయిర్ పోర్టు నుంచి 198 కిలోమీటర్ల దూరం, టుటికోరిన్ ఎయిర్ పోర్టు నుంచి 142 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ధనుష్కోడి.  

3. బస్సుల్లో వెళ్లే వారయితే రామేశ్వరం వరకు బుక్ చేసుకుని వెళ్లచ్చు. అక్కడ్నించి ధనుష్కోడి చాలా దగ్గర. స్థానికంగా చాలా ట్యాక్సీలు, బస్సులు ధనుష్కోడికి తిరుగుతుంటాయి. 

Also read: ఆ బీచ్‌లో గుసగుసలు వినిపిస్తాయి, మాట్లాడేదెవరో తెలియదు, అదో మిస్టరీ

Also read: వేసవి సెలవుల్లో హంపి ట్రిప్ అదిరిపోతుంది, అక్కడ కచ్చితంగా చూడాల్సిన ప్రదేశాలు ఇవిగో

Also read: కొత్త జంటలకు ఉత్తమ హనీమూన్ డెస్టినేషన్ అండమాన్ నికోబార్ దీవులు, అక్కడికి ఎలా వెళ్లాలి? ఎంత ఖర్చువుతుంది?

Published at : 08 Apr 2022 01:36 PM (IST) Tags: Dhanushkodi trip in Summer Summer Holiday in Dhanushkodi How to go Dhanushkodi Summer Family Trip

సంబంధిత కథనాలు

Warts Removal Tips: పులిపిరులు వేదిస్తున్నాయా? ఈ ఆయుర్వేద చిట్కా పాటిస్తే వెంటనే రాలిపోతాయి

Warts Removal Tips: పులిపిరులు వేదిస్తున్నాయా? ఈ ఆయుర్వేద చిట్కా పాటిస్తే వెంటనే రాలిపోతాయి

Man Cut in Half: ప్రాణం పోసిన ప్రేమ, ప్రమాదంలో శరీరం సగానికి ముక్కలైనా జీవిస్తున్న యువకుడు

Man Cut in Half: ప్రాణం పోసిన ప్రేమ, ప్రమాదంలో శరీరం సగానికి ముక్కలైనా జీవిస్తున్న యువకుడు

Hair Regrow Drug: గుడ్ న్యూస్, బట్టతలకు ఇక బై బై, ఈ మందుతో జుట్టు తిరిగి వచ్చేస్తుంది!

Hair Regrow Drug: గుడ్ న్యూస్, బట్టతలకు ఇక బై బై, ఈ మందుతో జుట్టు తిరిగి వచ్చేస్తుంది!

Keema Recipe: దాబా స్టైల్‌లో కీమా కర్రీ రెసిపీ, తింటే ఎంతో బలం

Keema Recipe: దాబా స్టైల్‌లో కీమా కర్రీ రెసిపీ, తింటే ఎంతో బలం

Clay Pot: ఫ్రిజ్‌లో నీళ్ల కన్నా కుండలో నీళ్లు తాగడం వల్ల ఎంత ఆరోగ్యమో తెలుసా?

Clay Pot: ఫ్రిజ్‌లో నీళ్ల కన్నా కుండలో నీళ్లు తాగడం వల్ల ఎంత ఆరోగ్యమో తెలుసా?

టాప్ స్టోరీస్

KCR Comments In Bengalore : రెండు, మూడు నెలల్లో సంచలన వార్త - మార్పును ఎవరూ ఆపలేరన్న కేసీఆర్

KCR Comments In Bengalore : రెండు, మూడు నెలల్లో సంచలన వార్త - మార్పును ఎవరూ ఆపలేరన్న కేసీఆర్

Ante Sundaraniki: ‘అంటే సుందరానికి’ మేకింగ్, షూటింగ్‌లో నాని ఫన్‌కు పకపకా నవ్వులు, ఇదిగో వీడియో!

Ante Sundaraniki: ‘అంటే సుందరానికి’ మేకింగ్, షూటింగ్‌లో నాని ఫన్‌కు పకపకా నవ్వులు, ఇదిగో వీడియో!

Vivo T2 5G: వివో కొత్త ఫోన్ లాంచ్ వాయిదా - కారణం ఏంటంటే?

Vivo T2 5G: వివో కొత్త ఫోన్ లాంచ్ వాయిదా - కారణం ఏంటంటే?

IND vs INA, Asia Cup Hockey: ఇండోనేషియాపై టీమిండియా గోల్స్ వర్షం - ఏకంగా 16-0తో విజయం - ఇంటి బాట పట్టిన పాకిస్తాన్!

IND vs INA, Asia Cup Hockey: ఇండోనేషియాపై టీమిండియా గోల్స్ వర్షం - ఏకంగా 16-0తో విజయం - ఇంటి బాట పట్టిన పాకిస్తాన్!