A New Study on Blood Donation : రక్తమార్పిడితో ప్రాణాంతక అలెర్జీలు వచ్చే ప్రమాదం.. షాకింగ్ విషయాలు వెల్లడించిన తాజా అధ్యయనం
Allergic Transfusion Reactions : అత్యవసర సమయాల్లో ప్రాణాలు కాపాడేందుకు చాలామంది వైద్యులు రక్తమార్పిడి చేసి ప్రాణాలు కాపాడుతారు. అయితే ఈ ప్రక్రియ వల్ల కొందరిలో అలెర్జీలు వస్తాయంటుంది తాజా అధ్యయనం..
Blood Transfusion : రక్తదానం ఎంతో పవిత్రమైనది. ఎందరి ప్రాణాలను ఇది రక్షించిందో చెప్పడం చాలా కష్టం. ప్రపంచవ్యాప్తంగా ఎందరికో పునర్జన్మనిస్తోంది ఈ రక్తదానం. అయితే ఈ రక్తదానంతో ఓ కొత్త చిక్కు వస్తుందని తాజా అధ్యయనం తెలిపింది. రక్తదాత ఆహారపు అలవాట్లు.. స్వీకర్తలలో అలెర్జీలు ప్రేరేపిస్తుందని తాజా అధ్యాయనం తెలిపింది. ముఖ్యంగా పిల్లల్లో ఈ అలెర్జీలు ఎక్కువగా ఉండవచ్చని తెలిపింది. ఈ అధ్యయనంలో ఇదే కాకుండా మరిన్ని షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. అసలు ఈ స్టడీలో తేలిన అంశాలు ఏంటో.. ఈ అలెర్జీలు ప్రాణాంతకమో కాదో వంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
అప్పుడప్పుడు అలెర్జీలు
శస్త్రచికిత్స లేదా ఏదైనా యాక్సిడెంట్, గాయం వల్ల రక్తాన్ని కోల్పోయిన రోగులకు అలాగే బ్లడ్ తక్కువున్న రోగులకు రక్తమార్పిడిలు చేసి క్లిష్టమైన స్థితిని కాపాడగలిగే ఓ మహత్తరమైన కార్యక్రమం రక్తదానం. ఇది వారి ప్రాణాలను రక్షించే సామర్థ్యం కలిగి ఉన్నప్పటికీ.. రక్తమార్పిడులు కొన్నిసార్లు ప్రతికూల ప్రతిచర్యలకు దారితీస్తాయి. అప్పటికీ పలు విషయాల్లో వైద్యులు జాగ్రత్తలు తీసుకుంటారు కానీ.. ఈ రకమైన అలెర్జీల గురించి కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
డైట్ ఎఫెక్ట్
రక్తదాత తీసుకునే డైట్.. Allergic Transfusion Reactions (ATR)లు మధ్య సంబంధాన్ని ఈ కొత్త అధ్యయనం కనుగొంది. గ్రహీత రోగనిరోధక వ్యవస్థ రక్తమార్పిడి సమయంలో వారు స్వీకరించే రక్తానికి ప్రతికూలంగా స్పందించినప్పుడు ఈ అలెర్జీలు సంభవిస్తాయని పరిశోధకులు తేల్చారు. ఈ పరిశోధనతో రక్తదాతలు బ్లడ్ డోనేట్ చేసే ముదు వారి డైట్పై దృష్టి పెట్టేలా చేసింది. లేదంటే వారి రక్తంలోని అలెర్జీ కారకాలు.. ఫుడ్ అలెర్జీ ఉన్న రోగులలో ప్రతిచర్యలను చూపిస్తుంది. ముఖ్యంగా పిల్లల్లో ATRలు ప్రాణాంతకం కావొచ్చని ఈ స్టడీ తెలిపింది.
కారణాలపై క్లారిటీ లేదట.. కానీ
రక్తదాతలో కలిగే ప్రతిచర్యలు ఇమ్యునోగ్లోబులిన్, హైపర్సెన్సిటివిటీ కూడా ఓ కారణమై ఉండవచ్చని పరిశోధకులు భావిస్తున్నారు. ఇది ఒక రకమైన యాంటీబాడీ అలెర్జీలతో ముడిపడి ఉంటుంది. అయితే ATRలను ప్రేరేపించే సరైన కారణాలను గుర్తించడం వారికి సవాలుగా మారింది. పెద్దల్లో కాస్త పర్లేదు కానీ.. పిల్లల్లో ఫుడ్ సెన్సిటివిటీ బాగా ఎక్కువగా ఉంటుంది. వారి రియాక్షన్ చాలా తొందరగా వస్తాయి. ఇలా బ్లడ్ డోనేట్ చేసిన సమయంలో రక్తంలోని ATRలు వారిని బాగా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. రక్త దానం ప్రాణాలను రక్షించే విధానమే అయినా.. అలెర్జీలను ప్రేరేపిస్తే ప్రాణాంతకం కావొచ్చు అంటున్నారు.
నమూనాలు సేకరించిన బృందం
ఈ పరిశోధనను మే 2022 నుంచి డిసెంబర్ 2023 మధ్య డాక్టర్ యానాగిసావా బృందం ఈ పరిశోధనను చేశారు. గుడ్లు, గోధుమలు, పాలు వంటి సాధారణ ఆహారాలకు అలెర్జీ ఉన్న 100 మంది రోగుల రక్త నమూనాలపై వారు అధ్యయనం చేశారు. ఈ ఆహారాలను గణనీయమైన మొత్తంలో తినే వారి, ఆరోగ్యకరమైన దాతల నుంచి రక్తాన్ని సేకరించి వాటిపై కూడా పరిశోధనలు చేశారు. బాసోఫిల్ యాక్టివేషన్ టెస్ట్(BAT )లు చేసి.. ఒక రకమైన తెల్ల రక్త కణం అలెర్జీ ప్రతి చర్యలలో పాల్గొంటున్నట్లు గుర్తించారు.
ప్రత్యామ్నాయం ఉందా?
గుడ్డు అలెర్జీ ఉన్న రోగులకు గుడ్లు తిన్న దాతల నుంచి సేకరించిన రక్తం ఇవ్వగా.. వారిలో BAT స్థాయిలు గణనీయంగా పెరిగినట్లు గుర్తించారు. ఇది బలమైన అలెర్జీని సూచిస్తుంది. అలాగే పాలు, గోధుమలకు అలెర్జీ ఉన్నవారిపై కూడా పరిశోధన చేసి.. వైవిధ్యాలను గుర్తించారు. భవిష్యత్తులో ATRలకు నివారణ చర్యలు అభివృద్ధి చేసి.. సురక్షితమై రక్తమార్పిడి చేయవచ్చని డాక్టర్ యానాగిసావా తెలిపారు.
Also Read : పసుపుతో ఆ సమస్యలను మాయం చేయొచ్చంటున్న తాజా స్టడీ - ఖరీదైన చికిత్సలకూ చక్కని ప్రత్యామ్నాయం