Viral Video: ఇలాంటి పెళ్లి చూసుండరు, పాములనే పూల దండల్లా భావిస్తూ పెళ్లి చేసుకున్న జంట, పాత వీడియో వైరల్
పెళ్లంటే ప్రత్యేకమైన రోజు. ఆ రోజును ఓ జంట మర్చిపోలేని విధంగా మార్చుకుంది.
వీడియో ఎప్పటిది అనేది ఎవరూ పట్టించుకోవడం, చూడటానికి కంటెంట్ ఉంటే చాలు నిమిషాల్లో వైరల్ చేసేస్తున్నారు. అలాగే ఓ పాత పెళ్లి వీడియో ఒకటి ప్రస్తుతం వైరల్ గా మారింది. అందులో ఓ జంట పెళ్లి చేసుకుంటోంది. అయితే పూల దండలకు బదులు ఇద్దరూ చెరో పాముని మెడలో వేసుకున్నారు. వధువు మీడియం సైజు పాముని వరుడి మెడలో వేస్తే, వరుడు ఏకంగా పెద్ద కొండచిలువనే తెచ్చి అమ్మాయి మెడలో వేశాడు. ఈ పెళ్లి చూసి చుట్టుపక్కల జనాలు భయపడ్డారు కానీ వీరిద్దరూ మాత్రం ఎంచక్కా పాములను మార్చుకున్నారు. ఈ పెళ్లి 2010లో జరిగినట్టు సమాచారం. మహారాష్ట్రాలోని ఒక మారుమూల గ్రామంలో ఈ పెళ్లి జరిగినట్టు తెలుస్తోంది. వధూవరూలిద్దరూ అటవీ శాఖ అధికారులని అందుకే ఇలా వెరైటీగా పెళ్లి చేసుకున్నారని చెబుతున్నారు. వరుడు పేరు సిద్ధార్ధ్ సోనావనే కాగా, వధువు పేరు సృష్టి.
View this post on Instagram
కొత్త కల్చర్
పెళ్లిని అందంగా, పదికాలాల పాటూ గుర్తుండిపోయేలా చేసుకోవాలని అందరూ కోరుకుంటారు. కొంత మంది మాత్రం వెరైటీగా పది మంది చర్చించుకునే విధంగా ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. ఫ్రాన్స్ దేశంలో ఆ మధ్య ఇద్దరు వధూవరులు మిగిలి పోయిన ఆహారాలు, వ్యర్థ పదార్ధాలతో టాయిలెట్ సీట్లోనే కాంకాషన్ కలిపారు. ఇది తెలుసుకున్న అతిధులు వాంతులు చేసుకున్నారు. వారి మీద కేసు వేసేందుకు సిద్ధమయ్యారు. మరోచోట ఇద్దరు వధువరులు తమకు నిప్పంటించుకుని పెళ్లి వేదిక నుంచి నడుచుకుంటూ వచ్చారు. వారు సినిమాల్లోని స్టంట్ మాస్లర్లుగా పనిచేస్తుండడంతో ఇలా చేశారు. ఇలాంటివి ప్రపంచంలో ప్రతి మూల ఎక్కడో దగ్గరా జరుగుతూనే ఉన్నాయి.
Also read: ఇరాక్‌ను వణికిస్తున్న వింత జ్వరం, జంతువుల ద్వారా సోకుతున్న వైరస్