అన్వేషించండి

Congo Fever: ఇరాక్‌‌ను వణికిస్తున్న వింత జ్వరం, జంతువుల ద్వారా సోకుతున్న వైరస్

ఇరాక్ లోని గ్రామీణ ప్రాంతాల్లో కొత్త జ్వరం పాకుతోంది. దీని వల్ల ఇప్పటికే ఎన్నో మరణాలు సంభవించాయి.

మొన్నటి వరకు కరోనా ప్రపంచాన్ని వణికించింది. ఇప్పుడిప్పుడే దాన్నుంచి బయటపడుతున్నామని అనుకుంటున్న సమయంలో మంకీ పాక్స్ తెర మీదకు వచ్చింది. ఇప్పుడు ఇరాక్ తో మరో వింత జ్వరం కలవరానికి గురిచేస్తుంది. కాంగో ఫీవర్‌గా పిలిచే ఈ జ్వరం వల్ల ఇప్పటి వరకు 19 మంది మరణించారు. వారంతా ముక్కు నుంచి రక్తం కారి, అంతర్గతంగా కూడా రక్తస్రావమై మరణించినట్టు గుర్తించారు. ఇంకా కేసులు పెరుగుతూ వస్తున్నాయి. 111 కేసులను ప్రస్తుతానికి గుర్తించారు, వారిలో 19 మంది మరణించడం ప్రజలను కలవరానికి గురిచేస్తుంది. 

ఏమిటీ వైరస్?
సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (CDC) ప్రకారం ఈ కాంగో ఫీవర్ టిక్ బర్న్ అని పిలిచే వైరస్ వల్ల వస్తుంది. దీన్ని మొదట 1944లో క్రిమియాలో కనుగొన్నారు. అందుకే దీనికి ‘క్రిమియన్ హెమరేజిక్ ఫీవర్’ అని పిలుస్తారు. తరువాత ఇదే వైరస్ 1969లో కాంగోలో తీవ్ర అలజడికి కారణమైంది. అప్పట్నించి ‘కాంగో ఫీవర్’ అని పిలవడం ప్రారంభించారు. ఆఫ్రికా, ఆసియా, మిడిల్ ఈస్ట్, బాల్కన్ దేశాలలో ఈ వైరస్ ఉనికిలో ఉంది. 

ఎలా సోకుతుంది?  
టిక్ బర్న్ వైరస్ జంతువులను కరవడం ద్వారా వాటిలో ప్రవేశిస్తాయి. ఇదే జంతువులను ఆహారం కోసం వధిస్తున్నప్పుడు చిందే రక్తం లేదా వాటి మాంసం ద్వారా ప్రజలకు వెంటనే సోకుతుంది. ఆవులు, గొర్రెలు, మేకలు, కోళ్లు వంటి వాటిపై ఈ వైరస్ లు మొదట దాడి చేస్తాయి. 

గ్రామీణ ప్రాంతాల్లో ఉండే రైతులు, కబేళాలలో పనిచేసేవారు, పశు వైద్యులు అధికంగా ఈ వైరస్ బారిన పడుతున్నట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది. ఇది మనిషి నుంచి మనిషికి కూడా అంటుకుంటుందని తెలిపింది.వైరస్ సోకిన వారితో సన్నిహిత సంబంధం కలవారికి వ్యాప్తి చెందే అవకాశం చాలా ఎక్కువ. రక్తం, నోరు, ముక్కు స్రావాల ద్వారా ఈ వైరస్ మనుషుల్లో వ్యాప్తి చెందుతుంది. 

లక్షణాలు...
కాంగో ఫీవర్ వస్తే జ్వరం తీవ్రంగా ఉంటుంది. వాంతులు అవుతుంటాయి. ముక్కు నుంచి ఆపలేని విధంగా రక్త స్రావం అవుతుంది. అంతర్గతంగా కూడా అయ్యే అవకాశం ఎక్కువ. ఇలా రక్తస్రావం అయిన వారు మరణించే ఛాన్సులు కూడా అధికమే. 

చికిత్స
ఈ వైరస్ కు వ్యాక్సిన్ లేదు. ప్రారంభంలోనే వేగంగా లక్షణాలు బయటపడతాయి. ఈ వైరస్ సోకిన వారిపై పరిశోధనలు చేస్తే కాదు వారిలో కలిగే ఇతర సమస్యలు, దీర్ఘకాలిక ప్రభావాల గురించి తెలిసే అవకాశం లేదు. ఈ వైరస్ బారిన పడని వారిలో రికవరీ మాత్రం చాలా నెమ్మదిగా ఉంది. 

Also read: కంటిచూపు కాపాడుకోవాలంటే సిగరెట్ మానేయాల్సిందే

Also read: ఈ లక్షణాలు కనిపిస్తే ఐరన్ లోపమేమో చెక్ చేసుకోవాల్సిందే

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Cantonment Bypoll: కంటోన్మెంట్‌ ఉప ఎన్నికకు అభ్యర్థిని ప్రకటించిన బీజేపీ - ఏ పార్టీ నుంచి ఎవరంటే!
కంటోన్మెంట్‌ ఉప ఎన్నికకు అభ్యర్థిని ప్రకటించిన బీజేపీ - ఏ పార్టీ నుంచి ఎవరంటే!
Akhanda 2: ఎన్నికల తర్వాతే 'అఖండ 2' ఉంటుంది - ఈసారి అలాంటి కాన్సెప్ట్‌తో వస్తున్నాం: బోయపాటి శ్రీను
ఎన్నికల తర్వాతే 'అఖండ 2' ఉంటుంది - ఈసారి అలాంటి కాన్సెప్ట్‌తో వస్తున్నాం: బోయపాటి శ్రీను
IPL 2024: ఇక నా వల్ల కాదు గుడ్‌ బై! మ్యాక్స్‌వెల్‌ సంచలన ప్రకటన
ఇక నా వల్ల కాదు గుడ్‌ బై! మ్యాక్స్‌వెల్‌ సంచలన ప్రకటన
CM Jagan: సీఎంపై రాయి దాడి ఘటనలో ఊహించని ట్విస్ట్ - సంచలనం రేపుతోన్న లోకేష్ ట్వీట్
సీఎంపై రాయి దాడి ఘటనలో ఊహించని ట్విస్ట్ - సంచలనం రేపుతోన్న లోకేష్ ట్వీట్
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

Nirai Mata Temple | గర్భగుడిలో దేవత ఉండదు... కానీ ఉందనుకుని పూజలు చేస్తారుSiricilla Gold Saree | Ram Navami | మొన్న అయోధ్య.. నేడు భద్రాద్రి సీతమ్మకు... సిరిసిల్ల బంగారు చీరVijayawada CP On CM Jagan Stone Attack:ప్రాథమిక సమాచారం ప్రకారం సీఎంపై దాడి వివరాలు వెల్లడించిన సీపీRCB IPL 2024: చేతిలో ఉన్న రికార్డ్ పోయే.. చెత్త రికార్డ్ వచ్చి కొత్తగా చేరే..!

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Cantonment Bypoll: కంటోన్మెంట్‌ ఉప ఎన్నికకు అభ్యర్థిని ప్రకటించిన బీజేపీ - ఏ పార్టీ నుంచి ఎవరంటే!
కంటోన్మెంట్‌ ఉప ఎన్నికకు అభ్యర్థిని ప్రకటించిన బీజేపీ - ఏ పార్టీ నుంచి ఎవరంటే!
Akhanda 2: ఎన్నికల తర్వాతే 'అఖండ 2' ఉంటుంది - ఈసారి అలాంటి కాన్సెప్ట్‌తో వస్తున్నాం: బోయపాటి శ్రీను
ఎన్నికల తర్వాతే 'అఖండ 2' ఉంటుంది - ఈసారి అలాంటి కాన్సెప్ట్‌తో వస్తున్నాం: బోయపాటి శ్రీను
IPL 2024: ఇక నా వల్ల కాదు గుడ్‌ బై! మ్యాక్స్‌వెల్‌ సంచలన ప్రకటన
ఇక నా వల్ల కాదు గుడ్‌ బై! మ్యాక్స్‌వెల్‌ సంచలన ప్రకటన
CM Jagan: సీఎంపై రాయి దాడి ఘటనలో ఊహించని ట్విస్ట్ - సంచలనం రేపుతోన్న లోకేష్ ట్వీట్
సీఎంపై రాయి దాడి ఘటనలో ఊహించని ట్విస్ట్ - సంచలనం రేపుతోన్న లోకేష్ ట్వీట్
Drugs And Drive Test: ఇకపై డ్రగ్స్ అండ్ డ్రైవ్ పరీక్షలు - గంజాయి తాగే వారిని ఈజీగా గుర్తించేలా!
ఇకపై డ్రగ్స్ అండ్ డ్రైవ్ పరీక్షలు - గంజాయి తాగే వారిని ఈజీగా గుర్తించేలా!
Kavali Accident: నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం - ఐదుగురు స్పాట్ డెడ్
నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం - ఐదుగురు స్పాట్ డెడ్
Chamkila Movie Review: ‘చమ్కీల’ మూవీ రివ్యూ - డబుల్ మీనింగ్ పాటలు పాడే ఆ సింగర్స్‌ను ఎందుకు చంపారు? మూవీ ఎలా ఉంది?
‘చమ్కీల’ మూవీ రివ్యూ - డబుల్ మీనింగ్ పాటలు పాడే ఆ సింగర్స్‌ను ఎందుకు చంపారు? మూవీ ఎలా ఉంది?
PMKVY: సొంతంగా బిజినెస్‌ స్టార్‌ చేయండి - ఉచిత శిక్షణతో పాటు బహుమతులు కూడా!
సొంతంగా బిజినెస్‌ స్టార్‌ చేయండి - ఉచిత శిక్షణతో పాటు బహుమతులు కూడా!
Embed widget