Smoking Effect: సిగరెట్లు తాగితే నాలుకపై వెంటుకలు వస్తాయా? ఇతడి నరకయాతన చూస్తే వణికిపోతారు!
ధూమపానం అనేక ఆరోగ్య సమస్యలు కలిగిస్తుందని అందరికీ తెలిసిన విషయమే. ఈ అలవాటు వల్ల ఒక వ్యక్తికి వింత పరిస్థితి వచ్చింది.
గుప్పు గుప్పుమని పొగ పీలుస్తూ పురుషులు తెగ ఎంజాయ్ చేస్తారు. వర్క్ మధ్యలో కాసేపు బ్రేక్ తీసుకున్నారంటే చాలు వెంటనే సిగరెట్ వెలిగించేసి రిలాక్స్ అయిపోతారు. ధూమపానం ఆరోగ్యానికి హానికరం అనే విషయం అందరికీ తెలిసిందే. దీని వల్ల అనేక అనారోగ్య సమస్యలు వస్తాయి. కానీ సిగరెట్ తాగడం మాత్రం మానుకోరు. ఇక్కడ కూడా ఒక వ్యక్తి ఇలాగే సిగరెట్లు మీద సిగరెట్లు తాగేశాడు. కానీ చివరకి అతనికి ఏమైందో తెలిస్తే మాత్రం పొరపాటున కూడా మీరు ఇంకోసారి సిగరెట్ ముట్టుకోరు.
అమెరికాలోని ఒహైయో ప్రాంతానికి చెందిన 64 ఏళ్ల వ్యక్తికి ధూమపానం చేసే అలవాటు ఉంది. దాన్ని అలవాటు అనే కంటే వ్యసనం అనడం మంచిది. దీని వల్ల అతనికి క్లిండామైసిన్ అనే చిగుళ్ళ ఇన్ఫెక్షన్ కి గురయ్యాడు. దాన్ని తగ్గించుకోవడం కోసం యాంటీ బయాటిక్స్ వినియోగించాడు. కానీ ధూమపానం మాత్రం ఆపలేదు. ఫలితంగా అతడి నాలుక గ్రీన్ కలర్ లోకి మారిపోవడమే కాదు దాని మీద చిన్న చిన్న వెంట్రుకలు కూడా వచ్చేశాయి. వినడానికి వింతగా ఉన్న పరిస్థితి ఇది. న్యూ ఇంగ్లాండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్ ప్రకారం ధూమపానం, నోటి ఆరోగ్యానికి మధ్య ప్రత్యక్ష సంబంధం కలిగి ఉంది. పొగాకు నోట్లో చెడు బ్యాక్టీరియా ఏర్పడేలా చేస్తుంది. బాగా ఎక్కువగా ధూమపానం చేసే వ్యక్తులు నోటి క్యాన్సర్ లేదా చిగుళ్ళ సమస్యలు, దంతాలు కోల్పోవడం, దంతాలు పుచ్చుపట్టడం వంటి సమస్యలకు ఎక్కువగా గురయ్యే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు. యాంటీ బయాటిక్స్ నోటిలోని మైక్రోబయోమ్ పై కూడా ప్రభావం చూపుతాయి. బ్యాక్టీరియాను మార్చేస్తాయి.
ఆకుపచ్చని నాలుకకి కారణాలు ఏంటి?
మనిషి నాలుక మీద ఉండే డోర్సల్ అనే ఏరియా మీద అసాధారణమైన పూతతో వెంట్రుకలు ఏర్పడతాయని అనేక అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న జనాభాలో 13 శాతం మంది ఈ పరిస్థితి బారిన పడుతున్నారు. ఇది సాధారణ, తాత్కాలిక, హాని చేయని పరిస్థితి అయినప్పటికీ వెంట్రుకలు నాలుక మీద వృద్ధాప్యంలో కూడా వస్తాయి. అమెరికన్ అకాడమీ ఆఫ్ ఓరల్ మెడిసిన్ ప్రకారం వెంట్రుకలు నాలుక మీద పాపిల్లే అనే అవయవ భాగాలపై చనిపోయిన చర్మ పేరుకుపోవడం వల్ల ఏర్పడుతుంది. దీని వల్ల కేరాటిన్ అనే ప్రోటీన్ భారీగా ఉత్పత్తి అవుతుంది. ఫలితంగా జుట్టు మొలుస్తుంది. పాపిల్లే సాధారణం కంటే పొడవుగా వచ్చినప్పుడు అవి వెంట్రుకలు మాదిరిగా కనిపిస్తాయి.
మౌత్ వాష్ లేదా క్యాండిలు వంటి మనం తినే ఆహార పదార్థాల మీద వెంట్రుకల రంగు ఆధారపడి ఉంటుంది. గోధుమ, తెలుపు, ఆకుపచ్చ, గులాబీ రంగులోకి మారే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. అనేక రకాల బ్యాక్టీరియా, ఈస్ట్ వల్ల నాలుకకి నలుపు రంగు కూడా వస్తుంది.
యాంటీ బయాటిక్స్ వల్ల కూడా..
ఒహైయో వ్యక్తి విషయంలో అతడు తీసుకున్న యాంటీ బయాటిక్స్ కూడా నోటిలో బ్యాక్టీరియా ఏర్పడటానికి కారణమని వైద్యులు తెలిపారు.
⦿ యాంటీ బయాటిక్స్ ఉపయోగించిన తర్వాత నోటిలోని బ్యాక్టీరియా లేదా ఈస్ట్ లో మార్పులు
⦿ నోటి శుభ్రత సరిగా లేకపోవడం
⦿ పొడి బారిన నోరు
⦿ పెరాక్సైడ్ వంటి ఆక్సీడైజింగ్ ఏంజెట్లని కలిగి ఉండే మౌత్ వాష్ వాడటం
⦿ పొగాకు దీర్ఘకాలికంగా ఉపయోగించడం
⦿ కాఫీ లేదా బ్లాక్ టీ ఎక్కువగా తాగడం
⦿ అతిగా మద్యం సేవించడం
వెంట్రుకల నాలుక కలిగి ఉన్న రోగులకు ప్రస్తుతానికి అది తగ్గిపోయినప్పటికీ మళ్ళీ వచ్చే అవకాశం ఉంది. ఇది హాని చేయని పరిస్థితి అయినప్పటికీ వెంట్రుకల నాలుక ఇబ్బందికారంగా ఉంటుంది. ఇతర నోటి సమస్యలకు దారి తీస్తుంది.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.
Also Read: అధిక రక్తపోటును అదుపులో ఉంచేందుకు ఈ పానీయాలు తాగండి
Join Us on Telegram: https://t.me/abpdesamofficial