వీడియో: ఈ బామ్మతో పెట్టుకుంటే దబిడి దిబిడే.. దొంగని అడ్డుకున్న 73 ఏళ్ల వృద్ధురాలు
ఓ స్టోర్‌లో వస్తువులను ఎత్తుకెళ్తున్న దొంగను ఓ పెద్దవిడ ధైర్యసాహసాలతో పట్టుకుంది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
దొంగోడిని పట్టుకోవాలంటే ఎంతో దమ్ముండాలి. ఎందుకంటే.. వారి వద్ద ఆయుధాలు కూడా ఉండే ప్రమాదం ఉంది. పారిపోయే క్రమంలో.. తమని పట్టుకొనేవారిపై దొంగలు దాడి చేస్తారు. అందుకే.. ఏదైనా దొంగతనం జరుగుతున్నప్పుడు అంత త్వరగా ఎవరూ ముందుకు రారు. అయితే, ఈ బామ్మగారు చాలా ధైర్యవంతురాలు. ధైర్యంగా ఓ దొంగను ఒంటిచేత్తు అడ్డుకుంది. షాప్‌లోని వస్తువులను ఎత్తుకెళ్లకుండా అడ్డుకుంది.
కెనడాలోని బ్రిటీష్ కొలంబియాలో క్యాంప్‌బెల్ రివర్ సమీపంలో ఉన్న వాల్‌మార్ట్ స్టోర్‌లో ఓ దొంగ దొరికినవన్నీ కార్డ్‌లో వేసుకుని.. బిల్లు చెల్లించకుండానే బయటకు వచ్చాడు. ఆ తర్వాత ఓ సైకిల్ తీసుకుని.. వాటిని ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నించాడు. దీంతో ఓ వ్యక్తి వీడియో రికార్డు చేస్తూ.. ఆ వస్తువులకు డబ్బులు చెల్లించావా? అని అడిగాడు. అదే సమయానికి వస్తువులను కొనుగోలు చేసుకుని బయటకు వెళ్తున్న 73 ఏళ్ల బామ్మ ఆ మాటలు విన్నది. క్షణం ఆలస్యం చేయకుండా అతడిని అడ్డుకుంది. వీడియోలో రికార్డయ్యేందుకు ఆ బామ్మ.. ముందుగా ఆ దొంగోడి ముసుగు తొలగించింది. దీంతో అతడు వస్తువులను అక్కడే వదిలిపెట్టి.. తన బ్యాగ్ తీసుకుని సైకిల్‌పై ఉడాయించాడు.
Also Read: చనిపోయినా వదలరు.. మూడేళ్ల తర్వాత సమాధుల నుంచి శవాలను బయటకు తీసి.. అరాచకం కాదు, ఆచారం
జనవరి 29న చోటుచేసుకున్న ఈ ఘటన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ బామ్మగారి ధైర్యాన్ని చూసి అంతా పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. అన్నట్లు.. ఆ బామ్మగారి పేరు ఎలైన్ గాలవే. తాజాగా ఆమె ఓ వీడియో సంస్థతో మాట్లాడుతూ.. ‘‘నేను డోర్ వద్దకు వెళ్తున్న సమయంలో ఆ వ్యక్తి కార్ట్ నిండా వస్తువులతో అక్కడి నుంచి తప్పించుకోడానికి ప్రయత్నిస్తూ కనిపించాడు. నా వద్దకు రాగానే అతడి ముసుగు తొలగించి వీడియోకు చూపించా. కానీ, అది అనుకోకుండా.. అప్పటికప్పుడు జరిగిపోయింది. అతడు దొంగ అని తెలియగానే.. అతడిని బయటకు వెళ్లనీవకూడదని అనుకున్నాను. అతడి ఒక చేయి కార్ట్ మీద, మరో చేతిని సైకిల్ మీద పెట్టాడు. కాబట్టి.. అతడికి ఆయుధాలు బయటకు తీసి దాడి చేసే అవకాశం కూడా లేదు’’ అని తెలిపింది. ఏది ఏమైనా ఈ బామ్మగారు గట్టివారే సుమీ. సెకన్ల వ్యవధిలోనే ఆమె అన్నివిధాలుగా ఆలోచించారంటే నిజంగా గ్రేటే. అతడిని కొనేందుకు సిద్ధమైన మహిళలు, ధర ఎంతంటే..
Grandma tries to stop a shoplifter pic.twitter.com/BBuwnoXLRU
— The Daily Sneed™ 💭 (@Tr00peRR) January 31, 2022
Also Read: మీరు మారరా? చైనీసే కాదు.. ఈ దేశస్తులూ గబ్బిలాలు తినడం ఆపలేదు.. ఎందుకు తింటున్నారో తెలిస్తే షాకే!