అన్వేషించండి

Eating Bats: మీరు మారరా? చైనీసే కాదు.. ఈ దేశస్తులూ గబ్బిలాలు తినడం ఆపలేదు.. ఎందుకు తింటున్నారో తెలిస్తే షాకే!

కోవిడ్-19 భయపెడుతున్నా.. ఈ దేశాల్లో ఇంకా గబ్బిలాలను తినడం ఆపలేదట. ఇంతకీ వీరంతా గబ్బిలాలను అంత ఇష్టంతో ఎందుకు తింటారో తెలుసా?

గబ్బిలాలు.. కోవిడ్ మరణాలను దగ్గర నుంచి చూసినవారిని గజగజ వణికించే ప్రాణి ఇది. ప్రపంచంలోని ప్రమాదకర వైరస్‌లన్నీ గబ్బిలాల్లోనే పెరుగుతాయి. అందుకే, గబ్బిలాలు తిరిగే ప్రాంతాల్లో సంచరించకూడదని చెబుతుంటారు. కోవిడ్-19 వైరస్‌కు కూడా గబ్బిలాలే కారణమనే సంగతి తెలిసిందే. వాటిని పెంచుకున్నా.. ఆహారంగా తీసుకున్నా చాలా ప్రమాదమని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. కానీ, ప్రజలు మాత్రం వాటిని ఇంకా తింటూనే ఉన్నారు. కోవిడ్-19 ప్రంపంచాన్ని వణికిస్తున్నా.. ఆ అలవాటు మానుకోలేకపోతున్నారు. 

గబ్బిలాలు ఇంట్లోకి వస్తే కీడు జరుగుతుందని మన పెద్దలు చెబుతుంటారు. వాటిని చెడుకు సంకేతాలుగా భావిస్తారు. శాస్త్రీయంగా కూడా గబ్బిలాలు మనుషులకు కీడు కలిగించే జంతువులేనని నిరూపితమైంది. అవి కొన్ని వేల రకాల వైరస్‌లను మోసుకొస్తాయని వైరాలజిస్టులు చెబుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. ఫలితంగా కోవిడ్-19 మాత్రమే కాకుండా మరెన్నో వైరస్‌లు మనుషులకు సోకుతున్నాయి. అయితే, ఆ వైరస్‌లు తప్పు చేసినవారికి మాత్రమే సోకవు. వారి నుంచి అమాయకులకు కూడా అంటుకుంటాయి. ఒకరి నుంచి ఒకరికి సంక్రమిస్తూనే ఉంటాయి. 

గబ్బిలాల్లో భయానక వైరస్.. నియోకోవ్: ఇటీవల చైనాలోని ఉహాన్ శాస్త్రవేత్తలు.. దక్షిణాఫ్రికాలోని గబ్బిలాలు, జంతువుల్లో కోవిడ్-19 రకానికి చెందిన నియోకోవ్ (NeoCov) అనే కొత్త వైరస్‌ను కనుగొన్నట్లు తెలిపిన విషయం తెలిసిందే. నియోకోవ్ వైరస్ కూడా SARS-CoV-2 మాదిరిగానే మానవ కణాలలోకి చొచ్చుకుపోతుంది. ఇది కూడా కోవిడ్ తరహాలోనే వ్యాప్తి చెందుతుంది. పైగా, ఇది కోవిడ్ కంటే ప్రమాదకరమైనది కూడా. ఇది జంతువుల నుంచి జంతువులకు మాత్రమే వ్యాపిస్తోంది. ఇది మనుషులకు వ్యాపించాలంటే.. కేవలం ఒకే ఒక మ్యూటేషన్ అవసరం. అంటే.. ఆ ఒక్క మ్యూటేషన్ పెరిగితే మనుషులకూ నియోకోవ్ వైరస్‌ సంక్రమిస్తుంది. ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుంది. ఇది SARS-CoV-2 కాదు. కానీ, దీనికి MERS Coronavirusతో సంబంధం ఉంది. ఇది సోకిన ప్రతి ముగ్గురిలో ఒకరు మరణించే అవకాశాలు ఎక్కువని ఇటీవలే హెచ్చరించారు. అయితే, ఇప్పటికీ కొన్ని ఆసియా దేశాల్లో గబ్బిలాలను వేటాడటం, ఆహారంగా తీసుకోవడం మానలేదు. 

పదేళ్ల కిందటే గబ్బిలాల వల్ల వైరస్ వ్యాప్తి: 2002-2004 మధ్య కాలంలో సుమారు 800 మందిని చంపిన SARS వైరస్.. చైనాలోని ఫోషన్‌ మార్కెట్‌లోని గబ్బిలాల వల్ల ఏర్పడినట్లు గుర్తించారు. అలాగే, కోవిడ్-19 మహామ్మారి సైతం అలాంటి మార్కెట్ నుంచే మనుషులకు వ్యాపించినట్లు చెబుతున్నారు. అటవీ జంతువుల అమ్మకాలను నిలిపివేయాలని ఆదేశించింది. ఆసియాలో జంతు సంక్షేమ సంఘాలు కూడా దీనిపై ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అలాంటి మార్కెట్లలోని అపరిశుభ్ర పరిస్థితులు.. జూనోటిక్ (జంతువుల నుంచి మనుషులకు వ్యాపించే వైరస్) వ్యాధులు కలిగించే వైరస్‌ల సంతానోత్పత్తి కేంద్రాలుగా మారుతున్నాయని, వెంటనే వాటిని నిషేదించాలని డిమాండ్ చేస్తున్నారు.  
 
నిషేదం విధించినా..: గతేడాది వియత్నాంలో అన్నిరకాల వన్యప్రాణుల దిగుమతులను నిలిపివేయాలని ఆ దేశ అధ్యక్షుడు ఉత్తర్వులు జారీ చేశారు. తన ఆదేశాలను ఉల్లంఘిస్తే.. 15 ఏళ్ల వరకు జైలు శిక్ష, భారీ జరిమానాలు వసూలు చేస్తామని హెచ్చరించారు. అయితే, స్థానిక వ్యాపారులు ఆ ఉత్తర్వులను అంత సీరియస్‌గా తీసుకోలేదు. గబ్బిలాలతోపాటు వివిధ వన్య ప్రాణులను అక్రమ మార్గాల్లో విక్రయిస్తూనే ఉన్నారని పాన్‌నేచర్ అనే ఎన్జీవో సంస్థ వెల్లడించింది.

మరణాలను లెక్క చేయకుండా..: ఇండోనేషియాలో సైతం గబ్బిలాలు తదితర వన్యప్రాణుల విక్రయాలు ఆగలేదు. అక్కడ 2.5 మిలియన్లకు పైగా కోవిడ్ కేసులు నమోదయ్యాయి. సుమారు 67,000 మంది మరణించారు. ఇంత నష్టం జరుగుతున్నా.. అక్కడి ప్రజలు గబ్బిలాలను తినడం మాత్రం మానలేదు. సెంట్రల్ జావాలోని సోలో నగరంలో కూడా వన్యప్రాణుల మార్కెట్ ఉంది. కోవిడ్-19 భయంతో ఆ మార్కెట్లోని గబ్బిలాలను చంపేయాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించారు. కానీ, ఆ ఆదేశాలను అమలు చేయడంలో అధికారులు విఫలమయ్యారు.   

ఇండోనేషియాలో పక్షి ప్రేమికుల సంఘం వ్యవస్థాపకుడు మారిసన్ గుసియానో వెబెర్ ‘అల్ జజీరా’ వార్తా సంస్థతో మాట్లాడుతూ.. ‘‘నేను ఒక వారం కిందట అక్కడే ఉన్నాను. వారు ఇప్పటికీ గబ్బిలాలతో పాటు పాములు, కుందేళ్ళు, తాబేళ్లు, పిల్లులు, కుక్కలు, చిట్టెలుకలు, ముళ్లపందులు, చిలుకలు, గుడ్లగూబలు, కాకులు, డేగలను బహిరంగంగా విక్రయిస్తున్నారు. ఇండోనేషియాలోని దాదాపు అన్ని మార్కెట్లలో అవి కనిపిస్తున్నాయి’’ అని తెలిపాడు. మలేషియాలోని పలు మార్కెట్లలో కూడా ఇలాంటి విక్రయాలు సాగుతున్నాయి. మనదేశంలో మేఘాలయాలో కూడా గబ్బిలాల మంసాన్ని తింటారు. అయితే, ఇప్పుడు విక్రయాలు జరుగుతున్నాయా లేదా అనే సమాచారం లేదు. 

PETAకే షాకిచ్చారు: కోవిడ్-19 నేపథ్యంలో గబ్బిలాలతోపాటు వివిధ వన్యప్రాణులకు మోక్షం కలుగుతుందని ప్రపంచ జంతు హక్కుల సంఘం PETA.. వియత్నాం, థాయ్‌లాండ్, కంబోడియా, ఫిలిప్పీన్స్, ఇండోనేషియా, చైనాలలో వన్యప్రాణులను విక్రయించే వెట్ మార్కెట్‌లను సందర్శించింది. అక్కడి పరిస్థితులు చూసి PETA సభ్యులు ఆశ్చర్యపోయారు. ‘‘కొత్త రూల్స్ ప్రకారం.. అక్కడ వన్యప్రాణుల మాంస విక్రయాలు నిలిచిపోతాయని భావించాం. కానీ, అక్కడ ఎప్పటిలాగానే వ్యాపారం సాగుతోంది. అపరిశుభ్రమైన వాతావరణంలో ఆయా జంతువులను ఉంచుతున్నారు. వాటిలో కొన్ని బతికినవి, మరికొన్ని చనిపోయినవి కూడా ఉన్నాయి’’ అని PETA సభ్యులు తెలిపారు.  

విక్రయాలను ఎందుకు ఆపలేకపోతున్నారు?: చైనాలో వన్యప్రాణుల మార్కెట్లపై నిషేదం విధించడం ఇదే తొలిసారి కాదు. 2002లో SARS కారణంగా వన్యప్రాణుల మార్కెట్లను మూసివేశారు. ఆర్థిక ఇబ్బందుల వల్ల మళ్లీ వాటిని తెరిచారు. 2016లో చైనీస్ అకాడెమీ ఆఫ్ ఇంజనీర్స్ విశ్లేషణ ప్రకారం.. చైనాలో ఆ మార్కెట్ల విలువ 76 బిలియన్ డాలర్లు. ఈ వ్యాపారం వల్ల ఏటా 19 బిలియన్ డాలర్ల వ్యాపారకార్యకలాపాలు సాగుతున్నాయి. చైనాలో ఇది 6.3 మిలియన్ల మందికి ఉపాధి కల్పిస్తోంది. అందుకే అక్కడి మార్కెట్లను నియంత్రించడం ఆ దేశం వల్ల కావడం లేదు. అయితే, కోవిడ్-19 నియంత్రణ విషయంలో ఆ దేశం కఠినంగానే ఉంటోంది. కరోనా అక్కడే పుట్టినా.. ఇతర దేశాల్లోనే ఎక్కువగా ఉనికిలో ఉందంటే.. చైనా ఎంత కచ్చితంగా కోవిడ్ వ్యాప్తిని అరికడుతుందో అర్థం చేసుకోవచ్చు.  

తప్పు గబ్బిలాలది కాదు.. మనుషులదే: గబ్బిలాలు అడవిలో తమ జీవితాన్ని ప్రశాంతంగా గడుపుతాయి. కానీ, జనాలే వాటిని వేటాడి వైరస్‌లను వెంట తెచ్చుకుంటున్నారు. అంటే కోవిడ్-19 వ్యాప్తిలో విలన్ గబ్బిలం కాదు.. మనిషి. వాస్తవానికి గబ్బిలాల్లో అనేక వైరస్‌లు నివసిస్తాయి. వాటిని తట్టుకోనే శక్తి గబ్బిలాల్లో ఉంటుంది. గబ్బిలాలు, పందులకు ఉండే రోగనిరోధక శక్తి ప్రపంచంలో మరే ప్రాణికి ఉండదు. అయితే, వాటిని మనతో ఉంచుకుంటే ఎప్పటికైనా ముప్పే. గబ్బిలాలు ఎక్కువగా చీకటి ప్రదేశాల్లోనే ఉంటాయి. వైరస్, బ్యాక్టీరియాలకు కూడా అవే తగిన ప్రాంతాలు. ఎండ ఎక్కువగా ప్రాంతాల్లో వైరస్, బ్యాక్టీరియాలు జీవించలేవు. అందుకే.. చీకట్లో ఉండే గబ్బిలాలే వాటికి నివాస స్థావరాలు. ప్రస్తుతం కోవిడ్ కంటే అత్యంత ప్రమాదకరమైన NeoCov కేవలం ఒక్క మ్యూటేషన్ దూరంలోనే ఉంది. ఆ వైరస్ కలిగిన గబ్బిలా.. మన ఆసియా దేశంలోని ఒక్క మార్కెట్లోకి వెళ్లినా.. ప్రభావం తీవ్రంగా ఉంటుంది. అన్నట్లు.. దక్షిణాఫ్రికాలోని కొన్ని తెగల ప్రజలు కూడా గబ్బిలాలను తింటారు. అదే జరిగితే.. ఒమిక్రాన్ తరహాలోనే NeoCov కూడా ఇండియాకు రావడానికి ఎంతో టైమ్ పట్టదు. ప్రస్తుతం కోవిడ్ మీద అందరికీ భయం పోయింది. ఇది మంచి విషయమే. కానీ, అతి విశ్వాసం ఎప్పటికీ మంచిది కాదు. ప్రమాదం లేదని తెలిసినా అప్రమత్తంగా ఉండటం ఎంతో ముఖ్యం. 

గబ్బిలాలను ఎందుకు తింటారు?: గబ్బిల మాంసంలోని పోషకాలు గురించి ఇప్పటివరకు ఆధారాలేవీ లేవు. అయితే, కొన్ని దేశాలు గబ్బిల మాంసంతో సహా బుష్ మీట్ (వన్య ప్రాణుల మాంసం) పోషకాలు సమృద్ధిగా ఉంటాయని నమ్మకం ఆయా దేశీయుల్లో ఉంది. మడగాస్కర్‌లో నిర్వహించిన ఒక అధ్యయనం ప్రకారం.. గబ్బిలాల మాంసం, బుష్ మీట్ వల్ల బాల్యంలో ఏర్పడే రక్తహీనత రేటు 29% పెరుగుతుంది. కొన్ని దేశాల్లో గబ్బిలాలను తినడం వల్ల మూర్ఛరోగ సమస్యలు ఉండవని నమ్ముతున్నారు. దక్షిణ అమెరికా, బ్రెజిల్, ఫిలిప్పీన్స్ వంటి దేశాల్లో సైతం గబ్బిలాలను తినే సాంప్రదాయం ఉంది. అలాగే కొన్ని దేశాల్లో సాధారణ మాంసాన్ని కొనుగోలు చేయలేని పేదలు గబ్బిలాలను వేటాడి మరీ ఆహారంగా తీసుకుంటున్నారు. వాటిని కాల్చి తింటే.. ఎలాంటి వైరస్‌లు ఉండవనేది వారి నమ్మకం. కానీ, వాటిని పట్టుకున్నప్పుడే.. వైరస్‌లు మనుషుల్లోకి ప్రవేశిస్తాయనే విషయాన్ని తెలుసుకోలేకపోతున్నారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy :  ఎన్టీఆర్ డైలాగ్‌తో కేసీఆర్‌కు రేవంత్ రెడ్డి వార్నింగ్ - హైటెన్షన్ కరెంట్ వైర్‌తో  పోల్చుకుని
ఎన్టీఆర్ డైలాగ్‌తో కేసీఆర్‌కు రేవంత్ రెడ్డి వార్నింగ్ - హైటెన్షన్ కరెంట్ వైర్‌ తో పోల్చుకుని ...
Rana Naidu 2: ‘రానా నాయుడు 2’లో ‘ఏజెంట్’ విలన్ - పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో!
‘రానా నాయుడు 2’లో ‘ఏజెంట్’ విలన్ - పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో!
Pawan Kalyan: పిఠాపురంలో నేను గెలిస్తే వర్మ గెలిచినట్లే, కూటమి విజయమే ఉమ్మడి లక్ష్యం: పవన్ కళ్యాణ్
Pawan Kalyan: పిఠాపురంలో నేను గెలిస్తే వర్మ గెలిచినట్లే, కూటమి విజయమే ఉమ్మడి లక్ష్యం: పవన్ కళ్యాణ్
TSPSC: 'గ్రూప్‌-2' అభ్యర్థులకు అలర్ట్, రివైజ్డ్‌ ఖాళీల వివరాలు వెల్లడి
TSPSC: 'గ్రూప్‌-2' అభ్యర్థులకు అలర్ట్, రివైజ్డ్‌ ఖాళీల వివరాలు వెల్లడి
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

Gems Sikakulam Mdical College Studnets on AP Elections | 2024 ఎన్నికలపై స్టూడెంట్స్ మనోగతం | ABPLoksabha Elections 2024 | వీళ్లకు రెండు రాష్ట్రాల్లో రెండు ఓట్లు ఉంటాయి..కానీ.! | ABP DesamHappy Days Rerelease Public Talk | హ్యాపీడేస్ సినిమా రీరిలీజ్ తో థియేటర్ల దగ్గర యూత్ సందడి | ABPAsaduddin Owaisi vs Raja singh | బీఫ్ షాపు జిందాబాద్ అన్న ఓవైసీ.. ఫైర్ అవుతున్న రాజాసింగ్ | ABP

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy :  ఎన్టీఆర్ డైలాగ్‌తో కేసీఆర్‌కు రేవంత్ రెడ్డి వార్నింగ్ - హైటెన్షన్ కరెంట్ వైర్‌తో  పోల్చుకుని
ఎన్టీఆర్ డైలాగ్‌తో కేసీఆర్‌కు రేవంత్ రెడ్డి వార్నింగ్ - హైటెన్షన్ కరెంట్ వైర్‌ తో పోల్చుకుని ...
Rana Naidu 2: ‘రానా నాయుడు 2’లో ‘ఏజెంట్’ విలన్ - పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో!
‘రానా నాయుడు 2’లో ‘ఏజెంట్’ విలన్ - పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో!
Pawan Kalyan: పిఠాపురంలో నేను గెలిస్తే వర్మ గెలిచినట్లే, కూటమి విజయమే ఉమ్మడి లక్ష్యం: పవన్ కళ్యాణ్
Pawan Kalyan: పిఠాపురంలో నేను గెలిస్తే వర్మ గెలిచినట్లే, కూటమి విజయమే ఉమ్మడి లక్ష్యం: పవన్ కళ్యాణ్
TSPSC: 'గ్రూప్‌-2' అభ్యర్థులకు అలర్ట్, రివైజ్డ్‌ ఖాళీల వివరాలు వెల్లడి
TSPSC: 'గ్రూప్‌-2' అభ్యర్థులకు అలర్ట్, రివైజ్డ్‌ ఖాళీల వివరాలు వెల్లడి
ITR 2024: ఐటీ రిటర్న్‌ ఫైల్‌ చేసే ముందు ఒకటికి రెండుసార్లు చెక్‌ చేయాల్సిన విషయాలివి
ఐటీ రిటర్న్‌ ఫైల్‌ చేసే ముందు ఒకటికి రెండుసార్లు చెక్‌ చేయాల్సిన విషయాలివి
Telangana Candidates Assets: ఇల్లు లేని బండి, కేసుల్లేని కిషన్ రెడ్డి- తెలంగాణలో లోక్‌సభ అభ్యర్థుల ఆస్తులు-అప్పుల వివరాలు ఇవే
ఇల్లు లేని బండి, కేసుల్లేని కిషన్ రెడ్డి- తెలంగాణలో లోక్‌సభ అభ్యర్థుల ఆస్తులు-అప్పుల వివరాలు ఇవే
Duvvada Srinivas: టెక్కలిలో ఇండిపెండెంట్ బరిలో దువ్వాడ వాణి - దువ్వాడ శ్రీనివాస్ స్పందన ఇదే!
టెక్కలిలో ఇండిపెండెంట్ బరిలో దువ్వాడ వాణి - దువ్వాడ శ్రీనివాస్ స్పందన ఇదే!
Weather Latest Update: తెలంగాణలో కూల్ వెదర్‌- హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో వర్షాలు
తెలంగాణలో కూల్ వెదర్‌- హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో వర్షాలు
Embed widget