అన్వేషించండి

Fashion Tips in Telugu: మీరు 40+ అయితే షర్ట్ ధరించేటప్పుడు చేసే ఈ 5 తప్పులు మీ వయసును మరింత పెంచేస్తాయి!

కొందరు వేసుకునే షర్ట్ సింపుల్‌గా ఉంటుంది. చూడముచ్చటగా కనిపిస్తుంది. మరి కొందరు దానికి విరుద్ధంగా ధరిస్తారు. అసలు షర్ట్స్ కొనేటప్పుడు వేసుకునేటప్పులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇక్కడ చూద్దాం

Fashion Tips in Telugu: బట్టలు వేసుకొనేటప్పుడు మనకు నప్పుతుందా, లేదా అని, ఫిట్‌గా ఉందా లేదా అని మాత్రమే చూస్తారు. కానీ మనం ఏ పొజిషన్‌లో ఉన్నాం, ఎలాంటి దుస్తులు వేసుకోవాలనే ఆలోచన చేయరు. దీని వల్ల ఇతరుల దృష్టిలో మీరు వీక్ అయ్యే ఛాన్స్ ఉందని ఫ్యాషన్ నిపుణులు చెబుతున్నారు. మీరు ఉన్న ప్రొఫెషన్, మీరు ఉన్న స్థాయిని బట్టి కొన్ని దుస్తులు వేసుకోవాల్సి ఉంటుంది. ఇష్టమైన కొన్నింటిని వదిలేయాల్సి ఉంటుంది. ఆ వివరాలేంటో ఇక్కడ చూద్దాం. 

మీరు 40 ఏళ్లు పైబడి, ఒక పేరున్న ఉద్యోగంలో చేస్తుండవచ్చు, లేదా సంస్థ యజమానికి కావచ్చు, లేదా అంతకు మించిన హోదా ఉండొచ్చు. ఇది మీ జీవితంలో అత్యున్నతమైన స్థానం అయినప్పుడు మీరు కచ్చితంగా దుస్తులు విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. మీ వార్డ్‌రోబ్‌ స్ట్రాటజీ మార్చాల్సిన అవసరం వచ్చిందని అర్థం. కానీ చాలా మంది దీన్ని పెద్దగా పట్టించుకోరు. ఇలాంటి ఉన్నతంగా ఉన్న వ్యక్తులు దుస్తులు ముఖ్యంగా షర్ట్స్‌ వేసుకునే విధానంలో చేస్తున్న తప్పులు గురించి చూద్దాం. మీరు ఒకరే కాదు, 90 శాతం మంది ఇవే తప్పులు చేస్తున్నారు. దీంతో వారు తమ వయసు కంటే పదేళ్లు పెద్దవారిగా కనిపిస్తుంటారు. దీని వల్ల వారి టీంలో వారి సర్కిల్‌లో విశ్వసనీయత కూడా కోల్పోతున్నారు. తెలియకుండానే మిమ్మల్ని డీ గ్రేడ్ చేసే తప్పులు గురించి తెలుసుకొని వాటిని నుంచి ఎలా బయటపడాలో చూద్దాం.  
  
మనం వేసుకునే దుస్తులు శరీరాన్ని కవర్ చేయడమే కాదు అవి మనపై అటెన్షన్‌ను తీసుకొస్తాయి. మన పని తీరును కూడా తెలియజేస్తాయి. అందుకే చాలా మంది వేసుకునే దుస్తులను బట్టి వ్యక్తి స్వభావాన్ని అతని క్యారెక్టర్‌ను చెప్పిస్తుంటారు. వ్యక్తిత్వాన్ని తెలియజేసే దుస్తుల విషయంలో చాలా మంది ఐదు మిస్టేక్స్ చేస్తుంటారు. చిన్న చిన్న మార్పులతో వాటిని సరి చేసుకుంటే మీలో ఆత్మవిశ్వాసం పెరగడమే కాకుండా ఇతరులు గూడా మిమ్మల్ని మరింతగా గౌరవిస్తారు. 

ఫిట్‌ డిజాస్టర్‌

నలభై ఏళ్లు దాటిన వ్యక్తులు చేసే మొదటి తప్పు ఇది. వారు ధరించే షర్ట్స్‌ వారికి సరిపోవడం లేదు. కొందరు వదులుగా ఉండే వాటిని వేస్తే మరికొందరు చాలా టైట్‌గా ఉండే దుస్తులు ధరిస్తారు. అలాంటి వారు కచ్చితంగా మారాల్సిన టైం వచ్చింది. అలాంటి వ్యక్తులు షర్ట్ వేసుకొనేటప్పుడు కచ్చితంగా ఈ జాగ్రత్తలు తీసుకోవాలి. 

షర్ట్‌ శరీరానికి ఫిక్స్ అవ్వాలి:- మీ వేసుకునే చక్కా మీ శరీర ఆకారానికి అనుగుణంగా ఫిక్స్ అవ్వాలి. మరీ అత్తుకొని ఉండకూడదు. మరీ లూజ్‌గా కూడా ఉండకూడదు.  

భుజాలు దాటి రాకూడదు:- కొందరు వేసుకునే షర్ట్స్‌ భుజాలను దాటి వస్తుంటుంది. అంటే షర్ట్ హ్యాండ్స్‌  చేతులు జాయింట్‌ నుంచి ఉండాలి. చాలా మందికి దాని కంటే దిగువ నుంచి ప్రారంభమవుతుంటాయి. ఇలా ఉంటే వేరే వాళ్ల షర్ట్ వేసుకున్నారనే ఫీలింగ్‌ కలిగిస్తుంది. 

ది పించ్‌ టెస్టు:- ఇది చాలా సులభంగా చేయవచ్చు. షర్ట్‌ వేసుకొని బటన్స్ పెట్టిన తర్వాత మీ చాతీ వైపు వచ్చే షర్ట్‌ భాగాన్ని పట్టుకోండి. అలా పట్టుకున్నప్పుడు రెండు అంగుళాల గుడ్డ పట్టుకోగలిగితే అది సరిగా ఉన్నట్టు అర్థం. అంత కంటే ఎక్కువ ఉంటే మాత్రం ఆ షర్ట్ వదులుగా ఉన్నట్టు లెక్క. 

అవసరం అయితే ఆల్ట్ రేషన్:- మీరు మీ భుజాలకు సరిపోయే షర్ట్‌ గుర్తించినట్టు అయితే దాన్ని వేసుకొని చూడండి. మిగతా మార్పులు ఏమైనా చేయాల్సి వస్తే ఆల్ట్ రేషన్‌కు ఇవ్వండి. అంతే కానీ భుజాలకు సరిపడా షర్ట్ విషయంలో రాజీ పడొద్దు. ఇక్కడ టైలర్‌కు మీరు ఇచ్చే డబ్బులు మీ లుక్‌ను మార్చవచ్చు. 

చీప్‌ ఫ్యాబ్రిక్ సిండ్రోమ్‌

చాలా మంది ఈ విషయంలో బోల్తా పడుతుంటాయి. ఎక్కువ మంది చేసే తప్పు కూడా ఇదే. షర్ట్స్‌ వేసుకొని కూర్చొని ఉంటే జిగేల్‌మని మెరుస్తూ ఉంటాయి. వారిపై లైట్‌ పడితే  జిగేల్‌మని మెరుస్తూ ఉంటాయి. ఇది చీప్‌ ఫ్యాబ్రిక్‌ లక్షణం. పాలి-కాటన్ మిశ్రమాలు ఆఫీస్‌ లైట్ల కింద మెరుస్తాయి. హీట్ ఎక్కువైతే ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. చూడటానికి అవసరమైన లుక్‌ను ఈ దుస్తులు ఇయ్యవు. 
 
దీన్ని నివారించడానికి మీరు కచ్చితంగా వంద శాతం కాటన్ దుస్తులు మాత్రమే ధరించేందుకు ప్రయత్నించాలి. షర్ట్ వెయిట్, నేసే విధానం, ఇలా అన్నింటినీ కచ్చితంగా చూసుకోవాలి. 

షర్ట్ వెయిట్‌:- మంచి చూడ చక్కని సౌకర్యవంతమైన షర్ట్‌ మాత్రం 1120-140 జీఎస్‌ఎం పరిధిలో మాత్రమే ఉండేలా చాడాలి. ఇలాంటి బరువు షర్ట్‌కు సరైన స్ట్రక్చర్‌ను ఇస్తుంది. చూడటానికి అట్ట ముక్కలా కనిపించదు. 

నేత విధానం:- ఒక షర్ట్‌ బాగుందా లేదా అనేది చెప్పడానికి నేసే స్టైల్ కూడా కారణం అవుతుంది. 

పాప్లిన్‌ విధానంలో ఫ్యాబ్రిక్‌ మృదువుగా ఉండేలా చూస్తుంది. క్వాలిటీ స్పష్టంగా కనిపిస్తుంది. సూట్‌లలో పర్‌ఫెక్ట్‌గా ఉండేలా చూస్తుంది. 

ట్విల్ విధానంలో టెక్చర్‌ ఉంటుంది. షర్ట్ త్వరగా ముడతలు పడకుండా చేస్తుంది. బిజీ షెడ్యూల్ కలిగిన వారికి మంచి ఎంపిక అవుతుంది. 

ఆక్స్‌ఫర్డ్‌- ఇది క్యాజువల్‌ రకం. అయినా సరై వ్యాపార వాతావరణాలకు, ప్రొఫెషనల్‌గా ఉండేందుకు అవకాశం కల్పిస్తుంది. మిమ్మల్ని డీ గ్రేడ్ చేసే పది షర్ట్‌లు వేయడం కంటే మీ గౌరవాన్ని పెంచే మూడు ధరించడం మంచిది. 

ఓల్డ్ కలర్స్‌ 

చాలా మంది చేసే మరో పెద్ద మిస్టేక్ కలర్స్ ఎంపిక. ఇది మీ వయసును అమాంతం పెంచేస్తుంది. అందుకే షర్ట్‌ రంగుల ఎంపికలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి. రంగు మారిన దుస్తులు వేస్తూ వారిపై ఉన్న గౌరవాన్ని తగ్గించుకుంటూ ఉంటారు. దీని వల్ల వారిపై పాజిటివ్‌ ఒపీనియన్ పోతుంది. 

దీని నివారణకు మారుతున్న ఫ్యాషన్ ధోరణిని అర్థం చేసుకోవాలి. అందుకే మీ కింది కలర్స్ ఓ సారి ట్రై చేయండి. మీ లుక్  ఎలా మారుతుందో చూసుకోండి. 

క్రిస్ప్‌ వైట్‌- ఇది మీ హూందాతనాన్ని అమాంతం పెంచుతుది. మీ సామర్థ్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని ప్రదర్శించడానికి కావాల్సి కలర్. ఆఫీస్‌కు కరెక్ట్‌గా సరిపోతుంది. అప్పటికప్పుడు క్లయింట్ మీటింగ్‌కు వెళ్లాలన్నా ఇది డీసెంట్‌ లుక్‌ను ఇస్తుంది. 

లైట్‌ బ్లూ- ఇది చాలా మందికి విశ్వసనీయమైన ఎంపిక అవుతుంది. ఎలాంటి వారికైనా నప్పుతుంది. దేనికైనా కాంబినేషన్ కుదురుతుంది. పది మందిలో రిచ్‌ లుక్ ఇస్తుంది.  

నేవీ- ఇది మీకు సూపర్ లుక్ తీసుకొస్తుంది. వైట్ కలర్ కంటే చూడముచ్చటగా ఉంటుంది. సంప్రదాయకంగా ఉంటుంది. ఇది ఎలాంటి వ్యాపార వాతావరణానికైనా సెట్ అవుతుంది. 

ప్యాటర్న్స్‌ విషయంలో క్లాసిక్‌గా ఉండేలా చూడండి. సన్నని స్ట్రైప్స్‌ ఇబ్బంది కలిగిస్తాయి. చిన్న స్ట్రైప్స్‌ మిమ్మల్ని ప్రొఫెషనల్‌గా ఉంచుతాయి. మీరు వేసుకొని షర్ట్‌ మీ వ్యక్తిత్వాన్ని పెంచాలే కానీ డామినేట్ చేయకూడదు. 

సందర్భాన్ని అర్థం చేసుకొని షర్ట్స్ వేసుకోవడం

ఇది చాలా మందికి అర్థం కాని వ్యవహారం. కొందరు ఆఫీస్‌కు, ఇంటిలో ఫంక్షన్‌కు, బిజినెస్ ట్రిప్పులకు, విహార యాత్రలకు అన్నింటికీ ఒకే రకమైన దుస్తులు ధరిస్తుంటారు. ఇది మీ వృత్తి పరమైన విశ్వసనీయతను దెబ్బతీస్తాయి. మీరు సాధారణంగా నెట్‌వర్కింగ్ ఈవెంట్స్‌కు ఫార్మల్ డ్రెస్‌ వెళ్తారు. కానీ అక్కడ అంతా పోలో షర్ట్‌లలో కనిపిస్తారు. అప్పడు మిమ్మల్ని మీరు చూడటానికి ఇబ్బందిగా ఉంటుంది. వేరే వారి దృష్టిలో కూడా అదే ఫీలింగ్ ఉంటుంది. మీరు కాలానికి అనుగుణంగా మారలేదనే సంకేతాలు వారికి వెళ్తాయి. సందర్భాన్ని అర్థం చేసుకోవడం అనేది మీ పరిపక్వతను తెలియజేస్తుంది. 

బిజినెస్ ఫార్మల్‌- సూట్‌లతోపాటు తెల్ల, లేత నీలం రంగు డ్రెస్‌ షర్ట్‌లను ధరించండి. అవి అధికార స్థాయని ప్రదర్శించేలా చేస్తాయి. 

బిజినెస్ క్యాజువల్స్- ఇది ఇండస్ట్రీని బట్టి మారుతుంటాయి. మీ కంపెనీ తీరును గమనించాలి. అందుకు అనుగుణంగా ఇక్కడ మీరు వ్యవహరించాల్సి ఉంటుంది. ఎక్కువ మంది పోలో దుస్తులను ప్రిఫర్ చేస్తుంటారు.  

స్మార్ట్ క్యాజువల్- ఇది మీకు మ్యాన్లీనెస్ ఇస్తుంది. ఏదైనా షర్ట్ వేసుకునేటప్పుడు మార్నింగ్ కాఫీ నుంచి రాత్రి డిన్నర్ వరకు  పరిస్థితులు ఎదురవుతాయి. అన్నింటికీ ఈ షర్ట్ కంఫర్ట్‌గా ఉంటుందా అనేది చెక్ చేసుకోవాలి. వేసుకోవచ్చు అనే సమాధానం  మీ మనసు చెప్పినట్టైతే మీ ఎంపిక కరెక్ట్ అవుతుంది. లేదంటే వెంటనే మీ షర్ట్ మార్చుకోవాల్సి ఉంటుంది.  

చిన్న చిన్న వాటిపై నిర్లక్ష్యం

చాలా మంది పురుషులు ఈ తప్పు చేస్తుంటారు. షర్ట్ కొనేటప్పుడు ప్రతి విషయాన్ని నిశితంగా గమనించాలి. కాలర్‌ స్టైల్ నుంచి బటన్ ప్లేస్‌మెంట్ వరకు అన్నింటినీ చూసుకోవాలి. లేకుంటే పది మందిలో ఇబ్బంది పడాల్సి ఉంటుంది.  అందరికీ అన్ని రకాల దుస్తులు నప్పవు. అందుకే మీ ముఖం ఉన్న ఆకారాన్ని బట్టి షర్ట్స్ ఎంచుకోవాలి. 

ముఖాకృతిని బట్టి కాలర్‌ స్టైల్ 

  • గుండ్రటి ముఖం ఉంటే పాయింట్ కాలర్స్‌ ముఖాన్ని పొడవుగా చూపిస్తాయి.  
  • స్క్వేర్‌ ఫేస్‌ ఉన్న వాళ్లకు స్ప్రెడ్‌కాలర్ సరిపోతుంది. వారి ముఖాన్ని గుండ్రంగా ఉండేలా చూపిస్తుంది. 
  • లాంగర్ ఫేస్ ఉన్న వాళ్లకు వైడర్ కాల్స్‌ సెట్ అవుతుంది.
  • బటన్ ప్లేస్‌మెంట్‌ మొత్తం సిల్హౌట్‌ను ప్రభావితం చేస్తాయి. 

ముడతలు పడిన చొక్కాలు, రంగు మారిన కాలర్‌లు, దుస్తులు మీరు ప్రాథమిక అంశాలపై దృష్టి పెట్టడం లేదని తెలుస్తుంది. 

మీరు దుస్తులను చల్లని నీటిలో ఉతకండి, గాలిలో మాత్రమే ఆరబెట్టండి. ముఖ్యమైన షర్ట్‌లను ఐరన్ చేయండి. మంచి హ్యాంగర్లు వాడటం వల్ల భుజాల వద్ద మడతలు పడకుండా ఉంటాయి. 

ఇవి కాకుండా మీరు ఫార్మల్ షర్ట్ ధరించినప్పుడు జీన్స్ వేసుకోవద్దు. చాలా మంది ఇది చేస్తుంటారు. ఇది చూడటానికి వికారంగా కనిపిస్తుంది. ఇలా మీరు చేసే తప్పులను గుర్తించి వాటిని క్రమంగా సరిదిద్దుకొనే ప్రయత్నం చేయండి. మీరు ఇరవై ఏళ్ల వయసులో ఉన్న కుర్రాడిలా కనిపించడం కంటే ఉత్తమ వ్యక్తిగా కనిపించడం చాలా ముఖ్యమని గ్రహించండి. అందుకు అనుగుణమైన దుస్తులను ధరిస్తే మీకు గౌరవం లభిస్తుంది.   
 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

MBBS Students Suicide: మెడికోల ఆత్మహత్యల నివారణకు ప్రభుత్వం చర్యలు.. గ్రామీణ విద్యార్థులపై స్పెషల్ ఫోస్
మెడికోల ఆత్మహత్యల నివారణకు ప్రభుత్వం చర్యలు.. గ్రామీణ విద్యార్థులపై స్పెషల్ ఫోస్
T20 World Cup 2026 Team India Squad :టి20 ప్రపంచ కప్ ఇండియా స్క్వాడ్‌ నుంచి శుభ్‌మన్‌ గిల్ అవుట్‌! బీసీసీఐ ప్రకటించిన జాబితా ఇదే!
టి20 ప్రపంచ కప్ ఇండియా స్క్వాడ్‌ నుంచి శుభ్‌మన్‌ గిల్ అవుట్‌! బీసీసీఐ ప్రకటించిన జాబితా ఇదే!
IPS PV Sunil Kumar: రఘురామపై ఐపీఎస్ సునీల్ కుమార్ డైరక్ట్ ఎటాక్ - 420 అంటూ విమర్శలు - ఏం జరగబోతోంది?
రఘురామపై ఐపీఎస్ సునీల్ కుమార్ డైరక్ట్ ఎటాక్ - 420 అంటూ విమర్శలు - ఏం జరగబోతోంది?
Imran Khan : ఇమ్రాన్ ఖాన్ బుష్రా బీబీలకు 17 ఏళ్ల జైలు శిక్ష!పాకిస్తాన్ కోర్టు సంచలన తీర్పు!
ఇమ్రాన్ ఖాన్ బుష్రా బీబీలకు 17 ఏళ్ల జైలు శిక్ష!పాకిస్తాన్ కోర్టు సంచలన తీర్పు!
Advertisement

వీడియోలు

Ishan Kishan Named T20 World Cup 2026 | రెండేళ్ల తర్వాత టీ20ల్లో ఘనంగా ఇషాన్ కిషన్ పునరాగమనం | ABP Desam
Shubman Gill Left out T20 World Cup 2026 | ఫ్యూచర్ కెప్టెన్ కి వరల్డ్ కప్పులో ఊహించని షాక్ | ABP Desam
T20 World Cup 2026 Team India Squad Announced | ఊహించని ట్విస్టులు షాకులతో టీ20 వరల్డ్ కప్ స్క్వాడ్ | ABP Desam
Tilak Varma Innings Ind vs SA T20 | అహ్మదాబాద్‌లో రెచ్చిపోయిన తిలక్ వర్మ
Hardik Pandya in India vs South Africa T20 | రికార్డులు బద్దలు కొట్టిన హార్దిక్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
MBBS Students Suicide: మెడికోల ఆత్మహత్యల నివారణకు ప్రభుత్వం చర్యలు.. గ్రామీణ విద్యార్థులపై స్పెషల్ ఫోస్
మెడికోల ఆత్మహత్యల నివారణకు ప్రభుత్వం చర్యలు.. గ్రామీణ విద్యార్థులపై స్పెషల్ ఫోస్
T20 World Cup 2026 Team India Squad :టి20 ప్రపంచ కప్ ఇండియా స్క్వాడ్‌ నుంచి శుభ్‌మన్‌ గిల్ అవుట్‌! బీసీసీఐ ప్రకటించిన జాబితా ఇదే!
టి20 ప్రపంచ కప్ ఇండియా స్క్వాడ్‌ నుంచి శుభ్‌మన్‌ గిల్ అవుట్‌! బీసీసీఐ ప్రకటించిన జాబితా ఇదే!
IPS PV Sunil Kumar: రఘురామపై ఐపీఎస్ సునీల్ కుమార్ డైరక్ట్ ఎటాక్ - 420 అంటూ విమర్శలు - ఏం జరగబోతోంది?
రఘురామపై ఐపీఎస్ సునీల్ కుమార్ డైరక్ట్ ఎటాక్ - 420 అంటూ విమర్శలు - ఏం జరగబోతోంది?
Imran Khan : ఇమ్రాన్ ఖాన్ బుష్రా బీబీలకు 17 ఏళ్ల జైలు శిక్ష!పాకిస్తాన్ కోర్టు సంచలన తీర్పు!
ఇమ్రాన్ ఖాన్ బుష్రా బీబీలకు 17 ఏళ్ల జైలు శిక్ష!పాకిస్తాన్ కోర్టు సంచలన తీర్పు!
Rishabh Pant Ruled out T20 World Cup: గత టీ20 వరల్డ్ కప్ నెగ్గడంలో కీలకం.. రిషబ్ పంత్ సహా చోటు దక్కని 5 మంది స్టార్లు వీరే
గత టీ20 వరల్డ్ కప్ నెగ్గడంలో కీలకం.. పంత్ సహా చోటు దక్కని 5 మంది స్టార్లు వీరే
Discount On Cars: ఈ 4 కార్లపై భారీ డిస్కౌంట్.. గరిష్టంగా రూ.2.50 లక్షల వరకు బెనిఫిట్
ఈ 4 కార్లపై భారీ డిస్కౌంట్.. గరిష్టంగా రూ.2.50 లక్షల వరకు బెనిఫిట్
Arin Nene: ఎవరీ ఆరిన్? యాపిల్ కంపెనీలో పని చేస్తున్న హీరోయిన్ కుమారుడు... ఫ్యామిలీ ఫోటోలు చూడండి
ఎవరీ ఆరిన్? యాపిల్ కంపెనీలో పని చేస్తున్న హీరోయిన్ కుమారుడు... ఫ్యామిలీ ఫోటోలు చూడండి
Radhika Apte : సెట్స్‌లో అసభ్యకర జోకులు - డబ్బు కోసమే ఆ సినిమాల్లో నటించా... రాధికా ఆప్టే సెన్సేషనల్ కామెంట్స్
సెట్స్‌లో అసభ్యకర జోకులు - డబ్బు కోసమే ఆ సినిమాల్లో నటించా... రాధికా ఆప్టే సెన్సేషనల్ కామెంట్స్
Embed widget