By: ABP Desam | Updated at : 09 Oct 2022 10:08 PM (IST)
యూపీఎస్సీ సీఏపీఎఫ్ ఇంటర్వ్యూ షెడ్యూలు
సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్సెస్ అసిస్టెంట్ కమాండెంట్ పోస్టుల భర్తీకి నిర్వహించనున్న పర్సనాలిటీ టెస్ట్/ఇంటర్వ్యూ షెడ్యూలును యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రకటించింది. షెడ్యూలు ప్రకారం అక్టోబరు 31 నుంచి నవంబరు 22 వరకు అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు. ఆయా తేదీల్లో ఉదయం, మధ్యాహ్నం సెషన్లలో ఇంటర్వ్యూలు జరగుతాయి.
ఇంటర్వ్యూలకు మొత్తం 454 మంది అభ్యర్థులు ఎంపికయ్యారు. ఏ అభ్యర్థికి ఏరోజు ఇంటర్వ్యూ ఉంటుందో షెడ్యూలులో అందుబాటులో ఉంచారు. ఇంటర్వ్యూ అభ్యర్థుల మెడికల్ ఫిట్‌నెస్‌కు సంబంధించిన ఈ-సమ్మన్ లెటర్లను త్వరలోనే వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనున్నారు. అభ్యర్థులు ఈసమ్మన్ లెటర్లను డౌన్‌లోడ్ చేసుకొని, ప్రింట్ తీసుకోవాలి. ఇంటర్వ్యూరోజు తప్పనిసరిగా ఈ లెటర్లను వెంట తీసుకెళ్లాల్సి ఉంటుంది. అభ్యర్థులకు న్యూఢిల్లీలోని యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యాలయంలో ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.
ఇంటర్వ్యూ తేదీలు: అక్టోబరు 31 నుంచి నవంబరు 22 వరకు.
ఇంటర్వ్యూ వేదిక:
Union Public Service Commission,
Dholpur House, Shahjahan Road,
New Delhi-110069
:: Also Read ::
SSC MTS Result: మల్టీటాస్కింగ్ స్టాఫ్ 'టైర్-1' ఫలితాలు వెల్లడి, ఇక్కడ చూసుకోండి!
కేంద్రప్రభుత్వ విభాగాల్లో మల్టీటాస్కింగ్ స్టాఫ్, హవల్దార్ పోస్టుల భర్తీకి నిర్వహించిన టైర్-1 పరీక్ష ఫలితాలను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అక్టోబరు 8న విడుదల చేసింది. ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. ఎంటీఎస్ టైర్-1 పరీక్షకు హాజరైన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను చూసుకోవచ్చు. పీడీఎఫ్ ఫార్మాట్‌లో ఫలితాలను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ విడుదల చేసింది. మల్టీటాస్కింగ్ స్టాఫ్ టైర్-1 పరీక్షలో మొత్తం 69,160 మంది అభ్యర్థులు టైర్-2 పరీక్షకు అర్హత సాధించారు. వీరిలో 44,590 మంది అభ్యర్థుల మల్టీటాస్కింగ్ పోస్టులకు; 24,570 మంది అభ్యర్థులు హవల్దార్ పోస్టులకు సంబంధించి తదుపరి దశకు ఎంపికైన అభ్యర్థులు ఉన్నారు. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ జులై 5 నుంచి 22 వరకు ఎంటీఎస్ (నాన్ టెక్నికల్) టైర్-1 పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. అభ్యర్థుల స్కోరుకార్డులను అక్టోబరు 17 నుంచి వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనున్నారు. నవంబరు 6 వరకు స్కోరు కార్డు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అభ్యర్థులు తమ ఐడీకార్డు, పాస్‌వర్డ్ వివరాలు నమోదుచేసి స్కోరుకార్డు పొందవచ్చు.
ఎంటీఎస్ ఫలితాల కోసం క్లిక్ చేయండి..
SSC CGLE 2022: సీజీఎల్ఈ దరఖాస్తు గడువు పొడిగింపు, చివరితేది ఎప్పుడంటే?
కేంద్ర ప్రభుత్వంలోని వివిధ విభాగాల్లో గ్రూప్-బి, గ్రూప్-సి పోస్టుల భర్తీకి నిర్వహించే 'కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవల్ ఎగ్జామినేషన్-2022' దరఖాస్తు గడువును అక్టోబరు 13 వరకు పొడిగిస్తూ స్థాఫ్ సెలక్షన్ కమిషన్ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు అధికారిక ప్రకటన విడుదల చేసింది. వాస్తవానికి అక్టోబరు 8తో ముగియాల్సిన ఆన్‌లైన్ దరఖాస్తు గడువును మరో వారంపాటు పొడిగించింది. ఇప్పటివరకూ దరఖాస్తు చేసుకోలేని అభ్యర్థులు అక్టోబరు 13లోపు దరఖాస్తు చేసుకోవచ్చు. ఫీజు చెల్లించడానికి ఆన్‌లైన్ ద్వారా అక్టోబరు 14 వరకు, చలనా ద్వారా అక్టోబరు 15 వరకు అవకాశం కల్పించారు. ఇక దరఖాస్తుల్లో ఏమైనా తప్పులుంటే అక్టోబరు 19, 20 తేదీల్లో సరిచేసుకోవచ్చు.
పొడిగించిన పూర్తి షెడ్యూలు కోసం క్లిక్ చేయండి...
TSPSC Group1 Mains Exam Dates: గ్రూప్-1 అభ్యర్థులకు అలర్ట్ - మెయిన్స్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల చేసిన టీఎస్ పీఎస్సీ
TSPSC HWO Recuitment: 581 ఉద్యోగాల దరఖాస్తుకు ఫిబ్రవరి 3 వరకు అవకాశం, వెంటనే అప్లయ్ చేసుకోండి!
RRB Group D DV: ఫిబ్రవరి 7 నుంచి గ్రూప్-డి అభ్యర్థులకు ధ్రువపత్రాల పరిశీలన!
TSPSC Group4 Application: 'గ్రూప్-4' ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్, దరఖాస్తు గడువు పొడిగింపు, చివరితేది ఎప్పుడంటే?
TSPSC Group4 Application: 8180 'గ్రూప్-4' ఉద్యోగాల దరఖాస్తుకు నేడే ఆఖరు, ఇప్పటికే 8 లక్షలు దాటిన దరఖాస్తుల సంఖ్య!
KTR: దేశంలోనే తెలంగాణ నెంబర్ వన్, మా దారిలోనే ఇతర రాష్ట్రాలు ప్లాన్ : మంత్రి కేటీఆర్
Nellore Anam : నెల్లూరు వైఎస్ఆర్సీపీలో మరోసారి ఆనం బాంబ్ - ఫోన్లు ట్యాప్ చేస్తున్నారు - ప్రాణ హానీ ఉందని ఆందోళన !
Thalapathy 67 Update: ‘దళపతి 67‘ నుంచి అదిరిపోయే అప్ డేట్, కీ రోల్లో సంజయ్ దత్, హీరోయిన్గా త్రిష
పెళ్లి కాకపోయినా పర్వాలేదు, పిల్లలను కనండి - పాలకులు షాకింగ్ నిర్ణయం, ఎక్కడో తెలుసా?