అన్వేషించండి

UPSC: ఇంజినీరింగ్ సర్వీసెస్ ఎగ్జామినేషన్-2025 నోటిఫికేషన్ విడుదల, పోస్టుల వివరాలిలా

యూనియ‌న్ పబ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ ఇంజినీరింగ్ సర్వీసెస్ ఎగ్జామినేషన్-2025 నోటిఫికేషన్‌ను సెప్టెంబరు 18న విడుదల చేసింది. సెప్టెంబరు 18 నుంచి అక్టోబరు 8 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు.

UPSC Engineering Services Examination (ESE) 2025: కేంద్రప్రభుత్వ సంస్థల్లో ఇంజినీర్ ఉద్యోగాల భర్తీకి సంబంధించి 'ఇంజినీరింగ్ సర్వీసెస్ ఎగ్జామినేషన్-2025' నోటిఫికేషన్‌ను యూనియ‌న్ పబ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ సెప్టెంబరు 18న విడుదల చేసింది. దీనిద్వారా సెంట్రల్ ఇంజినీరింగ్ సర్వీస్, ఇండియన్ డిఫెన్స్ సర్వీస్ ఆఫ్ ఇంజినీర్స్, ఇండియన్ టెలికమ్యూనికేషన్ సర్వీస్ లాంటి కేంద్ర ప్రభుత్వ సంస్థల్లోని సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ ఇంజినీరింగ్ విభాగాల్లో 232 ఖాళీలను భర్తీ చేయనున్నారు. పోస్టుల భర్తీకి సంబంధించి సెప్టెంబరు 18 ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకాగా.. అక్టోబరు 8 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. అక్టోబరు 9 నుంచి 15 మధ్య దరఖాస్తుల సవరణకు అవకాశం కల్పించనున్నారు. అభ్యర్థులకు వచ్చే ఏడాది(2025) ఫిబ్రవరి 9న ప్రిలిమినరీ(స్టేజ్-1) పరీక్ష నిర్వహించనున్నారు. ప్రిలిమినరీ పరీక్షలో అర్హత సాధించినవారికి తర్వాతి దశలో మెయిన్ పరీక్ష (స్టేజ్-2)., పర్సనాలిటి టెస్ట్(ఇంటర్వ్యూ) నిర్వహించి తుది ఎంపికచేస్తారు.

వివరాలు..

* ఇంజినీరింగ్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ - 2025

పోస్టుల సంఖ్య: 232 (సివిల్, మెకానిక‌ల్, ఎల‌క్ట్రిక‌ల్, ఎల‌క్ట్రానిక్స్ అండ్ టెలీక‌మ్యూనికేష‌న్).

విద్యార్హతలు: సంబంధిత విభాగాల్లో బీఈ/బీటెక్ డిగ్రీ/ రేడియో రెగ్యులేటరీ సర్వీసెస్‌లో పోస్టులకు ఫిజిక్స్ లేదా రేడియో ఫిజిక్స్/ వైర్‌లెస్ కమ్యూనికేషన్‌లో మాస్టర్స్ డిగ్రీ ఉండాలి.

వ‌యోప‌రిమితి: 01.01.2025 నాటికి నాటికి 21 నుంచి 30 సంవత్సరాల మ‌ధ్య ఉండాలి. అభ్యర్థులు 02.01.1995 - 01.01.2004 మధ్య జన్మించి ఉండాలి. నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, దివ్యాంగులు, ఎక్స్-సర్వీస్‌మెన్‌కు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. 

దరఖాస్తు విధానం: యూపీఎస్సీ వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయాలి. 

దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీ అభ్యర్థులు ఫీజు కింద రూ.200 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది.

ఎంపిక విధానం..
➦ రాత‌ప‌రీక్ష,  ఇంటర్వ్యూ/పర్సనల్ టెస్ట్, మెడికల్ పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు.
➦ ప‌రీక్షను రెండు దశల్లో నిర్వహిస్తారు. ప్రిలిమిన‌రీ (స్టేజ్‌-1), మెయిన్స్ (స్టేజ్-2).
➦ ప్రిలిమ్స్‌లో అర్హత సాధించిన‌వారిని మెయిన్‌ ప‌రీక్షకు ఎంపిక చేస్తారు.
➦ మెయిన్స్ వచ్చిన మార్కులను ఆధారంగా స్టేజ్-3 పర్సనాలిటి టెస్ట్(ఇంటర్వ్యూ) నిర్వహిస్తారు. 

పరీక్ష ఇలా...
➦ ప్రిలిమినరీ పరీక్ష: మొత్తం 500 మార్కులకు ప్రిలిమినరీ పరీక్ష నిర్వహిస్తారు. పరీక్షలో రెండు పేపర్లు ఉంటాయి. వీటిలో 200 మార్కులకు పేపర్-1 (జనరల్ స్టడీస్ అండ్ ఇంజినీరింగ్ ఆప్టిట్యూడ్), 300 మార్కులకు పేపర్-2 (సివిల్/మెకానికల్/ఎలక్ట్రికల్/ఎలక్ట్రానిక్స్ & టెలికమ్యూనికేషన్ ఇంజినీరింగ్) పరీక్ష నిర్వహిస్తారు. పేపర్-1 పరీక్షకు 2 గంటలు, పేపర్-1 పరీక్షకు 3 గంటల సమయం కేటాయిస్తారు. ఆబ్జెక్టివ్ విధానంలో ప్రశ్నలు ఉంటాయి.

➦ మెయిన్ పరీక్ష: మొత్తం 600 మార్కులకు మెయిన్ పరీక్ష నిర్వహిస్తారు. పరీక్షలో రెండు పేపర్లు ఉంటాయి. వీటిలో 300 మార్కులకు పేపర్-1 (సివిల్/మెకానికల్/ఎలక్ట్రికల్/ఎలక్ట్రానిక్స్ & టెలికమ్యూనికేషన్), 300 మార్కులకు పేపర్-2 (సివిల్/మెకానికల్/ఎలక్ట్రికల్/ఎలక్ట్రానిక్స్ & టెలికమ్యూనికేషన్ ఇంజినీరింగ్) పరీక్ష నిర్వహిస్తారు.  ఒక్కో పేపర్‌కు 3 గంటల చొప్పున సమయం కేటాయిస్తారు. కన్వెన్షల్ విధానంలో ప్రశ్నలు ఉంటాయి.

తెలుగు రాష్ట్రాల్లో ప్రిలిమినరీ పరీక్ష కేంద్రాలు: హైద‌రాబాద్, తిరుప‌తి, విశాఖ‌ప‌ట్నం.

తెలుగు రాష్ట్రాల్లో మెయిన్ పరీక్ష కేంద్రాలు: హైద‌రాబాద్, విశాఖ‌ప‌ట్నం.

ముఖ్యమైన తేదీలు..

➦ ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం: 18.09.2024.

➦ ఫీజు చెల్లించడానికి చివరితేది (క్యాష్ రూపంలో): 07.10.2024 (11:59 PM)

➦ ఆన్‌లైన్ ద్వారా ఫీజు చెల్లింపు, రిజిస్ట్రేషన్‌కు చివ‌రితేదీ: 08.10.2024 (6:00 PM)

➦ దరఖాస్తుల సవరణ తేదీలు: 09.10.2024 - 15.10.2024.

➦ ప్రిలిమిన‌రీ ప‌రీక్ష తేదీ: 09.02.2025.

కేటగిరీ I-సివిల్ ఇంజినీరింగ్
గ్రూప్-ఎ సేవలు/పోస్టులు
(i) సెంట్రల్ ఇంజనీరింగ్ సర్వీస్ (సివిల్)
(ii) సెంట్రల్ ఇంజనీరింగ్ సర్వీస్ (రోడ్లు), గ్రూప్-ఎ (సివిల్ ఇంజనీరింగ్ పోస్టులు).
(iii) సర్వే ఆఫ్ ఇండియా గ్రూప్ 'A' సర్వీస్.
(iv) బోర్డర్ రోడ్స్ ఇంజినీరింగ్ సర్వీస్‌లో *AEE (సివిల్).
(v) ఇండియన్ డిఫెన్స్ సర్వీస్ ఆఫ్ ఇంజనీర్స్.
(vi) MES సర్వేయర్ కేడర్‌లో AEE (QS&C).
(vii) ఇండియన్ స్కిల్ డెవలప్‌మెంట్ సర్వీస్.
(viii) సెంట్రల్ వాటర్ ఇంజనీరింగ్ (గ్రూప్ 'ఎ') సర్వీస్.

కేటగిరీ- II-మెకానికల్ ఇంజినీరింగ్
గ్రూప్-A/B సేవలు/పోస్టులు
(i) ఇండియన్ డిఫెన్స్ సర్వీస్ ఆఫ్ ఇంజనీర్స్.
(ii) ఇండియన్ నేవల్ ఆర్మమెంట్ సర్వీస్ (మెకానికల్ ఇంజనీరింగ్ పోస్టులు).
(iii) సెంట్రల్ పవర్ ఇంజనీరింగ్ సర్వీస్ Gr 'A' (మెకానికల్ ఇంజనీరింగ్ పోస్టులు)
(iv) డిఫెన్స్ ఏరోనాటికల్ క్వాలిటీ అస్యూరెన్స్ సర్వీస్/SSO-II (మెకానికల్).
(v) బోర్డర్ రోడ్స్ ఇంజనీరింగ్ సర్వీస్‌లో AEE (ఎలెక్ట్ & మెచ్).
(vi) ఇండియన్ నేవల్ మెటీరియల్ మేనేజ్‌మెంట్ సర్వీస్ (మెకానికల్ ఇంజనీరింగ్ పోస్టులు)
(vii) ఇండియన్ స్కిల్ డెవలప్‌మెంట్ సర్వీస్

కేటగిరీ III-ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్
గ్రూప్-A/B సేవలు/పోస్టులు
(i) ఇండియన్ డిఫెన్స్ సర్వీస్ ఆఫ్ ఇంజనీర్స్.
(ii) ఇండియన్ నేవల్ మెటీరియల్ మేనేజ్‌మెంట్ సర్వీస్ (ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ పోస్టులు)
(iii) ఇండియన్ నేవల్ ఆర్మమెంట్ సర్వీస్ (ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ పోస్టులు)
(iv) డిఫెన్స్ ఏరోనాటికల్ క్వాలిటీ అస్యూరెన్స్ సర్వీస్/SSO-II (ఎలక్ట్రికల్).
(v) సెంట్రల్ పవర్ ఇంజనీరింగ్ సర్వీస్ Gr 'A' (ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ పోస్టులు).
(vi) ఇండియన్ స్కిల్ డెవలప్‌మెంట్ సర్వీస్.
(vii) IEDS/అసిస్టెంట్ డైరెక్టర్ గ్రేడ్-I (IEDS) ఎలక్ట్రికల్ ట్రేడ్
(viii) IEDS/అసిస్టెంట్ డైరెక్టర్ గ్రేడ్-II (IEDS) ఎలక్ట్రికల్ ట్రేడ్

కేటగిరీ IV-ఎలక్ట్రానిక్స్ మరియు టెలికమ్యూనికేషన్ ఇంజినీరింగ్
గ్రూప్-A/B సేవలు/పోస్టులు
(i) ఇండియన్ టెలికమ్యూనికేషన్ సర్వీస్ Gr 'A'.
(ii) సెంట్రల్ పవర్ ఇంజనీరింగ్ సర్వీస్ Gr 'A' (ఎలక్ట్రానిక్స్ & టెలికమ్యూనికేషన్ ఇంజనీరింగ్ పోస్టులు).
(iii) ఇండియన్ నేవల్ ఆర్మమెంట్ సర్వీస్ (ఎలక్ట్రానిక్స్ మరియు టెలికాం ఇంజనీరింగ్ పోస్టులు).
(iv) ఇండియన్ నేవల్ మెటీరియల్ మేనేజ్‌మెంట్ సర్వీస్ (ఎలక్ట్రానిక్స్ మరియు టెలికాం ఇంజనీరింగ్ పోస్టులు)
(v) డిఫెన్స్ ఏరోనాటికల్ క్వాలిటీ అస్యూరెన్స్ సర్వీస్/SSO-II (ఎలక్ట్రానిక్స్ & టెలి).
(vi) ఇండియన్ స్కిల్ డెవలప్‌మెంట్ సర్వీస్.
(vii) ఇండియన్ రేడియో రెగ్యులేటరీ సర్వీస్ Gr ‘A’
(viii) IEDS/అసిస్టెంట్ డైరెక్టర్ గ్రేడ్-I(IEDS) ఎలక్ట్రానిక్స్ ట్రేడ్.
(ix) IEDS/అసిస్టెంట్ డైరెక్టర్ గ్రేడ్-II(IEDS) ఎలక్ట్రానిక్స్ ట్రేడ్

Notification

Online Application

Website

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

RGV News: ఆర్టీవీ అభ్యర్థన తిరస్కరించిన హైకోర్టు- మంగళవారం విచారణకు వస్తారా?
ఆర్టీవీ అభ్యర్థన తిరస్కరించిన హైకోర్టు- మంగళవారం విచారణకు వస్తారా?
Lagacherla Case: లగచర్ల దాడి కేసులో కీలక పరిణామాలు-సురేష్‌పై లుక్‌ అవుట్ నోటీసు- ఢిల్లీకి చేరిన రైతుల పంచాయితీ
లగచర్ల దాడి కేసులో కీలక పరిణామాలు-సురేష్‌పై లుక్‌ అవుట్ నోటీసు- ఢిల్లీకి చేరిన రైతుల పంచాయితీ
AP DSC 2024: ఏపీలో డీఎస్సీ అభ్యర్థులకు బ్యాడ్ న్యూస్- నోటిఫికేషన్ మరింత ఆలస్యం
ఏపీలో డీఎస్సీ అభ్యర్థులకు బ్యాడ్ న్యూస్- నోటిఫికేషన్ మరింత ఆలస్యం
Telangana EV Subsidy 2024: తెలంగాణ తీసుకొచ్చే కొత్త ఈవీ విధానంలో ఏం ఉంది? కలిగే ప్రయోజనాలు ఏంటీ?
తెలంగాణ తీసుకొచ్చే కొత్త ఈవీ విధానంలో ఏం ఉంది? కలిగే ప్రయోజనాలు ఏంటీ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

వైసీపీ నేతపై వాసంశెట్టి అనుచరుల దాడిబోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఫస్ట్ టెస్ట్‌కి దూరంగా రోహిత్ శర్మపుష్ప 2 ట్రైలర్‌లో హైలైట్ షాట్ ఇదేనటి కస్తూరి అరెస్ట్‌, 14 రోజుల రిమాండ్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
RGV News: ఆర్టీవీ అభ్యర్థన తిరస్కరించిన హైకోర్టు- మంగళవారం విచారణకు వస్తారా?
ఆర్టీవీ అభ్యర్థన తిరస్కరించిన హైకోర్టు- మంగళవారం విచారణకు వస్తారా?
Lagacherla Case: లగచర్ల దాడి కేసులో కీలక పరిణామాలు-సురేష్‌పై లుక్‌ అవుట్ నోటీసు- ఢిల్లీకి చేరిన రైతుల పంచాయితీ
లగచర్ల దాడి కేసులో కీలక పరిణామాలు-సురేష్‌పై లుక్‌ అవుట్ నోటీసు- ఢిల్లీకి చేరిన రైతుల పంచాయితీ
AP DSC 2024: ఏపీలో డీఎస్సీ అభ్యర్థులకు బ్యాడ్ న్యూస్- నోటిఫికేషన్ మరింత ఆలస్యం
ఏపీలో డీఎస్సీ అభ్యర్థులకు బ్యాడ్ న్యూస్- నోటిఫికేషన్ మరింత ఆలస్యం
Telangana EV Subsidy 2024: తెలంగాణ తీసుకొచ్చే కొత్త ఈవీ విధానంలో ఏం ఉంది? కలిగే ప్రయోజనాలు ఏంటీ?
తెలంగాణ తీసుకొచ్చే కొత్త ఈవీ విధానంలో ఏం ఉంది? కలిగే ప్రయోజనాలు ఏంటీ?
Andhra Pradesh High School Time Table: ఆంధ్రప్రదేశ్‌ గవర్నమెంట్‌ హైస్కూల్‌ టైమింగ్స్ మారుతున్నాయి! నెల్లూరు నుంచే ప్రారంభం
ఆంధ్రప్రదేశ్‌ గవర్నమెంట్‌ హైస్కూల్‌ టైమింగ్స్ మారుతున్నాయి! నెల్లూరు నుంచే ప్రారంభం
Vishwak Sen : మేం ఇట్లనే మాట్లాడ్తాం, పర్సనల్ అటాక్ చేస్తే దబిడి దిబిడే - రివ్యూ రైటర్లకు విశ్వక్ సేన్ స్ట్రాంగ్ వార్నింగ్
మేం ఇట్లనే మాట్లాడ్తాం, పర్సనల్ అటాక్ చేస్తే దబిడి దిబిడే - రివ్యూ రైటర్లకు విశ్వక్ సేన్ స్ట్రాంగ్ వార్నింగ్
Kantara Chapter 1 Release Date: గాంధీ జయంతికి 'కాంతార' ప్రీక్వెల్... లాంగ్ వీకెండ్ మీద కన్నేసిన రిషబ్ శెట్టి
గాంధీ జయంతికి 'కాంతార' ప్రీక్వెల్... లాంగ్ వీకెండ్ మీద కన్నేసిన రిషబ్ శెట్టి
Andhra News: ఏపీలో తీవ్ర విషాదాలు - సెల్‌ఫోన్‌లో ఆడుతూ సాంబారులో పడి బాలుడు మృతి, రోడ్డు ప్రమాదంలో ముగ్గురు బాలురు మృతి
ఏపీలో తీవ్ర విషాదాలు - సెల్‌ఫోన్‌లో ఆడుతూ సాంబారులో పడి బాలుడు మృతి, రోడ్డు ప్రమాదంలో ముగ్గురు బాలురు మృతి
Embed widget