News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

UGC NET Result: యూజీసీ నెట్-2022 ఫలితాలు వెల్లడి, రిజల్ట్ డైరెక్ట్ లింక్ ఇదే!

యూజీసీ నెట్ అధికారిక వెబ్‌సైట్‌తోపాటు, ఎన్టీఏ ఫలితాల వెబ్‌సైట్‌లో కూడా ఫలితాలను అందుబాటులో ఉంచింది. అభ్యర్థులు ఆయా వెబ్‌సైట్లలో ఫలితాలను చూసుకోవచ్చు.

FOLLOW US: 
Share:

యూనివర్సిటీల్లో పీహెచ్‌డీ, అసిస్టెంట్‌ లెక్చర్‌షిప్‌ అర్హత కోసం నిర్వహించిన యూజీసీ నెట్‌ ఫలితాలు శనివారం (నవంబరు 5న) విడుదలయ్యాయి. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఫలితాలను విడుదల చేసింది. యూజీసీ నెట్ అధికారిక వెబ్‌సైట్‌తోపాటు, ఎన్టీఏ ఫలితాల వెబ్‌సైట్‌లో కూడా ఫలితాలను అందుబాటులో ఉంచింది. అభ్యర్థులు ఆయా వెబ్‌సైట్లలో ఫలితాలను చూసుకోవచ్చు. ఇప్పటికే ఈ అర్హత పరీక్షకు సంబంధించిన తుది కీని ఎన్‌టీఏ విడుదల చేసింది.

యూజీసీ నెట్‌ పరీక్షను అక్టోబర్‌ 8, 10, 11, 12, 13, 14 తేదీల్లో దేశవ్యాప్తంగా ఎన్‌టీఏ నిర్వహించింది. యూజీసీ నెట్ ఎగ్జామ్‌ను ఈ ఏడాది నాలుగు విడతలుగా నిర్వహించారు. తొలి విడతలో జూలై 9 నుంచి జూలై 12 వరకు, రెండో విడత సెప్టెంబరు 20 నుంచిసెప్టెంబరు 23 వరకు నిర్వహించారు. ఇక నెట్ ఎగ్జామ్ మూడో విడత సెప్టెంబరు 29 నుంచి అక్టోబరు 4 వరకు, నాలుగో విడత అక్టోబరు 8 నుంచి అక్టోబరు 14 వరకు నిర్వహించారు.

యూజీసీ నెట్ 2022 ఫలితాల కోసం క్లిక్ చేయండి..

సబ్జెక్టులవారీగా కటాఫ్ పర్సంటైల్ 

సబ్జెక్టులవారీగా కటాఫ్ మార్కులు

యూజీసీ నెట్ రిజల్ట్స్ ఇలా చూసుకోండి..
అభ్యర్థులు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీకి చెందిన అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలు చెక్ చేసుకోవచ్చు.
1. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అధికారిక సైట్ సందర్శించాలి. సైట్ డైరెక్ట్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
2: హోం పేజీలో డిస్‌ప్లే ఆఫ్ రిజల్ట్స్ అండ్ ఫైనల్ ఆన్సర్ కీ ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
3: అభ్యర్థులు తమ అప్లికేషన్ నెంబర్, పాస్ వర్డ్ ఇవ్వడం ద్వారా లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. అప్లికేషన్ నెంబరు, డేటాఫ్ బర్త్ వివరాలు ఇవ్వడం ద్వారా కూడా లిగిన్ అవ్వొచ్చు.
4:  అవసరమైన వివరాలు నింపిన తరువాత అభ్యర్థులు తమ రిజల్ట్ కార్డును డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

ఫలితాల కోసం వెబ్‌సైట్స్:

www.ugcnet.nta.nic.in 

www.ntaresults.nic.in

Also Read:

Post Office Jobs: పోస్టాఫీసుల్లో 98 వేల ఉద్యోగాలు, ఖాళీల వివరాలివే!
దేశంలో భారీగా ఉద్యోగాల భర్తీకి ఇండియా పోస్టు తెరలెపింది. దేశవ్యాప్తంగా ఉన్న వివిధ పోస్టాఫీసుల్లో 98,083 ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు అధికారిక ప్రకటన విడుదల చేసింది. రీజియన్ల వారీగా నోటిఫికేషన్లు విడుదల విడుదల చేసి ఉద్యోగాల భర్తీ చేపట్లనున్నట్లు ప్రకటించింది. పోస్టాఫీసుల్లో పోస్ట్‌మ్యాన్, మెయిన్ గార్డ్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టులను భర్తీ చేయనున్నట్లు తెలిపింది.  
పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..

ఇండియన్ నేవీలో ఆఫీసర్ పోస్టులు, ప్రారంభ జీతం రూ.56,100
భారత రక్షణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ఇండియన్ నేవీ షార్ట్ సర్వీస్ కమిషన్ (SSC) ఆఫీసర్ పోస్టుల భర్తీకి అర్హులైన అవివాహిత పురుషులు, మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఏదైనా డిగ్రీ లేదా పీజీ అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అకడమిక్ మెరిట్ మార్కుల ఆధారంగా ఎంపికచేస్తారు. ఎంపికైనవారికి కేరళ రాష్ట్రం ఎజిమలలోని ఇండియన్ నేవల్ అకాడమీలో జూన్ 2023 ప్రారంభమయ్యే 23వ కోర్సులో సంబంధిత శాఖలు/ కేడర్/ స్పెషలైజేషన్లలో శిక్షణ ఇస్తారు. 
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...

Published at : 05 Nov 2022 08:48 PM (IST) Tags: National Testing Agency UGC NET 2022 Result UGC NET Result NET UGC 2022 result NTA JRF NET JRF 2022 Results

ఇవి కూడా చూడండి

AIIMS: ఎయిమ్స్‌ పట్నాలో 20 ట్యూటర్/క్లినికల్ ఇన్‌స్ట్రక్టర్ పోస్టులు, వివరాలు ఇలా

AIIMS: ఎయిమ్స్‌ పట్నాలో 20 ట్యూటర్/క్లినికల్ ఇన్‌స్ట్రక్టర్ పోస్టులు, వివరాలు ఇలా

NIE: ఎన్‌ఐఈ, చెన్నైలో 47 టెక్నికల్ అసిస్టెంట్, ల్యాబొరేటరీ అటెండెంట్ పోస్టులు

NIE: ఎన్‌ఐఈ, చెన్నైలో 47 టెక్నికల్ అసిస్టెంట్, ల్యాబొరేటరీ అటెండెంట్ పోస్టులు

Railway Recruitment: నార్త్ఈస్ట్ ఫ్రాంటియర్ రైల్వేలో 51 స్పోర్ట్స్ పర్సన్ పోస్టులు, వివరాలు ఇలా

Railway Recruitment: నార్త్ఈస్ట్ ఫ్రాంటియర్ రైల్వేలో 51 స్పోర్ట్స్ పర్సన్ పోస్టులు, వివరాలు ఇలా

Bank of Baroda: బ్యాంక్ ఆఫ్ బరోడా ఏవో ఉద్యోగాల హాల్‌టికెట్లు విడుదల, పరీక్ష ఎప్పుడంటే?

Bank of Baroda: బ్యాంక్ ఆఫ్ బరోడా ఏవో ఉద్యోగాల హాల్‌టికెట్లు విడుదల, పరీక్ష ఎప్పుడంటే?

TS TET: తెలంగాణ 'టెట్' పేప‌ర్-1లో 36.89 శాతం, పేప‌ర్‌-2లో 15.30 శాతం ఉత్తీర్ణత

TS TET: తెలంగాణ 'టెట్' పేప‌ర్-1లో 36.89 శాతం, పేప‌ర్‌-2లో 15.30 శాతం ఉత్తీర్ణత

టాప్ స్టోరీస్

Adilabad: గణేష్ లడ్డూని కొన్న ముస్లిం యువకుడు - రూ.1.2 లక్షలకు వేలంలో సొంతం

Adilabad: గణేష్ లడ్డూని కొన్న ముస్లిం యువకుడు - రూ.1.2 లక్షలకు వేలంలో సొంతం

Kotamreddy : చంద్రబాబు అరెస్ట్‌పై వైసీపీలో మెజార్టీ నేతల వ్యతిరేకత - కోటంరెడ్డి కీలక వ్యాఖ్యలు !

Kotamreddy :  చంద్రబాబు అరెస్ట్‌పై వైసీపీలో మెజార్టీ నేతల వ్యతిరేకత -  కోటంరెడ్డి కీలక వ్యాఖ్యలు !

Khairatabad Ganesh Immersion: గంగమ్మ ఒడికి చేరిన ఖైరతాబాద్ వినాయకుడు - అర్ధరాత్రి ఆఖరి పూజ, వేకువజాము నుంచి యాత్ర

Khairatabad Ganesh Immersion: గంగమ్మ ఒడికి చేరిన ఖైరతాబాద్ వినాయకుడు - అర్ధరాత్రి ఆఖరి పూజ, వేకువజాము నుంచి యాత్ర

Chandrababu Special Song: ‘తెలుగు జాతి వెలుగుబిడ్డ లేరా’ చంద్రబాబు అరెస్టుపై స్పెషల్ సాంగ్ - రిలీజ్ చేసిన నారా లోకేశ్

Chandrababu Special Song: ‘తెలుగు జాతి వెలుగుబిడ్డ లేరా’ చంద్రబాబు అరెస్టుపై స్పెషల్ సాంగ్ - రిలీజ్ చేసిన నారా లోకేశ్