News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Group1 Key: టీఎస్‌పీఎస్సీ 'గ్రూప్-1' ఫైనల్ ఆన్సర్ 'కీ' వచ్చేస్తోంది! ఎప్పుడంటే?

తెలంగాణలో గ్రూప్-1 పోస్టుల భర్తీకి నిర్వహించిన ప్రిలిమినరీ పరీక్ష ఫైనల్ ఆన్సర్ కీ ఒకట్రెండు రోజుల్లో వెలువడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. జులై 31 లేదా లేదా ఆగస్టు 1న ప్రకటించే అవకాశం ఉంది.

FOLLOW US: 
Share:

తెలంగాణలో గ్రూప్-1 పోస్టుల భర్తీకి నిర్వహించిన ప్రిలిమినరీ పరీక్ష ఫైనల్ ఆన్సర్ కీ ఒకట్రెండు రోజుల్లో వెలువడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. జులై 31 లేదా లేదా ఆగస్టు 1న ప్రకటించే అవకాశం ఉంది. జూన్ 28న ప్రాథమిక కీని విడుదల చేసి టీఎస్‌పీఎస్సీ జులై 1 నుంచి జులై 5 వరకు ఆన్సర్ కీ అభ్యంతరాలు స్వీకరించింది. అభ్యంతరాలను పరిగణనలోకీ తీసుకుని పరిశీలించిన విషయ నిపుణులు రూపొందించిన గ్రూప్-1 తుది కీని విడుదల చేసేందుకు టీఎస్‌పీఎస్సీ ఏర్పాట్లు చేస్తోంది.  

రాష్ట్రంలో 503 'గ్రూప్‌-1' సర్వీసుల ఉద్యోగాల భర్తీకి జూన్‌ 11న నిర్వహించిన సంగతి తెలిసిందే. పరీక్ష ప్రాథమిక కీని టీఎస్‌పీఎస్సీ జూన్ 28న విడుదల చేసింది. అయితే ఈ పరీక్షకు సంబంధించిన ఫైనల్ 'కీ' విడుదల చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. గ్రూప్-1 పరీక్ష ప్రిలిమినరీ ఆన్సర్ కీతో పాటు అభ్యర్థుల రెస్పాన్స్ షీట్లను కూడా వెబ్‌సైట్‌లో పొందుపరిచేందుకు టీఎస్‌పీఎస్సీ ఏర్పాట్లు చేస్తోంది. ప్రస్తుతం ఓఎంఆర్‌ పత్రాల ఇమేజింగ్‌ ప్రక్రియ కొనసాగుతోంది. ఈ ప్రక్రియ ముగియగానే తుది కీని కమిషన్ విడుదల చేయనుంది.

రాష్ట్రంలో జూన్‌ 11న నిర్వహించిన ప్రిలిమినరీ పునఃపరీక్షకు 2,33,248 మంది హాజరయ్యారు. గతేడాది అక్టోబరు 16న జరిగిన పరీక్షతో పోలిస్తే దాదాపు 55 లక్షల మంది పరీక్షకు దూరంగా ఉన్నారు. ఇమేజింగ్‌ ప్రక్రియ పూర్తయిన వెంటనే ప్రిలిమనరీ పరీక్ష మాస్టర్‌ ప్రశ్నపత్రం, గ్రూప్‌-1 ప్రిలిమినరీ కీ టీఎస్‌పీఎస్సీ... వెబ్‌సైట్లో పొందుపరచనుంది. కీ పై అభ్యర్థుల నుంచి అభ్యంతరాలు స్వీకరించి తుది కీ విడుదల చేయనుంది. వీలైనంత త్వరగా ఫలితాలు వెల్లడించేందుకు టీఎస్‌పీఎస్సీ ప్రయత్నాలు చేస్తోంది. 

ఆగస్టు నెలాఖరు నుంచి ఫలితాల వెల్లడి..
ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి పోటీపరీక్షలు నిర్వహిస్తున్న టీఎస్‌పీఎస్సీ ఆగస్టు నెలాఖరు లేదా సెప్టెంబరు మొదటివారం నుంచి ఫలితాలను వెల్లడించేలా కసరత్తు ప్రారంభించింది. న్యాయవివాద అడ్డంకుల్లేని నోటిఫికేషన్లకు వారంలోగా ప్రశ్నపత్రాల ఫైనల్‌కీ వెల్లడించి, 1:2 నిష్పత్తిలో మెరిట్‌ జాబితాలు ప్రకటించనుంది. అభ్యర్థుల సంఖ్య మేరకు వీలైనంత త్వరగా ధ్రువీకరణ పత్రాలను పరిశీలిస్తూ, వరుసగా ఫలితాలు ప్రకటించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. గ్రూప్‌-1 ప్రిలిమినరీ పరీక్ష.. ప్రిలిమినరీ కీపై ఇప్పటికే అభ్యంతరాల్ని పరిశీలించిన కమిషన్, తుది కీని జులై 31 లేదా లేదా ఆగస్టు 1న ప్రకటించే అవకాశం ఉంది.

ALSO READ:

'గ్రూప్‌-2' పరీక్ష తేదీల్లో మార్పుల్లేవ్! షెడ్యూలు ప్రకారమే పరీక్షల నిర్వహణ
తెలంగాణలో గ్రూప్‌-2 పరీక్షల నిర్వహణకు టీఎస్‌పీఎస్సీ ఏర్పాట్లు చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం ఆగస్టు 29,30 తేదీల్లో గ్రూప్-2 పరీక్ష నిర్వహించనుంది. అయితే గ్రూప్‌-3 పరీక్ష తేదీల ఖరారుతోపాటు గ్రూప్‌-1 మెయిన్స్‌, కళాశాల లెక్చరర్లు, సంక్షేమ వసతిగృహాల అధికారులు (హెచ్‌డబ్ల్యూవో), డివిజినల్‌ అకౌంట్స్‌ అధికారుల (డీఏవో) పరీక్షల నిర్వహణకు టీఎస్‌పీఎస్సీ ముమ్మర కసరత్తు చేస్తోంది. ఈ నేపథ్యంలో కొందరు అభ్యర్థులు 'గ్రూప్‌-2' పరీక్షను వాయిదా వేయాలని కమిషన్‌ను ఆశ్రయిస్తున్నారు.
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..

తెలంగాణ మెడికల్ కాలేజీల్లో టీచింగ్ పోస్టులు, ఎంపికైతే భారీగా జీతభత్యాలు
తెలంగాణలోని మెడికల్ కాలేజీల్లో టీచింగ్ ప్యాకల్టీల భర్తీకి డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ద్వారా రాష్ట్రంలోని 23 ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ప్రొఫెసర్‌, అసోసియేట్‌, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు. కాంట్రాక్టు విధానంలో ఈ పోస్టుల భర్తీ చేపట్టనున్నారు. అయితే వీరికి రెగ్యులర్‌ ఉద్యోగులకన్నా ఎక్కువ జీతాలు ఇవ్వనుండటం విశేషం. కేవలం ఏడాది కాలానికి మాత్రమే ఈ నియామకాలను భర్తీ చేయనున్నారు. ఏడాది తర్వాత అవసరాన్ని బట్టి పదవీ కాలాన్ని పెంచుతారు. రెగ్యులర్‌ నియామకాలు చేపడితే మాత్రమే వీరు ఉద్యోగాల నుంచి వైదొలగాల్సి ఉంటుంది. రాష్ట్రంలో మొత్తం 26 ప్రభుత్వ వైద్యవిద్య కళాశాలలు ఉండగా.. వాటిలో గాంధీ, ఉస్మానియా, వరంగల్‌ కాకతీయ మెడికల్‌ కాలేజీలను మినహాయించి మిగిలిన 23 కాలేజీల్లో పోస్టులు భర్తీ కానున్నాయి. 
నోటిఫికేష్, పోస్టుల పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..

Published at : 31 Jul 2023 11:54 AM (IST) Tags: Group 1 Prelims Answer Key TSPSC Group 1 Answer Key TSPSC Group 1 Prelims Answer Key Group-1 Prelims Answer Key Group-1 Prelims Response Sheets

ఇవి కూడా చూడండి

TS SET: టీఎస్‌ సెట్‌ - 2023 ఫలితాలు విడుదల, ర్యాంక్ కార్డుల డౌన్‌లోడ్ లింక్ ఇదే

TS SET: టీఎస్‌ సెట్‌ - 2023 ఫలితాలు విడుదల, ర్యాంక్ కార్డుల డౌన్‌లోడ్ లింక్ ఇదే

SSC Delhi Police: ఢిల్లీ పోలీస్ కానిస్టేబుల్ నియామక పరీక్ష ప్రిలిమినరీ ఆన్సర్ 'కీ' విడుదల, అభ్యంతరాలకు అవకాశం

SSC Delhi Police: ఢిల్లీ పోలీస్ కానిస్టేబుల్ నియామక పరీక్ష ప్రిలిమినరీ ఆన్సర్ 'కీ' విడుదల, అభ్యంతరాలకు అవకాశం

SI Exam Results: ఎస్‌ఐ పరీక్ష తుది ఫలితాలు విడుదల, ఫైనల్ ఆన్సర్ 'కీ' అందుబాటులో

SI Exam Results: ఎస్‌ఐ పరీక్ష తుది ఫలితాలు విడుదల, ఫైనల్ ఆన్సర్ 'కీ' అందుబాటులో

NCDC: ఎన్‌సీడీసీలో యంగ్‌ ప్రొఫెషనల్‌ పోస్టులు, వివరాలు ఇలా

NCDC: ఎన్‌సీడీసీలో యంగ్‌ ప్రొఫెషనల్‌ పోస్టులు, వివరాలు ఇలా

AP High Court: ఎస్‌ఐ ఫలితాల వెల్లడికి లైన్ క్లియర్, 'స్టే' ఎత్తివేసిన హైకోర్టు

AP High Court: ఎస్‌ఐ ఫలితాల వెల్లడికి లైన్ క్లియర్, 'స్టే' ఎత్తివేసిన హైకోర్టు

టాప్ స్టోరీస్

Revanth Reddy First Signature: ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన తర్వాత రేవంత్ పెట్టే తొలి సంతకం ఇదే

Revanth Reddy First Signature: ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన తర్వాత రేవంత్ పెట్టే తొలి సంతకం ఇదే

Hi Nanna Movie Review - హాయ్ నాన్న రివ్యూ: నాని, మృణాల్ సినిమా హిట్టా? ఫట్టా?

Hi Nanna Movie Review - హాయ్ నాన్న రివ్యూ: నాని, మృణాల్ సినిమా హిట్టా? ఫట్టా?

Traffic Restrictions in Hyderabad: సీఎంగా రేవంత్‌రెడ్డి ప్రమాణ స్వీకారం, గురువారం హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు

Traffic Restrictions in Hyderabad: సీఎంగా రేవంత్‌రెడ్డి ప్రమాణ స్వీకారం, గురువారం హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు

Hi Nanna Review - హాయ్ నాన్న ఆడియన్స్ రివ్యూ : నాని అంత ఏడిపించేశాడా? కర్చీఫ్, టవల్స్ తీసుకువెళ్లక తప్పదా? 

Hi Nanna Review - హాయ్ నాన్న ఆడియన్స్ రివ్యూ : నాని అంత ఏడిపించేశాడా? కర్చీఫ్, టవల్స్ తీసుకువెళ్లక తప్పదా?