TSPSC Paper Leak Case: పేపర్ లీక్ వ్యవహారం, లావాదేవీలపై ప్రధాన నిందితులను ప్రశ్నించిన ఈడీ!
ఈడీ అసిస్టెంట్ డైరెక్టర్లు సుమిత్ గోయల్, దేవేందర్‌సింగ్‌ల నేతృత్వంలోని నలుగురు సభ్యుల బృందం మొదట ప్రవీణ్‌కుమార్, రాజశేఖర్‌రెడ్డిని చెంచల్‌గూడ జైల్లో వేర్వేరుగా ప్రశ్నించారు.
టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారంలో జరిగిన ఆర్థిక లావాదేవీల మూలాలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దృష్టిపెట్టింది. ఈ కేసులో ప్రధాన నిందితులైన ప్రవీణ్‌కుమార్, రాజశేఖర్‌రెడ్డిని ఏప్రిల్ 17న ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈడీ ప్రశ్నించింది. ఈడీ అసిస్టెంట్ డైరెక్టర్లు సుమిత్ గోయల్, దేవేందర్‌సింగ్‌ల నేతృత్వంలోని నలుగురు సభ్యుల బృందం మొదట ప్రవీణ్‌కుమార్, రాజశేఖర్‌రెడ్డిని చెంచల్‌గూడ జైల్లో వేర్వేరుగా ప్రశ్నించారు. మధ్యాహ్నం తర్వాత ఇద్దరినీ కలిపి కూడా కొన్ని అంశాలపై ప్రశ్నించినట్లు తెలిసింది.
టీఎస్‌పీఎస్సీ కార్యాలయంలోని కాన్ఫిడెన్షియల్ సెక్షన్ నుంచి ప్రశ్నపత్రాలు కొట్టేశాక ఏయే పేపర్లను ఎవరికి చేరవేశారు? ఎంత మొత్తానికి వారితో బేరం కుదుర్చుకున్నారు అన్న విషయాలపై విచారణలో సేకరించిన వివరాల ఆధారంగా ప్రవీణ్‌కుమార్, రాజశేఖర్‌రెడ్డిల బ్యాంకు స్టేట్‌మెంట్లను ముందుపెట్టి ప్రశ్నించినట్లు తెలిసింది. పేపర్ల లీకేజీ సొమ్ము మొత్తం రూ.50 లక్షల మేర బేరసారాలు జరిగినట్లు సిట్ ఇప్పటికే గుర్తించిన నేపథ్యంలో ఆ మేరకు ఎంతెంత డబ్బు ఎవరెవరి ద్వారా సేకరించారన్న అంశాలపైనా ప్రశ్నించినట్లు సమాచారం.
ప్రవీణ్‌కుమార్ ఇంట్లో జరిపిన సోదాల్లో లభ్యమైన రూ.4 లక్షలు, రాజశేఖర్‌రెడ్డి గత ఆరు నెలలుగా ఖర్చు చేసిన డబ్బు, ఆ సొమ్ముకు మూలం, అతను తిరిగిన ప్రాంతాలు వంటి అంశాలపైనే ప్రధానంగా విచారణ కొనసాగినట్లు తెలిసింది. ఇప్పటికే ఈ కేసులో కాన్ఫిడెన్షియల్ సెక్షన్ అధికారి శంకరలక్షి్మ, మరో అధికారి సత్యనారాయణల నుంచి వివరాలు సేకరించిన ఈడీ అధికారులు... ప్రస్తుతం ప్రవీణ్‌కుమార్, రాజశేఖర్‌రెడ్డిల నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా మరికొందరిని సైతం కస్టడీకి కోరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాగా, ప్రవీణ్‌కుమార్, రాజశేఖర్‌రెడ్డి ఈడీ కస్టడీ ఏప్రిల్ 18తో ముగిసింది. ఈ కేసులో ఇంతవరకు 18 మంది నిందితులను గుర్తించి.. 17 మందిని ఇప్పటికే అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.
డైరీలో లేని యూజర్ ఐడీ, పాస్‌వర్డ్ వివరాలు...
మరోవైపు శంకరలక్ష్మి డైరీని స్వాధీనం చేసుకొని పరిశీలించిన సిట్ అధికారులు దానిలో ఎక్కడా యూజర్ ఐడీ, పాస్‌వర్డ్ రాసినట్లు ఆధారాల్లేవని నిర్ధారణకు వచ్చారు. సిట్ పోలీసులు, ఈడీ అధికారుల విచారణలోనూ శంకరలక్ష్మి ఇదే విషయాన్ని చెప్పారని సమాచారం. ముగ్గులు ఒకే విధమైన సమాధానం ఇవ్వడం, డైరీలో యూజర్ ఐడీ, పాస్‌వర్డ్ వివరాలు లేకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఈ కేసులో పెద్ద తలకాయల ప్రమేయం ఉండే అవకాశమూ లేకపోలేదు. మరోవైపు ప్రశ్నపత్రాల కొనుగోలు వ్యవహారంలో మరికొందరు ఉన్నట్లు గుర్తించి అనుమానితుల జాబితాను సిట్ రూపొందించినట్లు తెలుస్తోంది. వారిలో ఇద్దరు గ్రూప్-1, డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్(డీఏవో) పరీక్ష రాసినట్లు నిర్ధారణకు వచ్చారు. ఆ ఇద్దరికీ ప్రశ్నపత్రాల లీకేజీతో సంబంధాలున్నాయా? లేదా? అనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది.
Also Read:
గురుకుల డిగ్రీ కాలేజీల్లో 868 డీఎల్, నాన్-టీచింగ్ పోస్టులు - అర్హతలివే!
తెలంగాణ గురుకుల డిగ్రీ కాలేజీల్లో వివిధ పోస్టుల భర్తీకి పూర్తిస్థాయి నోటిఫికేషన్ ఏప్రిల్ 17న వెలువడింది. దీనిద్వారా 868 లెక్చరర్, ఫిజికల్ డైరెక్టర్, లైబ్రేరియన్ పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటిలో సోషల్ వెల్ఫేర్ కాలేజీల్లో 174 పోస్టులు, ట్రైబల్ వెల్ఫేర్ కళాశాలల్లో 287 పోస్టులు, బీసీ గురుకుల డిగ్రీ కళాశాలల్లో 407 పోస్టులను భర్తీ చేయనున్నారు. మొత్తం ఖాళీల్లో లెక్చరర్ పోస్టులు 785, ఫిజికల్ డైరెక్టర్ పోస్టులు 39, లైబ్రేరియన్ పోస్టులు 36 ఉన్నాయి. ఈ పోస్టుల భర్తీకి సంబంధించి ఏప్రిల్ 17 నుంచి మే 17 వరకు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
గురుకుల జూనియర్ కళాశాలల్లో జేఎల్, ఫిజికల్ డైరెక్టర్, లైబ్రేరియన్ పోస్టులు, అర్హతలివే!
తెలంగాణ గురుకుల జూనియర్ కాలేజీల్లో వివిధ పోస్టుల భర్తీకి పూర్తిస్థాయి నోటిఫికేషన్ ఏప్రిల్ 17న వెలువడింది. దీనిద్వారా 2008 జూనియర్ లెక్చరర్, ఫిజికల్ డైరెక్టర్, లైబ్రేరియన్ పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటిలో సోషల్ వెల్ఫేర్ కాలేజీల్లో 253 పోస్టులు, ట్రైబల్ వెల్ఫేర్ కళాశాలల్లో 291 పోస్టులు, బీసీ గురుకుల డిగ్రీ కళాశాలల్లో 1070 పోస్టులను భర్తీ చేయనున్నారు. మొత్తం ఖాళీల్లో జేఎల్ పోస్టులు 1924, ఫిజికల్ డైరెక్టర్ పోస్టులు 34, లైబ్రేరియన్ పోస్టులు 50 ఉన్నాయి. ఈ పోస్టుల భర్తీకి సంబంధించి ఏప్రిల్ 17 నుంచి మే 17 వరకు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..