By: ABP Desam | Updated at : 25 Jan 2023 10:06 AM (IST)
Edited By: omeprakash
గ్రూప్-3 అప్లికేషన్
TSPSC has started Group3 application process: తెలంగాణలో 'గ్రూప్-3' ఉద్యోగాల భర్తీకి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ డిసెంబరు 30న నోటిఫికేషన్ కూడా విడుదల చేసిన సంగతి. దీనిద్వారా మొత్తం 1363 ఖాళీలను భర్తీ చేయనున్నారు. వివిధ విభాగాల్లో జూనియర్ అసిస్టెంట్, సీనియర్ అకౌంటెంట్, ఆడిటర్, సీనియర్ ఆడిటర్, అసిస్టెంట్ ఆడిటర్, అకౌంటెంట్ పోస్టులను భర్తీ చేయనున్నారు. అయితే గ్రూప్-3 ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ జనవరి 24న ప్రారంభమైంది. పోస్టుల అర్హతలు, ఇతర వివరాలకు సంబంధించిన పూర్తి నోటిఫికేషన్‌లో అందుబాటులో ఉంచారు. సరైన అర్హతలున్న అభ్యర్థులు ఫిబ్రవరి 23 వరకు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది . రాతపరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపికచేస్తారు.
పోస్టుల వివరాలు..
* గ్రూప్-3 పోస్టులు
పోస్టుల సంఖ్య: 1363
1) జూనియర్ అసిస్టెంట్: 655 పోస్టులు
2) సీనియర్ అకౌంటెంట్: 436 పోస్టులు
3) ఆడిటర్: 126 పోస్టులు
4) సీనియర్ ఆడిటర్: 61 పోస్టులు
5) అసిస్టెంట్ ఆడిటర్: 23 పోస్టులు
6) జూనియర్ అకౌంటెంట్: 61 పోస్టులు
7) అకౌంటెంట్: 01 పోస్టు
అర్హతలు: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
వయోపరిమితి: 01.07.2022 నాటికి 18-44 సంవత్సరాల మధ్య ఉండాలి. 02.07.1978 - 01.07.2004 మధ్య జన్మించి ఉండాలి. నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
దరఖాస్తు ఫీజు: రూ.280. ఇందులో రూ.200 ఆన్‌లైన్ ప్రాసెసింగ్ ఫీజు కింద, రూ.80 పరీక్ష ఫీజు కింద చెల్లించాల్సి ఉంటుంది. నిరుద్యోగులకు పరీక్ష ఫీజు నుంచి మినహాయింపు ఉంది. ప్రభుత్వ ఉద్యోగులు పరీక్ష ఫీజు చెల్లిస్తే సరిపోతుంది.
ఎంపిక విధానం: ఆన్‌లైన్ రాతపరీక్ష ఆధారంగా.
పరీక్ష విధానం: మొత్తం 450 మార్కులకు రాతపరీక్ష నిర్వహిస్తారు. పరీక్షలో మూడు పేపర్లు ఉంటాయి. ఒక్కో పేపరుకు 150 మార్కులు కేటాయించారు. ఇందులో పేపర్-1(జనరల్ స్టడీస్ & జనరల్ ఎబిలిటీస్)-150 ప్రశ్నలు, పేపర్-2(హిస్టరీ, పాలిటీ & సొసైటీ)-150 ప్రశ్నలు, పేపర్-3(ఎకానమీ & డెవలప్‌మెంట్)-150 ప్రశ్నలు అడుగుతారు. ఇంగ్లిష్, తెలుగు, ఉర్దూలో ప్రశ్నపత్రం ఉంటుంది.
ముఖ్యమైన తేదీలు...
➥ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 24.01.2023
➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 23.02.2023
Also Read:
TSPSC Recruitment: 'మున్సిపల్' ఉద్యోగాల దరఖాస్తు ప్రారంభం! చివరితేది ఎప్పుడంటే?
తెలంగాణ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ & అర్బన్ డెవలప్‌మెంట్ డిపార్ట్‌మెంట్‌లో ఖాళీల భర్తీకి టీఎస్‌పీఎస్సీ డిసెంబరు 31 నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. దీనిద్వారా 78 పోస్టులకు భర్తీచేయనున్నారు. వీటిలో అకౌంట్స్ ఆఫీసర్-01, జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్-13, సీనియర్ అకౌంటెంట్-64 పోస్టులు ఉన్నాయి. కామర్స్ డిగ్రీ అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
నోటిఫికేషన్, దరఖాస్తు వివరాల కోసం క్లిక్ చేయండి..
లైబ్రేరియన్ పోస్టుల దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం! చివరితేది ఎప్పుడంటే?
తెలంగాణలోని ఇంటర్, సాంకేతిక విద్యలో లైబ్రేరియన్ పోస్టుల భర్తీకి టీఎస్‌పీఎస్సీ డిసెంబరు 31 నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. దీనిద్వారా 71 లైబ్రేరియన్ పోస్టులకు భర్తీచేయనున్నారు. వీటిలో ఇంటర్మీడియట్ ఎడ్యకేషన్ పరిధిలో 40 పోస్టులు, టెక్నికల్ ఎడ్యకేషన్ పరిధిలో 31 పోస్టులు ఉన్నాయి. ఏదైనా డిగ్రీతోపాటు సంబంధిత విభాగంలో పీజీ డిగ్రీ అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఈ పోస్టుల భర్తీకి జనవరి 21న ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. ఫిబ్రవరి 10 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. రాతపరీక్ష ద్వారా ఖాళీల భర్తీ ఎంపిక చేపడతారు.
నోటిఫికేషన్, దరఖాస్తు వివరాల కోసం క్లిక్ చేయండి..
హైకోర్టు ఉద్యోగాల దరఖాస్తు ప్రారంభం, చివరితేది ఎప్పుడంటే?
తెలంగాణ హైకోర్టులో ఉద్యోగాల భర్తీకి జనవరి 11న నోటిఫికేషన్లు వెలువడిన సంగతి తెలిసిందే. మొత్తం 176 ఖాళీల భర్తీకి 9 నోటిఫికేషన్లను హైకోర్టు విడుదల చేసింది. అయితే ఈ పోస్టుల భర్తీకి సంబంధించిన ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ జనవరి 21న ప్రారంభమైంది. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలున్నవారు ఫిబ్రవరి 11 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. కంప్యూటర్ ఆధారిత రాతపరీక్ష ఆధారంగా ఉద్యోగ ఎంపికలు చేపట్టనున్నారు. పరీక్షకు సంబంధించిన హాల్‌టికెట్లు ఫిబ్రవరి 20 నుంచి అందుబాటులో ఉండనున్నాయి. పరీక్ష తేదీపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు.
నోటిఫికేషన్, దరఖాస్తు వివరాల కోసం క్లిక్ చేయండి..
APPSC Mains Exam Schedule: 'గ్రూప్-1' మెయిన్స్ షెడ్యూలు విడుదల, ఏ పరీక్ష ఎప్పుడంటే?
Post Office Jobs: పోస్టాఫీసుల్లో కొలువుల జాతర, 40 వేలకుపైగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వెల్లడి! తెలుగు రాష్ట్రాలకు ఎన్ని పోస్టులంటే?
APPSC Group1 Prelims Results: గ్రూప్-1 ఫలితాలు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే! మెయిన్స్కు 6,455 మంది ఎంపిక!
NLC Apprenticeship: నైవేలి లిగ్నైట్ కార్పొరేషన్లో 626 అప్రెంటిస్ ఖాళీలు, అర్హతలివే!
నిరుద్యోగులకు గుడ్ న్యూస్, మరో 2391 ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వ అనుమతి!
నేడు సీబీఐ ముందుకు అవినాష్ రెడ్డి- వివేకా హత్య కేసులో ఇంకెన్ని ట్విస్ట్లు!
Tarak ratna Health Update : మెరుగైన వైద్యం కోసం బెంగళూరు ఆసుపత్రికి తారకరత్న, కుప్పం నుంచి గ్రీన్ ఛానల్
Heart Attack: ఈ శరీరభాగాల్లో అసౌకర్యంగా ఉంటే అది గుండె సమస్య కావచ్చు, తేలిగ్గా తీసుకోకండి
Ratha Sapthami 2023 Slokas: రథసప్తమి రోజు తప్పనిసరిగా చదువుకోవాల్సిన శ్లోకాలు