FSO Merit List: ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ మెరిట్ జాబితా వెల్లడి, మార్కుల వివరాలు తెలుసుకోండి!
పరీక్షకు 16,381 మంది దరఖాస్తు చేయగా, పేపర్-1, పేపర్-2 పరీక్షకు 9,368 మంది అభ్యర్థులు హాజరయ్యారు. వీరికి సంబంధించిన మెరిట్ జాబితాను వెల్లడించింది. 287 మంది అభ్యర్థులకు అన్హులుగా తేల్చింది.
తెలంగాణ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్(ఐపీఎం)లో 24 ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్ (ఎఫ్‌ఎస్‌వో) పోస్టుల భర్తీకి నిర్వహించిన రాతపరీక్షలో అభ్యర్థులు పొందిన మార్కుల వివరాలను, మెరిట్ జాబితాను టీఎస్‌పీఎస్సీ వెబ్‌సైట్లో పొందుపరిచింది. ఎఫ్‌ఎస్‌వో పోస్టులకు నవంబరు 7న రాతపరీక్ష నిర్వహించి, డిసెంబరు 2న తుది కీని కమిషన్ ప్రకటించింది. ఈ పరీక్షకు 16,381 మంది దరఖాస్తు చేయగా, పేపర్-1, పేపర్-2 పరీక్షకు 9,368 మంది అభ్యర్థులు హాజరయ్యారు. వీరికి సంబంధించిన మార్కుల వివరాలను మెరిట్ జాబితాలో పొందుపరిచింది. 287 మంది అభ్యర్థులకు అన్హులుగా తేల్చింది. అయితే తుది జాబితా ప్రకటనకు ముందుగా మెరిట్ లిస్టు ప్రకారం 1:2 నిష్పత్తిలో అభ్యర్థులకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ నిర్వహించనున్నట్లు కమిషన్ తెలిపింది. అనంతరం తుది ఎంపిక జాబితాను వెల్లడించనుంది.
మెరిట్ జాబితా కోసం క్లిక్ చేయండి..
తెలంగాణలోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ పబ్లిక్ హెల్త్ అండ్ పుడ్(హెల్త్) అడ్మినిస్ట్రేషన్ విభాగంలో ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. అభ్యర్థుల నుంచి జులై 29 నుంచి ఆగస్టు 26 వరకు దరఖాస్తులు స్వీకరిచింది. అక్టోబరు 31న రాతపరీక్షకు సంబంధించిన హాల్‌టికెట్లను విడుదల చేసింది. రాష్ట్రవ్యాప్తంగా నవంబరు 7న పరీక్ష నిర్వహించింది. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పేపర్-1, మధ్మాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పేపర్-2 పరీక్ష జరిగింది.
రాష్ట్రంలో మొత్తం 16 జిల్లాల్లోని 56 సెంటర్లలో పరీక్ష నిర్వహించారు. పరీక్ష కోసం మొత్తం 16,381 మంది దరఖాస్తు చేసుకోగా.. 14,830 మంది హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకున్నారు. వీరిలో కేవలం 9,655 మంది పరీక్షకు హాజరయ్యారు. ఇక 47 మంది అభ్యర్థులు పేపర్-1 మాత్రమే రాశారు. వీరిని అనర్హులుగా ప్రకటిస్తామని టీఎస్‌పీఎస్సీ ఇప్పటికే ప్రకటించింది. రాతపరీక్ష ప్రాథమిక కీని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) నవంబరు 15న విడుదల చేసింది. నవంబరు 20 వరకు అభ్యంతరాలు స్వీకరించింది. అనంతరం డిసెంబరు 2న ఫైనల్ కీని విడుదల చేసింది. డిసెంబరు 9న అభ్యర్థుల మార్కులతో మెరిట్ జాబితాను కమిషన్ విడుదల చేసింది.
Also Read:
పాలిటెక్నిక్ కాలేజీల్లో 247 లెక్చరర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్, వివరాలు ఇలా!
తెలంగాణలోని పాలిటెక్నిక్ కాలేజీల్లో ఖాళీగా ఉన్న లెక్చరర్ పోస్టుల భర్తీకి టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ మేరకు వెబ్‌సైట్‌లో పోస్టుల వివరాలు అందుబాటులో ఉంచింది. దీనిద్వారా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీల్లో మొత్తం 247 పోస్టులను భర్తీ చేయనున్నారు. 19 సబ్జెక్టుల్లో ఈ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. సరైన అర్హతలు గల అభ్యర్థులు డిసెంబర్ 14 నుంచి జనవరి 4 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. సంబంధిత విభాగంలో బ్యాచీలర్ డిగ్రీ (ఇంజినీరింగ్/ టెక్నాలజీ) అర్హత ఉన్నవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
వైద్యశాఖలో 1147 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు నోటిఫికేషన్, వివరాలు ఇలా!
తెలంగాణలో వైద్య విద్యపూరి చేసుకున్న వారికి తెలంగాణ ప్రభుత్వం శుభవార్త వినిపించింది. రాష్ట్ర వైద్యారోగ్య శాఖలో 1147 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. అర్హులైన అభ్యర్థుల నుంచి డిసెంబరు 20న ఉదయం 10:30 గంటల నుంచి జనవరి 5న సాయంత్రం 5 గంటల వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులను స్వీకరించనున్నారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..