TSPSC 'డ్రగ్ ఇన్‌స్పెక్టర్' ఫైనల్ 'కీ' విడుదల, రెస్పాన్స్ షీట్లు కూడా అందుబాటులో
తెలంగాణలో డ్రగ్ ఇన్‌స్పెక్టర్ పోస్టుల భర్తీకి నిర్వహించిన రాతపరీక్ష తుది 'కీ' ని టీఎస్‌పీఎస్సీ అక్టోబరు 21న వెల్లడించింది. అధికారిక వెబ్‌సైట్‌లో ఆన్సర్ కీని అందుబాటులో ఉంచింది.
తెలంగాణలో డ్రగ్ ఇన్‌స్పెక్టర్ పోస్టుల భర్తీకి నిర్వహించిన రాతపరీక్ష తుది 'కీ' ని టీఎస్‌పీఎస్సీ అక్టోబరు 21న వెల్లడించింది. అధికారిక వెబ్‌సైట్‌లో ఆన్సర్ కీని అందుబాటులో ఉంచింది. తుది ఆన్సర్ కీతోపాటు.. అభ్యర్థుల సమాధాన పత్రాలను (రెస్పాన్స్ షీట్లు) కూడా టీఎస్‌పీఎస్సీ అందుబాటులో ఉంచింది. అభ్యర్థులు తమ టీఎస్‌పీఎస్సీ ఐడీ, హాల్‌టికెట్ నెంబరు, పుట్టినతేదీ వివరాలు నమోదుచేసి ఫైనల్ ఆన్సర్ కీతోపాటు, రెస్పాన్స్ షీట్లు పొందవచ్చు. అయితే తుది 'కీ' పై ఎలాంటి అభ్యంతరాలు పరిగణించబోమని కమిషన్ స్పష్టం చేసింది.
ఫైనల్ ఆన్సర్ కీ, రెస్పాన్స్ షీట్ల కోసం క్లిక్ చేయండి..
డ్రగ్ ఇన్‌స్పెక్టర్ పోస్టుల భర్తీకి టీఎస్‌పీఎస్సీ గత మే19న సీబీఆర్‌టీ విధానంలో పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షకు సంబంధించిన ప్రాథమిక ఆన్సర్ కీని మే 27న కమిషన్ ప్రకటించింది. ప్రాథమిక 'కీ' పై జూన్ 1 నుంచి 3 వరకు అభ్యంతరాలు స్వీకరించింది. ఈ అభ్యంతరాలను పరిశీలించిన సబ్జెక్టు నిపుణులు తుది 'కీ' రూపొందించగా కమిషన్ ఆమోదం తెలిపింది. తాజాగా తుది కీని కమిషన్ విడుదల చేసింది.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ విభాగంలో 18 డ్రగ్ ఇన్‌స్పెక్టర్ పోస్టుల భర్తీకి టీఎస్‌పీఎస్సీ డిసెంబర్ 8న నోటిఫికేషన్ (నెం.21/2022) వెలువడిన సంగతి తెలిసిందే. ఈ ఉద్యోగాల భర్తీకి సంబంధించి డిసెంబర్ 16న ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. జనవరి 5 వరకు దరఖాస్తులు స్వీకరించారు. బీఫార్మసీ/ఫార్మాస్యూటికల్ సైన్స్/ఫార్మా-డి (లేదా) గుర్తింపు పొందిన యూనివర్సిటి నుంచి మెడిసిన్ (క్లినికల్ ఫార్మకాలజి/మైక్రోబయాలజి) ఉన్నవారు దరఖాస్తు చేసుకున్నారు. అభ్యర్థులకు మే 19న కంప్యూటర్ ఆధారిత రాతపరీక్ష నిర్వహించింది. మే 27న ప్రాథమిక కీ విడుదల చేయగా.. అక్టోబరు 21న ఫైనల్ కీని కమిషన్ విడుదల చేసింది. త్వరలోనే ఫలితాలను వెల్లడించే అవకాశం ఉంది.
ALSO READ:
ఇంటెలిజెన్స్ బ్యూరోలో 677 ఉద్యోగాల దరఖాస్తులు ప్రారంభం, చివరితేది ఎప్పుడంటే?
కేంద్ర హోంవ్యవహారాల మంత్రిత్వ పరిధిలోని ఇంటెలిజెన్స్ బ్యూరోలో 677 సెక్యూరిటీ అసిస్టెంట్/మోటార్ ట్రాన్స్‌పోర్ట్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ పోస్టుల భర్తీకి సంబంధించిన ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ అక్టోబరు 14న ప్రారంభమైంది. ఆసక్తి కలిగిన వారు నవంబరు 13 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు పదోతరతగతి లేదా తత్సమాన విద్యార్హత ఉండాలి. అలాగే ప్రాంతీయ భాషలో నైపుణ్యం ఉండాలి. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.500 చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి, మహిళా అభ్యర్థులు రూ.50 చెల్లిస్తే సరిపోతుంది. టైర్-1, టైర్-2 రాతపరీక్షల ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. పోస్టులు, దరఖాస్తు వివరాల కోసం క్లిక్ చేయండి..
ఎన్టీపీసీలో 495 ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టులు, ఇంజినీరింగ్‌తోపాటు ఈ అర్హతలుండాలి
నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎన్టీపీసీ) గేట్-2023 ఇంజినీరింగ్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా 495 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఇంజినీరింగ్ డిగ్రీతోపాటు, గేట్-2023 అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలున్న అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.300 చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్-సర్వీస్‌మెన్, మహిళలకు ఫీజు నుంచి మినహాయింపు ఉంది. ఈ పోస్టుల భర్తీకి సంబంధించిన ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ అక్టోబరు 6న ప్రారంభంకాగా.. అక్టోబరు 20 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఉద్యోగాలకు ఎంపికైనవారికి నెలకు రూ.40 వేల నుంచి రూ.1,40,000 వరకు వేతనంగా ఇస్తారు. నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..