అన్వేషించండి

TSPSC AEE Exam: ఏఈఈ నియామక పరీక్షల షెడ్యూలు ఖరారు, సబ్జెక్టులవారీగా తేదీలివే!

పేపర్ లీకేజీ కారణంగా రద్దయిన అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్(ఏఈఈ) నియామక పరీక్షల తేదీలను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రకటించింది. షెడ్యూలును అధికారిక వెబ్‌‌సైట్‌లో అందుబాటులో ఉంచింది.

తెలంగాణలో పేపర్ లీకేజీ కారణంగా రద్దయిన అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్(ఏఈఈ) నియామక పరీక్షల తేదీలను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మార్చి 29న ప్రకటించింది. కొత్త షెడ్యూలు ప్రకారం మే 8న ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ విభాగాలకు;  మే 9న అగ్రికల్చర్, మెకానికల్ విభాగాలకు ఆన్‌లైన్ పరీక్ష నిర్వహించనున్నారు. ఇక మే 21న సివిల్ ఏఈఈ ఓఎంఆర్ పరీక్ష నిర్వహించిననున్నట్లు వెల్లడించింది. ఈ ఏడాది జనవరి 22న ఏఈఈ పరీక్షను టీఎస్‌పీఎస్సీ నిర్వహించిన విషయం తెలిసిందే. అయితే, ప్రశ్నపత్రాల లీకేజీతో ఈ పరీక్షలను రద్దు చేసింది. తాజాగా నియామక పరీక్ష తేదీలను టీఎస్‌పీఎస్సీ ప్రకటించింది. పూర్తి వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్‌ను చూడాలని అభ్యర్థులకు టీఎస్‌పీఎస్సీ సూచించింది.

TSPSC AEE Exam: ఏఈఈ నియామక పరీక్షల షెడ్యూలు ఖరారు, సబ్జెక్టులవారీగా తేదీలివే!

ప్రభుత్వంలోని వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 1540 అసిస్టెంట్​ ఎగ్జిక్యూటివ్ ​ఇంజినీర్​(ఏఈఈ) పోస్టులను భర్తీకి సెప్టెంబరు 3న నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. మిష‌న్ భ‌గీర‌థ‌, ఇరిగేష‌న్‌, పంచాయ‌తీరాజ్ రూర‌ల్ డెవ‌ల‌ప్‌మెంట్‌, మున్సిప‌ల్ అడ్మినిస్ట్రేష‌న్‌, ట్రైబ‌ల్ వెల్ఫేర్‌, అర్అండ్‌బీ విభాగాల్లో ఈ ఖాళీలు ఉన్నాయి. వీటిని డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ విధానం ద్వారా భ‌ర్తీ చేయనున్నారు.

రాతపరీక్ష విధానం: మొత్తం 450 మార్కులకు రాతపరీక్ష నిర్వహిస్తారు. ఇందులో పేపర్-1 (జనరల్ స్టడీస్ & జనరల్ ఎబిలిటీస్)కు 150 మార్కులు, పేపర్-2(అభ్యర్థి సబ్జెక్టు)కు 300 మార్కులు కేటాయించారు. పేపర-1లో 150 ప్రశ్నలు-150 మార్కులు, పేపర్-2లో 150 ప్రశ్నలు 300 మార్కులు ఉంటాయి. పరీక్ష సమయం ఒక్కో పేపరుకు 150 నిమిషాలుగా కేటాయించారు.

పరీక్ష విధానం, సిలబస్ వివరాలు..

పోస్టుల వివరాలు.. 

* అసిస్టెంట్​ ఎగ్జిక్యూటివ్ ​ఇంజినీర్​(ఏఈఈ) పోస్టులు

మొత్తం ఖాళీల సంఖ్య: 1540

 1)   ఏఈఈ(సివిల్)- పీఆర్‌ఆర్‌డీ డిపార్ట్‌మెంట్  (మిషన్ భగీరథ): 302 పోస్టులు     

అర్హత: బ్యాచిలర్ డిగ్రీ (సివిల్ ఇంజినీరింగ్).

2)   ఏఈఈ(సివిల్)- పీఆర్‌ఆర్‌డీ ‌డిపార్ట్‌మెంట్: 211 పోస్టులు    

అర్హత: బ్యాచిలర్ డిగ్రీ (సివిల్ ఇంజినీరింగ్). 

3)  ఏఈఈ (సివిల్) ఎంఏ యూడీ- పీహెచ్: 147 పోస్టులు    

అర్హత: బ్యాచిలర్ డిగ్రీ (సివిల్ ఇంజినీరింగ్). AMIE (సివిల్) పరీక్ష అర్హత ఉండాలి. 

4)  ఏఈఈ(సివిల్) టీడబ్ల్యూ డిపార్ట్ మెంట్: 15 పోస్టులు

అర్హత: బ్యాచిలర్ డిగ్రీ (సివిల్ ఇంజినీరింగ్). 

5)  ఏఈఈ ఐ‌సీఏడీ డిపార్ట్ మెంట్: 704 పోస్టులు    

అర్హత: బ్యాచిలర్ డిగ్రీ (సివిల్ ఇంజినీరింగ్/మెకానికల్ ఇంజినీరింగ్/ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్/ ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్/అగ్రికల్చర్  ఇంజినీరింగ్). 

 6)  ఏఈఈ (మెకానికల్) ఐసీఏడీ(జీడబ్ల్యూడీ): 03 పోస్టులు    

అర్హత: బ్యాచిలర్ డిగ్రీ (మెకానికల్ ఇంజినీరింగ్). 

 7)  ఏఈఈ (సివిల్) టీఆర్‌బీ: 145 పోస్టులు    

అర్హత: బ్యాచిలర్ డిగ్రీ (సివిల్ ఇంజినీరింగ్). 

 8)  ఏఈఈ (ఎలక్ట్రికల్) టీఆర్‌బీ: 13 పోస్టులు    

అర్హత: బ్యాచిలర్ డిగ్రీ (ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్). 

Notification

Also Read:

కేంద్ర కొలువులకు నోటిఫికేషన్ - 69 పోస్టులు, అర్హతల వివరాలు ఇలా!
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సీ) వివిధ సంస్థల్లో పనిచేయుటకు పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలున్నవారు ఆన్‌లైన్ ద్వారా ఏప్రిల్ 13లోగా తమ దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.25 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది. ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..

ఈపీఎఫ్‌వోలో 2674 సోషల్ సెక్యూరిటీ అసిస్టెంట్ పోస్టులు, వివరాలు ఇలా!
న్యూఢిల్లీలోని ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ దేశ వ్యాప్తంగా రెగ్యులర్ ప్రాతిపదికన ఈపీఎఫ్‌వో- రీజియన్ల వారీగా సోషల్ సెక్యూరిటీ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 2674 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు కంప్యూటర్‌లో టైపింగ్ స్పీడ్‌గా చేయగలగాలి. సరైన అర్హతలు గల అభ్యర్థులు ఏప్రిల్ 26 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి.. 

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

IPL 2024:గుజరాత్‌ను చిత్తు చేసిన ఢిల్లీ, తేలిపోయిన గిల్‌  సేన
గుజరాత్‌ను చిత్తు చేసిన ఢిల్లీ, తేలిపోయిన గిల్‌ సేన
2027 నాటికి సంపూర్ణ హిందూ దేశంగా భారత్ - పాకిస్థాన్‌లోనూ హిందూ జెండా ఎగురవేస్తాం: రాజా సింగ్
2027 నాటికి సంపూర్ణ హిందూ దేశంగా భారత్ - పాకిస్థాన్‌లోనూ హిందూ జెండా ఎగురవేస్తాం: రాజా సింగ్
Samsung New Smart TV: కొత్త టీవీలు లాంచ్ చేసిన శాంసంగ్ - వావ్ అనిపించే డిస్‌ప్లేలతో!
కొత్త టీవీలు లాంచ్ చేసిన శాంసంగ్ - వావ్ అనిపించే డిస్‌ప్లేలతో!
Silence 2 Movie Review: ‘సైలెన్స్ 2’ మూవీ రివ్యూ - బార్‌లో షూటౌట్, ట్విస్టులతో మైండ్‌ను మెలితిప్పే సినిమా ఇది, కానీ...
‘సైలెన్స్ 2’ మూవీ రివ్యూ - బార్‌లో షూటౌట్, ట్విస్టులతో మైండ్‌ను మెలితిప్పే సినిమా ఇది, కానీ...
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

Raja Singh Ram Navami Shobha Yatra| శ్రీరామనవమి శోభయాత్రలో ఫుల్ జోష్ లో రాజాసింగ్ | ABP DesamBJP Madhavi Latha vs Akbaruddin Owaisi | శ్రీరామ నవమి శోభయాత్రలో పాల్గొన్న మాధవి లత | ABP DesamTruck Hit Motorcycle In Hyderabad  | బైకును ఢీ కొట్టిన లారీ.. పిచ్చి పట్టినట్లు ఈడ్చుకెళ్లాడు | ABPPerada Tilak vs Ram Mohan Naidu | రామ్మోహన్ నాయుడు ఓడిపోతారు ఇదే కారణమంటున్న పేరాడ తిలక్ |ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IPL 2024:గుజరాత్‌ను చిత్తు చేసిన ఢిల్లీ, తేలిపోయిన గిల్‌  సేన
గుజరాత్‌ను చిత్తు చేసిన ఢిల్లీ, తేలిపోయిన గిల్‌ సేన
2027 నాటికి సంపూర్ణ హిందూ దేశంగా భారత్ - పాకిస్థాన్‌లోనూ హిందూ జెండా ఎగురవేస్తాం: రాజా సింగ్
2027 నాటికి సంపూర్ణ హిందూ దేశంగా భారత్ - పాకిస్థాన్‌లోనూ హిందూ జెండా ఎగురవేస్తాం: రాజా సింగ్
Samsung New Smart TV: కొత్త టీవీలు లాంచ్ చేసిన శాంసంగ్ - వావ్ అనిపించే డిస్‌ప్లేలతో!
కొత్త టీవీలు లాంచ్ చేసిన శాంసంగ్ - వావ్ అనిపించే డిస్‌ప్లేలతో!
Silence 2 Movie Review: ‘సైలెన్స్ 2’ మూవీ రివ్యూ - బార్‌లో షూటౌట్, ట్విస్టులతో మైండ్‌ను మెలితిప్పే సినిమా ఇది, కానీ...
‘సైలెన్స్ 2’ మూవీ రివ్యూ - బార్‌లో షూటౌట్, ట్విస్టులతో మైండ్‌ను మెలితిప్పే సినిమా ఇది, కానీ...
Hyderabad Rains: హైదరాబాద్‌లో పలు చోట్ల భారీ వర్షం, ఒక్కసారిగా పడిపోయిన ఉష్ణోగ్రతలు
Hyderabad Rains: హైదరాబాద్‌లో పలు చోట్ల భారీ వర్షం, ఒక్కసారిగా పడిపోయిన ఉష్ణోగ్రతలు
Contestant Nomination Rules: అభ్యర్థులకు అలర్ట్ - నామినేషన్లు దాఖ‌లు చేసేట‌ప్పుడు ఈ జాగ్రత్తలు తీసుకోవాలి
అభ్యర్థులకు అలర్ట్ - నామినేషన్లు దాఖ‌లు చేసేట‌ప్పుడు ఈ జాగ్రత్తలు తీసుకోవాలి
Jeep Compass New Car: జీప్ కంపాస్ టర్బో పెట్రోల్ ఇంజిన్ వేరియంట్ గ్లోబల్ లాంచ్ - మనదేశంలో ఎప్పుడు?
జీప్ కంపాస్ టర్బో పెట్రోల్ ఇంజిన్ వేరియంట్ గ్లోబల్ లాంచ్ - మనదేశంలో ఎప్పుడు?
UPSC 2023 Ranker Ananya Reddy: కేసీఆర్ అధికారం ఎందుకు కోల్పోయారు? మాక్ ఇంటర్వ్యూలో సివిల్స్ టాపర్ అనన్యా రెడ్డి కీలక వ్యాఖ్యలు
కేసీఆర్ అధికారం ఎందుకు కోల్పోయారు? మాక్ ఇంటర్వ్యూలో సివిల్స్ టాపర్ అనన్యా రెడ్డి కీలక వ్యాఖ్యలు
Embed widget