News
News
వీడియోలు ఆటలు
X

TSPSC Librarian Exam: లైబ్రేరియన్‌ పోస్టుల పరీక్ష ప్రశాంతం, 55 శాతం అభ్యర్థులు హాజరు!

తెలంగాణ ఇంటర్‌ విద్య, సాంకేతిక విద్య కమిషనరేట్ల పరిధిలో లైబ్రేరియన్‌ పోస్టుల భర్తీకి మే 17న నిర్వహించిన రాతపరీక్ష ప్రశాంతంగా ముగిసింది. పరీక్షకు మొత్తం 55 శాతం మంది అభ్యర్థులు హాజరయ్యారు.

FOLLOW US: 
Share:

తెలంగాణ ఇంటర్‌ విద్య, సాంకేతిక విద్య కమిషనరేట్ల పరిధిలో లైబ్రేరియన్‌ పోస్టుల భర్తీకి బుధవారం(మే 17) నిర్వహించిన కంప్యూటర్ ఆధారిత రాతపరీక్ష ప్రశాంతంగా ముగిసింది. పరీక్షకు మొత్తం 55 శాతం మంది అభ్యర్థులు హాజరయ్యారు. మొత్తం 71 పోస్టులకు 4,790 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా.. వీరిలో 3,924 మంది హాల్‌టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకున్నారు. పేర్కొన్నారు. ఉదయం జరిగిన పేపర్‌-1 పరీక్షకు 2,663 మంది (55.59 శాతం), మధ్యాహ్నం జరిగిన పేపర్‌-2కు 2,650 మంది (55.32 శాతం) హాజరయ్యారు.

తెలంగాణలోని ఇంటర్, సాంకేతిక విద్యలో లైబ్రేరియన్ పోస్టుల భర్తీకి టీఎస్‌పీఎస్సీ డిసెంబరు 31 నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. దీనిద్వారా 71 లైబ్రేరియన్ పోస్టులకు భర్తీచేయనున్నారు. వీటిలో ఇంటర్మీడియట్ ఎడ్యకేషన్ పరిధిలో 40 పోస్టులు, టెక్నికల్ ఎడ్యకేషన్ పరిధిలో 31 పోస్టులు ఉన్నాయి. ఏదైనా డిగ్రీతోపాటు సంబంధిత విభాగంలో పీజీ డిగ్రీ అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి జనవరి 21 నుంచి ఫిబ్రవరి 10 వరకు దరఖాస్తులు స్వీకరించింది. తాజాగా పరీక్షకు సంబంధించిన హాల్‌టికెట్లను విడుదల చేసింది.

పోస్టుల వివరాలు..

* లైబ్రేరియన్ పోస్టులు

ఖాళీల సంఖ్య: 71

విభాగాల వారీగా ఖాళీలు: 

1) లైబ్రేరియన్: 40 పోస్టులు

విభాగం: అండర్ ది కంట్రోల్ ఆఫ్ కమిషనర్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యకేషన్.

2) లైబ్రేరియన్: 31 పోస్టులు

విభాగం: అండర్ ది కంట్రోల్ ఆఫ్ కమిషనర్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యకేషన్.

పరీక్ష విధానం: మొత్తం 450 మార్కులకు రాతపరీక్ష నిర్వహిస్తారు. ఇందులో పేపర్-1 (జనరల్ స్టడీస్ & జనరల్ ఎబిలిటీస్): 150 ప్రశ్నలు-150 మార్కులు, పేపర్-2 (లైబ్రరీ & ఇన్‌ఫర్మేషన్ సైన్స్ - ఎంఎల్‌ఐఎస్సీ స్థాయి): 150 ప్రశ్నలు-300 మార్కులు ఉంటాయి. పేపర్-1లో ఒక్కో ప్రశ్నకు ఒకమార్కు, పేపర్-2లో ఒక్కో ప్రశ్నకు 2 మార్కులు ఉంటాయి. పేపర్-1 ప్రశ్నపత్రం ఇంగ్లిష్, తెలుగులోనూ, పేపర్-2 ప్రశ్నపత్రం ఇంగ్లిష్‌లో మాత్రమే ఉంటుంది.

Also Read:

ఇండియన్ నేవీలో 227 ఎస్‌ఎస్‌సీ ఆఫీసర్ ఉద్యోగాలు- అర్హతలివే!
ఇండియన్ నేవల్ అకాడమీ(ఐఎన్ఏ)లో 2024 జనవరి నుంచి ప్రారంభమయ్యే షార్ట్ సర్వీస్ కమిషన్(ఎస్‌ఎస్‌సీ) కోర్సుల్లో ప్రవేశాలకు ఇండియన్ నేవీ నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 227 పోస్టులను భర్తీ చేయనున్నారు. సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్‌, ఎంబీఏ, ఎంసీఏ, పీజీ ఉత్తీర్ణతతో పాటు నిర్దిష్ట శారీరక/ వైద్య ప్రమాణాలు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.  ఈ పోస్టులకు అవివాహిత పురుష, మహిళా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. 
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి.. 

తెలంగాణ జిల్లా కోర్టుల్లో 144 టైపిస్ట్‌ ఉద్యోగాలు, ఎంపికైతే రూ.72 వేల వరకు జీతం!
తెలంగాణ హైకోర్టు రాష్ట్రంలోని వివిధ కోర్టుల్లో ఖాళీగా ఉన్న టైపిస్ట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా 144 టైపిస్ట్ పోస్టులను భర్తీ చేయనున్నారు. డిగ్రీ అర్హతతోపాటు ఇంగ్లిష్ టైపింగ్ అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఈ పోస్టుల భర్తీకి మే 25 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకానుంది. జూన్ 15 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. టైపింగ్ టెస్ట్ ఆధారంగా ఉద్యోగ ఎంపికలు చేపడతారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..

Published at : 17 May 2023 11:43 PM (IST) Tags: TSPSC Exams TSPSC Librarian Posts Librarian Posts in Telangana Librarian Posts TSPSC Librarian Exam TSPSC Librarian Recruitment Exam

సంబంధిత కథనాలు

UGC-NET: జూన్‌ 13 నుంచి యూజీసీ నెట్‌ పరీక్షలు, పూర్తి షెడ్యూలు ఇలా!

UGC-NET: జూన్‌ 13 నుంచి యూజీసీ నెట్‌ పరీక్షలు, పూర్తి షెడ్యూలు ఇలా!

BEL Recruitment: బెల్‌లో 205 ట్రెయినీ, ప్రాజెక్ట్‌ ఇంజినీర్‌ పోస్టులు, వివరాలు ఇలా!

BEL Recruitment: బెల్‌లో 205 ట్రెయినీ, ప్రాజెక్ట్‌ ఇంజినీర్‌ పోస్టులు, వివరాలు ఇలా!

BEL Jobs: బీఈఎల్‌లో ప్రొబేషనరీ, సీనియర్ ఇంజినీర్‌ పోస్టులు, అర్హతలివే!

BEL Jobs: బీఈఎల్‌లో ప్రొబేషనరీ, సీనియర్ ఇంజినీర్‌ పోస్టులు, అర్హతలివే!

AP KGBV: కేజీబీవీల్లో 1,358 పోస్టుల దరఖాస్తుకు జూన్ 8 వరకు అవకాశం!

AP KGBV: కేజీబీవీల్లో 1,358  పోస్టుల దరఖాస్తుకు జూన్ 8 వరకు అవకాశం!

GDS Recruitment: 12,828 పోస్టాఫీసు ఉద్యోగాల దరఖాస్తుకు ఇక నాలుగు రోజులే గడువు, వివరాలు ఇలా!

GDS Recruitment: 12,828 పోస్టాఫీసు ఉద్యోగాల దరఖాస్తుకు ఇక నాలుగు రోజులే గడువు, వివరాలు ఇలా!

టాప్ స్టోరీస్

Sharwanand: సీఎం కేసీఆర్‌ను కలిసిన శర్వానంద్ - వెడ్డింగ్ రిసెప్షన్‌కు ఆహ్వానం

Sharwanand: సీఎం కేసీఆర్‌ను కలిసిన శర్వానంద్ - వెడ్డింగ్ రిసెప్షన్‌కు ఆహ్వానం

Ambati Rayudu : జగన్ ను కలిసిన అంబటి రాయుడు - వైసీపీలో చేరికకు ముహుర్తం ఖరారైనట్లేనా ?

Ambati Rayudu :  జగన్ ను కలిసిన అంబటి రాయుడు - వైసీపీలో చేరికకు ముహుర్తం ఖరారైనట్లేనా ?

CM Jagan Review: ప్రతి మండలానికి 2 జూనియర్ కాలేజీలు ఉండాల్సిందే - అధికారులకు సీఎం జగన్ ఆదేశాలు

CM Jagan Review: ప్రతి మండలానికి 2 జూనియర్ కాలేజీలు ఉండాల్సిందే - అధికారులకు సీఎం జగన్ ఆదేశాలు

Durgam Chinnaiah: బీఆర్ఎస్ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యకు షాక్! మహిళా కమిషన్ కీలక ఆదేశం

Durgam Chinnaiah: బీఆర్ఎస్ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యకు షాక్! మహిళా కమిషన్ కీలక ఆదేశం