News
News
వీడియోలు ఆటలు
X

TS High Court Jobs: తెలంగాణ జిల్లా కోర్టుల్లో 144 టైపిస్ట్‌ ఉద్యోగాలు, ఎంపికైతే రూ.72 వేల వరకు జీతం!

ఈ పోస్టుల భర్తీకి మే 25 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకానుంది. జూన్ 15 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. టైపింగ్ టెస్ట్ ఆధారంగా ఉద్యోగ ఎంపికలు చేపడతారు.

FOLLOW US: 
Share:

తెలంగాణ హైకోర్టు రాష్ట్రంలోని వివిధ కోర్టుల్లో ఖాళీగా ఉన్న టైపిస్ట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా 144 టైపిస్ట్ పోస్టులను భర్తీ చేయనున్నారు. డిగ్రీ అర్హతతోపాటు ఇంగ్లిష్ టైపింగ్ అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఈ పోస్టుల భర్తీకి మే 25 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకానుంది. జూన్ 15 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. టైపింగ్ టెస్ట్ ఆధారంగా ఉద్యోగ ఎంపికలు చేపడతారు.

వివరాలు...

* టైపిస్ట్‌ పోస్టులు..

ఖాళీల సంఖ్య: 144.

జిల్లాలవారీగా ఖాళీల వివరాలు..
ఆదిలాబాద్-02, భద్రాద్రి కొత్తగూడెం-09, హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు-13, సిటీ స్మాల్ కాసెస్ కోర్టు-హైదరాబాద్-02, హనుమకొండ-02, జగిత్యాల-09, జనగామ-03, జయశంకర్ భూపాలపల్లి-04, జోగుళాంబ గద్వాల-02, కామారెడ్డి-04, ఖమ్మం-04, కుమరంభీమ్ ఆసిఫాబాద్-03, మహబూబాబాద్-02, మంచిర్యాల-01, మేడ్చల్-మల్కాజ్‌గిరి-10, మెదక్-03, ములుగు-02, నాగర్‌కర్నూలు-03, నారాయణపేట-05, నిర్మల్-03, నిజామాబాద్-09, పెద్దపల్లి-05, రంగారెడ్డి-19, సంగారెడ్డి-01, సిద్ధిపేట-05, సూర్యాపేట-06, వికారాబాద్-04, వనపర్తి-04, వరంగల్-01, యాదాద్రి-భువనగిరి-04.  

అర్హత: బ్యాచిలర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. ఇంగ్లిష్‌ టైప్‌రైటింగ్‌లో అర్హత సాధించాలి. 

వయోపరిమితి: 01.07.2023 నాటికి 18-34 సంవత్సరాల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, దివ్యాంగులకు 10 సంవత్సరాలపాటు వయోసడలింపు వర్తిస్తుంది.

దరఖాస్తు ఫీజు: రూ.600. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు రూ.400 చెల్లిస్తే సరిపోతుంది.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఎంపిక విధానం: ఇంగ్లిష్‌ టైప్‌రైటింగ్‌ టెస్ట్‌(స్కిల్‌ టెస్ట్‌) ఆధారంగా ఎంపిక ఉంటుంది. 100 మార్కులకు నిర్వహించే ఈ టైపింగ్ పరీక్షను 10 నిమిషాల్లో పూర్తిచేయాల్సి ఉంటుంది. ఇంగ్లిష్‌లో నిమిషానికి 45 పదాలు టైప్‌ చేయగలగాలి. కనీస అర్హత మార్కులను ఓసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 40 శాతంగా, బీసీ అభ్యర్థులకు 35 శాతంగా, ఎస్సీ-ఎస్టీ-దివ్యాంగ అభ్యర్థులకు 30 శాతంగా నిర్ణయించారు. హైకోర్టులో ఇప్పటికే పనిచేస్తున్నవారికి వెయిటేజీ వర్తిస్తుంది. 

జీతభత్యాలు: నెలకు రూ.24,280-రూ.72,850 చెల్లిస్తారు.

ముఖ్యమైన తేదీలు...

➥ నోటిఫికేషన్ వెల్లడి: 12.05.2023.

➥ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 25.05.2023.

➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 15.06.2023.

➥ పరీక్ష హాల్‌టికెట్ల వెల్లడి: ప్రకటించాల్సి ఉంది.

➥  స్కిల్‌ టెస్ట్‌ తేది: 2023, జులై.

Notification

Website

ALso Read:

షిల్లాంగ్‌ నైగ్రిమ్స్‌లో 42 సీనియర్‌ రెసిడెంట్ పోస్టులు- వివరాలు ఇలా!
షిల్లాంగ్‌లోని నార్త్ఈస్టర్న్ ఇందిరాగాంధీ రీజినల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ మెడికల్ సైన్సెస్(నైగ్రిమ్స్) ఖాళీగా ఉన్న సీనియర్ రెసిడెంట్ పోస్టుల కోసం వాక్-ఇన్ ఇంటర్వ్యూలను నిర్వహిస్తోంది. దీనిద్వారా మొత్తం 42 పోస్టులను భర్తీ చేయనున్నారు. సంబంధిత స్పెషలైజేషన్‌లో పీజీ డిగ్రీ/ పీజీ డిప్లొమా ఉత్తీర్ణత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు మే 11 నుంచి 26 వరకు ఇంటర్వ్యూకు హాజరు కావాల్సి ఉంటుంది. 
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..

ఇండియన్ నేవీలో 227 ఎస్‌ఎస్‌సీ ఆఫీసర్ ఉద్యోగాలు- అర్హతలివే!
ఇండియన్ నేవల్ అకాడమీ(ఐఎన్ఏ)లో 2024 జనవరి నుంచి ప్రారంభమయ్యే షార్ట్ సర్వీస్ కమిషన్(ఎస్‌ఎస్‌సీ) కోర్సుల్లో ప్రవేశాలకు ఇండియన్ నేవీ నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 227 పోస్టులను భర్తీ చేయనున్నారు. సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్‌, ఎంబీఏ, ఎంసీఏ, పీజీ ఉత్తీర్ణతతో పాటు నిర్దిష్ట శారీరక/ వైద్య ప్రమాణాలు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.  ఈ పోస్టులకు అవివాహిత పురుష, మహిళా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. 
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..

Published at : 15 May 2023 11:26 PM (IST) Tags: TS High Court Jobs TS High Court Notification TS High Court Recruitment 2023 TS High Court Typist Jobs TS High Court Typist Notification

సంబంధిత కథనాలు

APPSC Group1 Mains: జూన్‌ 3 నుంచి 'గ్రూప్‌-1' మెయిన్స్ పరీక్షలు! హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకున్నారా?

APPSC Group1 Mains: జూన్‌ 3 నుంచి 'గ్రూప్‌-1' మెయిన్స్ పరీక్షలు! హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకున్నారా?

IBPS RRB XII Recruitment 2023: ఐబీపీఎస్ ఆర్‌ఆర్‌బీ నోటిఫికేషన్ విడుదల - ప్రిలిమ్స్, మెయిన్స్ పరీక్షలు ఎప్పుడంటే?

IBPS RRB XII Recruitment 2023: ఐబీపీఎస్ ఆర్‌ఆర్‌బీ నోటిఫికేషన్ విడుదల - ప్రిలిమ్స్, మెయిన్స్ పరీక్షలు ఎప్పుడంటే?

TSPSC Paper Leak Case: మరో 13 మంది అభ్యర్థులకు టీఎస్ పీఎస్సీ షాక్, జీవితాంతం ఎగ్జామ్ రాయకుండా డీబార్

TSPSC Paper Leak Case: మరో 13 మంది అభ్యర్థులకు టీఎస్ పీఎస్సీ షాక్,  జీవితాంతం ఎగ్జామ్ రాయకుండా డీబార్

APKGBV Notification: ఏపీ సమగ్ర శిక్షా సొసైటీలో 1,358 టీచింగ్‌ పోస్టులు - దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం!

APKGBV Notification: ఏపీ సమగ్ర శిక్షా సొసైటీలో 1,358 టీచింగ్‌ పోస్టులు - దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం!

IGCAR: కల్పక్కం ఐజీసీఏఆర్‌లో 100 జూనియర్‌ రిసెర్చ్‌ ఫెలోషిప్‌ పోస్టులు

IGCAR: కల్పక్కం ఐజీసీఏఆర్‌లో 100 జూనియర్‌ రిసెర్చ్‌ ఫెలోషిప్‌ పోస్టులు

టాప్ స్టోరీస్

Margadarsi Case: మార్గదర్శి కేసు: సీఐడీ లుక్‌అవుట్ నోటీసులపై హైకోర్టుకు శైలజా కిరణ్

Margadarsi Case: మార్గదర్శి కేసు: సీఐడీ లుక్‌అవుట్ నోటీసులపై హైకోర్టుకు శైలజా కిరణ్

Khairatabad Ganesh : ఖైరతాబాద్ గణేష్ విగ్రహం అంకురార్పణ - ఈ ఏడాది ఎన్ని అడుగులంటే ?

Khairatabad Ganesh : ఖైరతాబాద్ గణేష్ విగ్రహం అంకురార్పణ - ఈ ఏడాది ఎన్ని అడుగులంటే ?

Ugram OTT Release: ఓటీటీలోకి అల్లరి నరేష్ ‘ఉగ్రం’ - స్ట్రీమింగ్ డేట్ ఇదే!

Ugram OTT Release: ఓటీటీలోకి అల్లరి నరేష్ ‘ఉగ్రం’ - స్ట్రీమింగ్ డేట్ ఇదే!

Kishan Reddy : కేంద్రం తరపున తెలంగాణ ఆవిర్భావ వేడుకలు - ఇతర రాష్ట్రాల్లోనూ చేస్తున్నామన్న కిషన్ రెడ్డి !

Kishan Reddy : కేంద్రం తరపున తెలంగాణ ఆవిర్భావ వేడుకలు - ఇతర రాష్ట్రాల్లోనూ చేస్తున్నామన్న కిషన్ రెడ్డి !