1,442 అసిస్టెంట్ ప్రొఫెసర్ల ఎంపిక జాబితా విడుదల, త్వరలో కౌన్సెలింగ్ షెడ్యూలు!
వైద్యారోగ్య శాఖలో 1,442 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను తెలంగాణ మెడికల్ అండ్ హెల్త్ రిక్రూట్‌మెంట్ బోర్డు మే 8న విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో అందబాటులో ఉంచింది.
వైద్యారోగ్య శాఖలో 1,442 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను తెలంగాణ మెడికల్ అండ్ హెల్త్ రిక్రూట్‌మెంట్ బోర్డు మే 8న విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో జాబితాను అందబాటులో ఉంచింది. డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ పరిధిలోని 34 స్పెషాలిటీ విభాగాల్లో వీరు ఎంపికయ్యారు. మెరిట్ ఆధారంగా కౌన్సెలింగ్ నిర్వహించి, కొత్తగా ప్రారంభమైన మెడికల్ కాలేజీల్లో అభ్యర్థులు కోరుకున్న చోట నియామక ఉత్తర్వులు పొందనున్నారు. భర్తీ ప్రక్రియను కేవలం 5 నెలల రికార్డు సమయంలోనే విజయవంతంగా పూర్తిచేసిన బోర్డును ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు అభినందించారు. పూర్తి పారదర్శకంగా ప్రక్రియ నిర్వహించి, ఎప్పటికప్పుడు అభ్యర్థుల నుంచి అభ్యంతరాలను స్వీకరిస్తూ, ఎలాంటి సమస్యలు రాకుండా చూసుకుంటూ, అర్హులు ఉద్యోగ అవకాశాలు పొందేలా చేయడం గొప్ప విషయం అన్నారు.
ప్రభుత్వ ఆసుపత్రుల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్లుగా ఎంపికైన వైద్యులకు మంత్రి హరీశ్‌రావు శుభాకాంక్షలు తెలిపారు. జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయాలన్న సీఎం కేసీఆర్ నిర్ణయంతో రాష్ట్రంలో వైద్య విద్య అవకాశాలు పెరిగి, సూపర్ స్పెషాలిటీ సేవలు మారుమూల ప్రాంతానికి సైతం చేరువ అయ్యాయని మంత్రి పేర్కొన్నారు. ఈ క్రమంలో అవసరమైన వైద్య సిబ్బంది భర్తీని ప్రభుత్వం ప్రారంభించి, విజయవంతంగా పూర్తి చేస్తున్నట్లు తెలిపారు. ఒకవైపు వైద్యుల భర్తీతో పాటు, మరోవైపు 5,204 స్టాఫ్ నర్సుల పోస్టుల భర్తీని మొదలు పెట్టినట్లు చెప్పారు. అత్యంత పారదర్శకంగా, పకడ్బందీగా స్టాఫ్ నర్సు నియామక ప్రక్రియ పూర్తి చేసేందుకు ఆన్‌లైన్ (కంప్యూటర్ బేస్డ్ టెస్ట్) ద్వారా పరీక్ష నిర్వహిస్తున్నట్లు చెప్పారు.
తాజాగా ఎంపికైన అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకంతో కొత్తగా ఏర్పడ్డ మెడికల్ కాలేజీల్లోని, ఆయా విభాగాల్లో అందించే వైద్య సేవలు మరింత మెరుగుకానున్నాయి. రెండు వారాల్లోగా కౌన్సెలింగ్ ప్రక్రియ పూర్తి చేసి, నియామక ఉత్తర్వులు అందించి, విధుల్లో చేరే విధంగా చర్యలు తీసుకోవాలని మంత్రి డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్‌ను ఆదేశించారు. వైద్యారోగ్య శాఖలో భాగస్వామ్యం అవుతున్న వైద్య సిబ్బంది, ముఖ్యమంత్రి కేసీఆర్ మార్గనిర్దేశనంలో ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించి, ఆరోగ్య తెలంగాణను సాకారం చేసేందుకు అంకితభావంతో, సేవాభావంతో కృషి చేయాలని, మంచి వైద్య సేవలు అందించి ప్రజల మన్ననలు పొందాలని మంత్రి ఆకాంక్షించారు.
అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల తుది మెరిట్ జాబితా, సబ్జెక్టులవారీగా ఎంపిక జాబితా కోసం క్లిక్ చేయండి..
Great News! MHSRB has released a selection list for 1,442 Assistant Professor posts in 34 specialties for appointment into new Government Medical colleges under @DMETelangana, as part of Hon'ble #CMKCR Garu's vision of one medical college in each district towards…
— Harish Rao Thanneeru (@BRSHarish) May 8, 2023
Also Read:
పాలిటెక్నిక్ లెక్చరర్, పీడీ పోస్టుల రాతపరీక్షల తేదీల్లో మార్పులు, కొత్త షెడ్యూలు ఇదే!
తెలంగాణలోని పాలిటెక్నిక్ కళాశాలల్లో లెక్చరర్లు, సాంకేతిక, ఇంటర్మీడియట్ విద్యలో ఫిజికల్ డైరెక్టర్ పోస్టుల భర్తీకి మే నెలలో నిర్వహించనున్న రాతపరీక్షల తేదీల్లో టీఎస్‌పీఎస్సీ మార్పులు చేసింది. ఈ పరీక్షలను కంప్యూటర్ ఆధారితంగా (సీబీఆర్‌టీ) సెప్టెంబరు 4, 5, 6, 8, 11 తేదీల్లో సంబంధిత సబ్జెక్టుల వారీగా నిర్వహించనున్నట్లు వెల్లడించింది. ఈమేరకు కమిషన్ పరీక్షల షెడ్యూలు జారీ చేసింది. పాలిటెక్నిక్ కళాశాలలో 247 లెక్చరర్ పోస్టులకు సాంకేతిక, ఇంటర్ విద్యలో 128 ఫిజికల్ డైరెక్టర్ పోస్టులకు ఓఎంఆర్ విధానంలో పరీక్ష నిర్వహించనున్నట్లు తొలుత కమిషన్ తెలిపింది. ప్రశ్నపత్రాల లీకేజీ అనంతరం సాధ్యమైనన్ని పరీక్షలను కంప్యూటర్ ఆధారిత (సీబీఆర్‌టీ) విధానంలో నిర్వహించాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో ఆయా పోస్టులకు సీబీఆర్‌టీ పరీక్షలకు కొత్త షెడ్యూల్‌ను వెల్లడించింది.
పూర్తి షెడ్యూలు కోసం క్లిక్ చేయండి..