By: ABP Desam | Updated at : 07 May 2023 06:04 PM (IST)
Edited By: omeprakash
టీఎస్పీఎస్సీ పరీక్షలు
తెలంగాణలోని పాలిటెక్నిక్ కళాశాలల్లో లెక్చరర్లు, సాంకేతిక, ఇంటర్మీడియట్ విద్యలో ఫిజికల్ డైరెక్టర్ పోస్టుల భర్తీకి మే నెలలో నిర్వహించనున్న రాతపరీక్షల తేదీల్లో టీఎస్‌పీఎస్సీ మార్పులు చేసింది. ఈ పరీక్షలను కంప్యూటర్ ఆధారితంగా (సీబీఆర్‌టీ) సెప్టెంబరు 4, 5, 6, 8, 11 తేదీల్లో సంబంధిత సబ్జెక్టుల వారీగా నిర్వహించనున్నట్లు వెల్లడించింది. ఈమేరకు కమిషన్ పరీక్షల షెడ్యూలు జారీ చేసింది.
పాలిటెక్నిక్ కళాశాలలో 247 లెక్చరర్ పోస్టులకు సాంకేతిక, ఇంటర్ విద్యలో 128 ఫిజికల్ డైరెక్టర్ పోస్టులకు ఓఎంఆర్ విధానంలో పరీక్ష నిర్వహించనున్నట్లు తొలుత కమిషన్ తెలిపింది. ప్రశ్నపత్రాల లీకేజీ అనంతరం సాధ్యమైనన్ని పరీక్షలను కంప్యూటర్ ఆధారిత (సీబీఆర్‌టీ) విధానంలో నిర్వహించాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో ఆయా పోస్టులకు సీబీఆర్‌టీ పరీక్షలకు కొత్త షెడ్యూల్‌ను వెల్లడించింది.
➥ పాలిటెక్నికల్ లెక్చరర్ పోస్టుల పరీక్షల కొత్త షెడ్యూలు..
సెప్టెంబరు 4:
ఉదయం: పేపర్-1 జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్.
మధ్యాహ్నం: పేపర్-2 సివిల్ ఇంజినీరింగ్, టన్నరీ, జియాలజీ, ఫిజిక్స్
సెప్టెంబరు 5:
ఉదయం: పేపర్-1 జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్
మధ్యాహ్నం: పేపర్-2 మెకానికల్ ఇంజినీరింగ్, కెమిస్ట్రీ, ప్యాకేజింగ్ టెక్నాలజీ, ఆర్కిటెక్చర్ ఇంజినీరింగ్.
సెప్టెంబరు 6:
ఉదయం: పేపర్-1 జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్.
మధ్యాహ్నం: పేపర్-2 ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్, ఫుట్‌వేర్ టెక్నాలజీ, లెటర్ ప్రెస్ (ప్రింటింగ్ టెక్నాలజీ), మెటలర్జరీ, ఫార్మసీ, ఎలక్ట్రికల్ అండ్ ఇన్‌స్ట్రుమెంటేషన్ ఇంజినీరింగ్.
సెప్టెంబరు 8:
ఉదయం: పేపర్-1 జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్.
మధ్యాహ్నం: పేపర్-2 ఎలక్ట్రికల్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్, ఆటోమొబైల్ ఇంజినీరింగ్, బయోమెడికల్ ఇంజినీరింగ్, టెక్స్‌టైల్ ఇంజినీరింగ్, కెమికల్ ఇంజినీరింగ్.
➥ ఫిజికల్ డైరెక్టర్ల పరీక్ష కొత్త షెడ్యూలు..
ఉదయం: పేపర్-1 జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్.
మధ్యాహ్నం: పేపర్-2 ఫిజికల్ ఎడ్యుకేషన్.
పాలిటెక్నిక్ కాలేజీల్లో 247 లెక్చరర్ పోస్టుల వివరాలు..
తెలంగాణలోని పాలిటెక్నిక్ కాలేజీల్లో ఖాళీగా ఉన్న లెక్చరర్ పోస్టుల భర్తీకి టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. దీనిద్వారా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీల్లో మొత్తం 247 పోస్టులను భర్తీ చేయనున్నారు. 19 సబ్జెక్టుల్లో ఈ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. సరైన అర్హతలు గల అభ్యర్థుల నుంచి డిసెంబర్ 14 నుంచి జనవరి 4 వరకు దరఖాస్తులు స్వీకరించారు. కంప్యూటర్ ఆధారిత రాతపరీక్షల ద్వారా పోస్టులను భర్తీ చేయనున్నారు.
పాలిటెక్నిక్ పోస్టుల పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి...
ఫిజికల్ డైరెక్టర్ పోస్టుల వివరాలు..
తెలంగాణ రాష్ట్ర కమిషనర్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్, కమిషనర్ ఆఫ్ ఇంటర్మీడియేట్ ఎడ్యుకేషన్ విభాగాల్లో ఫిజికల్ డైరెక్టర్ ఉద్యోగాల భర్తీకి టీఎస్‌పీఎస్సీ డిసెంబరు 28న నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. దీనిద్వారా మొత్తం 128 ఫిజికల్ డైరెక్టర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. అగ్రికల్చర్ బీఎస్సీ అర్హత ఉన్నవారి నుంచి దరఖాస్తులు స్వీకరించారు. ఈ పోస్టుల భర్తీకి జనవరి 6 నుంచి 27 వరకు దరఖాస్తులు స్వీకరించారు. రాతపరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపికచేస్తారు.
ఫిజికల్ డైరెక్టర్ పోస్టుల పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
TS Police DV: పోలీసు అభ్యర్థులకు అలర్ట్, సర్టిఫికేట్ వెరిఫికేషన్ తేదీలు ఖరారు! ఇవి తప్పనిసరి!
WCDSCD Sangareddy: సంగారెడ్డి జిల్లా చైల్డ్ హెల్ప్లైన్లో ఉద్యోగాలు, అర్హతలివే!
WCDSCD Yadadri Bhuvanagiri District: యాదాద్రి భువనగిరి జిల్లా చైల్డ్ హెల్ప్లైన్లో ఉద్యోగాలు, వివరాలు ఇలా!
Group 1 Exam: 'గ్రూప్-1' ప్రిలిమ్స్ పరీక్ష వాయిదాపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు, ఏమందంటే?
WDCWD: విశాఖపట్నం జిల్లాలో 34 అంగన్వాడీ పోస్టులు, వివరాలు ఇలా!
KCR Good News: దివ్యాంగులకు సీఎం కేసీఆర్ తీపి కబురు - వచ్చే నెల నుంచే అమలు
Varun Tej, Lavanya Engagement: తన ‘లవ్’తో వరుణ్ తేజ్ ఎంగేజ్మెంట్ - ఇవిగో ఫొటోలు
Apsara Murder Case Update : అప్సర హత్య వెనుక ఇన్ని కోణాలున్నాయా ? - మర్డర్ మిస్టరీలో పోలీసులు చెప్పిన సంచలన విషయాలు !
KCR in Mancherial: ఆ రెండు ఘటనలతో కోలుకోలేని దెబ్బ తిన్నాం, అయినా నెంబర్ 1గా నిలిచాం - కేసీఆర్