News
News
వీడియోలు ఆటలు
X

TSLPRB: ఎస్‌ఐ, ఏఎస్‌ఐ ప్రిలిమినరీ 'కీ' విడుదల! అభ్యంతరాలకు అవకాశం!

ఎస్‌ఐ , ఏఎస్‌ఐ పోస్టులకు సంబంధించిన రాత పరీక్షల ఫలితాల ‘కీ’ ని పోలీసు నియామక మండలి ఏప్రిల్ 15న విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో ఆన్సర్ కీని అందుబాటులో ఉంచింది.

FOLLOW US: 
Share:

తెలంగాణ స్టేట్‌ లెవల్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు ఇటీవల నిర్వహించిన ఎస్‌ఐ (సివిల్‌, ఐటీ అండ్‌ సీఓ, పీటీఓ) తత్సమాన పోస్టులు, ఏఎస్‌ఐ పోస్టులకు సంబంధించిన రాత పరీక్షల ఫలితాల ‘కీ’ ని పోలీసు నియామక మండలి ఏప్రిల్ 15న విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో ఆన్సర్ కీని అందుబాటులో ఉంచింది. పరీక్షలకు హాజరైన అభ్యర్థులు వెబ్‌సైట్‌లో ఆన్సర్ కీలను చూసుకోవచ్చు. అయితే ప్రస్తుతానికి ఇంగ్లిష్‌, తెలుగు, ఉర్దూ పరీక్షలకు సంబంధించిన ప్రిలిమినరీ కీని వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. మిగతా పేపర్లకు సంబంధించిన ప్రిలిమినరీ కీ వివరాలను త్వరలోనే వెల్లడించనున్నట్లు ప్రకటలో తెలిపారు. ఫైనల్‌ కీని విడుదల చేసిన తర్వాత అభ్యర్థుల ఓఎమ్మార్‌ షీట్‌ను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనున్నారు.

SCT SI Civil and / or Equivalent:

➥ Preliminary Key of FWE Language Papers Part-A 

 Apply for Preliminary Key objections on FWE Language Papers Part-A

SCT SI IT & CO / SI PTO / ASI FPB:

➥  Preliminary Key of FWE Language Papers Part-A 

 Apply for Preliminary Key objections on FWE Language Papers Part-A 

అభ్యంతరాలకు అవకాశం..

ప్రిలిమినరీ ఆన్సర్ కీపై ఏమైనా అభ్యంతరాలు తెలిపేందుకు అవకాశం కల్పించారు. అభ్యర్థుల నుంచి ఏప్రిల్ 15న సాయంత్రం 5 గంటల నుంచి 17 వరకు వెబ్‌సైట్‌ ద్వారా స్వీకరించనున్నారు. అభ్యర్థులు తమ అభ్యంతరాలను డాక్యుమెంట్‌, పీడీఎఫ్‌, జేపీజీ రూపంలో వెబ్‌సైట్‌లో సమర్పించాల్సి ఉంటుంది. మరే ఇతర విధానాల్లో అభ్యంతరాలు స్వీకరించరు. అభ్యంతరాల నమోదుకు సంబంధించిన ప్రొఫార్మాను తమ వ్యక్తిగత లాగిన్‌లో అందుబాటులో ఉంచారు. అభ్యర్థులు తమ మొబైల్ నెంబరు, పాస్‌వర్డ్ వివరాలు నమోదుచేసి వివరాలు తెలుసుకోవచ్చు. ఫైనల్‌ కీని విడుదల చేసిన తర్వాత అభ్యర్థుల ఓఎమ్మార్‌ షీట్‌ను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనున్నారు. 

ఏప్రిల్ 8, 9 తేదీల్లో ఆర్థమెటిక్స్‌, మెంటల్‌ ఎబిలిటీ, ఇంగ్లిష్‌, జనరల్‌ స్టడీస్‌, తెలుగు, ఉర్దూ, రెండు నాన్‌ టెక్నికల్‌ పేపర్లకు సంబంధించిన పరీక్షలను మూడు జిల్లాల్లో 81 పరీక్షా కేంద్రాల్లో నిర్వహించిన విషయం తెలిసిందే.

Also Read:

తెలంగాణ గురుకులాల్లో 9,231 ఉద్యోగాలు, పూర్తి వివరాలు ఇలా!
తెలంగాణ గురుకులాల్లో 9,231 ఉద్యోగాల భర్తీకి ఏప్రిల్ 6న నోటిఫికేషన్లు వెలువడిన సంగతి తెలిసిందే.  విడుదలైంది. ఈ మేరకు గురుకుల విద్యా సంస్థల నియామక బోర్డు మొత్తం 9 నోటిఫికేషన్లు జారీ చేసింది. గురుకులాల్లో ఖాళీలకు సంబంధించి అత్యధికంగా టీజీటీ పోస్టులు 4020 ఉన్నాయి. ఆ తర్వాత అత్యధికంగా జూనియర్ కళాశాలల్లో 2008 లెక్చరర్ పోస్టులు, ఫిజికల్ డైరెక్టర్, లైబ్రేరియన్ పోస్టులు ఉన్నాయి. ఇక  గురుకుల పాఠశాలల్లో 1276 పీజీటీ పోస్టులు ఉన్నాయి. వీటి తర్వాత డిగ్రీ కాలేజీల్లో 868 డీఎల్, ఫిజికల్ డైరెక్టర్, లైబ్రేరియన్  పోస్టులు ఉన్నాయి. వీటితోపాటు 434 లైబ్రేరియన్ పోస్టులు, 275 ఫిజికల్ డైరెక్టర్ పోస్టులు, 134 ఆర్ట్స్ టీచర్ పోస్టులు, 92 క్రాఫ్ట్ టీచర్ పోస్టులు, 124 మ్యూజిక్ టీచర్ పోస్టులు ఉన్నాయి.
నోటిఫికేషన్లు, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..

సీజీఎల్ఈ-2023 నోటిఫికేషన్ వచ్చేసింది, ఈ సారి 7500 వరకు ఖాళీల భర్తీ - దరఖాస్తు ప్రారంభం!
కేంద్ర ప్రభుత్వంలోని వివిధ విభాగాల్లో గ్రూప్-బి, గ్రూప్-సి పోస్టుల భర్తీకి నిర్వహించే 'కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవల్ ఎగ్జామినేషన్‌-2023' నోటిఫికేషన్‌ను స్థాఫ్ సెలక్షన్ కమిషన్ విడుదల చేసింది. దీనిద్వారా దాదాపు 7500 ఖాళీలను భర్తీ చేయనున్నారు. అవసరాలకు అనుగుణంగా పోస్టుల సంఖ్య పెరిగే అవకాశమూ ఉంది. ఏదైనా డిగ్రీ అర్హత ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. పోస్టులవారీగా అదనపు విద్యార్హతలు నిర్ణయించారు. అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఏప్రిల్ 3 నుంచి మే 3 వరకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగనుంది. రెండంచెల (టైర్-1,టైర్-2) పరీక్షల ద్వారా అభ్యర్థులను ఎంపికచేస్తారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి.. 

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...

Published at : 15 Apr 2023 10:32 AM (IST) Tags: SI Answer Key ASI Answer Key TS Police Final Exams TSLPRB Answer Keys Police Exams Answer Keys

సంబంధిత కథనాలు

UGC-NET: జూన్‌ 13 నుంచి యూజీసీ నెట్‌ పరీక్షలు, పూర్తి షెడ్యూలు ఇలా!

UGC-NET: జూన్‌ 13 నుంచి యూజీసీ నెట్‌ పరీక్షలు, పూర్తి షెడ్యూలు ఇలా!

BEL Recruitment: బెల్‌లో 205 ట్రెయినీ, ప్రాజెక్ట్‌ ఇంజినీర్‌ పోస్టులు, వివరాలు ఇలా!

BEL Recruitment: బెల్‌లో 205 ట్రెయినీ, ప్రాజెక్ట్‌ ఇంజినీర్‌ పోస్టులు, వివరాలు ఇలా!

BEL Jobs: బీఈఎల్‌లో ప్రొబేషనరీ, సీనియర్ ఇంజినీర్‌ పోస్టులు, అర్హతలివే!

BEL Jobs: బీఈఎల్‌లో ప్రొబేషనరీ, సీనియర్ ఇంజినీర్‌ పోస్టులు, అర్హతలివే!

AP KGBV: కేజీబీవీల్లో 1,358 పోస్టుల దరఖాస్తుకు జూన్ 8 వరకు అవకాశం!

AP KGBV: కేజీబీవీల్లో 1,358  పోస్టుల దరఖాస్తుకు జూన్ 8 వరకు అవకాశం!

GDS Recruitment: 12,828 పోస్టాఫీసు ఉద్యోగాల దరఖాస్తుకు ఇక నాలుగు రోజులే గడువు, వివరాలు ఇలా!

GDS Recruitment: 12,828 పోస్టాఫీసు ఉద్యోగాల దరఖాస్తుకు ఇక నాలుగు రోజులే గడువు, వివరాలు ఇలా!

టాప్ స్టోరీస్

Sharwanand: సీఎం కేసీఆర్‌ను కలిసిన శర్వానంద్ - వెడ్డింగ్ రిసెప్షన్‌కు ఆహ్వానం

Sharwanand: సీఎం కేసీఆర్‌ను కలిసిన శర్వానంద్ - వెడ్డింగ్ రిసెప్షన్‌కు ఆహ్వానం

Ambati Rayudu : జగన్ ను కలిసిన అంబటి రాయుడు - వైసీపీలో చేరికకు ముహుర్తం ఖరారైనట్లేనా ?

Ambati Rayudu :  జగన్ ను కలిసిన అంబటి రాయుడు - వైసీపీలో చేరికకు ముహుర్తం ఖరారైనట్లేనా ?

CM Jagan Review: ప్రతి మండలానికి 2 జూనియర్ కాలేజీలు ఉండాల్సిందే - అధికారులకు సీఎం జగన్ ఆదేశాలు

CM Jagan Review: ప్రతి మండలానికి 2 జూనియర్ కాలేజీలు ఉండాల్సిందే - అధికారులకు సీఎం జగన్ ఆదేశాలు

Durgam Chinnaiah: బీఆర్ఎస్ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యకు షాక్! మహిళా కమిషన్ కీలక ఆదేశం

Durgam Chinnaiah: బీఆర్ఎస్ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యకు షాక్! మహిళా కమిషన్ కీలక ఆదేశం