TS Police: కానిస్టేబుల్ పరీక్ష హాల్‌టికెట్లు వచ్చేశాయ్, ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి!
కానిస్టేబుల్ ప్రిలిమినరీ పరీక్షకు సంబంధించిన హాల్‌టికెట్లు ఆగస్టు 18 నుంచి అందుబాటులోకి రానున్నాయి. పోలీసు నియామక మండలి అధికారిక వెబ్‌సైట్ నుంచి అభ్యర్థులు హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవాలి.
తెలంగాణలో కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి నిర్వహించనున్న ప్రిలిమినరీ పరీక్షకు సంబంధించిన హాల్‌టికెట్లు ఆగస్టు 18 నుంచి అందుబాటులోకి రానున్నాయి. పోలీసు నియామక మండలి అధికారిక వెబ్‌సైట్ నుంచి అభ్యర్థులు హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అభ్యర్థులు ఆగస్టు 18న ఉదయం 8 గంటల నుంచి ఆగస్టు 26న అర్ధరాత్రి వరకు హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. హాల్‌టికెట్ల డౌన్‌లోడ్ ప్రక్రియలో ఏదైనా ఇబ్బంది తలెత్తితో support@tslprb.in కు ఈమెయిల్ లేదా 9393711110, 9391005006కు ఫోన్ చేయవచ్చు.
హాల్‌టికెట్ కోసం క్లిక్ చేయండి..
PRESS NOTE
కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఆగస్టు 28న ప్రిలిమినరీ రాత పరీక్ష నిర్వహించనున్నారు. ఆ రోజు ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకూ పరీక్ష జరగనుంది. ఈ పరీక్షకు మొత్తం 6,61,196 మంది అభ్యర్థులు హాజరుకానున్నారు. వాస్తవానికి ఆగస్టు 21న జరగాల్సిన కానిస్టేబుల్ రాత పరీక్షను సాంకేతిక కారణాలతో ఆగస్టు 28న నిర్వహిస్తున్నారు. ప్రిలిమినరీ పరీక్షకు తెలంగాణలో హైదరాబాద్ సహా 40 పట్టణాల్లో 1,601 పరీక్ష కేంద్రాల్లో అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్రంలో 15,644 కానిస్టేబుల్ పోస్టులకు ఏప్రిల్ 25న నోటిఫికేషన్ విడుదల అయింది. దీంతోపాటు 614 ప్రొహిబిషన్, ఎక్సైజ్ కానిస్టేబుల్ పోస్టులకు ఏప్రిల్ 28న నోటిఫికేషన్ జారీ అయిన సంగతి విదితమే.
హాల్‌టికెట్ ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి..
Step 1: అభ్యర్థులు మొదటగా బోర్డ్ అధికారిక వెబ్ సైట్ https://www.tslprb.in/ను ఓపెన్ చేయాలి.
Step 2: అనంతరం హోం స్క్రీన్ లో Download Hall Tickets ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
Step 3: అనంతరం Sign in పేజీ ఓపెన్ అవుతుంది. అక్కడ మొబైల్ నంబర్, పాస్‌వర్డ్ నమోదు చేసి Sign In బటన్ పై క్లిక్ చేయాలి.
Step 4: దీంతో మీ హాల్‌టికెట్ హోంపేజీలో కనిపిస్తుంది అవుతుంది. డౌన్‌లోడ్ చేసుకోవాలి. ప్రింట్ తీసుకుని భవిష్యత్ అవసరాల నిమిత్తం భద్రపరచుకోవాలి.
అభ్యర్థులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇలా...
★ డౌన్‌లోడ్ చేసుకున్న హాల్‌టికెట్‌ను ప్రింట్ (కలర్‌లోనే తీసుకోవాలన్న నిబంధన ఏమీ లేదు) తీసుకోవాలి.
★ అభ్యర్థులు పాటించాల్సిన నిబంధనలను కూడా కాగితానికి మరోవైపు ప్రింట్ తీసుకోవాలి.
★ పరీక్షకు ఒకరోజు ముందుగా పరీక్ష కేంద్రం సరిచూసుకోవడం ఉత్తమం. పరీక్ష రోజు నేరుగా కేంద్రానికి వెళ్లవచ్చు. చివరి నిమిషంలో ఆందోళన ఉండదు.
★ దరఖాస్తు సమయంలో అభ్యర్థులు అప్‌లోడ్ చేసిన ఫొటోను హాల్‌టికెట్‌పై అతికించాలి. వేరే దాన్ని అతికించినా, హాల్‌టికెట్ అసమగ్రంగా ఉన్నా పరీక్షకు అనుమతించరు.
★ ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్ష కేంద్రాల్లోకి అనుమతి ఉండదు.
★ పరీక్ష రాస్తున్నప్పుడు అభ్యర్థుల డిజిటల్ వేలిముద్ర తీసుకుంటారు.
★ పరీక్ష కేంద్రాల వద్ద అభ్యర్థులకు సంబంధించిన సామగ్రి భద్రపరుచుకునే సదుపాయం ఏదీ ఉండదు.
★ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు ఉదయం 9 గంటలకు పరీక్షా కేంద్రానికి తప్పనిసరిగా చేరుకోవాలి.
★ పరీక్షా సమయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు పరీక్ష నిర్వహిస్తారు.
★ ఉదయం 10 గంటల తర్వాత.. నిమిషం ఆలస్యమైనా లోపలికి అనుమతించరు.
★ హాల్‌టికెట్ తప్పనిసరిగా తెచ్చుకోవాలి. లేకపోతే పరీక్షకు అనుమతించరు.
★ నియామక ప్రక్రియ పూర్తయ్యే వరకూ హాల్‌టికెట్ భద్రపరచుకోవాలి.
★ అభ్యర్థులు తమ ఒరిజినల్ గుర్తింపు కార్డు (ఆధార్ కార్డ్, పాన్ కార్డు, పాస్ పోర్టు, ఓటర్ ఐడీ, డ్రైవింగ్ లైసెన్సు) తీసుకురావాల్సి ఉంటుంది.
★ పాస్ పోర్ట్ సైజు ఫోటో కూడా వెంట తీసుకురావాలి.
★ అభ్యర్థులు తమ వెంట బ్లాక్ పెన్, బూల్ పెన్ తేవాలి.
★ పరీక్ష కేంద్రంలోకి సెల్‌ఫోన్, కాలిక్యులేట్, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులు తేరాదు. అలాగే ఎలాంటి పుస్తకాలు, గైడ్లు, స్టడీ మెటిరియల్ పరీక్ష కేంద్రంలోకి తీసుకురాకూడదు.
★ పరీక్షా సమయం పూర్తయ్యే వరకు అభ్యర్థులు పరీక్ష కేంద్రం బయటకు వెళ్లరాదు.
★ పరీక్ష హలులో మాల్ ప్రాక్టీస్‌కు పాల్పడిన అభ్యర్థులు చట్టప్రకారం శిక్షార్హులుగా పరిగణించబడతారు.
Also Read:
SSC - జూనియర్ ఇంజినీర్ ఎగ్జామినేషన్ 2022
కేంద్రప్రభుత్వరంగ సంస్థల్లోని జూనియర్ ఇంజినీర్ (జేఈ) పోస్టుల భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఆగస్టు 12న నోటిఫికేషన్ జారీచేసింది. దీనిద్వారా వివిధ కేంద్ర ప్రభుత్వంలోని 22 విభాగాల్లోని జూనియర్ ఇంజినీర్ (సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్) పోస్టులను భర్తీ చేస్తారు. సంబంధిత విభాగాల్లో డిప్లొమా లేదా ఇంజినీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు ఉన్నవారు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆగస్టు 12న దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. సెప్టెంబరు 2 వరకు ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ కొనసాగనుంది. ఫీజు చెల్లించడానికి ఆగస్టు 3 వరకు గడువు ఉంది. పోస్టుల వారీగా అభ్యర్థులకు వయోపరిమితిని నిర్ణయించారు.
నోటిఫికేషన్, దరఖాస్తు తదితర వివరాల కోసం క్లిక్ చేయండి..
Also Read:
ITBP Constable Notification: టెన్త్ అర్హతతో కానిస్టేబుల్ ఉద్యోగాలు, పూర్తి వివరాలు ఇవే!
ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్(ఐటీబీపీ) విభాగం కానిస్టేబుల్(పయోనిర్) గ్రూప్-సి పరిధిలోని నాన్ గెజిటెడ్ (నాన్ మినిస్టీరియల్) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. పదోతరగతి లేదా తత్సమాన విద్యార్హత ఉండి, గుర్తింపు పొందిన ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ నుంచి ఒక సంవత్సరం సర్టిఫికేట్ కోర్సు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఆగస్టు 19 నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకానుంది. సెప్టెంబరు 17 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
నోటిఫికేషన్, దరఖాస్తు తదితర వివరాల కోసం క్లిక్ చేయండి..