అన్వేషించండి

Police Jobs: నేడు కానిస్టేబుల్ రాతపరీక్ష, నిమిషం ఆలస్యమైనా 'నో ఎంట్రీ'

16,321 పోస్టులకు పోటీపడుతున్న 6,61,196 మంది అభ్యర్థులు. ఆగస్టు 28న 1,601 కేంద్రాల్లో కానిస్టేబుల్ రాతపరీక్ష నిర్వహణకు ఏర్పాట్లు పూర్తిచేసిన అధికారులు. ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు..

తెలంగాణలో యూనిఫాం సర్వీసుల్లో కానిస్టేబుల్ ప్రిలిమినరీ రాతపరీక్షకు తెలంగాణ రాష్ట్రస్థాయి పోలీస్ నియామక మండలి(TSLPRB) ఏర్పాట్లు పూర్తిచేసింది. ఆగస్టు 28న జరగనున్న ఈ పరీక్ష నిర్వహణకు రాష్ట్రవ్యాప్తంగా 1,601 కేంద్రాల్లో ఏర్పాట్లు చేసింది. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్ష నిర్వహించనున్నారు. పోలీసు నియామక మండలి మొత్తం 16,321 కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయగా.. ఏకంగా 6,61,196 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. తెలంగాణ ఆవిర్భావం తర్వాత తొలిసారిగా ఇంత భారీఎత్తున కానిస్టేబుళ్ల నియామకాల కోసం పరీక్ష జరుగుతోంది.


TS Police: కానిస్టేబుల్‌ పరీక్ష హాల్‌టికెట్లు డౌన్‌లోడ్



అర్హత మార్కులు కుదింపు
:
కానిస్టేబుల్ ప్రాథమిక రాతపరీక్షలో ఈసారి కనీస అర్హత మార్కుల్ని కుదించారు. ఇప్పటివరకు జరిగిన పరీక్షల్లో ఎస్సీ/ఎస్టీలు 30శాతం.. బీసీలు 35శాతం.. ఇతరులు 40శాతం కనీస మార్కులు సాధిస్తేనే అర్హులుగా పరిగణించేవారు. ఈసారి సామాజికవర్గాలతో నిమిత్తం లేకుండా అందరికీ 30శాతం కనీస మార్కులనే అర్హతగా పరిగణిస్తారు. రాతపరీక్షలో మొత్తం 200 ప్రశ్నలుంటాయి. వీటిలో 60 మార్కులు వస్తే సరిపోతుంది. ఆబ్జెక్టివ్ విధానంలోనే ప్రశ్నలు అడుగుతారు. నెగెటివ్ మార్కులు ఉంటాయి. ప్రతి 5 తప్పు సమాధానాలకు ఒక మార్కు కోత విధిస్తారు. ప్రిలిమినరీ రాతపరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులే తర్వాత దశలో నిర్వహించే శారీరక సామర్థ్య పరీక్షలకు హాజరువుతారు. ఇందులోనూ అర్హత సాధించిన అభ్యర్థులు తుది రాతపరీక్షకు అర్హత సాధిస్తారు. తుది పరీక్షలో మాత్రం నెగెటివ్ మార్కులుండవు.


Also Read: TSPSC Recruitment: ఈవో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్, వీరు మాత్రమే అర్హులు!


‘కానిస్టేబుల్‌’ అభ్యర్థులకోసం ఆర్టీసీ సేవలు:

ఆగస్టు 28న నిర్వహించే కానిస్టేబుల్‌ ప్రాథమిక పరీక్షకు హాజరయ్యే అభ్యర్థుల కోసం టీఎస్ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఈ మేరకు సంస్థ చైర్మన్‌ బాజిరెడ్డి గోవర్ధన్‌, వైస్ చైర్మన్‌, ఎండీ సజ్జనార్‌ నగరంలోని బ‌స్ భ‌వ‌న్‌ నుంచి అన్ని రీజియన్ల డిపో మేనేజర్లతో వీడియో కాన్ఫరెన్స్​‍ నిర్వహించారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు రవాణా సేవలు అందుబాటులో ఉంచాలని అధికారులకు సూచించారు.

 
అభ్యర్థులకు ముఖ్య సూచనలు:

  • కానిస్టేబుల్ రాతపరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు గంట ముందే పరీక్ష కేంద్రానికి చేరుకోవాల్సి ఉంటుంది. ఉదయం 10 గంటలకే పరీక్ష కేంద్రం గేట్లు మూసేస్తారని మండలివర్గాలు స్పష్టం చేశాయి. నిమిషం ఆలస్యమైనా పరీక్షకు అనుమతించరు.

  • పోలీసు నియామక మండలి అధికారిక వెబ్‌సైట్ tslprb.in నుంచి హాల్‌టికెట్లను ఏ4సైజ్ పేపర్‌లో డౌన్‌లోడ్ చేసుకున్న అనంతరం నిర్దేశిత స్థలంలో తప్పనిసరిగా అభ్యర్థి ఫొటోను గమ్‌తో అతికించుకోవాలి. దరఖాస్తు చేసిన సమయంలో డిజిటల్ కాపీలో ఉంచిన ఫొటోనే తిరిగి వినియోగించాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ పిన్‌లు కొట్టొద్దు. హాల్‌టికెట్ మీద ఫొటో లేకుంటే పరీక్షకు అనుమతించరు.

  • బయోమెట్రిక్ విధానం అనుసరించనున్న నేపథ్యంలో అభ్యర్థుల చేతులకు మెహిందీ, టాటూలు ఉంచుకోకూడదు.

  • అభ్యర్థి పరీక్ష గదిలోకి తనవెంట హాల్‌టికెట్‌తో పాటు బ్లూ లేదా బ్లాక్ పాయింట్‌పెన్‌ను మాత్రమే తీసుకెళ్లాలి. సెల్‌ఫోన్, టాబ్లెట్, పెన్‌డ్రైవ్, బ్లూటూత్ డివైజ్, చేతిగడియారం, కాలుక్యులేటర్, లాగ్‌టేబుల్, వాలెట్, పర్స్, నోట్స్, చార్ట్, రికార్డింగ్ పరికరాలు, ఖాళీపేపర్లను వెంట తీసుకెళ్లరాదు.

  • మహిళా అభ్యర్థులు బంగారు ఆభరణాలు ధరించి పరీక్షకు వెళ్లకూడదు. విలువైన వస్తువుల్ని భద్రపరిచేందుకు పరీక్ష కేంద్రాల్లో క్లాక్‌రూం సదుపాయం ఉండదు అన్న సంగతి గుర్తించాలి.

  • ఓఎంఆర్ షీట్లపై అనవసర రాతలు, గుర్తులు, మతసంబంధ అంశాల్లాంటివి రాస్తే మాల్‌ప్రాక్టీస్‌గా పరిగణిస్తారు.

  • పరీక్షపత్రం బుక్లెట్‌లో ఇంగ్లిష్-తెలుగు, ఇంగ్లిష్-ఉర్దూ భాషలలో ప్రశ్నలు ఉంటాయి. ప్రశ్నల్లో ఏవైనా సందేహాలుంటే ఇంగ్లిష్ వెర్షన్‌నే పరిగణనలోకి తీసుకోవాలి.

 

Also Read: SAIL: స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు, ఈ అర్హతలుండాలి!


తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇలా...

★ డౌన్‌లోడ్‌ చేసుకున్న హాల్‌టికెట్‌ను ప్రింట్ (కలర్‌లోనే తీసుకోవాలన్న నిబంధన ఏమీ లేదు) తీసుకోవాలి.

★ అభ్యర్థులు పాటించాల్సిన నిబంధనలను కూడా కాగితానికి మరోవైపు ప్రింట్‌ తీసుకోవాలి.

★ పరీక్షకు ఒకరోజు ముందుగా పరీక్ష కేంద్రం సరిచూసుకోవడం ఉత్తమం. పరీక్ష రోజు నేరుగా కేంద్రానికి వెళ్లవచ్చు. చివరి నిమిషంలో ఆందోళన ఉండదు.

★ దరఖాస్తు సమయంలో అభ్యర్థులు అప్‌లోడ్ చేసిన ఫొటోను హాల్‌టికెట్‌పై అతికించాలి. వేరే దాన్ని అతికించినా, హాల్‌టికెట్‌ అసమగ్రంగా ఉన్నా పరీక్షకు అనుమతించరు.

★ ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్ష కేంద్రాల్లోకి అనుమతి ఉండదు.

★ పరీక్ష రాస్తున్నప్పుడు అభ్యర్థుల డిజిటల్‌ వేలిముద్ర తీసుకుంటారు. 

★ పరీక్ష కేంద్రాల వద్ద అభ్యర్థులకు సంబంధించిన సామగ్రి భద్రపరుచుకునే సదుపాయం ఏదీ ఉండదు.

★ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు ఉదయం 9 గంటలకు పరీక్షా కేంద్రానికి తప్పనిసరిగా చేరుకోవాలి.

★ పరీక్షా సమయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు పరీక్ష నిర్వహిస్తారు.

★ ఉదయం 10 గంటల తర్వాత.. నిమిషం ఆలస్యమైనా లోపలికి అనుమతించరు.

★ హాల్‌టికెట్ తప్పనిసరిగా తెచ్చుకోవాలి. లేకపోతే పరీక్షకు అనుమతించరు.

★ నియామక ప్రక్రియ పూర్తయ్యే వరకూ హాల్‌టికెట్ భద్రపరచుకోవాలి.

★ అభ్యర్థులు తమ ఒరిజినల్‌ గుర్తింపు కార్డు (ఆధార్‌ కార్డ్‌, పాన్‌ కార్డు, పాస్‌ పోర్టు, ఓటర్‌ ఐడీ, డ్రైవింగ్‌ లైసెన్సు) తీసుకురావాల్సి ఉంటుంది.

★ పాస్‌ పోర్ట్‌ సైజు ఫోటో కూడా వెంట తీసుకురావాలి.

★ అభ్యర్థులు తమ వెంట బ్లాక్‌ పెన్‌, బూల్‌ పెన్‌ తేవాలి.

★ పరీక్ష కేంద్రంలోకి సెల్‌ఫోన్, కాలిక్యులేట్, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులు తేరాదు. అలాగే ఎలాంటి పుస్తకాలు, గైడ్లు, స్టడీ మెటిరియల్ పరీక్ష కేంద్రంలోకి తీసుకురాకూడదు.

★ పరీక్షా సమయం పూర్తయ్యే వరకు అభ్యర్థులు పరీక్ష కేంద్రం బయటకు వెళ్లరాదు.

★ పరీక్ష హలులో మాల్ ప్రాక్టీస్‌కు పాల్పడిన అభ్యర్థులు చట్టప్రకారం శిక్షార్హులుగా పరిగణించబడతారు.

Also Read:

SSC - జూనియర్ ఇంజినీర్ ఎగ్జామినేషన్ 2022
కేంద్రప్రభుత్వరంగ సంస్థల్లోని జూనియర్‌ ఇంజినీర్ (జేఈ) పోస్టుల భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఆగస్టు 12న నోటిఫికేషన్  జారీచేసింది. దీనిద్వారా వివిధ కేంద్ర ప్రభుత్వంలోని 22 విభాగాల్లోని జూనియర్ ఇంజినీర్ (సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్) పోస్టులను భర్తీ చేస్తారు. సంబంధిత విభాగాల్లో డిప్లొమా లేదా ఇంజినీరింగ్‌ డిగ్రీ ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు ఉన్నవారు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆగస్టు 12న దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. సెప్టెంబరు 2 వరకు ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ కొనసాగనుంది. ఫీజు చెల్లించడానికి ఆగస్టు 3 వరకు గడువు ఉంది. పోస్టుల వారీగా అభ్యర్థులకు వయోపరిమితిని నిర్ణయించారు.
నోటిఫికేషన్, దరఖాస్తు తదితర వివరాల కోసం క్లిక్ చేయండి..  


Also Read:
ITBP Constable Notification: టెన్త్ అర్హతతో కానిస్టేబుల్ ఉద్యోగాలు, పూర్తి వివరాలు ఇవే!

ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్(ఐటీబీపీ) విభాగం కానిస్టేబుల్(పయోనిర్) గ్రూప్-సి పరిధిలోని నాన్ గెజిటెడ్ (నాన్ మినిస్టీరియల్) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. పదోతరగతి లేదా తత్సమాన విద్యార్హత ఉండి, గుర్తింపు పొందిన ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ నుంచి ఒక సంవత్సరం సర్టిఫికేట్ కోర్సు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఆగస్టు 19 నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకానుంది. సెప్టెంబరు 17 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
నోటిఫికేషన్, దరఖాస్తు తదితర వివరాల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని ఉద్యోగ సంబంధిత వార్తల కోసం క్లిక్ చేయండి...

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Hyderabad: ఓటు వేసిన వారికి షాపు యజమాని ఆఫర్, ఫ్లెక్సీలు కట్టి ఆకట్టుకుంటున్న ఓనర్
ఓటు వేసిన వారికి షాపు యజమాని ఆఫర్, ఫ్లెక్సీలు కట్టి ఆకట్టుకుంటున్న ఓనర్
Andhra Pradesh Postal Ballots : తేలిన ఏపీ పోస్టల్ బ్యాలెట్స్ లెక్క - రికార్డే !
తేలిన ఏపీ పోస్టల్ బ్యాలెట్స్ లెక్క - రికార్డే !
Weather Latest Update: నేడు తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి వర్షాలకు ఛాన్స్ : ఐఎండీ
నేడు తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి వర్షాలకు ఛాన్స్ : ఐఎండీ
In Pics: పిఠాపురంలో పవన్ కల్యాణ్ భారీ రోడ్‌ షో, జనాల్లో జోష్ చూసేయండి - ఫోటోలు
పిఠాపురంలో పవన్ కల్యాణ్ భారీ రోడ్‌ షో, జనాల్లో జోష్ చూసేయండి - ఫోటోలు
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

Mohit Sharma 3Wickets vs CSK | IPL 2024 లోనూ అద్భుతమైన బౌలింగ్ తో ఆకట్టుకుంటున్న మోహిత్ శర్మ | ABPShubman Gill Sai Sudharsan Centuries | GT vs CSK మ్యాచ్ లో సెంచరీలు బాదిన జీటీ కుర్రాళ్లు | IPL 2024Shubman Gill And Sai Sudharsan Centuries | GT vs CSK Highlights | కీలక మ్యాచులో చెన్నై ఓటమి| ABPRaja Singh Insulted in PM Modi Public Meeting | ఎల్బీ స్టేడియంలో రాజాసింగ్ కు అవమానం.. ఏం జరిగిందంటే

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad: ఓటు వేసిన వారికి షాపు యజమాని ఆఫర్, ఫ్లెక్సీలు కట్టి ఆకట్టుకుంటున్న ఓనర్
ఓటు వేసిన వారికి షాపు యజమాని ఆఫర్, ఫ్లెక్సీలు కట్టి ఆకట్టుకుంటున్న ఓనర్
Andhra Pradesh Postal Ballots : తేలిన ఏపీ పోస్టల్ బ్యాలెట్స్ లెక్క - రికార్డే !
తేలిన ఏపీ పోస్టల్ బ్యాలెట్స్ లెక్క - రికార్డే !
Weather Latest Update: నేడు తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి వర్షాలకు ఛాన్స్ : ఐఎండీ
నేడు తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి వర్షాలకు ఛాన్స్ : ఐఎండీ
In Pics: పిఠాపురంలో పవన్ కల్యాణ్ భారీ రోడ్‌ షో, జనాల్లో జోష్ చూసేయండి - ఫోటోలు
పిఠాపురంలో పవన్ కల్యాణ్ భారీ రోడ్‌ షో, జనాల్లో జోష్ చూసేయండి - ఫోటోలు
SBI News: టెక్కీలకు శుభవార్త చెప్పిన ఎస్బీఐ.. భారీ రిక్రూట్మెంట్ ప్లాన్ ఇదే..
SBI News: టెక్కీలకు శుభవార్త చెప్పిన ఎస్బీఐ.. భారీ రిక్రూట్మెంట్ ప్లాన్ ఇదే..
IPL 2024: రికార్డుల జోరు ముంబైదే, ప్రస్తుత హోరు కోల్‌కత్తాదే
రికార్డుల జోరు ముంబైదే, ప్రస్తుత హోరు కోల్‌కత్తాదే
Unhealthy Food: మన ఆయుష్షును హరిస్తున్నవి ఇవేనట - ఇలాంటివి తిన్నా.. తాగినా లైఫ్ మటాషే, తాజా పరిశోధన వెల్లడి
మన ఆయుష్షును హరిస్తున్నవి ఇవేనట - ఇలాంటివి తిన్నా.. తాగినా లైఫ్ మటాషే, తాజా పరిశోధన వెల్లడి
UDAN Scheme: ఇక పేదవాళ్లూ విమాన ప్రయాణం చేయొచ్చు, కేవలం రూ.500 కంటే తక్కువ ఖర్చుతో ఇలా!
ఇక పేదవాళ్లూ విమాన ప్రయాణం చేయొచ్చు, కేవలం రూ.500 కంటే తక్కువ ఖర్చుతో ఇలా!
Embed widget