TS TET 2022 : టీఎస్ టెట్ దరఖాస్తుకు రేపే లాస్ట్ డేట్, ఇలా దరఖాస్తు చేసుకోండి!
TS TET 2022 : తెలంగాణ టెట్ పరీక్షకు అప్లై చేసుకునేందుకు రేపే(ఏప్రిల్ 12) ఆఖరి తేదీ. దరఖాస్తు ఫీజు చెల్లింపు నేటితో ముగుస్తోంది. అభ్యర్థులు క్రింద విధంగా దరఖాస్తు చేసుకోవచ్చు.
TS TET 2022 : తెలంగాణ టెట్ పరీక్షకు ఇంకా ఒక్కరోజే మిగిలిఉంది. టెట్ పరీక్ష కోసం మార్చి 26 నుంచి దరఖాస్తులు ఆహ్వానించగా ఏప్రిల్ 12తో గడువు ముగుస్తోంది. అయితే పేమెంట్ చెల్లించేందుకు ఏప్రిల్ 11 చివరిరోజు. ఇప్పటి వరకూ అప్లై చేయని అభ్యర్థులు త్వరపడండి. అభ్యర్థులు https://tstet.cgg.gov.in వెబ్ సైట్ పై క్లిక్ చేయండి. అప్లై చేసే ముందు అభ్యర్థులు లేటెస్ట్ ఫొటో స్కానింగ్ ఇమేజ్, సిద్ధంగా చేసుకోండి. పదో తరగతి సర్టిఫికేట్ కూడా దగ్గరపెట్టుకోవాలి. అందులో ఉన్నట్లుగా వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది.
అభ్యర్థులు ముందుగా నోటిఫికేషన్ లో వివరాలను పూర్తి చదవాలి. అందులోని ఉన్న విధంగా వివరాలు నమోదు చేసుకోవాలి.
ఇలా దరఖాస్తు చేసుకోండి
1. ముందుగా http://tstet.cgg.gov.in/ లింక్ పై క్లిక్ చేయాలి.
2. ఇందులో ఆన్ లైన్ పేమెంట్ ఆఫ్షన్ పై క్లిక్ చేసి అభ్యర్థులు రూ.300 ఫీజును చెల్లించాల్సి ఉంటుంది.
3. పేమెంట్ చెల్లించేందుకు పేరు, డేట్ ఆఫ్ బర్త్, రాష్ట్రం, ఫోన్ నంబర్, ఇతర వివరాలు నమోదు చేయాలి.
4. ఆన్లైన్ పేమెంట్ చెల్లించాల్సి ఉంటుంది.
5. దరఖాస్తు ఫీజు చెల్లించిన అభ్యర్థులకు జర్నల్ నెంబర్ జనరేట్ అవుతుంది. ఈ నంబర్ సేవ్ చేసుకుని ఉంచుకోవాలి. జర్నల్ నెంబర్ అప్లికేషన్ నింపడానికి ఉపయోగపడుతుంది.
6. దరఖాస్తు పూర్తి చేసేందుకు అన్ని డాక్యుమెంట్లను సిద్ధం ఉంచుకోవాలి.
7. ఫొటోగ్రాఫ్ స్కానింగ్ కాపీని సిద్ధంగా ఉంచుకోవాలి.
8. online application Form ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
9. ఇందులో ముందుగా జర్నల్ నంబర్, పుట్టిన రోజు, పేమెంట్ డేట్ నమోదు చేయాలి.
10. అందులో ఇచ్చినా కాప్చాను నమోదు చేసి వెరిఫై అండ్ నెక్ట్స్ ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
11. అప్లికేషన్ ఫామ్ ఓపెన్ అవుతుంది. అందులో విద్యా, ఇతర వివరాలను నమోదు చేయాలి. చివర్లో ఫొటో అప్ లోడ్ చేయాలి.
12. ఒకసారి మీ వివరాలు అన్ని ఒకసారి చెక్ చేసుకుని సేవ్ అండ్ నెక్ట్స్ ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
13. తర్వాత Paper and Qualification, Previous TET వివరాలు నమోదు చేయాలి.
14. చివరిగా Save & Preview ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
15. ప్రివ్యూలో వివరాలన్నీ ఒకసారి సరిచూసుకుని అప్లికేషన్ సబ్మిట్ చేయాలి.
16. సబ్మిట్ అయిన తర్వాత ఐడీ జనరేట్ అవుతుంది. ఈ ఐడీ రిజిస్టర్డ్ ఫోన్ నంబర్ కు SMS కూడా వస్తుంది.
17. అప్లికేషన్ ఫామ్ ప్రింట్ తీసుకుని భద్రపరుచుకోవాలి