అన్వేషించండి

TS Teacher Transfers: నేటి నుంచి హెడ్ మాస్టర్లకు వెబ్ఆప్షన్లు, ఎస్‌ఏలకు ‘నాట్‌ విల్లింగ్‌’ ఆప్షన్‌!

ప్రధానోపాధ్యాయులుగా ప్రమోషన్‌కు అర్హులైన స్కూల్ అసిస్టెంట్‌ల సీనియార్టిటీ జాబితాను పోర్టల్‌లో అందుబాటులో ఉంచనుంది. దీనిపై అభ్యంతరాలుంటే సెప్టెంబరు 17 వరకు ఫిర్యాదులు స్వీకరించనున్నారు.

తెలంగాణలో టీచర్ల బదిలీల ప్రక్రియ నెలలు గడుస్తున్నా కొనసాగుతూనే ఉంది. కోర్టు కేసుల కారణంగా బదిలీలు ఆలస్యమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ట్రాన్స్‌ఫర్‌లపై కొందరు హెడ్ మాస్టర్లు హైకోర్టును ఆశ్రయించడంతో పాఠశాల విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. కటాఫ్ తేదీని సెప్టెంబరు 1కి మారుస్తూ కొత్త షెడ్యూలును విడుదల చేసింది. సెప్టెంబరు 15, 16 తేదీల్లో బదిలీలకు వెబ్ ఆప్షన్లు స్వీకరించనున్నారు. సెప్టెంబరు 17న ఉత్తర్వులు జారీచేయనుంది. ప్రధానోపాధ్యాయులుగా ప్రమోషన్‌కు అర్హులైన స్కూల్ అసిస్టెంట్‌ల సీనియార్టిటీ జాబితాను పోర్టల్‌లో అందుబాటులో ఉంచనుంది. దీనిపై అభ్యంతరాలుంటే సెప్టెంబరు 17 వరకు ఫిర్యాదులు స్వీకరించనున్నారు.

పదోన్నతి వద్దనుకునే స్కూల్‌ అసిస్టెంట్లకు ‘నాట్‌ విల్లింగ్‌’ ఆప్షన్‌..
మల్టీజోన్‌ కారణంగా.. ఈసారి గెజిటెడ్‌ ప్రధానోపాధ్యాయులు(జీహెచ్‌ఎం)గా పదోన్నతులు కల్పించినా వందలాది పోస్టులు ఖాళీగా ఉండే అవకాశం ఉందని భావించిన విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. పదోన్నతి వద్దనుకునే వారికి ‘నాట్‌ విల్లింగ్‌’ ఆప్షన్‌ ఇవ్వాలని నిర్ణయించింది. దీంతో సీనియర్లు తమకు పదోన్నతి వద్దనుకుంటే ఆ హెచ్‌ఎం పోస్టుల్లో ఆ తర్వాత సీనియర్లకు అవకాశం లభిస్తుంది. దీంతో రాష్ట్రంలోని మొత్తం ఉన్నత పాఠశాలల్లోని జీహెచ్‌ఎం పోస్టులన్నీ భర్తీ కానున్నాయి. త్వరలో స్కూల్‌ అసిస్టెంట్లకు సీనియారిటీ ఆధారంగా జీహెచ్‌ఎంలుగా పదోన్నతులు లభించనున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 2,017 జీహెచ్‌ఎం ఖాళీలు ఉండగా వాటిని భర్తీ చేయనున్నారు. అయితే పదోన్నతి లభించినా కనీసం 30% మంది తమకు కేటాయించిన పాఠశాలల్లో చేరకపోవచ్చని ఉపాధ్యాయ సంఘాలు అంచనా వేస్తున్నాయి. సొంత జిల్లాకు, కుటుంబసభ్యులకు దూరంగా వెళ్లాల్సి వస్తుందని భావించి చాలా వరకు స్కూల్‌ అసిస్టెంట్లు జీహెచ్‌ఎం పదోన్నతి దక్కినా చేరకపోవచ్చన్నని తెలుస్తోంది.

పదోన్నతి తీసుకునేందుకు ఆసక్తిలేని వారికోసం ఈ ఆప్షన్‌ ఇచ్చి బదిలీలు, పదోన్నతుల పోర్టల్‌లో పొందుపరుస్తారు. పదోన్నతిని తిరస్కరించిన వారి స్థానంలో ఆ తరువాత సీనియారిటీ ఉన్నవారికి పదోన్నతి కల్పించాలని నిర్ణయించారు. దీనివల్ల ఈసారి హైస్కూళ్లలో జీహెచ్‌ఎం పోస్టులు ఖాళీగా ఉండవని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం ఆయా పాఠశాలల్లో పనిచేసే సీనియర్‌ స్కూల్‌ అసిస్టెంట్లకు ఇన్‌ఛార్జి బాధ్యతలు అప్పగించారు. 2015లో చివరిసారిగా ఉపాధ్యాయులకు పదోన్నతులిచ్చారు. గత ఎనిమిది సంవత్సరాలుగా పదోన్నతులు లేకపోవడంతో భారీగా ఖాళీలు ఏర్పడ్డాయి.

స్కూల్‌ అసిస్టెంట్లు జీహెచ్‌ఎంలుగా పదోన్నతులు పొందితే ఏర్పడే ఖాళీలనూ బదిలీల్లో చూపనున్నారు. ఇప్పటివరకు దానిపై స్పష్టత ఇవ్వకపోవడంతో ఉపాధ్యాయుల్లో అయోమయం నెలకొంది. తాజా సమావేశంలో దానిపైనా నిర్ణయం తీసుకున్నారు. దానివల్ల ఇప్పటికే స్కూల్‌ అసిస్టెంట్లుగా పనిచేస్తున్న వారు తాజాగా ఏర్పడిన ఖాళీలకు కూడా బదిలీ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. స్కూల్‌ అసిస్టెంట్ల బదిలీలు పూర్తయిన తర్వాత ఏర్పడే మొత్తం ఖాళీల్లో 70 శాతాన్ని ఎస్‌జీటీలకు పదోన్నతులు ఇచ్చి భర్తీచేస్తారు. మిగిలిన 30% ఖాళీలను ప్రత్యక్ష నియామకాల (టీఆర్‌టీ) ద్వారా నింపుతారు.  

ALSO READ:

5,089 పోస్టులతో 'డీఎస్సీ' నోటిఫికేషన్ విడుదల, పరీక్ష ఎప్పుడంటే?
తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలల్లో 5089 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సంబంధించి డీఎస్సీ/టీచర్స్ రిక్రూట్‌మెంట్ టెస్ట్ (టీఆర్‌టీ) నోటిఫికేషన్ సెప్టెంబరు 7న విడుదలైంది. ఉద్యోగాల భర్తీకి సంబంధించి జిల్లాల వారీగా ఖాళీలు, ఇతర వివరాలన్నీ సెప్టెంబరు 15 నుంచి వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనున్నట్లు విద్యాశాఖ పేర్కొంది. సెప్టెంబరు 20 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానుంది. అక్టోబర్ 21 వరకు అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు. నవంబర్ 20 నుంచి 30వరకు సీబీటీ విధానంలో పరీక్షలు నిర్వహించనున్నారు. అయితే ఈ నోటిఫికేషన్‌లో 1,523 స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ల ఖాళీల భర్తీ గురించి ప్రస్తావించలేదు.అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.1000 చెల్లించాల్సి ఉంటుంది. అభ్యర్థుల గరిష్ఠ వయోపరిమితిని 44 సంవత్సరాలుగా నిర్ణయించారు. ఎస్‌సీ, ఎస్‌టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 5 సంవత్సరాలు వయోసడలింపు వర్తిస్తుంది. ఇక దివ్యాంగులకు మాత్రం 10 సంవత్సరాలపాటు వయోసడలింపు ఉంటుంది. 
డీఎస్సీ నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..

హైదరాబాద్ సెంట్రల్‌ యూనివర్సిటీలో 95 నాన్ టీచింగ్ పోస్టులు, అర్హతలివే!
యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్- డైరెక్ట్ రిక్రూట్‌మెంట్/ డిప్యూటేషన్ ప్రాతిపదికన నాన్-టీచింగ్, అకడమిక్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలున్నవారు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. అభ్యర్థులు సెప్టెంబరు 30లోగా ఆన్‌లైన్ దరఖాస్తులు సమర్పించి, అక్టోబరు 6లోగా దరఖాస్తు హార్డ్ కాపీలను నిర్ణీత చిరునామాకు చేరేలా పంపాలి.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Nitish Records Alert: ఆసీస్ గడ్డపై నితీశ్ రికార్డుల జోరు.. తగ్గేదే లే అన్న సుందర్.. నాలుగో టెస్టులో మెరుగైన స్థితిలో టీమిండియా..  
ఆసీస్ గడ్డపై నితీశ్ రికార్డుల జోరు.. తగ్గేదే లే అన్న సుందర్.. నాలుగో టెస్టులో మెరుగైన స్థితిలో టీమిండియా..  
Pawan Kalyan: 'వైసీపీ నేతలకు అహంకారంతో కళ్లు నెత్తికెక్కాయి' - ఖబడ్దార్ అంటూ పవన్ వార్నింగ్, ఎంపీడీవోకు పరామర్శ
'వైసీపీ నేతలకు అహంకారంతో కళ్లు నెత్తికెక్కాయి' - ఖబడ్దార్ అంటూ పవన్ వార్నింగ్, ఎంపీడీవోకు పరామర్శ
Manmohan Singh Last Rites: ముగిసిన మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు, మాజీ ప్రధానికి తుది వీడ్కోలు పలికిన భారతావని
ముగిసిన మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు, మాజీ ప్రధానికి తుది వీడ్కోలు పలికిన భారతావని
Chiranjeevi Odela Movie: పాటలు, హీరోయిన్ లేకుండానే చిరు - ఓదెల సినిమా?... రూమర్లపై క్లారిటీ ఇచ్చిన నిర్మాత
పాటలు, హీరోయిన్ లేకుండానే చిరు - ఓదెల సినిమా?... రూమర్లపై క్లారిటీ ఇచ్చిన నిర్మాత
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

పవన్ టూర్‌లో ఫేక్ ఐపీఎస్  కలకలం! పోలీసులతో ఫోటోలకు ఫోజులుమాజీ ప్రధానికేనా.. నా తండ్రికి ఇవ్వరా? కాంగ్రెస్ తీరుపై ప్రణబ్ కుమార్తె ఆగ్రహంNasa Parker Solar Probe Signal | సూర్యుడికి అతి దగ్గరగా వెళ్లిన సేఫ్ గా ఉన్న పార్కర్ ప్రోబ్ | ABP DesamPushpa 2 Bollywood Collections | బాలీవుడ్ ను షేక్ చేయటం ఆపని బన్నీ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nitish Records Alert: ఆసీస్ గడ్డపై నితీశ్ రికార్డుల జోరు.. తగ్గేదే లే అన్న సుందర్.. నాలుగో టెస్టులో మెరుగైన స్థితిలో టీమిండియా..  
ఆసీస్ గడ్డపై నితీశ్ రికార్డుల జోరు.. తగ్గేదే లే అన్న సుందర్.. నాలుగో టెస్టులో మెరుగైన స్థితిలో టీమిండియా..  
Pawan Kalyan: 'వైసీపీ నేతలకు అహంకారంతో కళ్లు నెత్తికెక్కాయి' - ఖబడ్దార్ అంటూ పవన్ వార్నింగ్, ఎంపీడీవోకు పరామర్శ
'వైసీపీ నేతలకు అహంకారంతో కళ్లు నెత్తికెక్కాయి' - ఖబడ్దార్ అంటూ పవన్ వార్నింగ్, ఎంపీడీవోకు పరామర్శ
Manmohan Singh Last Rites: ముగిసిన మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు, మాజీ ప్రధానికి తుది వీడ్కోలు పలికిన భారతావని
ముగిసిన మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు, మాజీ ప్రధానికి తుది వీడ్కోలు పలికిన భారతావని
Chiranjeevi Odela Movie: పాటలు, హీరోయిన్ లేకుండానే చిరు - ఓదెల సినిమా?... రూమర్లపై క్లారిటీ ఇచ్చిన నిర్మాత
పాటలు, హీరోయిన్ లేకుండానే చిరు - ఓదెల సినిమా?... రూమర్లపై క్లారిటీ ఇచ్చిన నిర్మాత
Pawan Kalyan: పవన్ కళ్యాణ్ పర్యటనలో సెక్యూరిటీ లోపం - వెంటే తిరిగిన ఫేక్ ఐపీఎస్, సిబ్బందితో ఫొటోలకు ఫోజులు
పవన్ పర్యటనలో సెక్యూరిటీ లోపం - వెంటే తిరిగిన ఫేక్ ఐపీఎస్, సిబ్బందితో ఫొటోలకు ఫోజులు
Mobile Phone Safety: ఈ లక్షణాలు మీ మొబైల్‌ ఫోన్‌లో కనిపిస్తే వైరస్‌ ప్రవేశించిందని అర్ధం, బీ అలెర్ట్‌!
ఈ లక్షణాలు మీ మొబైల్‌ ఫోన్‌లో కనిపిస్తే వైరస్‌ ప్రవేశించిందని అర్ధం, బీ అలెర్ట్‌!
KTR ED Notice: ఫార్ములా ఈ- కార్ రేసు కేసులో కేటీఆర్‌కు ఈడీ షాక్, విచారణకు రావాలని నోటీసులు
ఫార్ములా ఈ- కార్ రేసు కేసులో కేటీఆర్‌కు ఈడీ షాక్, విచారణకు రావాలని నోటీసులు
Nitish Fabulous Century: నితీశ్ రెడ్డి సూపర్ సెంచరీ.. ఆసీస్ బౌలర్లను ఆటాడుకున్న తెలుగు ప్లేయర్.. కంగారూ గడ్డపై సెంచరీ చేసిన మూడో యంగెస్ట్ ప్లేయర్
నితీశ్ రెడ్డి సూపర్ సెంచరీ.. ఆసీస్ బౌలర్లను ఆటాడుకున్న తెలుగు ప్లేయర్.. కంగారూ గడ్డపై సెంచరీ చేసిన మూడో యంగెస్ట్ ప్లేయర్
Embed widget