అన్వేషించండి

Telangana Staff nurse: స్టాఫ్‌నర్స్‌ పరీక్ష హాల్‌ టికెట్లు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే!

తెలంగాణలో స్టాఫ్‌నర్స్‌(Staff Nurse) ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు గమనిక. ఈ పరీక్షకు సమయం సమీపిస్తుండటంతో హాల్‌టికెట్లు అందుబాటులోకి వచ్చాయి.

తెలంగాణలో స్టాఫ్‌నర్స్‌(Staff Nurse) ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు గమనిక. ఈ పరీక్షకు సమయం సమీపిస్తుండటంతో హాల్‌టికెట్లు అందుబాటులోకి వచ్చాయి. ఈ మేరకు రాష్ట్ర వైద్య, ఆరోగ్య సేవల రిక్రూట్‌మెంట్‌ బోర్డు(MHSRB) అధికారిక ‌వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్లను ఆన్‌లైన్‌లో ఉంచింది. ఈ పోస్టులకు తొలిసారి ఆన్‌లైన్‌లో కంప్యూటర్‌ ఆధారిత పరీక్షను నిర్వహిస్తున్న నేపథ్యంలో అభ్యర్థుల అవగాహన కోసం MHSRB వెబ్‌సైట్‌లో మాక్‌టెస్ట్‌ కూడా నిర్వహించిన విషయం తెలిసిందే.

రాష్ట్రంలో మొత్తం 5,204 స్టాఫ్‌నర్సుల పోస్టుల కోసం 40,926 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్న విషయం తెలిసిందే. ఆగస్టు 2న కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష (CBT)ను ‌హైదరాబాద్‌, వరంగల్‌, ఖమ్మం, నిజామాబాద్‌ కేంద్రాల్లో మూడు షిఫ్ట్‌లలో ఉదయం 9 గంటల నుంచి 10.20 గంటల వరకు; 12.30-1.50గంటల వరకు; సాయంత్రం 4గంటల నుంచి 5.20గంటల వరకు నిర్వహించనున్నారు.

వైద్యారోగ్యశాఖలోని వివిధ విభాగాల్లో 5,204 స్టాఫ్ నర్సు పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం డిసెంబరు 30 నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇందులో డీఎంఈ, డీహెచ్  పరిధిలో 3,823 పోస్టులు, వైద్య విధాన పరిషత్‌లో 757 పోస్టులు భర్తీ చేయనున్నారు. ఎంఎన్‌జే సంస్థల్లో 81, తెలంగాణ మైనార్టీ రెసిడెన్షియల్ విద్యాసంస్థల్లో 127, దివ్యాంగులు, వయో వృద్ధుల సంక్షేమ విభాగంలో 8, మహాత్మాజ్యోతిబా పూలే విద్యా సంస్థల్లో 197, తెలంగాణ ట్రైబల్  వెల్ఫేర్ విద్యాసంస్థల్లో 74, తెలంగాణ సోషల్ వెల్ఫేర్‌లో 124, తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్‌లో 13 పోస్టులు భర్తీ చేయనున్నారు.

రాతపరీక్ష విధానం: మొత్తం 80 మార్కులకు రాతపరీక్ష నిర్వహిస్తారు. మల్టీపుల్ ఛాయిస్ విధానంలో మొత్తం 80 ప్రశ్నలు ఉంటాయి. ఒక్కో ప్రశ్నకు ఒకమార్కు. ఇంగ్లిష్‌లోనే పరీక్ష ఉంటుంది. తప్పుగా ఇచ్చిన జవాబులకి నెగెటివ్ మార్కులు ఉండవు.

నోటిఫికేషన్, రాతపరీక్ష వివరాల కోసం క్లిక్ చేయండి..

ALSO READ:

1876 ఎస్‌ఐ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ - అర్హతలు, ఇతర వివరాలు ఇలా!
ఢిల్లీ పోలీసు, సెంట్రల్ ఆర్మ్‌డ్ ఫోర్సెస్‌లో 1876 ఎస్‌ఐ (గ్రౌండ్ డ్యూటీ), ఎస్‌ఐ (ఎగ్జిక్యూటివ్) పోస్టుల భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ (SSC CPO 2023) విడుదల చేసింది. బీఎస్‌ఎఫ్, సీఐఎస్‌ఎఫ్, సీఆర్‌పీఎఫ్, ఐటీబీపీ, సశస్త్ర సీమాబల్ విభాగాలు సెంట్రల్ ఆర్మ్‌డ్ ఫోర్సెస్‌ కిందకు వస్తాయి. మొత్తం ఖాళీల్లో 1710 పురుషులకు కేటాయించగా.. 166 పోస్టులను మహిళలకు కేటాయించారు. డిగ్రీ అర్హత ఉన్నవారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అభ్యర్థులు ఆన్​లైన్​ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ పోస్టుల భర్తీకి జులై 21న నోటిఫికేషన్ విడుదలకాగా.. జులై 22 నుంచి ఆగస్టు 15 వరకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగనుంది. అక్టోబరులో రాతపరీక్ష నిర్వహించనున్నారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..

ఎయిమ్స్‌ రాయ్‌బరేలీలో 111 టెక్నీషియన్/ పారా మెడికల్ స్టాఫ్ పోస్టులు, అర్హతలివే!
రాయ్‌బరేలీలోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(ఎయిమ్స్‌) కాంట్రాక్ట్ ప్రాతిపదికన వివిధ టెక్నీషియన్స్/ పారా మెడికల్ స్టాఫ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 111 పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో 10+2, డిప్లొమా, డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా జులై 31 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. 
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..

హిందుస్థాన్‌ కాపర్‌ లిమిటెడ్‌లో 184 అప్రెంటిస్‌ ఖాళీలు, అర్హతలివే!
మధ్యప్రదేశ్‌ బాలాఘట్‌లోని హిందుస్థాన్‌ కాపర్‌ లిమిటెడ్‌(హెచ్‌సీఎల్‌) ఆధ్వర్యంలో పనిచేస్తున్న మలాంజ్‌ఖండ్‌ కాపర్‌ ప్రాజెక్ట్‌ అప్రెంటిస్‌ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పదోతరగతి లేదా ఇంటర్ అర్హతతోపాటు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అయితే మైనింగ్ విభాగంలో పోస్టులకు ఇంటర్ అర్హత అవసరం లేదు. అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా తమ దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CID VijayPal: ఏపీ సీఐడీ మాజీ డీఎస్పీ విజయ్ పాల్ అరెస్ట్ - రఘురామ కస్టోడియల్ టార్చర్ కేసులో పోలీసుల దూకుడు!
ఏపీ సీఐడీ మాజీ డీఎస్పీ విజయ్ పాల్ అరెస్ట్ - రఘురామ కస్టోడియల్ టార్చర్ కేసులో పోలీసుల దూకుడు!
Telangana Airports: తెలంగాణలో మరో 3 విమానాశ్రయాలు కావాలి, కేంద్రాన్ని కోరిన సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణలో మరో 3 విమానాశ్రయాలు కావాలి, కేంద్రాన్ని కోరిన సీఎం రేవంత్ రెడ్డి
అదానీ సౌరవిద్యుత్ వ్యవహారం- మాజీ సీఎం జగన్‌పై ఏసీబీకి ఫిర్యాదు
అదానీ సౌరవిద్యుత్ వ్యవహారం- మాజీ సీఎం జగన్‌పై ఏసీబీకి ఫిర్యాదు
Akhil Akkineni Engagement: సీక్రెట్‌గా ఫ్యామిలీ మెంబర్స్ మధ్య ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అఖిల్... అనౌన్స్ చేసిన నాగార్జున - అమ్మాయి ఎవరంటే?
సీక్రెట్‌గా ఫ్యామిలీ మెంబర్స్ మధ్య ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అఖిల్... అనౌన్స్ చేసిన నాగార్జున - అమ్మాయి ఎవరంటే?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

జీడిమెట్లలో భారీ అగ్ని ప్రమాదం, ఆ తప్పు వల్లే దట్టంగా మంటలుRail Bus in Mysore Rail Museum | తెలుగు రాష్ట్రాలకే ప్రత్యేకమైన రైలు బస్సు ఇలాగే ఉండేది | ABP DesamPrithvi Shaw Unsold IPL 2025 Auction | అద్భుతమైన భవిష్యత్తును చేతులారా నాశనం చేసుకున్న పృథ్వీ షా | ABP DesamMS Dhoni Auction Plan CSK IPL 2025 Team | ధోని ప్లాన్ వెనుక ఇంత మ్యాటర్ ఉందా..? | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CID VijayPal: ఏపీ సీఐడీ మాజీ డీఎస్పీ విజయ్ పాల్ అరెస్ట్ - రఘురామ కస్టోడియల్ టార్చర్ కేసులో పోలీసుల దూకుడు!
ఏపీ సీఐడీ మాజీ డీఎస్పీ విజయ్ పాల్ అరెస్ట్ - రఘురామ కస్టోడియల్ టార్చర్ కేసులో పోలీసుల దూకుడు!
Telangana Airports: తెలంగాణలో మరో 3 విమానాశ్రయాలు కావాలి, కేంద్రాన్ని కోరిన సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణలో మరో 3 విమానాశ్రయాలు కావాలి, కేంద్రాన్ని కోరిన సీఎం రేవంత్ రెడ్డి
అదానీ సౌరవిద్యుత్ వ్యవహారం- మాజీ సీఎం జగన్‌పై ఏసీబీకి ఫిర్యాదు
అదానీ సౌరవిద్యుత్ వ్యవహారం- మాజీ సీఎం జగన్‌పై ఏసీబీకి ఫిర్యాదు
Akhil Akkineni Engagement: సీక్రెట్‌గా ఫ్యామిలీ మెంబర్స్ మధ్య ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అఖిల్... అనౌన్స్ చేసిన నాగార్జున - అమ్మాయి ఎవరంటే?
సీక్రెట్‌గా ఫ్యామిలీ మెంబర్స్ మధ్య ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అఖిల్... అనౌన్స్ చేసిన నాగార్జున - అమ్మాయి ఎవరంటే?
Jio Best Prepaid Plan: జియో బెస్ట్ 84 రోజుల ప్లాన్ ఇదే - ఫ్రీగా డిస్నీప్లస్ హాట్‌స్టార్ కూడా!
జియో బెస్ట్ 84 రోజుల ప్లాన్ ఇదే - ఫ్రీగా డిస్నీప్లస్ హాట్‌స్టార్ కూడా!
Zainab Ravdjee : అఖిల్ చేసుకోబోయే అమ్మాయి జగన్ సలహాదారు కుమార్తె -  జైనాబ్ రావడ్జీ గురించి కొన్ని విషయాలు ఇవే
అఖిల్ చేసుకోబోయే అమ్మాయి జగన్ సలహాదారు కుమార్తె - జైనాబ్ రావడ్జీ గురించి కొన్ని విషయాలు ఇవే
Maruti Suzuki Export Record: విదేశాల్లోనూ దూసుకుపోతున్న మారుతి సుజుకి - ఏకంగా 30 లక్షల అమ్మకాలతో..!
విదేశాల్లోనూ దూసుకుపోతున్న మారుతి సుజుకి - ఏకంగా 30 లక్షల అమ్మకాలతో..!
Maharastra: మహారాష్ట్రలోని ప్రతిపక్ష నేతలకూ జగన్ పరిస్థితే - ప్రధాన ప్రతిపక్ష హోదా ఎవరికీ లేదు !
మహారాష్ట్రలోని ప్రతిపక్ష నేతలకూ జగన్ పరిస్థితే - ప్రధాన ప్రతిపక్ష హోదా ఎవరికీ లేదు !
Embed widget