JL Results: జూనియర్ లెక్చరర్ ఎంపిక ఫలితాలు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే
TGPSC JL Results: తెలంగాణలో జేఎల్ కెమిస్ట్రీ, ఫిజిక్స్, హిస్టరీ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు ప్రాథమిక ఎంపిక జాబితాలు టీజీపీఎస్సీ అక్టోబరు 28న విడుదల చేసింది. వెబ్‌సైట్‌లో ఫలితాలను అందుబాటులో ఉంచారు.
TGPSC JL Results: తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డులో జూనియర్ లెక్చరర్ పోస్టులకు సంబంధించిన ఫలితాలను టీజీపీఎస్సీ అక్టోబరు 28న విడుదల చేసింది. ఈ మేరకు ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల ప్రాథమిక జాబితాను అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. ఇదివరకే ఇతర సబ్జెక్టులకు ఎంపికైన అభ్యర్థుల జాబితా విడుదల చేయగా.. తాజాగా ఇతర సబ్జెక్టులకు సంబంధించి 325 మంది ఎంపికయ్యారు. ఇందులో కెమిస్ట్రీ-112 మంది, హిస్టరీ-75 మంది, హిస్టరీ (ఉర్దూమీడియం)-08 మంది, ఫిజిక్స్-110 మంది, ఫిజిక్స్ (ఉర్దూమీడియం)-11 మంది, సంస్కృతం-9 మంది ఉన్నారు.
జేఎల్ పోస్టుల ప్రాథమిక ఎంపిక జాబితా కోసం క్లిక్ చేయండి..
తెలంగాణలో 1392 జూనియర్ లెక్చరర్ల (Junior Lecturers) భర్తీకి టీఎస్‌పీఎస్సీ డిసెంబరు 9, 2022న నోటిఫికేషన్ విడుదల చేసింది. మల్టీ జోన్-1 లో 724 పోస్టులు, మల్టీ జోన్-2 లో 668 పోస్టులు ఉన్నాయి. డిసెంబరు 16 నుంచి 2023, జనవరి 6 వరకు అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్లో దరఖాస్తులు స్వీకరించారు. సెప్టెంబర్ 12 నుంచి అక్టోబర్ 3 వరకు జూనియర్ లెక్చరర్ పోస్టుల భర్తీకి పరీక్షలు నిర్వహించారు. మొత్తం 16 సబ్జెక్టులకు 11 రోజుల పాటు ఉదయం జనరల్ స్టడీస్ పేపర్ ఎగ్జామ్ నిర్వహించారు. మధ్యాహ్నం అభ్యర్థులకు సంబంధిత సబ్జెక్టు పేపర్ పరీక్షలు నిర్వహించారు. పరీక్షల ఆన్సర్ కీని విడుదల చేసి వారి నుంచి అభ్యంతరాలు స్వీకరించింది. ఆ తర్వాత ఫైనల్ కీతోపాటు అభ్యర్థుల జనరల్ ర్యాంకింగ్ జాబితాలను కమిషన్ విడుదల చేసింది. ఇందులో ఎంపికైనవారికి ఇంటర్వ్యూలు నిర్వహించి.. సబ్జెక్టులవారీగా ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల జాబితాలను టీజీపీఎస్సీ తాజాగా విడుదల చేసింది.
జులై 8న జూనియర్ లెక్చరర్స్ రాత పరీక్షల ఫలితాలను టీజీపీఎస్సీ విడుదల చేసింది. జనరల్ ర్యాంకింగ్ జాబితాలను సబ్జెక్టులవారీగా ఇచ్చారు. 1:2 నిష్పత్తిలో సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిర్వహించారు. పీడబ్ల్యూడీ అభ్యర్థులకు మాత్రం 1:5 నిష్పత్తిలో ధ్రువపత్రాల పరిశీలనకు అభ్యర్థులను ప్రకటించారు. ఈ ప్రక్రియ పూర్తి చేసి జూనియర్ లెక్చరర్స్ జేఎల్ పోస్టులకు ఎంపికైన వారి జాబితాను సబ్జెక్టుల వారీగా అధికారిక వెబ్ సైట్ లో విడుదల చేశారు. జేఎల్ పోస్టుల ప్రొవిజన్ లిస్టును టీజీపీఎస్సీ విడుదల చేసింది. అభ్యర్థులు ఫలితాలను అధికారిక వెబ్ సైట్‌లో చూసుకోవాలని కమిషన్ పేర్కొంది.
పోస్టుల వివరాలు: 1392
మల్టీ జోన్-1: 724 పోస్టులు
- ఆసిఫాబాద్-కుమ్రంభీమ్, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు
- ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల
- కరీంనగర్, సిరిసిల్ల-రాజన్న, సిద్దిపేట, మెదక్, కామారెడ్డి
- కొత్తగూడెం-భద్రాద్రి, ఖమ్మం, మహబూబాబాద్, హనుమకొండ (వరంగల్ అర్బన్), వరంగల్ (వరంగల్ రూలర్)
మల్టీ జోన్-2: 668 పోస్టులు
- సూర్యాపేట, నల్లగొండ, భువనగిరి-యాదాద్రి, జనగామ
- మేడ్చల్-మల్కాజ్‌గిరి, హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్
- మహబూబ్‌నగర్, నారాయణపేట, జోగుళాంబ-గద్వాల, వనపర్తి, నాగర్‌కర్నూలు
నోటిఫికేషన్, పోస్టుల పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
ALSO READ:
యూనియన్ బ్యాంకులో 1,500 లోకల్ బ్యాంక్ ఆఫీసర్ పోస్టులు
యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దేశవ్యాప్తంగా ఉన్న యూబీఐ శాఖల్లో 1500 లోకల్ బ్యాంక్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఏదైనా డిగ్రీ అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఈ పోస్టుల భర్తీకి సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ అక్టోబరు 24న ప్రారంభంకాగా.. అర్హులైన అభ్యర్థులు నవంబర్ 13లోగా దరఖాస్తులు సమర్పించవచ్చు. ఆన్‌లైన్ పరీక్ష, గ్రూప్ డిస్కషన్, అప్లికేషన్స్ స్క్రీనింగ్, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఉద్యోగ ఎంపికలు చేపడతారు. ఉద్యోగాలకు ఎంపికైనవారికి నెలకు రూ.48,480-రూ.85,920 జీతంగా చెల్లిస్తారు.
నోటిఫికేషన్, దరఖాస్తు వివరాల కోసం క్లిక్ చేయండి..