UBI LBI Recruitment: యూనియన్ బ్యాంకులో 1,500 లోకల్ బ్యాంక్ ఆఫీసర్ పోస్టులు, ఎంపికైతే రూ.85 వేల వరకు జీతం
UBI: ముంబయి ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్న యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దేశవ్యాప్తంగా ఉన్న యూబీఐ శాఖల్లో లోకల్ బ్యాంక్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. నవంబర్ 11లోగా దరఖాస్తు చేసుకోవచ్చు.
UBI Recruitment of Local Bank Officer: యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దేశవ్యాప్తంగా ఉన్న యూబీఐ శాఖల్లో లోకల్ బ్యాంక్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 1500 ఖాళీలను భర్తీచేయనున్నారు. ఏదైనా డిగ్రీ అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఈ పోస్టుల భర్తీకి సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ అక్టోబరు 24న ప్రారంభంకాగా.. అర్హులైన అభ్యర్థులు నవంబర్ 13లోగా దరఖాస్తులు సమర్పించవచ్చు. ఆన్‌లైన్ పరీక్ష, గ్రూప్ డిస్కషన్, అప్లికేషన్స్ స్క్రీనింగ్, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఉద్యోగ ఎంపికలు చేపడతారు. ఉద్యోగాలకు ఎంపికైనవారికి నెలకు రూ.48,480-రూ.85,920 జీతంగా చెల్లిస్తారు.
వివరాలు..
➥ లోకల్ బ్యాంక్ ఆఫీసర్ (LBO) (జేఎంజీఎస్-I స్కేల్)
ఖాళీల సంఖ్య: 1,500 పోస్టులు.
పోస్టుల కేటాయింపు: ఎస్సీ-224; ఎస్టీ-109; ఓబీసీ-404; ఈడబ్ల్యూఎస్-150; యూఆర్-613.
రాష్ట్రాల వారీగా ఖాళీలు..
రాష్ట్రం | పోస్టులు |
ఆంధ్రప్రదేశ్ | 200 |
తెలంగాణ | 200 |
అస్సాం | 50 |
గుజరాత్ | 200 |
కర్ణాటక | 300 |
కేరళ | 100 |
మహారాష్ట్ర | 50 |
ఒడిశా | 100 |
తమిళనాడు | 200 |
పశ్చిమ్ బెంగాల్ | 100 |
మొత్తం ఖాళీలు | 1500 |
అర్హతలు: గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా విద్యాసంస్థ నుంచి ఏదైనా విభాగంలో రెగ్యులర్ బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
వయోపరిమితి: 01.10.2024 నాటికి 20 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఎంపిక విధానం: ఆన్‌లైన్ పరీక్ష, గ్రూప్ డిస్కషన్, అప్లికేషన్స్ స్క్రీనింగ్, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా.
దరఖాస్తు ఫీజు: జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ అభ్యర్థులు రూ.850 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు రూ.175 చెల్లిస్తే సరిపోతుంది.
రాతపరీక్ష విధానం..
➥ మొత్తం 200 మార్కులకు రాతపరీక్ష, 25 మార్కులకు ఇంగ్లిష్ లాంగ్వేజ్ పరీక్ష ఉంటుంది.
➥ రాతపరీక్షలో రీజనింగ్ & కంప్యూటర్ ఆప్టిట్యూడ్-45 ప్రశ్నలు-60 మార్కులు, జనరల్/ఎకానమీ/బ్యాంకింగ్ అవేర్‌నెస్-40 ప్రశ్నలు-40 మార్కులు), డేటా అనాలిసిస్ & ఇంటర్‌ప్రెటేషన్-35 ప్రశ్నలు-60 మార్కులు, ఇంగ్లిష్ లాంగ్వేజ్-35 ప్రశ్నలు-40 మార్కులు ఉంటాయి.
➥ పరీక్ష సమయం 180 నిమిషాలు.
➥ఇక ఇంగ్లిష్ లాంగ్వేజ్ టెస్ట్‌లో లెటర్ రైటింగ్, ఎస్సే-2 ప్రశ్నలు-25 మార్కులు ఉంటాయి. పరీక్ష సమయం 30 నిమిషాలు.
➥ ఇంగ్లిష్ మినహాయించి మిగతా అన్ని ప్రశ్నలు ఇంగ్లిష్, హిందీ మాధ్యమాల్లో ఉంటాయి.
➥ పరీక్షలో నెగెటివ్ మార్కుల విధానం అమల్లో ఉంది. ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్కల చొప్పున కోత విధిస్తారు.
ఇంటర్వ్యూ విధానం: రాతపరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులను 1:3 నిష్పత్తిలో ఇంటర్వ్యూకు అభ్యర్థులను ఎంపికచేస్తారు. మొత్తం 100 మార్కులకు ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. ఇంటర్వ్యూలో కనీస అర్హత మార్కులను 40 శాతంగా నిర్ణయించారు. ఇక ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, దివ్యాంగులకు 35 శాతంగా నిర్ణయించారు.
తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: అమరావతి, అనంతపురం, ఏలూరు, గుంటూరు/ విజయవాడ, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజమహేంద్రవరం, శ్రీకాకుళం, తిరుపతి, విశాఖపట్నం, విజయనగరం, హైదరాబాద్/ సికింద్రాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్.
జీతం: నెలకు రూ.48,480-రూ.85,920.
ముఖ్యమైన తేదీలు..
➥ ఆన్‌లైన్ దరఖాస్తు, ఫీజు చెల్లింపు ప్రక్రియ ప్రారంభం: 24.10.2024.
➥ ఆన్‌లైన్ దరఖాస్తు, ఫీజు చెల్లింపునకు చివరితేదీ: 13.11.2024.
➥ దరఖాస్తు ప్రింట్ తీసుకోవడానికి చివరితేదీ: 28.11.2024.