News
News
X

TS Police: కానిస్టేబుల్ ప్రిలిమినరీ పరీక్షపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం, క్లారిటీ ఇచ్చిన బోర్డు!

పోలీసు కానిస్టేబుల్ ప్రిలిమినరీ పరీక్షలో సెట్-Dలో 13ప్రశ్నలు గందరగోళంగా ఉన్నట్లు రిక్రూట్మెంట్ బోర్డ్‌కు ఫిర్యాదులు అందాయి. దీనిపై పూర్తిస్థాయిలో పరిశీలించి రెండు రోజుల్లో క్లారిటీ..

FOLLOW US: 

ఆగస్టు 28న రాష్ట్రవ్యాప్తంగా ఎంతో పకడ్బంధీగా నిర్వహించిన కానిస్టేబుల్ ప్రిలిమినరీ ప్రశ్నాపత్రంలో తప్పులున్నాయంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు స్పందించింది. కానిస్టేబుల్ క్వశ్చన్ పేపర్‌లోని ప్రశ్నలు గందరగోళంగా ఉన్నట్లు జరుగుతోన్న వదంతులపై ఆగ్రహం వ్యక్తం చేసింది. సెట్ D లో 13 ప్రశ్నలు గందరగోళంగా ఉన్నట్లు రిక్రూట్మెంట్ బోర్డ్ కు ఫిర్యాదులు అందాయని ఉన్నతాధికారులు తెలిపారు. దీనిపై పూర్తిస్థాయిలో పరిశీలించి రెండు రోజుల్లో క్లారిటీ ఇస్తామని పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డ్ తెలిపింది. సోషల్  మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని నమ్మొద్దని అభ్యర్థులకు రిక్రూట్ మెంట్ బోర్డ్ చైర్మన్ శ్రీనివాసరావు తెలిపారు. నిపుణుల కమిటీతో చర్చించి వారు ఇచ్చే రిపోర్ట్ ఆధారంగా నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. వివరణ వచ్చేంతవరకు వదంతులు నమ్మొద్దని  శ్రీనివాసరావు పేర్కొన్నారు.Also Read: TS Police Jobs: టెక్నికల్ పోస్టులకు ప్రిలిమినరీ పరీక్ష లేదు, స్పష్టం చేసిన బోర్డు!


ముఖ్యంగా సి సిరీస్ ఓఎమ్మార్ షీట్‌లో పొరపాట్లు జరిగాయంటూ అభ్యర్థులు ఆందోళనకు గురయ్యారు. ప్రశ్నాపత్నం బుక్ కోడ్‌లో ఆరు సంఖ్య రాగా.. దాని ఎలా బబ్లింగ్ చేయాలో అర్థం కాక అభ్యర్థులు అయోమయానికి గురయ్యారు. పలు ప్రాంతాల్లో అభ్యర్థులు ఆందోళన చేశారు. దీంతో పోలీసు నియామకమండలి స్పందించింది. OMR షీట్లలో నెలకొన్న గందరగోళంపై క్లారిటీ ఇచ్చింది. బుక్ కోడ్ కేవలం నిర్ధారణ కోసమేనని... అది సరిగా నింపకున్నా అభ్యర్థులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. రాత పరీక్ష రాసిన అభ్యర్థులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పోలీస్ నియామక మండలి తెలిపింది. బుక్ కోడ్ రాయకున్నా వాటిని మూల్యాంకనం చేస్తామని వెల్లడించింది.Also Read: DRDO Recruitment: డీఆర్‌డీఓ -సెప్టంలో 1901 ఖాళీలు, అర్హతలివే!ఆదివారం జరిగిన కానిస్టేబుల్ రాత పరీక్షలో 'సీ' సిరీస్ బుక్ లెట్‌లో తప్పులు దొర్లాయి. క్యూబీ కోడ్‌లో 6వ అంకె ప్రింట్ కావడంతో అభ్యర్థులు గందరగోళానికి గురయ్యారు. సాధారణంగా  ఓఎంఆర్ షీట్ ప్రశ్నాపత్నం బుక్ కోడ్ లో 1 నుంచి ఐదు నెంబర్లు ఉంటాయి. కాని కానిస్టేబుల్ ప్రశ్నాపత్నంలో క్యూబీ కోడ్ లో 6 నెంబర్ వచ్చింది. దీంతో ఎలా బబ్లింగ్ చేయాలో తెలియక అభ్యర్థులు గందరగోళానికి గురయ్యారు. ఇన్విజిలేటర్లు పరిష్కారం చూపలేకపోయారు. అభ్యర్థుల ఆందోళనను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. పరీక్ష రాయాలని సూచించడంతో అభ్యర్థులు ఎగ్జామ్ రాశారు. కాని తమ ఓఎంఆర్ షీట్ ను పరిగణలోకి తీసుకుంటారోలేదోనని ఆందోళనకు గురవుతున్నారు. రాక రాక నోటిఫికేషన్ వచ్చిందని, చేయని తప్పుకు తాము బలికావాల్సి వస్తుందేమోనని కొందరు ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో అభ్యర్థుల ఆందోళనతో క్లారిటీ ఇచ్చింది పోలీసు రిక్రూట్ మెంట్ బోర్డు.


Also Read: AP DSC Jobs: ఏపీ ఆదర్శ పాఠశాలల్లో 207 టీచర్ పోస్టులు13 మార్కులు కలిసే అవకాశం..?
తెలంగాణ కానిస్టేబుల్ ప్రిలిమినరీ పరీక్ష ప్రశ్నపత్రంలో తప్పులు వచ్చాయి. 13 ప్రశ్నల్లో గందరగోళం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఫిర్యాదులు ఎక్కువ వస్తే మార్కులు కలిపే అవకాశం ఉన్నట్లు సమాచారం. కనీసం 8 మార్కులు కలిపేందుకు అవకాశం ఉన్నట్లు నిపుణులు తెలిపారు. మొత్తం రాష్ట్రవ్యాప్తంగా 16వందల సెంటర్లలో పరీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే. 15,644 పోస్టులకు గాను 9.50 లక్షలకు పైగా దరఖాస్తులు వచ్చాయి.


91.34 శాతం హాజరు..?
తెలంగాణలో కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నిర్వహించిన ప్రిలిమినరీ రాతపరీక్ష రాష్ట్రవ్యాప్తంగా ఆగస్టు 28న నిర్వహించిన సంగతి తెలిసిందే. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్ష జరిగింది. హైదరాబాద్‌తో రాష్ట్రవ్యాప్తంగా 38 పట్టణాల్లో ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించారు. పరీక్షను షెడ్యూల్‌ ప్రకారం.. అన్ని నియమ నిబంధనల మేరకు.. సజావుగా నిర్వహించారు. పరీక్షకు హాజరైన అభ్యర్థుల బయోమెట్రిక్‌ హాజరు, వేలిముద్రల సేకరణ, డిజిటల్‌ విధానంలో ఫొటోలు సేకరించారు. రాతపరీక్షకు సంబంధించిన ప్రిలిమినరీ కీని త్వరలోనే వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనున్నారు. కానిస్టేబుల్ ప్రిలిమినరీ రాత పరీక్షకు రాష్ట్రవ్యాప్తంగా 6,61,196 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా.. 6,03,955 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. మొత్తం 91.34శాతం హాజరు నమోదైంది. అత్యధికంగా వికారాబాద్ జిల్లాలో (97.41 %) హాజరు నమోదుకాగా.. అత్యల్పముగా సత్తుపల్లి జిల్లాలో (83.30 %) నమోదైంది.Also Read: AP IEDSS: ఏపీ ఐఈడీఎస్‌ఎస్‌ ప్రత్యేక విద్యలో 81 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు


అర్హత మార్కులు కుదింపు:
కానిస్టేబుల్ ప్రాథమిక రాతపరీక్షలో ఈసారి కనీస అర్హత మార్కుల్ని కుదించారు. ఇప్పటివరకు జరిగిన పరీక్షల్లో ఎస్సీ/ఎస్టీలు 30శాతం.. బీసీలు 35శాతం.. ఇతరులు 40శాతం కనీస మార్కులు సాధిస్తేనే అర్హులుగా పరిగణించేవారు. ఈసారి సామాజికవర్గాలతో నిమిత్తం లేకుండా అందరికీ 30శాతం కనీస మార్కులనే అర్హతగా పరిగణిస్తారు. రాతపరీక్షలో మొత్తం 200 ప్రశ్నలుంటాయి. వీటిలో 60 మార్కులు వస్తే సరిపోతుంది. ఆబ్జెక్టివ్ విధానంలోనే ప్రశ్నలు అడుగుతారు. నెగెటివ్ మార్కులు ఉంటాయి. ప్రతి 5 తప్పు సమాధానాలకు ఒక మార్కు కోత విధిస్తారు. ప్రిలిమినరీ రాతపరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులే తర్వాత దశలో నిర్వహించే శారీరక సామర్థ్య పరీక్షలకు హాజరువుతారు. ఇందులోనూ అర్హత సాధించిన అభ్యర్థులు తుది రాతపరీక్షకు అర్హత సాధిస్తారు. తుది పరీక్షలో మాత్రం నెగెటివ్ మార్కులుండవు.

 

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...

Published at : 29 Aug 2022 07:04 PM (IST) Tags: TS Police Exam TSLPRB Constable Exam Constable Exam Question Paper Telangana Constable Prlelims Exam

సంబంధిత కథనాలు

Andhra Pradesh News: 62 ఏళ్లకు రిటైర్మెంట్ పెంపు వారికి వర్తించదు - ఏపీ ఆర్థికశాఖ క్లారిటీ

Andhra Pradesh News: 62 ఏళ్లకు రిటైర్మెంట్ పెంపు వారికి వర్తించదు - ఏపీ ఆర్థికశాఖ క్లారిటీ

NABARD Jobs: డిగ్రీ అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం, వెంటనే దరఖాస్తు చేసుకోండి

NABARD Jobs: డిగ్రీ అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం, వెంటనే దరఖాస్తు చేసుకోండి

SSC Stenographer: స్టెనోగ్రాఫర్ స్కిల్ టెస్ట్ ఫలితాలు విడుదల, ఇక్కడ చూసుకోండి! డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఎప్పుడంటే?

SSC Stenographer: స్టెనోగ్రాఫర్ స్కిల్ టెస్ట్ ఫలితాలు విడుదల, ఇక్కడ చూసుకోండి! డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఎప్పుడంటే?

UPSC CDS Results: యూపీఎస్సీ సీడీఎస్ఈ (II) - 2022 ఫలితాలు విడుదల, ఇలా చెక్ చేసుకోండి!

UPSC CDS Results: యూపీఎస్సీ సీడీఎస్ఈ (II) - 2022 ఫలితాలు విడుదల, ఇలా చెక్ చేసుకోండి!

SAIL: స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియాలో 200 ఖాళీలు, అర్హతలివే!

SAIL: స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియాలో 200 ఖాళీలు, అర్హతలివే!

టాప్ స్టోరీస్

Pawan Politics : పవన్ లక్ష్యం అసెంబ్లీలో అడుగు పెట్టడమా .. అధికారమా? పార్ట్‌టైమ్ పాలిటిక్స్‌తో సాధించేదేంటి ?

Pawan Politics : పవన్ లక్ష్యం అసెంబ్లీలో అడుగు పెట్టడమా  .. అధికారమా? పార్ట్‌టైమ్ పాలిటిక్స్‌తో సాధించేదేంటి ?

Minister Jogi Ramesh : బాలకృష్ణకు పునర్జన్మనిచ్చింది వైఎస్సార్, చంద్రబాబు చేసిన ద్రోహం మర్చిపోయారా?- మంత్రి జోగి రమేష్

Minister Jogi Ramesh :  బాలకృష్ణకు పునర్జన్మనిచ్చింది వైఎస్సార్, చంద్రబాబు చేసిన ద్రోహం మర్చిపోయారా?- మంత్రి జోగి రమేష్

Hyderabad News : వంద శాతం మురుగునీటి శుద్ధి నగరంగా హైదరాబాద్- మంత్రి కేటీఆర్

Hyderabad News : వంద శాతం మురుగునీటి శుద్ధి నగరంగా హైదరాబాద్- మంత్రి కేటీఆర్

Bigg Boss 6 Telugu: ఈ వారం ఎలిమినేషన్ - నేహా చౌదరి అవుట్?

Bigg Boss 6 Telugu: ఈ వారం ఎలిమినేషన్ - నేహా చౌదరి అవుట్?