News
News
X

TS Police Jobs: టెక్నికల్ పోస్టులకు ప్రిలిమినరీ పరీక్ష లేదు, స్పష్టం చేసిన బోర్డు!

టెక్నికల్ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు నేరుగా శారీరక సామర్థ్య పరీక్షలకు హాజరుకావాల్సి ఉంటుంది. వీరికి తుది రాతపరీక్ష మాత్రం తప్పనిసరి అని ఉన్నతాధికారులు స్పష్టం చేశారు

FOLLOW US: 

కానిస్టేబుల్  పోస్టుల భర్తీ నోటిఫికేషన్  మేరకు సాంకేతిక పోస్టులకు ప్రాథమిక రాతపరీక్ష లేదని పోలీసు నియామక మండలి(TSLPRB) స్పష్టం చేసింది. 16 వేలకు పైగా కానిస్టేబుల్  పోస్టుల నియామకానికి ఆగస్టు 28న రాష్ట్రవ్యాప్తంగా ప్రాథమిక రాత పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. అయితే ఈ పరీక్ష నుంచి ఐటీ &  కమ్యూనికేషన్  విభాగం (డ్రైవర్ /మెకానిక్ )లో 383 పోస్టులకు, అగ్నిమాపకశాఖ (డ్రైవర్ ఆపరేటర్)లో 225 పోస్టులకు రాత పరీక్ష మినహాయించారు. ఈ విషయం తెలియని ఆయా అభ్యర్థులు గందరగోళానికి లోనయ్యారు.


ఈ విషయమై పోలీసు రిక్రూట్‌మెంట్ బోర్డు హెల్ప్ లైన్‌కు ఫోన్లతోపాటు సపోర్ట్  సెంటర్‌కు మెయిల్స్  ద్వారా ఫిర్యాదులు చేశారు. దీంతో వారికి పరీక్ష లేదని మండలి వివరణ ఇచ్చింది. ఈ అభ్యర్థులు నేరుగా శారీరక సామర్థ్య పరీక్షలకు హాజరుకావాల్సి ఉంటుంది. వీరికి తుది రాతపరీక్ష మాత్రం తప్పనిసరి అని ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. ఈ అభ్యర్థులు తగినంత ఎత్తు ఉండి.. పరుగు పందెం, లాంగ్ జంప్ , షాట్ పుట్  వంటి శారీరక సామర్థ్య పరీక్షల్లో ఉత్తీర్ణత సాధిస్తే వారికి ట్రేడ్  టెస్ట్ , డ్రైవింగ్  టెస్ట్  నిర్వహిస్తారు. వీటిలో కనీసం 50 శాతం మార్కులు సాధిస్తే తుది రాతపరీక్షకు ఎంపిక చేస్తారు.


ఇదిలా ఉండగా.. తెలంగాణలో కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నిర్వహించిన ప్రిలిమినరీ రాతపరీక్ష రాష్ట్రవ్యాప్తంగా ప్రశాంత వాతావరణంలో జరిగింది. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్ష జరిగింది. హైదరాబాద్‌తో రాష్ట్రవ్యాప్తంగా 38 పట్టణాల్లో ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించినట్లు బోర్డు తెలిపింది. పరీక్షను షెడ్యూల్‌ ప్రకారం.. అన్ని నియమ నిబంధనల మేరకు.. సజావుగా నిర్వహించినట్లు చెప్పింది. పరీక్షకు హాజరైన అభ్యర్థుల బయోమెట్రిక్‌ హాజరు, వేలిముద్రల సేకరణ, డిజిటల్‌ విధానంలో ఫొటోలు సేకరించినట్లు పేర్కొంది. రాతపరీక్షకు సంబంధించిన ప్రిలిమినరీ కీని త్వరలోనే వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనున్నట్లు బోర్డు పేర్కొంది.91.34శాతం హాజరు నమోదు
కానిస్టేబుల్ ప్రిలిమినరీ రాత పరీక్షకు రాష్ట్రవ్యాప్తంగా 6,61,196 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా.. 6,03,955 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. మొత్తం 91.34శాతం హాజరు నమోదైంది. అత్యధికంగా వికారాబాద్ జిల్లాలో (97.41 %) హాజరు నమోదుకాగా.. అత్యల్పముగా సత్తుపల్లి జిల్లాలో (83.30 %) నమోదైంది.

జిల్లాలవారీగా పరీక్ష హాజరు వివరాల కోసం క్లిక్ చేయండి..

 

తెలంగాణలో సివిల్‌, ట్రాన్స్‌పోర్టు, ఎక్సైజ్‌ కానిస్టేబుల్‌ పోస్టుల భర్తీకి తెలంగాణ రాష్ట్రస్థాయి పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు ఆగస్టు 28న పరీక్షలు నిర్వహించింది. సివిల్‌ ఇతర విభాగాల్లో 15,644, రవాణాశాఖలో 63, ఎక్సైజ్‌శాఖలో 614 కానిస్టేబుల్‌ పోస్టుల భర్తీకి నియామకానికి గత ఏప్రిల్‌లో నోటిషికేషన్‌ విడుదల చేసిన విషయం విదితమే. ఆయా పోస్టులకు 6,61,196 మంది అభ్యర్థులు దరఖాస్తులు చేసుకున్నారు.

అర్హత మార్కులు కుదింపు:
కానిస్టేబుల్ ప్రాథమిక రాతపరీక్షలో ఈసారి కనీస అర్హత మార్కుల్ని కుదించారు. ఇప్పటివరకు జరిగిన పరీక్షల్లో ఎస్సీ/ఎస్టీలు 30శాతం.. బీసీలు 35శాతం.. ఇతరులు 40శాతం కనీస మార్కులు సాధిస్తేనే అర్హులుగా పరిగణించేవారు. ఈసారి సామాజికవర్గాలతో నిమిత్తం లేకుండా అందరికీ 30శాతం కనీస మార్కులనే అర్హతగా పరిగణిస్తారు. రాతపరీక్షలో మొత్తం 200 ప్రశ్నలుంటాయి. వీటిలో 60 మార్కులు వస్తే సరిపోతుంది. ఆబ్జెక్టివ్ విధానంలోనే ప్రశ్నలు అడుగుతారు. నెగెటివ్ మార్కులు ఉంటాయి. ప్రతి 5 తప్పు సమాధానాలకు ఒక మార్కు కోత విధిస్తారు. ప్రిలిమినరీ రాతపరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులే తర్వాత దశలో నిర్వహించే శారీరక సామర్థ్య పరీక్షలకు హాజరువుతారు. ఇందులోనూ అర్హత సాధించిన అభ్యర్థులు తుది రాతపరీక్షకు అర్హత సాధిస్తారు. తుది పరీక్షలో మాత్రం నెగెటివ్ మార్కులుండవు.

 

Also Read:

DRDO Recruitment: డీఆర్‌డీఓ -సెప్టంలో 1901 ఖాళీలు, అర్హతలివే!

భార‌త ర‌క్షణ మంత్రిత్వ శాఖ‌కు చెందిన డిఫెన్స్ రిసెర్చ్ & డెవ‌ల‌ప్‌మెంట్ ఆర్గనేజేష‌న్(డీఆర్‌డీఓ) ఆధ్వర్యంలోని సెంట‌ర్ ఫ‌ర్ ప‌ర్సన‌ల్ టాలెంట్ మేనేజ్‌మెంట్ (సెప్టం) సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్-బి(ఎస్‌టిఏ- B),టెక్నీషియన్-A (టెక్-A) పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది. సరైన అర్హతలు, ఆసక్తి గల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. సెప్టెంబరు 3 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకానుంది. సెప్టెంబరు 23 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.100 చెల్లించాల్సి ఉంటుంది. మహిళలు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్ సర్వీస్‌మెన్ అభ్యర్థులకు ఫీజు చెల్లించాల్సిన అవసరంలేదు. వీరికి ఫీజు నుంచి మినహాయింపు ఉంది. ఆన్‌లైన్ ద్వారానే ఫీజు చెల్లించాలి. రాత పరీక్ష, స్కిల్ టెస్ట్ (అవసరమైతే), డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ద్వారా ఉద్యోగ ఎంపికలు చేపడతారు.

నోటిఫికేషన్, తదితర వివరాల కోసం క్లిక్ చేయండి..


Also Read:

SAIL: స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు, ఈ అర్హతలుండాలి!
స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా ఝార్ఖండ్‌లోని బొకారో స్టీల్ ప్లాంట్‌లో అటెండెంట్ కమ్ టెక్నీషియన్ ట్రైనీ ఖాళీలను భర్తీ చేయనున్నారు. పదోతరగతితోపాటు సంబంధిత ట్రేడ్‌లో అప్రెంటిస్‌ శిక్షణ పూర్తిచేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. దరఖాస్తు ఫీజుగా అభ్యర్థులు రూ.200 చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్-సర్వీస్‌మెన్, డిపార్ట్‌మెంటల్ అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంది. ఈ పోస్టుల భర్తీకి ఆగస్టు 25న దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకాగా.. సెప్టెంబరు 15 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
నోటిఫికేషన్, తదితర వివరాల కోసం క్లిక్ చేయండి..

 

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...

Published at : 29 Aug 2022 06:59 AM (IST) Tags: TSLPRB Recruitment 2022 TS Constable Technical Posts TS Constable Prelims TS Constable Technical Posts Recruitment

సంబంధిత కథనాలు

ECIL: ఈసీఐఎల్‌-హైదరాబాద్‌లో 284 అప్రెంటిస్‌ పోస్టులు, అర్హతలివే

ECIL: ఈసీఐఎల్‌-హైదరాబాద్‌లో 284 అప్రెంటిస్‌ పోస్టులు, అర్హతలివే

TS Jobs: గుడ్ న్యూస్, త్వరలో 738 లెక్చరర్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్!

TS Jobs: గుడ్ న్యూస్, త్వరలో 738 లెక్చరర్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్!

NAC Training: 30,625 మంది నిరుద్యోగులకు శిక్షణ, న్యాక్ సమావేశంలో నిర్ణయం!

NAC Training: 30,625 మంది నిరుద్యోగులకు శిక్షణ, న్యాక్ సమావేశంలో నిర్ణయం!

IOCL Recruitment 2022: ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్‌లో 1535 ఖాళీలు, దరఖాస్తుకు అర్హతలివే!

IOCL Recruitment 2022: ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్‌లో 1535 ఖాళీలు, దరఖాస్తుకు అర్హతలివే!

ONGC Recruitment: ఓఎన్‌జీసీలో 871 గ్రాడ్యుయేట్ ట్రైనీ పోస్టులు, అదిరిపోయే జీతం, ఈ అర్హత తప్పనిసరి!

ONGC Recruitment: ఓఎన్‌జీసీలో 871 గ్రాడ్యుయేట్ ట్రైనీ పోస్టులు, అదిరిపోయే జీతం, ఈ అర్హత తప్పనిసరి!

టాప్ స్టోరీస్

పద్దతి దాటితే కుల్లం కల్లం మాట్లాడతా, షర్మిల గురించి డెప్త్‌ విషయాలు చెప్తా: జగ్గారెడ్డి

పద్దతి దాటితే కుల్లం కల్లం మాట్లాడతా, షర్మిల గురించి డెప్త్‌ విషయాలు చెప్తా: జగ్గారెడ్డి

Atchannaidu: రాష్ట్రం బొత్సా జాగీరు కాదు, ఉత్తరాంధ్ర మంత్రులపై అచ్చెన్నాయుడు అనుచిత వ్యాఖ్యలు

Atchannaidu: రాష్ట్రం బొత్సా జాగీరు కాదు, ఉత్తరాంధ్ర మంత్రులపై అచ్చెన్నాయుడు అనుచిత వ్యాఖ్యలు

Tulasi Reddy On AP Capitals: ఆ ప్రాంతాన్ని మాత్రమే రాష్ట్ర రాజధాని అంటారు: తులసి రెడ్డి కీలక వ్యాఖ్యలు

Tulasi Reddy On AP Capitals: ఆ ప్రాంతాన్ని మాత్రమే రాష్ట్ర రాజధాని అంటారు: తులసి రెడ్డి కీలక వ్యాఖ్యలు

NIA Searches: పీఎఫ్ఐపై ఎన్ఐఏ ఫోకస్! దేశవ్యాప్తంగా స్పెషల్ ఆపరేషన్, పలువురి అరెస్టు - సడెన్‌గా ఎందుకిలా?

NIA Searches: పీఎఫ్ఐపై ఎన్ఐఏ ఫోకస్! దేశవ్యాప్తంగా స్పెషల్ ఆపరేషన్, పలువురి అరెస్టు - సడెన్‌గా ఎందుకిలా?