అన్వేషించండి

High Court: 'గ్రూప్-1' వయోపరిమితిపై ప్రభుత్వానికి హైకోర్టు కీలక ఆదేశాలు, ఏమందంటే?

గ్రూప్-1 పోస్టుల వయోపరిమితిని 46 నుంచి 51కి పెంచేలా ఆదేశాలు జారీ చేయాలంటూ నమోదైన పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి కీలక ఆదేశాలు జారీ చేసింది..

TSPSC Group1 Age Lmit: తెలంగాణ ప్రభుత్వం ఇటీవల గ్రూప్-1 పోస్టుల భర్తీకి పచ్చజెంగా ఊపిన సంగతి తెలిసిందే. ఈ మేరకు ఫిబ్రవరి 19న టీఎస్‌పీస్సీ 563 గ్రూప్-1 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసి, ఫిబ్రవరి 23 నుంచి దరఖాస్తులు స్వీకరిస్తోంది. ప్రభుత్వ ఉద్యోగాల్లో వయోపరిమితిని పెంచుతూ ఇటీవల ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా 'గ్రూప్‌-1' నోటిఫికేషన్‌తోపాటు టీఎస్‌పీఎస్సీ విడుదల చేసే తర్వాతి నోటిఫికేషన్‌లోనూ వయోపరిమితిని 44 నుంచి 46 సంవత్సరాలకు పెంచారు. అయితే వయోపరిమితిని 46 నుంచి 51కి పెంచేలా ఆదేశాలు జారీ చేయాలంటూ ఎ.శ్రీనివాసరెడ్డి హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. 

ఈ పిటిషన్‌పై ఫిబ్రవరి 28న విచారణ జరిపిన హైకోర్టు వయోపరిమితిని పెంచాలన్న నిరుద్యోగుల వినతి పత్రాన్ని పరిశీలించాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. 2017 నుంచి ఎలాంటి నోటిఫికేషన్‌ విడుదల కానందునా వయోపరిమితి 46 నుంచి 51 వరకు పెంచేలా ఆదేశాలు జారీ చేయాలంటూ ఎ.శ్రీనివాసరెడ్డి పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్‌ పుల్లా కార్తీక్‌ విచారణ చేపట్టారు. పిటిషనర్‌ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ 2017 నుంచి నియామక నోటిఫికేషన్‌ జారీ కాలేదన్నారు. వాదనలను విన్న న్యాయమూర్తి పిటిషనర్లు ఇచ్చిన వినతి పత్రాన్ని చట్ట ప్రకారం 4 వారాల్లో పరిష్కరించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఆదేశాలు జారీ చేశారు.

గ్రూప్-1 పోస్టుల వివరాలు..

క్ర.సం పోస్టులు ఖాళీల సంఖ్య
1. డిప్యూటీ కలెక్టర్ 45
2. డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (DSP) 115
3. కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ 48
4. రీజినల్ ట్రాన్స్‌పోర్ట్ ఆఫీసర్ 04
5. డిస్ట్రిక్ట్ పంచాయత్ ఆఫీసర్ 07
6. డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ 06
7. డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ జైల్స్ (మెన్) 05
8. అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ లేబర్ 08
9. అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ 30
10. మున్సిపల్ కమిషనర్ (గ్రేడ్-2) 41
11. డిస్ట్రిక్ట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్/
డిస్ట్రిక్ట్ షెడ్యూల్డ్ క్యాస్ట్ డెవలప్‌మెంట్ ఆఫీసర్
03
12. డిస్ట్రిక్ట్ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్/
అసిస్టెంట్ డైరెక్టర్ (డిస్ట్రిక్ట్ బీసీ డెవలప్‌మెంట్ ఆఫీసర్)
05
13. డిస్ట్రిక్ట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ 02
14. డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్‌మెంట్ ఆఫీసర్ 05
15. అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్/లే సెక్రటరీ& ట్రెజరర్ గ్రేడ్-2 20
16. అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్/అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్/ అసిస్టెంట్ లెక్చరర్ (ట్రైనింగ్ కాలేజ్ అండ్ స్కూల్) 38
17. అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్‌మెంట్ ఆఫీసర్ 41
18. మండల పరిషత్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ 140
  మొత్తం ఖాళీలు 563

నోటిఫికేషన్, పోస్టుల పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.

ఎంపిక విధానం: ప్రిలిమ్స్, మెయిన్ పరీక్షల ఆధారంగా.

దరఖాస్తు ఫీజు: అభ్యర్థులు దరఖాస్తు ప్రాసెసింగ్ ఫీజు కింద రూ.200, పరీక్ష ఫీజు కింద రూ.120 చెల్లించాల్సి ఉంటుంది. నిరుద్యోగ అభ్యర్థులకు పరీక్ష ఫీజు నుంచి, రాష్ట్రప్రభుత్వ ఉద్యోగులకు దరఖాస్తు ఫీజు నుంచి మినహాయింపు వర్తిస్తుంది.

పరీక్ష విధానం: మొత్తం 150 మార్కులకు ప్రిలిమ్స్ పరీక్ష (జనరల్ స్టడీస్ & మెంటల్ ఎబిలిటీ), 900 మార్కులకు మెయిన్ (6 పేపర్లు) పరీక్షలు నిర్వహిస్తారు. ఒక్కో పేపరుకు 150 మార్కులు ఉంటాయి. ఇక మెయిన్ పరీక్షలో 150 మార్కులకు జనరల్ ఇంగ్లిష్ అర్హత పరీక్ష నిర్వహిస్తారు. 

ముఖ్యమైన తేదీలు..

ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం 23.02.2024.
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది 14.03.2024. (5:00 PM)
దరఖాస్తుల సవరణకు అవకాశం 23.03.2024 (10:00 A.M.) - 27.03.2024 (5:00 P.M.)
గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష హాల్‌టికెట్లు పరీక్షకు వారం ముందు నుంచి అందుబాటులో
ప్రిలిమినరీ పరీక్ష మే/జూన్ 2024.
మెయిన్ పరీక్ష సెప్టెంబరు/అక్టోబరు 2024.

Notification

Online Application

Website

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...

టాప్ హెడ్ లైన్స్

How To Become Guest Faculty: కేంద్రీయ విశ్వవిద్యాలయంలో అతిథి అధ్యాపకులుగా ఎలా చేరాలి? ఎలా అప్లై చేసుకోవాలి?
కేంద్రీయ విశ్వవిద్యాలయంలో అతిథి అధ్యాపకులుగా ఎలా చేరాలి? ఎలా అప్లై చేసుకోవాలి?
AP DSC Notification 2026: అక్టోబర్‌లో వచ్చే డీఎస్సీ  సిలబస్ ఇదేనా? మార్పులు ఉంటాయా?
అక్టోబర్‌లో వచ్చే డీఎస్సీ  సిలబస్ ఇదేనా? మార్పులు ఉంటాయా?
SBI Clerk Notification 2026:ఎస్సీ, ఎస్టీ, బీసీల కోసమే SBI క్లర్క్ నోటిఫికేషన్! అర్హతలు, దరఖాస్తు విధానం పూర్తి వివరాలు ఇవే!
ఎస్సీ, ఎస్టీ, బీసీల కోసమే SBI క్లర్క్ నోటిఫికేషన్! అర్హతలు, దరఖాస్తు విధానం పూర్తి వివరాలు ఇవే!
TGPSC FBO Notification 2026: తెలంగాణ అటవీ శాఖలో ఉద్యోగాలు! 1393 ఫారెస్ట్ బీట్ ఆఫీసర్‌ పోస్టులకు త్వరలో ప్రకటన!
తెలంగాణ అటవీ శాఖలో ఉద్యోగాలు! 1393 ఫారెస్ట్ బీట్ ఆఫీసర్‌ పోస్టులకు త్వరలో ప్రకటన!

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Breaking News:మహిళలతో నేడు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేకంగా భేటీ
మహిళలతో నేడు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేకంగా భేటీ
Petrol-Diesel Windfall Tax: పెట్రోల్‌పై రూ. 3.50, డీజిల్‌పై రూ. 1.50 మేర విండ్‌ఫాల్ పన్ను తగ్గింపు! అర్ధరాత్రి కేంద్రం ప్రకటన!
పెట్రోల్‌పై రూ. 3.50, డీజిల్‌పై రూ. 1.50 మేర విండ్‌ఫాల్ పన్ను తగ్గింపు! అర్ధరాత్రి కేంద్రం ప్రకటన!
Chandrababu Naidu: అమరావతి అసైన్డ్‌ భూముల కేసులో కీలక పరిణామం! చంద్రబాబు, నారాయణకు భారీ ఊరట!
అమరావతి అసైన్డ్‌ భూముల కేసులో కీలక పరిణామం! చంద్రబాబు, నారాయణకు భారీ ఊరట!
Komatireddy Rajgopal Reddy vs Mahesh Kumar Goud: తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
Telangana Ration Card Security Features: తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
Venkatesh: కల్నల్ వెంకట్ రెడ్డిగా వెంకటేష్... అనిల్ రావిపూడితో కొత్త సినిమాలో ఆయన ఫస్ట్ లుక్ చూశారా?
కల్నల్ వెంకట్ రెడ్డిగా వెంకటేష్... అనిల్ రావిపూడితో కొత్త సినిమాలో ఆయన ఫస్ట్ లుక్ చూశారా?
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
Prabhas Fauzi : బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
Embed widget