అన్వేషించండి

TSPSC Group 1 Notification: టీఎస్‌పీఎస్సీ 'గ్రూప్-1' నోటిఫికేషన్ విడుదల - పోస్టులు, అర్హతలు, పరీక్ష వివరాలు ఇలా

తెలంగాణలో గ్రూప్-1 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. మొత్తం 563 పోస్టుల భర్తీకీ తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) ఫిబ్రవరి 19న నోటిఫికేషన్ విడుదల చేసింది.

TSPSC Group1 Recruitment Notificatin 2024: తెలంగాణలో గ్రూప్-1 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. మొత్తం 563 పోస్టుల భర్తీకీ తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) ఫిబ్రవరి 19న నోటిఫికేషన్ విడుదల చేసింది.  డిగ్రీ అర్హత ఉన్నవారు గ్రూప్-1 ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అయితే గతంలో టీఎస్‌పీఎస్సీ విడుదల చేసిన గ్రూప్-1 నోటిఫికేషన్ (Notification No. 04/2022 Dt. 26/04/2022) సమయంలో దరఖాస్తు చేసుకున్నవారు మళ్లీ దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరంలేదు. ఎలాంటి ఫీజు కూడా చెల్లించాల్సిన అవసరంలేదు.

సరైన అర్హతలున్న అభ్యర్థుల నుంచి ఫిబ్రవరి 23 నుంచి మార్చి 14న సాయంత్రం 5 గంటల వరకు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తులు స్వీకరించనున్నారు. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.320 చెల్లించాలి. ఇందులో అప్లికేషన్ ప్రాసెస్ ఫీజు కింద రూ.200, పరీక్ష ఫీజు కింద రూ.120 చెల్లించాల్సి ఉంటుంది. నిరుద్యోగులకు పరీక్ష ఫీజు నుంచి, ప్రభుత్వ ఉద్యోగులకు దరఖాస్తు ఫీజు నుంచి మినహాయింపు ఉంది. మే/జూన్ నెలల్లో ప్రిలిమ్స్(ఆబ్జెక్టివ్) పరీక్ష, సెప్టెంబరు/అక్టోబరు నెలల్లో మెయిన్ (కన్వెన్షనల్) పరీక్ష నిర్వహించనున్నారు. పరీక్షలకు వారం ముందు నుంచి హాల్‌టికెట్లను అందుబాటులో ఉంచుతారు. పరీక్ష సమయానికి 4 గంటల ముందువరకు హాల్‌టికెట్లు అందుబాటులో ఉండనున్నాయి. 

ప్రభుత్వం ఇటీవలే ప్రభుత్వ ఉద్యోగాలకు వయోపరిమితిని 2 సంవత్సరాలకు పొడిగించిన సంగతి తెలిసిందే. దీంతో గరిష్ఠవయోపరిమితి 44 సంవత్సరాల నుంచి 46 సంవత్సరాలకు చేరింది. అయితే నిబంధనల మేరకు వయోపరిమితిలో సడలింపులు వర్తించనున్నాయి. రాష్ట్రప్రభుత్వ ఉద్యోగులకు 5 సంవత్సరాలు, ఎక్స్-సర్వీ్స్‌మెన్ అభ్యర్థులకు 3 సంవత్సరాలు, ఎన్‌సీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు, ఎస్సీ-ఎస్టీ-బీసీ-ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, దివ్యాంగులకు 10 సంవత్సరాల వరకు వయోసడలింపు ఉంటుంది. 

వివరాలు..

* గ్రూప్-1 నోటిఫికేషన్ 2024

ఖాళీల సంఖ్య: 563

క్ర.సం పోస్టులు ఖాళీల సంఖ్య
1. డిప్యూటీ కలెక్టర్ 45
2. డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (DSP) 115
3. కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ 48
4. రీజినల్ ట్రాన్స్‌పోర్ట్ ఆఫీసర్ 04
5. డిస్ట్రిక్ట్ పంచాయత్ ఆఫీసర్ 07
6. డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ 06
7. డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ జైల్స్ (మెన్) 05
8. అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ లేబర్ 08
9. అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ 30
10. మున్సిపల్ కమిషనర్ (గ్రేడ్-2) 41
11. డిస్ట్రిక్ట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్/
డిస్ట్రిక్ట్ షెడ్యూల్డ్ క్యాస్ట్ డెవలప్‌మెంట్ ఆఫీసర్
03
12. డిస్ట్రిక్ట్ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్/
అసిస్టెంట్ డైరెక్టర్ (డిస్ట్రిక్ట్ బీసీ డెవలప్‌మెంట్ ఆఫీసర్)
05
13. డిస్ట్రిక్ట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ 02
14. డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్‌మెంట్ ఆఫీసర్ 05
15. అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్/లే సెక్రటరీ& ట్రెజరర్ గ్రేడ్-2 20
16. అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్/అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్/ అసిస్టెంట్ లెక్చరర్ (ట్రైనింగ్ కాలేజ్ అండ్ స్కూల్) 38
17. అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్‌మెంట్ ఆఫీసర్ 41
18. మండల పరిషత్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ 140
  మొత్తం ఖాళీలు 563

అర్హతలు, వయోపరిమితి, జీతభత్యాలు...

1) డిప్యూటీ కలెక్టర్
విభాగం: సివిల్ సర్వీసెస్, ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్.
అర్హత: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: 01.07.2024 నాటికి 18-46 సంవత్సరాల మధ్య ఉండాలి.
జీతం: రూ.58,850-రూ.1,37,050.

2) డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (DSP)
విభాగం: కేటగిరీ-2 (పోలీస్ సర్వీస్).
అర్హత: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: 01.07.2024 నాటికి 21-35 సంవత్సరాల మధ్య ఉండాలి.
జీతం: రూ.58,850-రూ.1,37,050.

3) కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్
విభాగం: కమర్షియల్ ట్యాక్స్ సర్వీసెస్.
అర్హత: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: 01.07.2024 నాటికి 18-46 సంవత్సరాల మధ్య ఉండాలి.
జీతం: రూ.58,850-రూ.1,37,050.

4) రీజినల్ ట్రాన్స్‌పోర్ట్ ఆఫీసర్
విభాగం: ట్రాన్స్‌పోర్ట్ సర్వీస్.
అర్హత: ఇంజినీరింగ్ డిగ్రీ (మెకానికల్/ఆటోమొబైల్) ఉత్తీర్ణత ఉండాలి.  
వయసు: 01.07.2024 నాటికి 21-46 సంవత్సరాల మధ్య ఉండాలి.
జీతం: రూ.54,220-రూ.1,33,630.

5) డిస్ట్రిక్ట్ పంచాయత్ ఆఫీసర్
విభాగం: పంచాయత్ సర్వీసెస్.
అర్హత: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: 01.07.2024 నాటికి 18-46 సంవత్సరాల మధ్య ఉండాలి.
జీతం: రూ.54,220-రూ.1,33,630.

6) డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్
విభాగం: రిజిస్ట్రేషన్ సర్వీసెస్.
అర్హత: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: 01.07.2024 నాటికి 18-46 సంవత్సరాల మధ్య ఉండాలి.
జీతం: రూ.54,220-రూ.1,33,630.

7) డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ జైల్స్ (మెన్)
విభాగం: జైల్స్ సర్వీస్.
అర్హత: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: 01.07.2024 నాటికి 18-35 సంవత్సరాల మధ్య ఉండాలి.
జీతం: రూ.54,220-రూ.1,33,630.

8) అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ లేబర్
విభాగం: లేబర్ సర్వీస్.
అర్హత: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: 01.07.2024 నాటికి 18-46 సంవత్సరాల మధ్య ఉండాలి.
జీతం: రూ.54,220-రూ.1,33,630

9) అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్
విభాగం: ఎక్సైజ్ సర్వీస్.
అర్హత: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: 01.07.2024 నాటికి 21-35 సంవత్సరాల మధ్య ఉండాలి.
జీతం: రూ.51,320-రూ.1,33,310.

10) మున్సిపల్ కమిషనర్ (గ్రేడ్-2)
విభాగం: ఎక్సైజ్ సర్వీస్.
అర్హత: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: 01.07.2024 నాటికి 18-46 సంవత్సరాల మధ్య ఉండాలి.
జీతం: రూ.51,320-రూ.1,33,310

11) డిస్ట్రిక్ట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్/ డిస్ట్రిక్ట్ షెడ్యూల్డ్ క్యాస్ట్ డెవలప్‌మెంట్ ఆఫీసర్
విభాగం: సోషల్ వెల్ఫేర్ సర్వీస్.
అర్హత: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: 01.07.2024 నాటికి 18-46 సంవత్సరాల మధ్య ఉండాలి.
జీతం: రూ.54,220-రూ.1,33,630.

12) డిస్ట్రిక్ట్ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్/అసిస్టెంట్ డైరెక్టర్ (డిస్ట్రిక్ట్ బీసీ డెవలప్‌మెంట్ ఆఫీసర్)
విభాగం: బీసీ వెల్ఫేర్ సర్వీస్.
అర్హత: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: 01.07.2024 నాటికి 18-46 సంవత్సరాల మధ్య ఉండాలి.
జీతం: రూ.54,220-రూ.1,33,630.

13) డిస్ట్రిక్ట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్
విభాగం: ట్రైబల్ వెల్ఫేర్ సర్వీస్.
అర్హత: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: 01.07.2024 నాటికి 18-46 సంవత్సరాల మధ్య ఉండాలి.
జీతం: రూ.54,220-రూ.1,33,630.

14) డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్‌మెంట్ ఆఫీసర్
విభాగం: ఎంప్లాయ్‌మెంట్ సర్వీస్.
అర్హత: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: 01.07.2024 నాటికి 18-46 సంవత్సరాల మధ్య ఉండాలి.
జీతం: రూ.51,320-రూ.1,27,310.

15) అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్/లే సెక్రటరీ& ట్రెజరర్ (గ్రేడ్-2)
విభాగం: మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్.
అర్హత: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: 01.07.2024 నాటికి 18-46 సంవత్సరాల మధ్య ఉండాలి.
జీతం: రూ.51,320-రూ.1,27,310.

16) అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్/అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్/ అసిస్టెంట్ లెక్చరర్ (ట్రైనింగ్ కాలేజ్ అండ్ స్కూల్)
విభాగం: ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ సర్వీస్.
అర్హత: డిగ్రీ (కామర్స్/ మ్యాథమెటిక్స్) ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: 01.07.2024 నాటికి 18-46 సంవత్సరాల మధ్య ఉండాలి.
జీతం: రూ.51,320-రూ.1,27,310.

17) అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్‌మెంట్ ఆఫీసర్
విభాగం: స్టేట్ ఆడిట్ సర్వీస్.
అర్హత: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: 01.07.2024 నాటికి 18-46 సంవత్సరాల మధ్య ఉండాలి.
జీతం: రూ.51,320-రూ.1,27,310.

18) మండల పరిషత్ డెవలప్‌మెంట్ ఆఫీసర్
విభాగం: ఎంప్లాయ్‌మెంట్ సర్వీస్.
అర్హత: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: 01.07.2024 నాటికి 18-46 సంవత్సరాల మధ్య ఉండాలి.
జీతం: రూ.51,320-రూ.1,27,310.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.

ఎంపిక విధానం: ప్రిలిమ్స్, మెయిన్ పరీక్షల ఆధారంగా.

పరీక్ష విధానం: మొత్తం 150 మార్కులకు ప్రిలిమ్స్ పరీక్ష (జనరల్ స్టడీస్ & మెంటల్ ఎబిలిటీ), 900 మార్కులకు మెయిన్ (6 పేపర్లు) పరీక్షలు నిర్వహిస్తారు. ఒక్కో పేపరుకు 150 మార్కులు ఉంటాయి. ఇక మెయిన్ పరీక్షలో 150 మార్కులకు జనరల్ ఇంగ్లిష్ అర్హత పరీక్ష నిర్వహిస్తారు. 

TSPSC Group 1 Notification: టీఎస్‌పీఎస్సీ 'గ్రూప్-1' నోటిఫికేషన్ విడుదల - పోస్టులు, అర్హతలు, పరీక్ష వివరాలు ఇలా

ప్రిలిమినరీ పరీక్ష కేంద్రాలు: ఆసిఫాబాద్-కొమ్రంభీమ్, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, కరీంనగర్, సిరిసిల్ల-రాజన్న, సిద్ధిపేట, మెదక్, కామారెడ్డి, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, సూర్యాపేట, నల్గొండ, భువనగిరి-యాదాద్రి, జనగాం, మేడ్చల్-మల్కాజ్‌గిరి, హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్, మహబూబ్‌నగర్, నారాయణపేట, జోగుళాంబ-గద్వాల్, వనపర్తి, నాగర్‌కర్నూల్.

మెయిన్ పరీక్ష కేంద్రాలు: ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, హైదరాబాద్, రంగారెడ్డి, నిజామాబాద్, మహబూబ్‌నగర్, మెదక్, నల్గొండ.

ముఖ్యమైన తేదీలు..

ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం 23.02.2024.
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది 14.03.2024. (5:00 PM)
దరఖాస్తుల సవరణకు అవకాశం 23.03.2024 (10:00 A.M.) - 27.03.2024 (5:00 P.M.)
గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష హాల్‌టికెట్లు పరీక్షకు వారం ముందు నుంచి అందుబాటులో
ప్రిలిమినరీ పరీక్ష మే/జూన్ 2024.
మెయిన్ పరీక్ష సెప్టెంబరు/అక్టోబరు 2024.

Notification

Website

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

TGPSC Group III: తెలంగాణలో గ్రూప్‌-3 పరీక్ష ప్రారంభం- అడ్రెస్ తప్పిన అభ్యర్థులను ఎగ్జామ్‌సెంటర్‌కు చేర్చిన పోలీసులు
తెలంగాణలో గ్రూప్‌-3 పరీక్ష ప్రారంభం- అడ్రెస్ తప్పిన అభ్యర్థులను ఎగ్జామ్‌సెంటర్‌కు చేర్చిన పోలీసులు
BRS BJP Alliance: బీఆర్‌ఎస్‌తో పొత్తుపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు- మూసీ ప్రక్షాళన ఆపేందుకు బీజేపీ బస్తీ నిద్ర
బీఆర్‌ఎస్‌తో పొత్తుపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు- మూసీ ప్రక్షాళన ఆపేందుకు బీజేపీ బస్తీ నిద్ర
Amaravati Master Plan: అదిరిపోయే రీతిలో అమరావతి మాస్టర్ ప్లాన్- మంగళగిరి, గుంటూరు, విజయవాడకు మహర్దశ
అదిరిపోయే రీతిలో అమరావతి మాస్టర్ ప్లాన్- మంగళగిరి, గుంటూరు, విజయవాడకు మహర్దశ
CM Chandrababu: 'సోషల్ మీడియా సైకోలను కట్టడి చేయాలి' - జైలు జీవితం పట్టుదల పెరిగేలా చేసిందన్న సీఎం చంద్రబాబు
'సోషల్ మీడియా సైకోలను కట్టడి చేయాలి' - జైలు జీవితం పట్టుదల పెరిగేలా చేసిందన్న సీఎం చంద్రబాబు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Nayanthara vs Dhanush Netflix Documentary | తమిళ్ సినీ ఇండస్ట్రీలో వివాదం..నయనతార vs ధనుష్ | ABP Desamరోహిత్ కి ధోని చేసిన మేలు, తిలక్ కి సూర్య చేస్తున్నాడుసఫారీలను సెంచరీతో చితక్కొట్టిన సంజూ శాంసన్మైక్ టైసన్ ను చిత్తు చేశాడు, 300 కోట్ల ప్రైజ్ మనీని కొల్లగొట్టాడు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TGPSC Group III: తెలంగాణలో గ్రూప్‌-3 పరీక్ష ప్రారంభం- అడ్రెస్ తప్పిన అభ్యర్థులను ఎగ్జామ్‌సెంటర్‌కు చేర్చిన పోలీసులు
తెలంగాణలో గ్రూప్‌-3 పరీక్ష ప్రారంభం- అడ్రెస్ తప్పిన అభ్యర్థులను ఎగ్జామ్‌సెంటర్‌కు చేర్చిన పోలీసులు
BRS BJP Alliance: బీఆర్‌ఎస్‌తో పొత్తుపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు- మూసీ ప్రక్షాళన ఆపేందుకు బీజేపీ బస్తీ నిద్ర
బీఆర్‌ఎస్‌తో పొత్తుపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు- మూసీ ప్రక్షాళన ఆపేందుకు బీజేపీ బస్తీ నిద్ర
Amaravati Master Plan: అదిరిపోయే రీతిలో అమరావతి మాస్టర్ ప్లాన్- మంగళగిరి, గుంటూరు, విజయవాడకు మహర్దశ
అదిరిపోయే రీతిలో అమరావతి మాస్టర్ ప్లాన్- మంగళగిరి, గుంటూరు, విజయవాడకు మహర్దశ
CM Chandrababu: 'సోషల్ మీడియా సైకోలను కట్టడి చేయాలి' - జైలు జీవితం పట్టుదల పెరిగేలా చేసిందన్న సీఎం చంద్రబాబు
'సోషల్ మీడియా సైకోలను కట్టడి చేయాలి' - జైలు జీవితం పట్టుదల పెరిగేలా చేసిందన్న సీఎం చంద్రబాబు
Pushpa 2 Trailer: మైండ్ బ్లాక్ అయ్యేలా బీహార్‌లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ క్రేజ్... ఇవాళ సాయంత్రమే 'పుష్ప 2' ట్రైలర్ విడుదల
మైండ్ బ్లాక్ అయ్యేలా బీహార్‌లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ క్రేజ్... ఇవాళ సాయంత్రమే 'పుష్ప 2' ట్రైలర్ విడుదల
Pushpa 2 Trailer Launch Live Updates: అల్లు అర్జున్ అంటే మినిమమ్ ఉంటుంది మరి... 'పుష్ప 2' ట్రైలర్ లాంచ్ అప్డేట్స్
అల్లు అర్జున్ అంటే మినిమమ్ ఉంటుంది మరి... 'పుష్ప 2' ట్రైలర్ లాంచ్ అప్డేట్స్
Toyota Camry Hybrid Facelift: టయోటా క్యామ్రీ ఫేస్‌లిఫ్ట్ లాంచ్ త్వరలోనే - స్ట్రాంగ్ హైబ్రిడ్ వెర్షన్‌లో మార్కెట్లోకి?
టయోటా క్యామ్రీ ఫేస్‌లిఫ్ట్ లాంచ్ త్వరలోనే - స్ట్రాంగ్ హైబ్రిడ్ వెర్షన్‌లో మార్కెట్లోకి?
Manipur: మణిపూర్‌లో మంత్రులు, ఎమ్మెల్యేల ఇళ్లపై దాడి- 7 జిల్లాల్లో కర్ఫ్యూ, రెండు రోజులు ఇంటర్‌నెట్ బంద్‌
మణిపూర్‌లో మంత్రులు, ఎమ్మెల్యేల ఇళ్లపై దాడి- 7 జిల్లాల్లో కర్ఫ్యూ, రెండు రోజులు ఇంటర్‌నెట్ బంద్‌
Embed widget