TSPSC Group 1 Recruitment: 'గ్రూప్-1' నియామకాలపై హైకోర్టు కీలక తీర్పు! 'సుప్రీం' గైడ్‌లైన్స్ పాటించాల్సిందే!
'గ్రూప్-1' పోస్టుల్లో మహిళా రిజర్వేషన్లు 33.33 శాతానికి పరిమితం చేయాలంటూ కొందరు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై తాజాగా హైకోర్టు తీర్పు వెల్లడించింది.
తెలంగాణలో 'గ్రూప్-1' ప్రిలిమినరీ ఫలితాల ప్రకటనకు అడ్డంకి తొలగిపోయింది. ఈ నియామకాల విషయంలో తలెత్తిన న్యాయవివాదంపై డిసెంబరు 15న హైకోర్టు తీర్పు వెల్లడించింది. గ్రూప్-1 తుది నియామకాల్లో మహిళా రిజర్వేషన్ల అమలులో గతంలో సుప్రీంకోర్టు జారీచేసిన మార్గదర్శకాలు అమలు చేయాలని టీఎస్‌పీఎస్సీకి సూచించింది.
'గ్రూప్-1' పోస్టుల్లో మహిళా రిజర్వేషన్లు 33.33 శాతానికి పరిమితం చేయాలంటూ కొందరు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. గతంలో రాజస్థాన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, ఉత్తరాంచల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కేసుల్లో ఇచ్చిన ఉత్తర్వులు అమలు చేయాలని కోరారు. ఈ పిటిషన్‌పై హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సూరేపల్లి నందా ధర్మాసనం విచారణ చేపట్టింది.
'గ్రూప్-1' నియామకాల్లో రాజేష్ కుమార్ వర్సెస్ రాజస్థాన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తదితర కేసుల్లో సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలు అమలు చేయాలని హైకోర్టు తన తీర్పులో సూచించింది.
ఈ తీర్పు వెలువడటంతో గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలు వారం, పది రోజుల్లో ప్రకటించే అవకాశాలున్నాయి. ఈ పరీక్షకు హాజరైన 2,85,916 మంది అభ్యర్థుల ఓఎంఆర్ పత్రాల ఇమేజింగ్‌ను టీఎస్‌పీఎస్సీ ఇప్పటికే పూర్తిచేసింది. పరీక్ష తుది కీని కూడా ప్రకటించింది.
Also Read:
గ్రూప్-2, గ్రూప్-3 పోస్టుల కసరత్తు పూర్తి! ఏ క్షణానైనా నోటిఫికేషన్లు?
తెలంగాణలోని నిరుద్యోగులు త్వరలోనే మరో ఉద్యోగ కబురు విననున్నారు. ఈ మేరకు రాష్ట్రంలో ఖాళీగా ఉన్న గ్రూప్-2, 3 ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ల జారీకి టీఎస్‌పీఎస్సీ కసరత్తు పూర్తిచేసింది. ఈ నెలలోనే ఉద్యోగ ప్రకటనలు జారీ చేయనున్నట్లు సమాచారం. వీటితోపాటు టీఎస్‌పీఎస్సీకి అప్పగించిన మిగతా పోస్టులకు నోటిఫికేషన్లు ఇచ్చేందుకు కమిషన్ సన్నద్ధమవుతోంది. ప్రభుత్వ విభాగాల్లోని మరికొన్ని పోస్టులను గ్రూప్-2, 3 పరిధిలోకి తీసుకురావడంతో వాటి సంఖ్య పెరగనుంది. గ్రూప్-2 పరిధిలోకి దాదాపు 120 వరకు కొత్తగా పోస్టులు రావడంతో.. ఈ ప్రకటన కింద మొత్తం 783 ఖాళీలు వెల్లడయ్యే అవకాశాలున్నట్లు తెలిసింది. గ్రూప్-3లో పెరగనున్న పోస్టులపై కమిషన్ కార్యాచరణ పూర్తిచేసింది. ఇందులో భాగంగా నెలాఖరులోగా ఫారెస్ట్ బీట్ ఆఫీసర్స్, హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేయాలని టీఎస్‌పీఎస్సీ భావిస్తోంది.
పోస్టుల పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి..
వరంగల్‌లో డిసెంబరు 17న జాబ్ మేళా, అందరూ అర్హులే! వేదిక ఇదే!
ఉమ్మడి వరంగల్ జిల్లాలోని నిరుద్యోగ యువతీ యువకులకు గుడ్ న్యూస్, డిసెంబరు 17న వరంగల్ ములుగు రోడ్డు ప్రభుత్వ ఐటీఐ క్యాంపస్ సమీపంలోని జిల్లా ఉపాధి కల్పన కార్యాలయంలో జాబ్ మేళా నిర్వహించనున్నట్లు అధికారులు ప్రకటించారు. కరీంనగర్ వెంకట సాయి ఎంటర్ ప్రైజెస్ కంపెనీలో 121 ఉద్యోగాల భర్తీ కోసం ఈ జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. ఎంపికైన అభ్యర్థులు ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలో పని చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. అభ్యర్థులు 18 నుంచి 35 సంవత్సరాలు ఉండి పదో తరగతి, ఇంటర్, డిగ్రీ, డిప్లొమా, ఐటీఐ, బీటెక్ ఉత్తీర్ణులైన వారు అర్హులని తెలిపారు.
జాబ్ మేళా పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
1392 జూనియర్ లెక్చరర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
తెలంగాణలో జూనియర్ లెక్చరర్ల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. 1392 జూనియర్ లెక్చరర్ పోస్టుల భర్తీకి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం పోస్టులు మల్టీ జోన్-1 పరిధిలో 724 పోస్టులు, మల్టీ జోన్-2 పరిధిలో 668 పోస్టులు ఉన్నాయి. డిసెంబరు 16 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకానుంది. అభ్యర్థులు జనవరి 6 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. జూన్ లేదా జులైలో రాతపరీక్ష నిర్వహించనున్నారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..