అన్వేషించండి

SSC GD Constable: ఎస్‌ఎస్‌సీ కానిస్టేబుల్(జీడీ) తుది ఫలితాలు విడుదల, కటాఫ్ మార్కుల వివరాలు ఇలా

కేంద్ర సాయుధ బలగాల్లో కానిస్టేబుల్(జీడీ) పోస్టుల భర్తీకి సంబంధించిన తుది ఫలితాలు విడుదలయ్యాయి. స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌(ఎస్‌ఎస్‌సీ) ఆగస్టు 20న ఫలితాలను విడుదల చేసింది.

కేంద్ర సాయుధ బలగాల్లో కానిస్టేబుల్(జీడీ) పోస్టుల భర్తీకి సంబంధించిన తుది ఫలితాలు విడుదలయ్యాయి. స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌(ఎస్‌ఎస్‌సీ) ఆగస్టు 20న ఫలితాలను విడుదల చేసింది. ఈ మేరకు  ఆధికారిక ప్రకటన విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను అందుబాటులో ఉంచింది. ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల తుది జాబితాతోపాటు.. రాష్ట్రాలు, కేటగిరీ వారీగా కటాఫ్‌ మార్కుల వివరాలను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ వెల్లడించింది. కానిస్టేబుల్(జీడీ) నియామకాల కోసం జులైలో నిర్వహించిన సర్టిఫికేట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ తర్వాత రిజర్వేషన్‌‌లకు అనుగుణంగా అభ్యర్థులను ఉద్యోగాలకు ఎంపిక చేశారు. 

సాయుధ బలగాల్లో 50,187 కానిస్టేబుల్(జీడీ)/ రైఫిల్‌మ్యాన్/ సిపాయి పోస్టుల భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరి నెలల్లో ఎస్‌ఎస్‌సీ ఓపెన్ కాంపిటీటివ్ పరీక్షను నిర్వహించింది. రాత పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్‌పీఎఫ్‌) ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్టులను మే నెలలో నిర్వహించింది. వీటి ఫలితాలను జులైలో విడుదల చేసింది. ఫిజిక్ ఈవెంట్లలో అర్హత సాధించిన అభ్యర్థులకు జులైలో ధ్రువపత్రాల పరిశీలన, వైద్య పరీక్షలు నిర్వహించారు. తాజాగా తుది ఫలితాలను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ విడుదల చేసింది.  

రాష్ట్రాలు, కేటగిరీ వారీగా కటాఫ్‌ మార్కుల జాబితా..

ఎస్‌ఎస్‌సీ కానిస్టేబుల్ జీడీ పురుషుల తుది ఎంపిక జాబితా..

ఎస్‌ఎస్‌సీ కానిస్టేబుల్ జీడీ మహిళల తుది ఎంపిక జాబితా.. 

మొదట నోటిఫికేషన్ విడుదల సమయంలో మొత్తం 24,369 ఖాళీలను ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఆ సంఖ్యను గత నవంబర్‌లో 45,284కు పెంచుతూ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ మరో ప్రకటన విడుదల చేసింది. తాజాగా ఆ పోస్టులకు అదనంగా మరో 1,151 ఖాళీలను కలిపారు. దీంతో మొత్తం ఖాళీల సంఖ్య 46,435కు చేరింది. ‌తాజాగా ఐటీబీపీ విభాగంలో సిబ్బంది నియామకానికి మరో 3,257 పోస్టులను కలపడంతో మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య ‌50,187కు పెరిగింది. మొత్తం 50,187 ఖాళీల్లో బీఎస్‌ఎఫ్‌లో 21,052; సీఐఎస్‌ఎఫ్‌లో 6,060; సీఆర్‌పీఎఫ్‌లో 11,169; ఎస్‌ఎస్‌బీలో 2274; ఐటీబీపీలో 5642, ఏఆర్‌లో 3601, ఎస్‌ఎస్‌ఎఫ్‌లో 214, ఎన్‌సీబీలో 175 పోస్టులు ఉన్నాయి. ఎన్‌సీబీ మినహాయించి మొత్తం ఖాళీల్లో 44,439 పోస్టులు పురుషులకు, 5573 పోస్టులు మహిళలకు కేటాయించారు.

* పోస్టుల వివరాలు...

విభాగాల వారీగా ఖాళీలు..

1) బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF): 21,052 

2) సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF): 6060 

3) సెంట్రల్ రిజర్వ్‌డ్ పోలీస్ ఫోర్స్(CRPF): 11,169

4) సశస్త్ర సీమాబల్ (SSB): 2274

5) ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ (ITBP): 1890 + 3,257 = 5642 

6) అసోం రైఫిల్స్ (AR): 3601

7) సెక్రటేరియల్‌ సెక్యూరిటీ ఫోర్స్‌ (SSF):  214

8) నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో (NCB): 175

SSC GD Constable: ఎస్‌ఎస్‌సీ కానిస్టేబుల్(జీడీ) తుది ఫలితాలు విడుదల, కటాఫ్ మార్కుల వివరాలు ఇలా

ALSO READ:

హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్‌లో 276 సీనియర్ ఆఫీసర్, ఇంజినీరింగ్‌ పోస్టులు
ముంబయిలోని హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్(హెచ్‌పీసీఎల్‌) సీనియర్ ఆఫీసర్, ఇంజినీరింగ్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.  దీనిద్వారా మొత్తం 276 పోస్టులను భర్తీ చేయనున్నారు. సంబంధిత విభాగంలో డిగ్రీ, బీఈ, బీటెక్‌, ఎంబీబీఎస్‌, సీఏ, ఎంబీఏ, పీజీడీఎం ఉత్తీర్ణత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు సెప్టెంబరు 18 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. 
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..

నార్తర్న్ రైల్వేలో 93 సీనియర్ టెక్నికల్ అసోసియేట్ పోస్టులు, ఈ అర్హతలుండాలి
న్యూఢిల్లీ ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్న నార్తర్న్ రైల్వే కాంట్రాక్ట్ ప్రాతిపదికన వివిధ విభాగాల్లో సీనియర్ టెక్నికల్ అసోసియేట్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇంజినీరింగ్ డిగ్రీ అర్హతతోపాటు గేట్ అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలున్నవారు ఆగస్టు 28 లోగా ఆన్‌లైన్ ద్వారా తమ దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.100 చెల్లించాలి. అయితే ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయించారు.అకడమిక్ మెరిట్, అర్హతల ఆధారంగా అభ్యర్థులను షార్ట్‌లిస్ట్ చేస్తారు.  
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Neet Counselling : మెడికల్ కాలేజీ ప్రవేశాల్లో లోకల్ కోటాపై ప్రభుత్వానికి ఊరట- హైకోర్టుపై సుప్రీం స్టే 
మెడికల్ కాలేజీ ప్రవేశాల్లో లోకల్ కోటాపై ప్రభుత్వానికి ఊరట- హైకోర్టుపై సుప్రీం స్టే
Bhogapuram Airport: భోగాపురం దగ్గర సైట్ అమరావతి కన్నా కాస్ట్‌లీ గురూ, ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు కొనలేరు!
భోగాపురం దగ్గర సైట్ అమరావతి కన్నా కాస్ట్‌లీ గురూ, ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు కొనలేరు!
Army Bus Accident: జమ్ము కశ్మీర్లో బస్సు ప్రమాదం, ముగ్గురు జవాన్లు దుర్మరణం- మరో ఆరుగురి పరిస్థితి విషమం
జమ్ము కశ్మీర్లో బస్సు ప్రమాదం, ముగ్గురు జవాన్లు దుర్మరణం- మరో ఆరుగురి పరిస్థితి విషమం
Hyper Aadi: పవన్ కళ్యాణ్ కు విరాళం అందజేసిన హైపర్ ఆది, ఎన్ని లక్షలు అంటే!
పవన్ కళ్యాణ్ కు విరాళం అందజేసిన హైపర్ ఆది, ఎన్ని లక్షలు అంటే!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Sinkhole swallows pune truck | పూణేలో జరిగిన విచిత్రమైన ప్రమాదం | ABP DesamTirumala Laddu Controversy | తిరుమల లడ్డుని ఎలా తయారు చేస్తారు | ABP Desamచాలా బాధగా ఉంది, చర్యలు తీసుకోవాల్సిందే - లడ్డు వివాదంపై పవన్ కామెంట్స్చార్మినార్ వద్ద అగ్ని ప్రమాదం, భారీగా ఎగిసిపడిన మంటలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Neet Counselling : మెడికల్ కాలేజీ ప్రవేశాల్లో లోకల్ కోటాపై ప్రభుత్వానికి ఊరట- హైకోర్టుపై సుప్రీం స్టే 
మెడికల్ కాలేజీ ప్రవేశాల్లో లోకల్ కోటాపై ప్రభుత్వానికి ఊరట- హైకోర్టుపై సుప్రీం స్టే
Bhogapuram Airport: భోగాపురం దగ్గర సైట్ అమరావతి కన్నా కాస్ట్‌లీ గురూ, ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు కొనలేరు!
భోగాపురం దగ్గర సైట్ అమరావతి కన్నా కాస్ట్‌లీ గురూ, ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు కొనలేరు!
Army Bus Accident: జమ్ము కశ్మీర్లో బస్సు ప్రమాదం, ముగ్గురు జవాన్లు దుర్మరణం- మరో ఆరుగురి పరిస్థితి విషమం
జమ్ము కశ్మీర్లో బస్సు ప్రమాదం, ముగ్గురు జవాన్లు దుర్మరణం- మరో ఆరుగురి పరిస్థితి విషమం
Hyper Aadi: పవన్ కళ్యాణ్ కు విరాళం అందజేసిన హైపర్ ఆది, ఎన్ని లక్షలు అంటే!
పవన్ కళ్యాణ్ కు విరాళం అందజేసిన హైపర్ ఆది, ఎన్ని లక్షలు అంటే!
Duleep Trophy: అనంతపురం స్టేడియంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న యువకులు అరెస్టు
అనంతపురం స్టేడియంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న యువకులు అరెస్టు
Travis Head: అలా ఎలా  కొడుతున్నావ్ బ్రో, హెడ్‌ విధ్వంసకర సెంచరీ
అలా ఎలా కొడుతున్నావ్ బ్రో, హెడ్‌ విధ్వంసకర సెంచరీ
Yashasvi Jaiswal: 147 ఏళ్ల రికార్డు బద్దలు కొట్టి, చ‌రిత్ర సృష్టించిన య‌శ‌స్వీ
147 ఏళ్ల రికార్డు బద్దలు కొట్టి, చ‌రిత్ర సృష్టించిన య‌శ‌స్వీ
Viral News: సోషల్ మీడియాలో అమ్మకానికి స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్‌ కస్టమర్ల డేటా, షాకింగ్ న్యూస్
సోషల్ మీడియాలో అమ్మకానికి స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్‌ కస్టమర్ల డేటా, షాకింగ్ న్యూస్
Embed widget